ఓ.. సుకుమారి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

కామెడీ కంటే షాకులే ఎక్కువ!

Rating: ⭐⭐☆☆☆ (2/5)

కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తేనే “ఇందులో ఏదో కొత్తగా ఉంది” అనిపిస్తాయి. Oh Sukumari కూడా అలాంటి సినిమానే. హీరోయిన్‌ను ఎవరైనా తాకితే కరెంట్ షాక్ కొట్టడం అనే కాన్సెప్ట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమా వరకు ఆసక్తికరంగా తీసుకెళ్లగలిగారా అంటే… సమాధానం మాత్రం కాదు.


కథ

తెలంగాణలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన దామిని (ఐశ్వర్య రాజేష్) చిన్నప్పటి నుంచే ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. దీంతో ఊరివాళ్లు ఆమెను దూరం పెడతారు.

మరోవైపు యాదగిరి (తిరువీర్) తన తాత వీలునామా కారణంగా వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాడు. అలా దామినిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సమస్య తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి తర్వాత ఏమైంది? ఈ విచిత్రమైన సమస్య వారి జీవితాన్ని ఎలా మార్చింది? అత్తింట్లో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు దామిని సమస్యకు పరిష్కారం దొరికిందా? అనేదే మిగతా కథ.


ఎలా ఉంది?

ఈ సినిమా మొత్తం ఒకే కాన్సెప్ట్ మీద నడుస్తుంది.

హీరోయిన్‌ను తాకితే షాక్ కొడుతుంది.

ఇది ట్రైలర్‌లో బాగానే అనిపించింది. కానీ సినిమాలో ఇదే పాయింట్‌ను పదే పదే తిప్పి చూపించడం వల్ల కొంతసేపటికే రిపీట్ ఫీలింగ్ మొదలవుతుంది.

ఇలాంటి కథల్లో బలమైన కామెడీ లేదా గట్టి ఎమోషన్ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటినీ పూర్తిగా వాడుకోలేకపోయాడు.

మొదటి భాగంలో కొన్ని చోట్ల నవ్వులు వస్తాయి. అయితే అవి సినిమా మొత్తాన్ని నిలబెట్టే స్థాయిలో మాత్రం లేవు.

రెండో భాగం మరింత నెమ్మదిగా సాగుతుంది. అసలు కథలో ఉండాల్సిన కాన్‌ఫ్లిక్ట్ కూడా అంత బలంగా అనిపించదు.

హీరో 80 ఎకరాల ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని చెప్పే ట్రాక్ కూడా అంతగా కన్విన్స్ చేయదు.

హీరోయిన్ సమస్య తెలిసిన తర్వాత కూడా అత్తింట్లో ఎవరూ దానిని సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా లాజిక్‌కు దూరంగా ఉంటుంది.

మొత్తానికి మంచి ఐడియా ఉన్నా… దానికి తగ్గ స్క్రీన్‌ప్లే మాత్రం కనిపించదు.


ఎవరు ఎలా చేశారు?

తిరువీర్ తనకు ఇచ్చిన పాత్రను నిజాయితీగా చేయడానికి ప్రయత్నించాడు. కానీ పాత్రలో పెద్దగా ఎలివేషన్ లేకపోవడంతో అతని నటన కూడా చాలా చోట్ల సాధారణంగానే కనిపిస్తుంది.

ఐశ్వర్య రాజేష్‌కు పాత్ర కొత్తగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై ఆశించినంత ప్రభావం చూపించలేకపోయింది. నటన పరంగా ఓకే అనిపిస్తుంది.

మురళీధర్ గౌడ్, ఝాన్సీ తమ అనుభవంతో కొన్ని సన్నివేశాలను నిలబెట్టారు.

ఆమని పాత్ర మాత్రం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది.


టెక్నికల్‌గా

భరత్ మాచిరాజు సంగీతం పెద్దగా గుర్తుండదు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.

సి.హెచ్. కుషేందర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించింది.

ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా రెండో భాగంలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది.

దర్శకుడు భరత్ దర్శన్ మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరమైన కథగా మార్చడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.


Plus Points

  • కొత్త కాన్సెప్ట్
  • కొన్ని కామెడీ సన్నివేశాలు
  • గ్రామీణ నేపథ్యం

Minus Points

  • బలహీనమైన స్క్రీన్‌ప్లే
  • ఎమోషన్ మిస్సింగ్
  • లాజిక్ లేని సన్నివేశాలు
  • నెమ్మదిగా సాగే రెండో భాగం
  • గుర్తుండని పాటలు

చివరగా

Oh Sukumari వినడానికి కొత్త ఐడియాతో వచ్చిన సినిమా. కానీ కొత్త ఐడియా ఒక్కటే సరిపోదని మరోసారి నిరూపించింది.

