‘లేడీస్ & లేడీస్’ టీజర్‌తో అంచనాలు పెంచిన ‘టాక్సిక్’..

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌లో సినిమా కథను పూర్తిగా రివీల్ చేయకుండా, సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హీరోయిన్లను స్టైలిష్‌గా పరిచయం చేశారు.

ఈ టీజర్‌లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ గ్లామరస్‌తో పాటు పవర్‌ఫుల్ లుక్స్‌లో కనిపించారు. ప్రతి పాత్ర వెనుక ఒక పెద్ద కథ దాగి ఉన్నట్లుగా విజువల్స్‌ను డిజైన్ చేశారు.

టీజర్‌లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈసారి పూర్తి ఫోకస్ మహిళా పాత్రలపైనే ఉండటంతో సినిమా కథలో వారి పాత్రలు ఎంత కీలకంగా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిస్తున్నారు.

అయితే టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ కనిపించింది. కొందరు టీజర్ విజువల్స్, మేకింగ్, స్టార్ కాస్ట్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు మహిళా పాత్రలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీని ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

‘లేడీస్ & లేడీస్’ టీజర్‌తో ‘టాక్సిక్’ సినిమాపై మరోసారి డిస్కషన్ మొదలైంది. మహిళా పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే టీజర్ మాత్రం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.

Continue reading
దిల్ రాజు బయోగ్రఫీ: చిన్న వ్యాపారం నుంచి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన సక్సెస్ స్టోరీ

తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతల జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు దిల్ రాజు. మంచి కథలను ఎంపిక చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం, కొత్త దర్శకులను ప్రోత్సహించే తీరు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను నిర్మించడం వల్ల టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
దిల్ రాజు అసలు పేరు వి. వెంకటరమణా రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో 18 డిసెంబర్ 1970లో జన్మించాడు. సినిమాల్లోకి రాకముందు దిల్ రాజు వ్యాపార రంగంలో ఉన్నారు. తర్వాత సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో అడుగుపెట్టి, ప్రేక్షకుల అభిరుచిని దగ్గరగా అర్థం చేసుకున్నారు. ఏ సినిమా ఎక్కడ బాగా ఆడుతుందనే విషయంలో ఆయనకు వచ్చిన అనుభవం నిర్మాతగా ఎదగడానికి బలమైన పునాది అయింది.
2003లో విడుదలైన ‘దిల్’ సినిమా నిర్మాతగా వెంకట రమణ రెడ్డి తొలి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అప్పటి నుంచి సినీ పరిశ్రమలో ఆయనను “దిల్ రాజు” అని పిలవడం ప్రారంభమైంది. ఆ పేరు తరువాత ఆయన అసలు పేరుకంటే ఎక్కువగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది.’దిల్’ మూవీతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా తన స్థానానికి చేరాడు.చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాయి.

కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన నిర్మాత

దిల్ రాజు గురించి చెప్పేటప్పుడు తప్పకుండా ప్రస్తావించాల్సిన విషయం కొత్త ప్రతిభను ప్రోత్సహించడం. మంచి కథ ఉంటే కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఆయన వెనుకాడరు. ఈ కారణంగా పలువురు యువ దర్శకులు, రచయితలు, నటులకు ఆయన ద్వారా సినీ పరిశ్రమలో అవకాశాలు లభించాయి.

దిల్ రాజు కుటుంబం

దిల్ రాజు తొలి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. అనంతరం 2020లో వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె హన్షిత రెడ్డి సినీ నిర్మాణ రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు కుటుంబ విషయాలను సాధారణంగా వ్యక్తిగతంగానే ఉంచుతారు.
దిల్ రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదు, టాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఒకరు. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు సమర్థవంతంగా విడుదల చేయడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. కథకు ప్రాధాన్యం ఇవ్వడం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు నిర్మించడం ఆయన విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

దిల్ రాజు అందుకున్న గుర్తింపు

దిల్ రాజు నిర్మించిన అనేక చిత్రాలు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నాయి. నాణ్యమైన సినిమాలు నిర్మించే నిర్మాతగా ఆయనకు పరిశ్రమలో మంచి గౌరవం ఉంది.
దిల్ రాజు బయోగ్రఫీ చూస్తే, సాధారణ వ్యాపారిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా ఎదిగిన విజయగాథగా కనిపిస్తుంది. సరైన కథలను ఎంచుకోవడం, కొత్త ప్రతిభను నమ్మడం, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధిలో దిల్ రాజు పాత్ర ఎంతో ముఖ్యమైనది. భవిష్యత్తులో కూడా ఆయన నుంచి మరిన్ని విజయవంతమైన చిత్రాలు రావాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

 

Continue reading
కార్తికేయ… సడెన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడు..?

