సూర్యకు జోడీగా కయాడు లోహర్

కరుప్పు బ్లాక్ బస్టర్ తో సూర్య దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తర్వాత విశ్వనాథమ్ అండ్ సన్స్ మూవీతో తెలుగు స్ట్రెయిట్ మూవీ ఈ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. తర్వాత ఓ మళయాల మూవీ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. మరోవైపు తమిళ్ లో కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జై భీమ్ దర్శకుడితో మరో మూవీకి సిద్ధం అయ్యాడు. ఇది సూర్యకు 48వ చిత్రం. జై భీమ్ తో విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు టిజే జ్ఞానవేల్. తర్వాత అతను రజినీకాంత్ తో చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద పోయింది. బట్ అతను ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా బావుంది.
దర్శకుడు టిజే జ్ఞానవేల్ తో మళ్లీ సూర్య జత కట్టడం మాత్రం చాలా బావుంది. ఇద్దరి కాంబోలో జై భీమ్ లాంటి మూవీనే మళ్లీ ఎక్స్ పెక్ట్ చేయలేం.. బట్ కమర్షియల్ మూవీతో రావడం పక్కా అనేది తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కయాడు లోహర్ ను తీసుకున్నారు. తమిళ్ లో ఆమె చేసిన డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా చాలా బిజీ అయిపోయింది. అలాంటి బ్యూటీ సూర్యతో అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఇక హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ మూవీ ఇవాళే ప్రారంభం అయింది. ఈ యేడాది జూలై లేదా ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మరి ఈ మూవీతో జై భీమ్ జోడీ మళ్లీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Continue reading
తెలుగు సినిమా పాటకు చిరునామా వేటూరి

తెలుగు పాటకు ఆయన చిరునామా.. తెలుగు పాటే ఆయనకు చిరునామా.. సంస్కృతభూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి, సరళమైన పాటగా మార్చి అందించినా.. లళిత శృంగార భావాలను మనోహరంగా కూర్చి అందమైన పాటగా మలచినా.. మొరటు పదాలకు జానపద పలుకులను నేర్పుగా అల్లి మసాలా కూర్చి మెప్పించినా… రాలిపోయే పూవుకు రాగాలెందుకంటూ శ్రోతల గుండెల్ని పిండి ఏడిపించినా .. అది వేటూరి కలానికే చెల్లింది.