కొన్ని నవ్వులు పంచినా… పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.

ఈ సినిమాకు “Oh Sukumari” అనే టైటిల్ కంటే “Shockumari” అనే టైటిల్ పెట్టి ఉంటే ఇంకా బాగా సెట్ అయ్యేదేమో అనిపిస్తుంది.

మా రేటింగ్: ⭐⭐☆☆☆ (2/5)

Continue reading
క్రిష్టఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’పై ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?

క్రిష్టఫర్ నోలన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు?

ప్రపంచ సినీ పరిశ్రమలో కథ చెప్పే విధానంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల్లో క్రిష్టఫర్ నోలన్ ముందువరుసలో ఉంటాడు. సాధారణ కథనాలకు భిన్నంగా, టైమ్‌లైన్‌లతో ఆడుకోవడం, మానసిక స్థాయిలో ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను తెరకెక్కించడం నోలన్ ప్రత్యేకత.

కొన్నిసార్లు ఆయన సినిమాలు ఒక్కసారి చూసిన వెంటనే పూర్తిగా అర్థం కావు. అయినప్పటికీ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసి వాటి అసలు అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే ఆయన సినిమాలపై ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణకు కారణం.

ఇప్పుడు నోలన్ నుంచి వస్తున్న తాజా చిత్రం ది ఒడిస్సీ (The Odyssey) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది.


ది ఒడిస్సీ సినిమాలో ఎవరు నటిస్తున్నారు?

ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు.

  • మాట్ డామన్
  • టామ్ హాలండ్
  • అన్నే హాతవే
  • రాబర్ట్ ప్యాటిన్సన్
  • లుపిటా న్యోంగో
  • జెండయా
  • చార్లీజ్ థెరాన్
  • ఇతర ప్రముఖ నటీనటులు

టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ది ఒడిస్సీ షూటింగ్ కేవలం 91 రోజుల్లోనే పూర్తయ్యిందా?

భారీ బడ్జెట్ సినిమాలు సాధారణంగా ఏడాది వరకు షూటింగ్ జరుపుకుంటాయి. కానీ ది ఒడిస్సీ చిత్రీకరణను కేవలం 91 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం.

అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం హాలీవుడ్ వర్కింగ్ స్టైల్. షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రీ-ప్రొడక్షన్, లొకేషన్ ప్లానింగ్, స్టోరీబోర్డింగ్, టెక్నికల్ ప్రిపరేషన్ వంటి పనులు పూర్తిగా సిద్ధం చేస్తారు. అందుకే షూటింగ్ దశ వేగంగా సాగుతుంది.


ది ఒడిస్సీ ఇండియాలో సెన్సార్ పరిస్థితి ఎలా ఉంది?

ఈ సినిమా ఇండియాలో ఎలాంటి విజువల్ లేదా డైలాగ్ కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఇది నోలన్ అభిమానులకు మరో శుభవార్తగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్, కథనం, టెక్నికల్ క్వాలిటీపై ప్రశంసలు వస్తున్నాయి.


ది ఒడిస్సీ రన్‌టైమ్ ఎంత?

ఈ సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 52 నిమిషాలు.

ఇండియాలో ఇలాంటి నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులకు పెద్ద సమస్య కాదు. అయితే విదేశాల్లో కొన్ని మల్టీప్లెక్స్‌లలో షో షెడ్యూలింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.


ది ఒడిస్సీపై ఎందుకు భారీ అంచనాలు?

క్రిష్టఫర్ నోలన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.

  • విభిన్నమైన కథ
  • అద్భుతమైన విజువల్స్
  • హాలీవుడ్ స్టార్ క్యాస్ట్
  • భారీ నిర్మాణ విలువలు
  • IMAX అనుభవం

ఈ అన్ని అంశాలు కలిసి ది ఒడిస్సీని ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

భారతదేశంలో కూడా ముఖ్యంగా IMAX, మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.


