కరుప్పు బ్లాక్ బస్టర్ తో సూర్య దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తర్వాత విశ్వనాథమ్ అండ్ సన్స్ మూవీతో తెలుగు స్ట్రెయిట్ మూవీ ఈ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. తర్వాత ఓ మళయాల మూవీ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. మరోవైపు తమిళ్ లో కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జై భీమ్ దర్శకుడితో మరో మూవీకి సిద్ధం అయ్యాడు. ఇది సూర్యకు 48వ చిత్రం. జై భీమ్ తో విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు టిజే జ్ఞానవేల్. తర్వాత అతను రజినీకాంత్ తో చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద పోయింది. బట్ అతను ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా బావుంది.
దర్శకుడు టిజే జ్ఞానవేల్ తో మళ్లీ సూర్య జత కట్టడం మాత్రం చాలా బావుంది. ఇద్దరి కాంబోలో జై భీమ్ లాంటి మూవీనే మళ్లీ ఎక్స్ పెక్ట్ చేయలేం.. బట్ కమర్షియల్ మూవీతో రావడం పక్కా అనేది తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కయాడు లోహర్ ను తీసుకున్నారు. తమిళ్ లో ఆమె చేసిన డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా చాలా బిజీ అయిపోయింది. అలాంటి బ్యూటీ సూర్యతో అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఇక హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ మూవీ ఇవాళే ప్రారంభం అయింది. ఈ యేడాది జూలై లేదా ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మరి ఈ మూవీతో జై భీమ్ జోడీ మళ్లీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.