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ పేరు టాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. 2018లో వచ్చిన RX 100 సినిమా అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. డిఫరెంట్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన కార్తికేయ.. ఇప్పుడు మాత్రం కొంతకాలంగా పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.

అసలు ఏం జరిగింది? సినిమాలకు దూరమయ్యాడా? లేక ప్లాన్ మార్చుకున్నాడా?

ఫ్యాక్ట్ ఏంటంటే… కార్తికేయ సినిమాలు పూర్తిగా ఆపలేదు. కానీ RX 100 తర్వాత వచ్చిన సినిమాలు అతనికి అదే స్థాయి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో ప్రయత్నించినా.. తొలి సినిమా ఇచ్చిన ఇంపాక్ట్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఇలాంటి సమయంలో హీరోగా మాత్రమే కాకుండా కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా అంగీకరించాడు. అందులో వలిమై సినిమాలో విలన్ పాత్ర ఒక ఉదాహరణ. ఈ సినిమా ద్వారా ఇతర భాషల్లో కూడా పరిచయం అయ్యాడు.
ప్రస్తుతం అతని కెరీర్‌లో కనిపిస్తున్న గ్యాప్‌కు ప్రధాన కారణం — సినిమాల కొరత కంటే, సరైన స్క్రిప్ట్ ఎంపికపై ఫోకస్ పెంచడం అని చెప్పొచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలు చేయడం కంటే, తన ఇమేజ్‌కు సరిపోయే కథల కోసం వేచి చూస్తున్నాడు.
అలాగే పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి కూడా కొంత సమయం కేటాయిస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో, సినిమా ప్రమోషన్స్‌లో కూడా అతని యాక్టివ్‌నెస్ కొంచెం తగ్గింది. అయితే “కార్తికేయ సినిమాలకు గుడ్‌బై చెప్పాడు” అనే వార్తలకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అతను ఇంకా సినిమాల్లోనే ఉన్నాడు. సరైన ప్రాజెక్ట్‌తో మళ్లీ బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే RX 100తో వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కార్తికేయ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌కు సరైన కథ దొరికితే మరోసారి బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

Continue reading
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ సంచలనం సృష్టిస్తుందా..?

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయింది. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవతో ఈ కాంబో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, దేవుడి పాత్ర, భారీ విజువల్ స్కేల్ అంటూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎన్టీఆర్ ఏ దేవుడి పాత్రలో నటిస్తున్నాడనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయంలో మాత్రం ఓ స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. మాగ్జిమం కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఫార్మాట్‌ను దాటి ఒక భారీ మైథలాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనేది మాత్రం స్పష్టం. పురాణాలు, చరిత్ర, ఫాంటసీ అంశాలను కలిపి ఒక ఎపిక్ కథను సిద్ధం చేశాడు అనేది క్లియర్.
ఎన్టీఆర్ విషయానికి వస్తే… ఆయనకు పౌరాణిక పాత్రలు కొత్త కాదు. చిన్న వయసులోనే పౌరాణిక పాత్రలు చేసిన అనుభవం ఉంది. తన డైలాగ్ డెలివరీ, హావభావాలతో ఇలాంటి పాత్రలకు సరిపోయే నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ అయిన నటుడు. అందుకే ఎన్టీఆర్‌ను దేవుడి తరహా పాత్రలో చూడాలనే వార్తలకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.
కానీ ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లు కేవలం స్టార్ పవర్‌తో కాకుండా కథ, విజువల్స్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌పై ఆధారపడి ఉంటాయి. త్రివిక్రమ్ తన రైటింగ్ స్టైల్ తో ఈ పురాణ ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరిస్తాడు? ఎన్టీఆర్ పాత్రను ఏ స్థాయిలో చూపిస్తాడు? అనేదే అసలు ఆసక్తి. కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయిక మాత్రం మరోసారి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

Continue reading
నాగబంధం మూవీ ఎలా ఉండబోతోంది?