ఆ కలం ముద్దమందారం పై వాలిన సీతాకోక చిలుక.. సిరిసిరిమువ్వల నాదమైంది.. సితారాగానమైంది.. శంకరాభరణం ధరించి సాగరసంగమమైంది. సరికొత్త పదాల అన్వేషణలో సప్తపదులు దాటుకుని మరీ మధురమైన పదాలకు పాటలు వేసింది. ఆ కలం వేటూరిది.. ఆ పాట తెలుగు పాటకు శాశ్వత సంతకం. ఆ సంతకాన్ని తనదైన పదాలతో వేసిన పదసిరి.. గడసరి వేటూరి..
బాధల్నీ, విషాదాల్నీ, ఆనందాల్నీ గాయకుల స్వరాల్లో నింపి తెలుగు సినిమా పాటకు ఓ సొగసిరినీ, సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని తెచ్చిన కలం వేటూరి సుందరరామ్మూర్తిది. సందర్భోచితమైన భావాలను సరళమైన పదాలతో పేర్చి శ్రోతల్ని తన సాహితీ రసజ్ఞతతో ముంచి వేయడం వేటూరి ప్రత్యేకత.
ఆయన కలం నుంచి జాలువారితే తెలుగు పదం హొయలు పోతుంది. లయలుగా మారుతుంది. సరికొత్త సొగసులను అందిపుచ్చుకుని… తెలుగు పాటకు వన్నె అద్ది.. చిన్నెలు నేర్పింది. సంప్రదాయం, యవ్వనం, విరహం, భక్తి, రక్తి, వేదాంతం, వైరాగ్యం.. ఇలా .. భావమేదైనా అది వేటూరి కలంలో పడితే అద్భుతమైన గేయమవుతుంది. మధురగానమై ప్రాణం పోసుకుంటుంది. అవ్యాక్తానుభూతులను కూడా అతి చిన్న పదాలతో ఆకట్టుకునేలా చెప్పడం వేటూరికే చెల్లిందేమో..
కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు వేటూరి. తనలోని పదసంపద అనే జ్ఞానానికి బాణీలు అద్ది, ఆ బాణీలతో తెలుగు పాటకు ఓణీలు వేయించారు. సంప్రదాయ కీర్తనలే కాదు, పురాణ సాహిత్యంలోని మాటలనూ తీసుకుని వాటిని అందమైన పాటలుగా మలచడంలో వేటూరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో..
వేటూరి కలంలో శృంగారపు సిరా పాళ్లు కూసంత ఎక్కువే కనిపిస్తాయి. అందుకే గానమూ ప్రాణమూ నీవేనని శంకరుణ్ని ఆరాధించిన ఆ కలమే.. ఆరేసుకోబోయి పారేసుకుంటుంది.. పారేసుకోవాలనే ఆరేసుకున్నాననే చిలిపి దనాన్నీ చిలకరిస్తుంది. ఇలాంటి పాటలను కూడా అంత అందంగా ఇంకెవరూ రాయలేకపోయారు.. అప్పుడే కాదు.. ఇప్పటికీ..
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా.. తరించిపోతుంది ఆ పట్టుపురుగు జన్మ అంటూ వేటూరి రాస్తే..ఆ భావానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదా పట్టుపురుగు. ఇలాంటి పద ప్రయోగాలు చేయడం అంటే వేటూరికి పాళీతో పెట్టిన విద్య. ఇలా మాటల్నీ మంత్రాలుగా చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో వేటూరి సిద్ధహస్తుడు.
వేటూరి భావానికి నాటి సంగీత దర్శకులు అద్భుతమైన స్వర ప్రస్థానం కట్టబెట్టారు. హార్ట్ బీట్ ను కదిలించేదైనా.. ఫాస్ట్ బీట్ తో హార్ట్ బీట్ ను పెంచేదైనా ఆయన అక్షరాలను నాటి సంగీత దర్శకులు సమకూర్చిన స్వరాల స్థానం కూడా చాలా చాలా ప్రత్యేకమైనదే. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లోని పాటల్లోని వేగానికి తగ్గట్టుగా వేటూరి కలమూ పరుగులు పెడుతుంది.

తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్యే అచ్చెరువొందేలా.. ఆయన జననాన్నే అత్యద్భుతంగా అక్షరీకరించాడు వేటూరి. తెలుగు పదానికి జన్మదినం..ఇది జానపదానికి జ్ఞానపదం, ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం .. ఇంతకు మించి అన్నమయ్యను గురించి చెప్పడం ఇంకెవరికి సాధ్యం..
మంచుతాకి కోయిల మౌనమైన వేళా… రాలేటి పూల రాగాలతో పూసేటి పూలగంధాలతో ఆమనీ పాడవే హాయిగా అని చెప్పడం ఎంతమందికి సాధ్యమౌతుంది. మంచు కురిసే వేళలో మల్లెవిరిసేదెందుకో అంటూ తొలి ప్రేమ చిగురించే వైనానికి ప్రకృతిని ఆసరా చేసుకుంటాడు. నిజంగానే ఆ పాట వింటుంటే మనం కూడా తెలియకుండానే ఏ మంచు కొండల నడుమనో ఉండిపోయి.. లేని మల్లెలను ఊహించుకుంటూ.. ఉంటాం.
రాలిపోయే పూవుకు రాగాలెందుకు.. వాలిపోయే పొద్దుకు వర్ణాలెందుకు అంటూ వేటూరి కలం ఝలిపిస్తే కన్నీరు పెట్టకుండా ఉండగలమా.. వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి .. అంటే మధ్యలో వినిపించే గానమే జీవితమా.. ఇలాంటి పదాలను రాస్తున్నప్పుడు అందులోని కష్టం తను అనుభవిస్తూ.. అనుభూతిని మనకు మిగుల్చుతాడు వేటూరి.
ఇలాంటిదే మరో పాట ఆకాశాన సూర్యుడుండు సందెవేళకీ .. చందమామకు రూపముండదు తెల్లవారితే అంటూ జీవితం ఎంత చిన్నదో తెలుపుతూనే… ఈ మజిలీ మూడు నాళ్లే అంటూ తత్వాన్నీ బోధిస్తాడు. ఇవన్నీ కవి అనుభవాల నుంచే రావాల్సిన అవసరం లేదు. సమాజాన్నీ.. తన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనిస్తూ ఉంటే చాలు..
వేటూరి పాటల్లో క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి. పండిత పామరులను మెప్పించిన ఉన్నత సాహితీ విలువలున్న పాటలూ ఉన్నాయి. భాషమీద పట్టుతో పాటు స్వరజ్ఞానం ఆయనకున్న వరం. శబ్ధానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సినిమా పాటను రక్తి కట్టించారు. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి తెలుగు సినిమా పాటను లాలించి, పాలించి, శాసించిన సినీకవితాగ్రేసరుడు వేటూరి.
వేటూరి రాసిన వాటిలో సాంఘికంగా ఎప్పటికీ తిరుగులేని పాట.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ లోకి వెళ్లిపోతాం. ఈ పాటతో ఆడవారిని చులకనగా చూసేవారిపై అక్షర శస్త్రాలు సంధించారు. వారిపై జరుగుతున్న ఆకృత్యాలను పాటీకరించిన ఆయన కలంలోని ఆవేశానికి మనమూ గురవుతాం..
తొలినాళ్లలో ఆయన పాట మానసవీణపై మదుగీతమై ఎలా పరవశింప చేసిందో.. ఆఖర్లోనూ అంతే ఉత్సాహంగా పరవళ్లు తొక్కింది. ఉప్పొంగిన గోదారిని చూసి .. ఆనందంతో ఊగిపోయిన వరి చేలను ఊహించింది. డెభ్భైయేళ్ల వయసులో కూడా చెలికాడి నిర్లక్ష్యానికి గురయ్యానేమో అనుకుని ఓ యువతి పడే తాపత్రయాన్ని అందంగా లేనా.. అస్సలేం బాలేనా అని చెప్పగలిగారంటే.. సందర్భానికి తగ్గ పాటను కాదు ఇక్కడ చూడాల్సింది. దర్శకుడి ఊహకు ఆయన అద్దిన పదాల్ని, వాటిపై ఆయనకున్న సర్వాధికారాన్ని. ..
కెరీర్ ప్రారంభం నుంచీ.. తనదైన శైలిలో తెలుగు సినిమా పాటలో సాహితీ సేద్యం చేసి ఎన్నో అద్భుతమైన పాటలను పండించారు. ముఖ్యంగా ఇళయరాజా, వేటూరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. కవిగా ఎంత గొప్పవాడో తెలుగు భాషాభిమానిగానూ ఆయన అంతే గొప్పవాడు. అందుకే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన నిజమైన మాతృభాషాభిమాని.. వేటూరి.. భౌతికంగా వేటూరి మనమధ్య లేకపోయినా.. తన అక్షరాలతో అనునిత్య తెలుగు భాషతో మమేకమయ్యే ఉంటారు.

 