ముగింపు

క్రిష్టఫర్ నోలన్ మరోసారి తన ప్రత్యేకమైన సినిమా మేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేవలం 91 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం, భారీ స్టార్ క్యాస్ట్, కట్స్ లేకుండా భారతీయ సెన్సార్ పూర్తి కావడం వంటి అంశాలు ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

విడుదల తర్వాత ది ఒడిస్సీ నిజంగానే మరో నోలన్ మాస్టర్‌పీస్‌గా నిలుస్తుందా లేదా అనేది ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న హైప్ మాత్రం అసాధారణంగా ఉంది.

FAQ’s

క్రిష్టఫర్ నోలన్ ది ఒడిస్సీ ఎప్పుడు విడుదల అవుతోంది?

ది ఒడిస్సీ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ది ఒడిస్సీ షూటింగ్ ఎన్ని రోజుల్లో పూర్తయింది?

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సుమారు 91 రోజుల్లో పూర్తయింది.


ఇండియాలో ది ఒడిస్సీకి సెన్సార్ కట్స్ ఉన్నాయా?

ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది.


ది ఒడిస్సీ రన్‌టైమ్ ఎంత?

ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 52 నిమిషాలు.

Continue reading
జగపతిబాబు, శ్రీకాంత్ లకు ఇంకా అవకాశాలున్నాయా

తెలుగులో ఒకప్పుడు టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు, టైర్ 3 హీరోలు అంటూ ఉండేవారు. వారందరికీ సరైన మార్కెట్ కూడా ఉండేది. ఆయా హీరోలకు మంచి రిలీజ్ లు దొరికేవి. కంటెంట్ ఉంటే టికెట్స్ కూడా భారీగా తెగేవి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. ఇలాంటి హీరోలకు మంచి అవకాశాలు రావడం లేదు. ఆ మాటకొస్తే సినిమాలు చేస్తున్నారు కానీ కొనేవాళ్లు కూడా బాగా తగ్గిపోయారు. అందుకే ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు ఇతర పాత్రల వైపు మళ్లిపోయారు. విలన్ గా అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ టైమ్ లో అంతా హ్యాపీ అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా మళ్లీ వీళ్లకు హీరో దోమ కుట్టినట్టు ఉంది. హీరోలుగా మళ్లీ కొత్త సినిమాలతో రాబోతున్నారు. అది కూడా ఇద్దరూ ఒకే రోజు విడుదలతో వస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ లయ. ఇది కాస్త ఆశ్చర్యమే అయినా అసలు వీళ్లకు మళ్లీ సత్తా చాటే అవకాశాలున్నాయా అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ నెల 17న తెలుస్తుంది.
జగపతి బాబు హీరోగా నటించిన మూవీ వదలా. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన సినిమా ఇది. వయసు మళ్లిన ఓ వ్యక్తికి జీవితంలో ఓ యువతి తారసపడుతుంది. అతన్నే ప్రేమిస్తున్నా అంటూ అతని కుటుంబానికి దూరం చేస్తుంది. అయితే ఈ యువతి పాత్రతో కొత్తమ్మాయి పరిచయం అవుతోంది. తనది నెగెటివ్ రోల్ అంటూ ప్రమోషన్స్ లో చెబుతోంది. ట్రైలర్ అయితే బావుంది. ఈ తరహా పాత్రలకు జగపతిబాబు పాత ఇమేజ్ కు సరిపోయేలా ఉంది. అయితే ఒకే పాయింట్ తో అంత సేపు ఆడియన్స్ చూడగలరా అనేది పెద్ద పాయింట్. అదీ కాక అసలు ఈ జెనరేషన్ ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ అవుతుందా అనేది మరో పెద్ద విషయం. నిజానికి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. ఈ టైమ్ లో ఒకప్పటి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉన్న జగ్గూ భాయ్ కి మళ్లీ ఆ ఆడియన్స్ ను తీసుకు వచ్చే కెపాసిటీ ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి వస్తుంది.
ఇక శ్రీకాంత్ పరిస్థితి కూడా ఇంటు మించు ఇలాగే ఉంది. హీరోగా అతనూ ఎప్పుడో ఫేడవుట్ అయిపోయాడు. జగపతిబాబు లాగానే ఇతర పాత్రలకు ఎప్పుడో మారిపోయాడు. ఇలాంటి టైమ్ లో అతను మిస్టర్ మిడిల్ క్లాస్ అనే మూవీతో రాబోతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మదేవుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీలో. విశేషంగా ఈ ట్రైలర్ కూడా బావుంది. ఓ మిడిల్ క్లాస్ జనానికి కనెక్ట్ అయ్యే కథగా కనిపిస్తోంది. అతనికి ఉన్న సమస్యలను దేవుడే తీర్చేలా ఉండేలా ఉన్నా అతను అతను దేవుడు అనే విషయంలో అతనికి తెలియదు. ఈ క్రమంలో వచ్చే వినోదాత్మకమైన కథనం కూడా ఉండేలా ఉంది. ఇదీ సేమ్. ఇప్పుడు శ్రీకాంత్ కు ఆడియన్స్ ను తీసుకువచ్చే సత్తా ఉందా అంటే లేదు అనే చెప్పాలి. మిస్టర్ మిడిల్ క్లాస్ టైటిల్ బావుంది. ఈ టైటిల్ కు తగ్గ కథ కూడా సెట్ అయినట్టుగా ఉంది. మరి ఏ మేరకు జనం మెచ్చుతారు అనేది కూడా పెద్ద ప్రశ్నే.
ఏదేమైనా ఈ ఇద్దరు హీరోలకు బాగా సెట్ అయ్యే కథలే ఇవి. కాకపోతే ఆడియన్స్ కు ఈ మూవీస్ కనెక్ట్ అవుతాయా.. అదీ ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకు. ఒకవేళ రివ్యూస్ అవీ బావుంటే అప్పుడు థియేటర్స్ కు వస్తారేమో కానీ ఈ లోగా వీకెండ్ పూర్తవుతుంది. తర్వాత వీరి పరిస్థితి ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ గత తరం హీరోలిద్దరూ ఒకే రోజు మళ్లీ హీరోలుగా వస్తుండటం మాత్రం కాస్త మంచి పరిణామమే. ఎటొచ్చీ ఈ చిత్రాలు కూడా ఆకట్టుకోవాలి. అప్పుడే మరిన్ని కథలు వస్తాయి. లేదంటే వీటితో ఆగిపోవాల్సిందే ఇంక.