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో పౌరాణికం, మిస్టరీ, ఫాంటసీ జానర్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అదే కోవలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ నాగబంధం(Nagabandham). జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో విరాట్ కర్ణ(Virat Karna) హీరోగా నటించాడు. నభా నటేష్(Nabha Natesh), ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా చేశారు. అభిషేక్ నామా దర్శకుడు.
నాగబంధం ఒక ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నాగ శక్తి, పురాతన రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు, యాక్షన్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దీని కాన్సెప్ట్. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా.. భారతీయ నమ్మకాలు, పురాణాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. నాగ దేవత, రహస్యమైన శక్తులు అనే అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
విజువల్స్ విషయంలో కూడా సినిమా టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి జానర్ సినిమాలకు గ్రాఫిక్స్, VFX, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు నమ్మేలా చూపించగలిగితే ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది. అయితే ఇలాంటి సినిమాలకు పెద్ద సవాల్ కూడా ఉంటుంది. కేవలం భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఉంటే సరిపోదు.. కథలో బలం, పాత్రల ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోవాలి. ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేయగలిగితేనే ఫాంటసీ సినిమాలు విజయవంతం అవుతాయి.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను స్వీకరించే మూడ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారతీయ కథలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. నాగబంధం కూడా సరైన ఎగ్జిక్యూషన్‌తో వస్తే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి.. నాగబంధం ఒక రెగ్యులర్ సినిమా కాదు. పురాణం, మిస్టరీ, ఫాంటసీ కలయికతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సినిమా. ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో జూలై 3 తర్వాతే తెలుస్తుంది.

Continue reading
రవితేజ మారుతున్నాడా..?

మాస్ మహరాజ్ రవితేజ.. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే అతను ఎంచుకున్న కథల్లో అప్పుడు సత్తా చాటాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అప్డేట్ కావాలి. బట్ ఈ విషయంలో రవితేజ చాలాకాలం పాటు అప్డేట్ కాలేకపోయాడు. అదే పనిగా మూవీస్ అన్నీ పోతున్నా అతను మారలేదు. ఓ దశలో అభిమానులు కూడా ఇవేం మూవీస్ రా బాబూ అని తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్తదనం అనే పదానికి చాలా దూరంగా అతని కథలు కనిపించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుల దండయాత్ర మొదలైంది. ఒకదాన్ని మించి ఒకటిగా డిజాస్టర్ అయ్యాయి. ఓ దశాబ్దం పాటు కొనసాగిన ఈ ఫ్లాపుల పర్వం అతని కెరీర్ నే ప్రశ్నార్థకంలో పడేసింది. బాగా ఆలస్యం అయినా ఆత్మ పరిశీలనలో పడిపోయాడు. అందులో భాగంగానే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ చేశాడు. ఈ కథలో కొత్తదనం లేదు. బట్ అతను చేయడం వల్ల కొత్తగా అనిపించింది. దీనికి తోడు తన ఇమేజ్ కు దూరంగా ఈ మూవీ చేశాడు. ఈ యేడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా విజయాన్ని సాధించింది. ఈ టైమ్ లో ఎవ్వరూ ఊహించని కథకు కమిట్ అయ్యాడు రవితేజ.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఇరుముడి’అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతను కథల విషయంలో ఓ మెట్టు ఎక్కుతున్నాడు అనిపించేలాఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అది చాలామందిని ఆకట్టుకుంది. తాజాగా ఇదే మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. ఈ పాట ఇరుముడి చుట్టూ సాగే గీతం. అయ్యప్ప మాల వేసుకుని, ఇరుముడి కట్టుకుని దీక్షను విరమించే సందర్భంలో వచ్చే పాట. ఈ పాటలో ఎక్కడా రవితేజ అతి కనిపించలేదు. చాలా సాధారణంగా సాగింది. పాట, సాహిత్యం రెండూ బావున్నాయి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మూవీలో చాలా కీలకంగా ఓ పాప కనిపిస్తోంది. ఈ పాటలో తను వేసిన డ్యాన్స్ లు చాలా బావున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ ఇది. ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.
ఏదేమైనా రవితేజ కాలానికి తగ్గట్టుగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అదే పనిగా మాస్ రాజా అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కు అంతగా వర్కవుట్ కాదు అనేది అర్థమైనట్టుంది. మరి ఇకనైనా బలమైన కథలను ఎంచుకుంటూ తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. అప్పుడప్పుడు మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీసుకువస్తే తన మళ్లీ రేంజ్ మారుతుంది.