  • యశ్వంతుడు

Continue reading
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయినట్టేనా..?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్యకు సరైన వారసుడుగా అభిమానులు అతన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఇటు చూస్తే తన తరం హీరోల తనయులు హీరోలుగా మారిపోయారు. బట్ తన ఏజ్ ను బట్టి మోక్షజ్ఞ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో అతనికి ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. బాలయ్య కోరిక బలంగా ఉన్నా మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరిక కనిపించడం లేదు అని చాలాసార్లు అనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని కొన్నాళ్ల క్రితం నానా హడావిడీ చేశారు. ఆ మేరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రశాంత్ తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి బాలయ్యే స్వయంగా వచ్చాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999ను రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బట్ అదీ ముందుకు సాగడం లేదు. ఇటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడూ ప్రాపర్ లుక్ మెయిన్టేన్ చేయలేకపోతున్నాడు. దీంతో అసలు మనోడికి సినిమా హీరో కావాలనే లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదీ నిజమే అనిపించేలా ఉంది తాజా కథ.
బాలకృష్ణ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరకూరు నిర్మాత. అయితే కొరటాల మూవీని సడెన్ గా స్టార్ట్ చేశాడు బాలయ్య. అందుకు కారణం నిర్మాతే అనేది చాలామందికి తెలియదు. సుధాకర్ చెరకూరి గతంలో మోక్షజ్ఞతో మూవీ చేయాలనుకున్నాడు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం కొంత ఖర్చు చేశాడు. కానీ మోక్షజ్ఞ మూవీ చేయలేకపోతున్నాడు. ఆ మేరకు అతనికి కాంపెన్సేట్ చేయడం కోసమే బాలయ్య ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశాడు అనేది వాస్తవం. అంటే మోక్షజ్ఞతో మూవీ చేయాలని సుధాకర్ కు ఉన్నా.. అది పట్టాలెక్కడం సాధ్యం కాదు అని తెలిసింది కాబట్టే ఈ ప్రాజెక్ట్ నే బాలయ్యతో స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట.
ఈ రకంగా చూస్తే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు మాత్రమే కాదు.. అసలు అతనికి సినిమాలే ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవచ్చు. లేదంటే ఇప్పటికే అతని వయసుకు 30కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో 20కే స్టార్ట్ చేయడం కామన్ గా చూస్తుంటాం. అలాంటి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతనికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమే అనేది ఈ వార్త సారాంశం. లేదంటే బాలయ్య కొన్ని ముహూర్తాల కోసం చూస్తున్నాడేమో తెలియాల్సి కూడా ఉంది.

Continue reading
ఓటిటిలోనూ అదరగొడుతోన్న ‘బ్లాస్ట్’

యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బ్లాస్ట్. మే 28న విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద విజయం సాధించింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ చాలా వరకు ప్రిడక్టబుల్. కానీ కథనంతో కట్టి పడేశారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ పాత్రను డిజైన్ చేసిన విధానానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రధానంగా తమిళ్ లో తెరకెక్కినా డబ్బింగ్ రూపంలో తెలుగులోనూ హిట్ అయింది. మళయాలంలో మాత్రం చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. అలాంటి చిత్రాన్ని ఈ నెల 25న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఓ వైపు ఓటిటిలో వస్తున్నా.. ఈ మూవీకి అక్కడక్కడ థియేటర్స్ లో కూడా ఆడుతూనే ఉంది.
మామూలుగా ఇలాంటి మూవీస్ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంటాయి. ఓటిటిలో మాత్రం తేలిపోతుంటాయి. బట్ ఈ మూవీ విషయంలో అలా కాలేదు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్.. ఓటిటిలో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ కు ఓటిటిలో హారతులు పడుతున్నారు ఆడియన్స్. థియేటర్స్ లో చూసిన వాళ్లు కూడా ఓటిటిలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు అంటే అది ఈ కంటెంట్ లో ఉన్న దమ్ము. ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ లో బ్లాస్ట్ కు బ్లాస్టింగ్ రెస్పాన్స్ వస్తోందనేది వాస్తవం.

Continue reading
శ్రీనివాస మంగాపురం పోస్ట్ పోన్ అవుతోందా..?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు, మహేష్ బాబు అన్న కొడుకు అంటూ చాలా ట్యాగ్స్ తో ఉన్న హీరో జయకృష్ణ. అతను హీరోగా పరిచయం అవుతోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ ఇద్దరి జంటకు మంచి అప్లాజ్ వస్తోంది. జయకృష్ణ ఇండస్ట్రీలోకి రావడం కోసం చాలా కసరత్తులు చేశాడు. తన తండ్రి సాధించలేకపోయిన విజయాన్ని తను సాధించాలని తాపత్రయ పడుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారంతో మంచి హిట్స్ అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆల్రెడీ ఈ మూవీ ఆడియోకు మంచి అప్లాజ్ వస్తోంది.పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని జూలై 9న విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. అయితే అదే టైమ్ కు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ కూడా విడుదల కాబోతోంది. దీంతో వీరు తమ శ్రీనివాస మంగాపురం సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త డేట్ గా ఇదే అని ఫిక్స్ చేయలేదు కానీ.. జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. మొత్తంగా హీరోగా ఫస్ట్ మూవీ అంటే ఇలాగే చేయాలి. కానీ వీళ్లు మొదటి నిర్ణయాన్ని వాయిదా వేయడం ఏమంత బాలేదు అని అభిమానులు భావించినా.. అఖిల్ తో పోటీ ఎందుకునే అని వీళ్లు అలా ఫిక్స్ అయ్యారు. బట్ మూవీ ఎప్పుడు విడుదలైన మంచి విజయం సాధించడం ఖాయం అనేది వీరి కాన్ఫిడెన్స్ మాత్రం చూడముచ్చటగా ఉంది.

