నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్యకు సరైన వారసుడుగా అభిమానులు అతన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఇటు చూస్తే తన తరం హీరోల తనయులు హీరోలుగా మారిపోయారు. బట్ తన ఏజ్ ను బట్టి మోక్షజ్ఞ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో అతనికి ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. బాలయ్య కోరిక బలంగా ఉన్నా మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరిక కనిపించడం లేదు అని చాలాసార్లు అనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని కొన్నాళ్ల క్రితం నానా హడావిడీ చేశారు. ఆ మేరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రశాంత్ తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి బాలయ్యే స్వయంగా వచ్చాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999ను రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బట్ అదీ ముందుకు సాగడం లేదు. ఇటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడూ ప్రాపర్ లుక్ మెయిన్టేన్ చేయలేకపోతున్నాడు. దీంతో అసలు మనోడికి సినిమా హీరో కావాలనే లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదీ నిజమే అనిపించేలా ఉంది తాజా కథ.
బాలకృష్ణ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరకూరు నిర్మాత. అయితే కొరటాల మూవీని సడెన్ గా స్టార్ట్ చేశాడు బాలయ్య. అందుకు కారణం నిర్మాతే అనేది చాలామందికి తెలియదు. సుధాకర్ చెరకూరి గతంలో మోక్షజ్ఞతో మూవీ చేయాలనుకున్నాడు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం కొంత ఖర్చు చేశాడు. కానీ మోక్షజ్ఞ మూవీ చేయలేకపోతున్నాడు. ఆ మేరకు అతనికి కాంపెన్సేట్ చేయడం కోసమే బాలయ్య ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశాడు అనేది వాస్తవం. అంటే మోక్షజ్ఞతో మూవీ చేయాలని సుధాకర్ కు ఉన్నా.. అది పట్టాలెక్కడం సాధ్యం కాదు అని తెలిసింది కాబట్టే ఈ ప్రాజెక్ట్ నే బాలయ్యతో స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట.
ఈ రకంగా చూస్తే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు మాత్రమే కాదు.. అసలు అతనికి సినిమాలే ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవచ్చు. లేదంటే ఇప్పటికే అతని వయసుకు 30కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో 20కే స్టార్ట్ చేయడం కామన్ గా చూస్తుంటాం. అలాంటి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతనికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమే అనేది ఈ వార్త సారాంశం. లేదంటే బాలయ్య కొన్ని ముహూర్తాల కోసం చూస్తున్నాడేమో తెలియాల్సి కూడా ఉంది.