Continue reading
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ అయింది..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగా ఈ మూవీ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలామందిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇది ఓ పౌరాణిక కథ. పౌరాణికాలు అంటే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని చిన్నప్పటి రామాయణంతోనే ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇది ఓ అద్భుతమైన పౌరాణిక గాథ అని తెలుస్తోంది. అదీ కాక త్రివిక్రమ్ కు ఇలాంటి కథలపై ఎంత ఆసక్తి ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే చాలా విషయాలు తెలిసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్ లో త్రిశూలం కనిపిస్తోంది. ఆ త్రిశూలంలో డిఎన్ఏ సింబల్ కూడా ఉంది. అంటే ఇది సోషల్ డ్రామా నుంచి పౌరాణికం వరకు వెళుతుందా అని చాలామంది భావిస్తున్నారు. బట్ అదేం కాదు. ఈ మూవీలో కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. కార్తికేయుడు అంటే శివుని అంశ. అది కాకుండా పార్వతీ దేవి గర్భం నుంచి కాక విశ్వ బీజం నుంచి ఆయన పుట్టుకు ఉంటుంది అని అర్థం. అంటే కేవలం శివ పార్వతుల అంశతో మాత్రమే కార్తికేయుడు జన్మించాడు అని వేరే చెప్పక్కర్లేదు. కార్తీకేయుడు అంటే యుద్దాలు చాలానే ఉంటాయి. అందుకే పోస్టర్ లో దాన్ని కూడా ఇన్ డైరెక్ట్ గా తెలిపేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పలేదు కానీ ముందైతే అనౌన్స్ అయింది.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో ఎన్టీఆర్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ ఉండబోతోంది అనేలా ఉంది. అంటే ఆ మధ్య ముందే నెల్సన్ మూవీ ఉంటుందని కూడా చెప్పారు కొందరు. అలాంటిదేం లేదు అనేలా ఈ అనౌన్స్ మెంట్ చెబుతోంది. ఏదేమైనా అల వైకుంఠపురములో తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఈ కథపై చాలా కసరత్తులు చేశాడు. అందుకే ఇదో అద్భుతమైన కథగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఆయన ఆదర్శ కుటుంబం తర్వాత ఇక తన ఫోకస్ అంతా ఈ మూవీపైనే పెట్టబోతున్నాడు అనేది స్పష్టం.