Continue reading
ఒన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లమరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన భారతనారి. హీరో స్వామ్యం నడిచే ఇండస్ట్రీలో నటిగా దాన్ని ప్రతిఘటించిన ధీశాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. అబితాబ్ బచ్చన్, రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి. డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి.

విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి తీసుకుంది. విజయశాంతిని కథానాయకిగా తెరకు పరిచయము చేసింది భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం కూడా అదే ఏడాది ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, దర్శకురాలు విజయనిర్మల. తర్వాత కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది విజయశాంతి.

హీరోయిన్ గా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది విజయశాంతి. వీటిలో కూడా పెద్ద హిట్స్ గా నిలిచినవి చాలా తక్కువ. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 లో నిర్మించిన నేటి భారతం. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.

తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు వంటి తెలుగు చిత్రాల్లో రెగ్యలర్ హీరోయిన్ వేషాలే వచ్చాయి .అయితే రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ వేసి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.

జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనకంటూఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలాకాలమే నిరీక్షించాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు.

1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ , అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జాదొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో హీరోతో ఆడి పాడే చిలిపి కథానాయికగానూ నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. ప్రతిఘటన తో అభినయ పరంగా తనకెదురే లేదని నిరూపించుకోగా, జడగంటలు లో టు-పీస్ బికినీ ధరించి అందాల ప్రదర్శన విషయంలో కూడా తనకు హద్దులు లేవని చాటి చెప్పింది.

సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు.. హుందాతనం ఉట్టిపడే పాత్రలు.. పురుషులను ధిక్కరించే అహంకారపూరిత పాత్రలు.. మొండితనం నిండిన క్యారక్టర్స్ కు .. అందచందాలతో అలరించే పాత్రలు.. ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీ ఫేమస్ అయిన టైమ్ లో, అవన్నీ విజయశాంతి ఒక్కతే పోషించి ప్రేక్షకులను మెప్పించగలదనీ నిరూపించింది. మొత్తంగా 1985లో ఆమె నటించిన పదమూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో పదకొండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో ఆమె తమిళ మూవీస్కు ఫుల్ స్టాప్ పెట్టి తెలుగు సినిమాలపైనే కాన్ సెంట్రేట్ చేసింది.

1986 విజయశాంతి స్టామినాను కమర్షియల్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన సంవత్సరం. రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాల నాయికగానూ నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చె వచ్చె వాన జల్లు పాటలో అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి మొహమాటాలూ పెట్టుకోలేదు. ఈ మూవీతో బాలయ్యతో విజయశాంతిది హిట్ పెయిర్ గా గుర్తింపొచ్చింది.

1980ల సగం నుంచి 90 వరకూ విజయశాంతి కెరీర్ పీక్స్ లో కొనసాగింది. ఈ టైమ్ లో ఆమె ఏం చేసినా హిట్టే అన్నట్టుగా సాగింది కెరీర్. తనే ప్రధాన పాత్రగా ఉన్నా.. హీరోల సరసన కేవలం గ్లామర్ డాళ్ గా ఆడిపాడినా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా అయినా.. విజయశాంతి ఈ ఐదారేళ్ల కాలంలో చేసిన పాత్రలు.. సినిమాలు.. అన్నీ సూపర్ హిట్సే. ఓ రకంగా అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.

పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్ద బంతి పూవు లాంటి తెలుగు పడుచు పిల్ల సౌందర్యానికి వెండితెర పర్యాయ పదాలుగా నిలచిపోయాయి. ఇవే కాక ఇంద్రుడు – చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలతో విజయానికి మరో పేరు విజయశాంతిగా నిలిచిపోయింది.