Continue reading
మళయాలంలో టాప్ లేపిన తెలుగు సంగీత దర్శకుడు విద్యా సాగర్

24శాఖలు ఎంతో కష్టపడితేనే ఓ సినిమా రెడీ అవుతుంది. కానీ ఆ సినిమా హిట్ అయితేనే ఆ శాఖల్లోని అందరికీ గుర్తింపు వస్తుంది. ఇండ్యువిడువల్ గా ఎవరెంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినా.. సినిమా హిట్ కాకపోతే గుర్తింపు రాదు.. అలా తను ఎంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినా సినిమాలు హిట్ కాకపోవడంతో ఇతర భాషా సినిమాల్లోకి వలస వెళ్లి అక్కడ నుంచి జాతీయ అవార్డ్ సాధించిన ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. తెలుగు వాడైనా మళయాలీల మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విద్యాసాగర్ సంగీత ప్రస్థానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

విద్యాసాగర్ పుట్టింది అమలాపురంలో. కుటుంబం అంతా సంగీతకారులే కావడంతో తన రక్తంలోనూ సంగీతం ఉందంటాడు విద్యాసాగర్. అయితే అతని చిన్నతనంలోనే తండ్రి సినిమా రంగానికి వెళ్లారు. విద్యాసాగర్ కు తండ్రే తొలి గురువు కూడా. తర్వాత వేరే మాస్టర్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆయనకు మరో ఫ్రెండ్ దొరికాడు.. అతనే ఎఆర్ రెహ్మాన్. ఇద్దరూ కలిసి ఆ గురువు వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.

ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విద్యా సాగర్

11యేళ్ల వయసులో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుని ఇండియాకు వచ్చారు. తర్వాత తండ్రి పరిచయాలతో కెవి మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయారాజ, రాజన్ – నాగేంద్ర వంటి నాటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ టైమ్ లో ఎస్పీ కోదండపాణి వద్ద వచ్చిన ఓ చిన్న అవకాశం అతన్ని 17యేళ్లపాటు తెరవెనుకే ఉండిపోయేలా చేసింది. అన్నేళ్ల పాటు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కు దాదాపు 600 సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశారట.
అలా ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లోనే చిలిపి కృష్ణుడు అనే సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. నిజానికి ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. ఆయనకు వీలుకాకపోవడంతో తను చేశాడు. అయినా నేను కూడా ఇంత బాగా చేయలేకపోయేవాణ్నేమో అన్నారట బర్మన్.. ఆ స్థాయి ప్రతిభ ఉన్నా చిన్న అదృష్టం లేక చాలా యేళ్ల పాటు తెరవెనుకే ఉండిపోవాల్సి వచ్చింది.
సంగీత దర్శకుడిగా నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్న విద్యాసాగర్ కు ఆ తరుణం వచ్చింది. 1989లో సంగీత దర్శకుడిగా పూ మనమ్ అనే ఓ తమిళ చిత్రానికి ఛాన్స్ వచ్చింది. దానికోసం ఎంతో కష్టపడ్డా ఫలితం రాలేదు. సినిమా పోయింది. కానీ తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి, తేనెటీగ, ఆమె చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇవి హిట్ అయినా మళ్లీ విద్యాసాగర్ కు అదృష్టం కలిసి రాలేదు.
నిజానికి విద్యాసాగర్ కెరీర్ ప్రారంభం నుంచీ ఇలాగే జరిగింది. ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిన సందర్భాలుంటే, వచ్చిన ఛాన్సుల్లో చాలా వరకూ తన వర్క్ బావున్నా సినిమా బాగాలేకపోవడం వల్లో, లేక హిట్ అయిన సినిమాల్లో ఇంకేదో బావుందనో తనకు బ్రేక్ వచ్చేది కాదు. ఆ టైమ్ లోనే మరో ఛాన్స్ తెలుగులోనే వచ్చింది. సురేష్, మీనా నటించిన అల్లరి పిల్ల సినిమా అది. ఇందులో తూరుపు సిందూరపు అనే సూపర్ హిట్ అయింది.

ముగ్గురు మొనగాళ్లుకు సంగీతం అందించిన విద్యా సాగర్

అల్లరి పిల్ల యావరేజ్ గా ఆడినా.. పరిశ్రమలో అందరూ ఎదురు చూసే కాంబినేషన్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది విద్యాసాగర్ కు. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఓ రోజు రాఘవేంద్రరావే విద్యాసాగర్ తో చిరంజీవి సినిమాకు పనిచేస్తావా అని అడిగారట. మరి కాదంటాడా.. వెంటనే ఒప్పేసుకుని అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు.. ఆ సినిమా ముగ్గురు మొనగాళ్లు.
బ్యాడ్ లక్ వెంటాడుతున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదంటే ఇదే. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో మళ్లీ మరో బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు వెయిట్ చేశాక, అది కూడా టాలీవుడ్ ను వదిలేశాకే విద్యాసాగర్ కు అదృష్టం మొదలైంది.
యాక్షన్ సినిమా చేసిన ఓ సంగీత దర్శకుడికి పెద్ద క్రేజ్ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యాసాగర్ విషయంలో ఇదే జరిగింది. అప్పటికే తెలుగు, తమిళంలో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ తనే దర్శకుడిగా మారి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జై హింద్. ఈ సినిమాకు సంగీతాన్నందించిన విద్యాసాగర్ తొలి బ్లాక్ బస్టర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో చాలా ఫాస్ట్ గా దూసుకపోయాడు.

మళయాలంలో విద్యా సాగర్ కు తిరుగులేని బ్రేక్

తమిళంలో వచ్చిన క్రేజ్ తో అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో విద్యాసాగర్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 1998వ సంవత్సరంలో మళయాల చిత్రం ‘అళగియ రావణన్’ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్. హీరో సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆమూవీతో పాటు మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తో పాటు మొత్తం తనొక్కడికే 12 అవార్డులు వచ్చాయి.
మళయాలంలో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో వరుసగా అక్కడే అన్ని అవకాశాలూ వచ్చాయి. అలా 2000,2002 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడు. తర్వాత తమిళంలోనూ 2001లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నాడు. అయితే తెలుగులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలన్న కల మాత్రం తీరలేదు..
ఇక విద్యాసాగర్ ను సౌత్ లో తిరుగులేని సంగీత దర్శకుణ్ని చేసింది చంద్రముఖి. రారా సరసకు రారా అంటూ తను కంపోజ్ చేసిన పాట రజినికాంత్ కే ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పాటలన్నీ అలరించాయి.. ఈ సినిమా తర్వాత తనకు హిట్ ఫ్లాపులకు సంబంధించిన పట్టింపులు పోయాయంటాడు విద్యాసాగర్.
జాతీయ అవార్డ్.. ఈ టైటిల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అందుకే నేషనల్ అవార్డ్ అందుకున్నవారు ఏ భాష వారైనా ఆసక్తిగా చూస్తాం. కానీ మనోడే అయినా మనవాళ్లు పట్టించుకోని విద్యాసాగర్ కు చివరికి తెలుగు సినిమాతోనే నేషనల్ అవార్డ్ రావడం విశేషం. చాలాయేళ్లుగా కె విశ్వనాథ్ తో పనిచేయాలనుకున్న తన కల నెరవేరడంతో విద్యాసాగర్ కు బోనస్ జాతీయ అవార్డ్ ను అందించిన ఆ సినిమా స్వరాభిషేకం.