Continue reading
ఎవర్ గ్రీన్ క్లాసిక్ గీతాంజలి రీ రిలీజ్ కాబోతోంది

క్లాసిక్స్ అనే మాట అత్యంత అరుదుగా వినిపిస్తుంది. ఆ మాటలోనే ఆ మూవీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థమైపోతుంది. కథలో కొత్తదనం, కథనంలో నవ్యత వల్ల అప్పటి వరకు చూసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే మూవీస్ గా ఇవి కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్లాసిక్ మూవీనే గీతాంజలి. నాగార్జున, గిరిజ జంటగా నటించిన మూవీ ఇది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైన తెలుగు సినిమా కూడా ఇదే. మణిరత్నం మ్యాజిక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీతో ప్రేమలో పడిపోయారు. ఆ రోజుల్లో ఈ తరహా మూవీని ఎవరూ ఊహించను కూడా లేరు. 1989 మే 12న విడుదలైన గీతాంజలి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సినిమా ప్రారంభంలోనే కాలేజ్ లో హ్యాపీగా సాగుతున్న ప్రకాష్ కి అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. పైగా అది చివరి దశలో ఉందని డాక్టర్స్ చెబుతారు. దీంతో ఆ కొన్నాళ్లు తను తనకు నచ్చినట్టుగానే ఉండాలని ఊటీ వెళతాడు. అక్కడ ఓ అల్లరి అమ్మాయి గీతాంజలితో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య పోట్లాటల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. అదే టైమ్ లో గీతాంజలికి కూడా క్యాన్సర్ ఉందని.. అది కూడా చివరి దశలో ఉందని తెలుస్తుంది. మరి ఆ తర్వాత వీరి ప్రేమ ఏ తీరాలకు వీరిని తీసుకువెళుతుంది. చనిపోతారా లేక బ్రతికి ఉంటారా అనేది అత్యంత హృద్యంగా సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ మూవీ. కావడానికి ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్సే అయినా ప్రతి నిమిషం వీళ్లు సంతోషంగా బ్రతికి ఉంటారు. అదే ఈ మూవీలో కనిపించే కోర్ పాయింట్. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు అసలు వారికి వ్యాధి ఉందా లేదా అనేది కూడా లేని ఆనందంగా సాగుతుందీ కథనం. ఏదేమైనా ఈ మూవీ ఇప్పుడు మళ్లీ విడుదల చేయబోతున్నారు అంటే నాటి ప్రేక్షకులకు మళ్లీ చూడాలన్న తపన పెరుగుతూ ఉంటుంది.
ఇక గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 28న నాగార్జున బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇళయరాజా సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతం. టెక్నికల్ గా కంటెంట్ పరంగా హండ్రెడ్ మార్క్స్ పడిన ఈ మూవీ ఈ జెనరేషన్ ఆడియన్స్ కు కూడా చాలా చాలా బాగా నచ్చుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading
పుష్ప రూట్ లోనే రామ్ చరణ్.. ఇది సుకుమార్ ప్లానేనా..?

పెద్దితో రామ్ చరణ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి పెద్ది తర్వాతేంటీ అనే ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు. సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు చరణ్. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీతోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో పాటు చరణ్ కు చెవుడు ఉన్నట్టుగా ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఇద్దరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్. అంటే రాబోయే కథ కూడా అలాగే ఉంటుంది అని భావించొచ్చు.
ఇక ఈ కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇది పూర్తిగా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కా సమాచారం. దీంతో పాటు దీన్ని కేవలం ఒకే పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట. రెండు భాగాలు అంటే పుష్ప, పుష్ప 2 లాగా చాలా టైమ్ తీసుకోకుండా.. ధురంధర్ లాగా రెండు భాగాలను వెంట వెంటనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ మూవీ అయితే సుకుమార్ స్టైల్ కు భిన్నంగా కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనేది మాత్రం నిజమే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతున్నాడు. అన్నీ సెట్ అయితే దసరా తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్.

Continue reading
అల్లు అర్జున్ తో మరోసారి రష్మిక మందన్నా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారింది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టాడు. తమిళ్ స్టార్ డైరెక్టర అట్లీతో జట్టు కట్టాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే చెప్పారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. రాకా టైటిల్. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తను మళ్లీ ప్రగ్నెంట్ తో ఉంది. అలాగే ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. అదే టైమ్ ల రష్మిక మందన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అనే న్యూస్ కూడా వస్తున్నాయి. జాన్వీ, మృణాల్ మేటర్ ఏంటో కానీ.. లేటెస్ట్ గా రష్మిక మందన్నా కన్ఫార్మ్ అయింది. ఈచిత్రంలో రష్మిక మందన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. తనేమీ రెగ్యులర్ హీరోయిన్ కాదు. బట్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలోనే చేయబోతున్నారు. మరో రెండు వారాల్లో రష్మిక మందన్నా రాకా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ పుష్ప మూవీతో ఈ జంట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అలాంటి జంట మళ్లీ కనిపించబోతున్నారు అంటే ఓ రకమైన ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది అనేది వాస్తవం. మరి కేవలం రష్మిక మాత్రమేనా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ల పాత్రలు కూడా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్నా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.

Continue reading