ఇక మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకూ లేడీ ఓరియంటెడ్ పాత్రలంటే మగదిక్కులేని గంపెడు సంసారాన్ని గుట్టుగా లాగిస్తూ.. సమాజంలో మంచి మహిళగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినవే. కానీ ఆడదంటే అబల కాదు..ఆమె తలచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా నాటి రోజుల్లో ఎందరు మహిళలకు స్ఫూర్తినిచ్చిందో చెప్పలేం. ఇప్పటికీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో చాలామంది సీనియర్ లేడీ ఆఫీసర్స్ తమకు కర్తవ్యం సినిమానే స్ఫూర్తి అని చెప్పుకుంటారు.

అయితే విజయశాంతి చేసిన చాలా చిత్రాల్లో పాత్రల కంటే తమిళ్ లో రజినికాంత్ హీరోగా నటించిన మన్నన్ లోని పాత్ర ది బెస్ట్ అని చెబుతారు. పొగరుబోతు మహిళగా ఈ సినిమాలో ఆమె నటనకు ఫిదా కాని వారు లేరు. ఓ సన్నివేశంలో ఆమె రజినికాంత్ ను చెంపదెబ్బ కొట్టాలి. ఆ పాత్రలో విజయశాంతి కాకుండా ఇంకెవరు చేసినా రజిని అభిమానులు ఊరుకునేవారు కాదని రజినీయే స్వయంగా చెప్పారంటే ఆమె నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే చిత్రం తెలుగులో ఘరానామొగుడు గా రీమేక్ కావడం విశేషం.

కర్తవ్యం ఇంపాక్ట్ తో ఆ తర్వాత దాదాపు తనే ప్రధాన పాత్రలో చాలా సినిమాలే చేసింది. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. ఇదే టైమ్ లో మరికొన్ని గ్లామర్ పాత్రలనూ పోషించింది. బాలయ్యతో నిప్పురవ్వ, చిరంజీవితో మెకానిక్ అల్లుడు తర్వాత ఆమె స్టార్ హీరోల సరసన నటించలేదు. అయితే వీటితో పాటు ఆమె చేసిన మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఆ టైమ్ లో వచ్చిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ తుడిచేసింది. అదే ఓసేయ్ రాములమ్మా.

ఒసేయ్ రాములమ్మా సినిమాతో వచ్చిన ఇమేజ్ తో ఆమె అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా లేని టైమ్ లో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేశారు. ఆ కోవలో చేసిన రౌడీ దర్బార్ ఎబౌ యావరేజ్ గా నిలిస్తే.. శ్రీవారంటే మావారే, భారతరత్న సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. 2000ల తర్వాత నుంచి విజయశాంతి సినిమా కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ లో కొనసాగింది. చేసిన ప్రతి సినిమా నిరాశపరిచింది.

శాంభవి ఐ.పి.యస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా, కథ, కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయరంగంలో కూడా ఉండటంతో మంచి కథలు ఎంచుకోలేకపోయింది. దీంతో సినిమాలలో ఇంకా సంచలనం సృష్టించగల ప్రతిభ, వయసు ఉన్నా రాజకీయరంగంపై ఆసక్తితో ఆమె సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు.

సొంతంగా పార్టీ పెట్టి, తర్వాత ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం ఓ సారి ఎం.పిగా గెలిచిన విజయశాంతి పొలిటికల్ కెరీర్ కూడా ఇప్పుడేమంత బాగా లేదు. అందుకే మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదీ కాక ఆమె ఎప్పటి నుంచో తన లక్ష్యం తెలంగాణ సాధించడం అని చెబుతూ వచ్చింది. అది సాకారమైంది కాబట్టి.. ఇక రాములమ్మ రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆమె అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం విజయశాంతి లాంటి ఆర్టిస్ట్ అవసరం దక్షిణాది చిత్ర పరిశ్రమకు చాలా ఉంది.

 

Continue reading
బాలయ్య, ప్రభాస్, విజయ్.. డిసెంబర్ లో వచ్చేదెవరు..?

నందమూరి బాలకృష్ణ అప్డేట్

ఈ యేడాది డిసెంబర్ మంచి డిమాండ్ లో ఉండబోతోంది అనిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య నటిస్తోన్న మూవీ డిసెంబర్ లో విడుదల కాబోతోంది అని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ తోనే అదరగొట్టాడు. అదీ కాక బాలయ్య విగ్ సెట్ అయితే సినిమా హిట్ అనే టాక్ కూడా ఉంది కదా. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తి కావొస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్స్ కు కావాల్సినంత టైమ్ ఉంది. అదీ కాక బాలయ్య ఈ మూవీ తర్వాత ఆగస్ట్ నుంచే కొరటాల శివ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు. అంటే ఆగస్ట్ వరకు గోపీచంద్ మూవీ కంప్లీట్ అవుతుంది. అందుకే బాలయ్యకు బాగా కలిసొచ్చినా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ప్రభాస్ ఫౌజీ మూవీ

ఇక రాజాసాబ్ లాంటి డిజాస్టర్ చూసిన ప్రభాస్ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ముందుగా రావాల్సిన సినిమా ఫౌజీ. బట్ ఈ మూవీ గురించి మినిమం అప్డేట్స్ కూడా ఏం లేవు. అసలు వస్తుందా లేదా అనేది కూడా తెలియకుండా పోయింది. ఈ మూవీ టీమ్ నుంచి ఎలాంటి విషయాలు కూడా తెలియకుండా ఉన్నారు. ఆ కారణంగా ఈ చిత్రం అసలు ఈ యేడాది విడుదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కొందరు మాత్రం ఈ చిత్రాన్ని ఈ యేడాది డిసెంబర్ 3న విడుదల చేస్తారు అని చెబుతున్నారు. ఆ కొందరు అనేది ఎవరికీ తెలియదు. బట్ ఇప్పటికైతే ఫౌజీని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు అనే రూమర్ ఉంది.

విజయ్ దేవరకొండ రణబాలి

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న మూవీ రణబాలి. రష్మిక మందన్నా హీరోయిన్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో రాబోతోంది. ఈ మూవీ విషయంలో విజయ్ దేవరకొండ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అదీ కాక రష్మిక మందన్నా ఈ మధ్య చేసిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్. అలాంటి ఇద్దరూ పెళ్లి తర్వాత చేస్తోన్న మూవీ ఇది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 11నవిడుదల అన్నారు. తర్వాత అక్టోబర్ కు వాయిదా వేశారు. బట్ ఈ వాయిదా కూడా ఆగిపోయేలా ఉందట. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక నాని నటిస్తోన్న ద ప్యారడైజ్ కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతోందంటున్నారు. వీళ్లు ఇప్పటికే రిలీజ్ డేట్ మార్చారు. ఇంకా కొత్త డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. మరి వీళ్లు కూడా డిసెంబర్ లో వస్తే.. ఈ నెల టాలీవుడ్ కు మాంజి జోష్ గా ఉంటుందేమో.

 

Continue reading
రామ్ పోతినేని రఫ్పాడిస్తాడా..?

రామ్ పోతినేని(Ram Pothineni) కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సరైన సినిమాలు పడటం లేదు. వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే పరుస్తున్నాయి. చివరగా ఆంధ్రాకింగ్ తాలూకాతో నటనతో మెప్పించాడు కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తనే స్వయంగా రంగంలోకి దిగాడు. డెబ్యూ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ రేపటి నుంచి(29.06.2026) ప్రారంభం కాబోతోంది.
ఈ చిత్రానికి దర్శకుడే కాదు నిర్మాత కూడా తనే. కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్ అనే బ్యానర్ స్థాపించాడు. ఆ బ్యానర్ లోనే రాపో ఫస్ట్ డైరెక్షన్ మూవీ రాబోతోంది. ఈ మూవీలో అతని పాత్రను ‘వీరా’గా ఆల్రెడీ చెప్పారు. ఆ పాత్రకు తగ్గట్టుగా గెటప్ కూడా ఉండబోతోంది అనిపించేలా ఓ లుక్ కూడా విడుదల చేశారు. మొత్తంగా రామ్ పోతినేని ఈ కథ విషయంలో చాలా సీరియస్ గా ఉండబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. మరిఈ మూవీలో హీరోయిన్ ఎవరు.. ఇతర కాస్టింగ్ ఎవరు అనేది రేపు తెలుస్తోందేమో.

Continue reading