కే.విశ్వనాథ్ మూవీస్ విద్యా సాగర్ కు మళ్లీ

కె విశ్వనాథ్ రూపొందించిన సప్తపది, శంకరాభరణం చిత్రాలకు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ శిష్యుడిగా ఈ మూవీస్ కు రీరికార్డింగ్ చేసిన తను తర్వాత విశ్వనాథ్ సినిమాకే పనిచేసి జాతీయ అవార్డ్ అందుకోవడం ఆనందం అంటాడు విద్యాసాగర్. అలాగే తన మరో ఫేవరెట్ డైరెక్టర్ బాపుతోనూ పనిచేసిన సంతృప్తిని మిగుల్చుకున్నాడు. బాపు తీసిన సుందరకాండకు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగరే.
విద్యాసాగర్ సంగీతంలో ఇటు శాస్త్రీయం, అటు వెస్ట్రన్ రెండూ ఉంటాయి. సందర్భాన్ని ఈ రెండూ మిక్స్ చేసి అందించిన పాటలూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాసాగర్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు మన దగ్గర కాకుండా మరో భాషలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అతని దురదృష్టమే తప్ప మరేమీ కాదు.. మరి ఇకనైనా విద్యాసాగర్ కు ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు రావాలని, అవన్నీ హిట్ కావాలని కోరుకుందాం..

Continue reading
అభినవ సావిత్రి సౌందర్య జయంతి స్పెషల్

సౌందర్య.. తెలుగుతెరపై ఈ పేరు ఒక చెరగని సంతకం. అందం, అభినయం కలబోసిన అద్భుతం ఆ పేరు. ఒక తరం మహిళా ప్రేక్షకులను ప్రభావితం చేసిన సౌందర్య.. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చిలిపిదనం నిండి ఉన్న పాత్రలతో పరిచయమై.. ఆ తర్వాత దక్షిణాది సినిమాకే ఆప్తమిత్రురాలిగా మారిపోయింది. దశాబ్ధానికి పైగా తన నట వైదుష్యంతో ప్రేక్షకులను సమ్మోహనపరచిన ఆ సౌందర్యం అకాస్మాత్తుగా మాయమైనా.. ఆ నటన, ఆ ప్రతిభ అజరామరం. ఈ నెల 18న సౌందర్య జయంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన సినీ విశేషాలతో ఈ స్పెషల్ ఆర్టికల్.

మహానటి సావిత్రి తర్వాత.. ఆ బిరుదుకు అర్థాన్నిచ్చిన నటి సౌందర్య. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం సౌందర్యకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్వాలిటీతోనే అగ్రహీరోలందరి సరసనా నటించి.. అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకుంది. సావిత్రి తర్వాత తిరుగులేని మహిళాభిమానుల్ని సంపాదించుకున్న నటి కూడా సౌందర్యే. అందాల ప్రదర్శనకు ఆమడదూరం నిలిచి.. సహజ సౌందర్యం ఆభరణంగా పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య.

గ్లామర్ పాత్రలకు దూరంగా సౌందర్య

చారడేసి కళ్లు, గులాబీ చెక్కిళ్లు.. చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం కలిపేస్తే కనిపించే రూపం సౌందర్య. నాజూకైన అందం … అసాధారణమైన అభినయం … అంతకు మించిన వ్యక్తిత్వం సౌందర్యకు ఆభరణాలు.. సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాలబొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోయింది. తీరైన కట్టుబొట్టుతో పుత్తడి కాంతుల మెరుపులతో.. చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదింకుంది సౌందర్య. ఓ దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది.. తెలుగు వారి మనసుల్లో ఎన్నటికీ చెరగని స్థానం సంపాదించుకుంది.
సౌందర్య పరిశ్రమలోకి వచ్చే టైమ్ కు ఇక్కడంతా గ్లామర్ నాయికల హవా నడుస్తోంది. హీరోయిన్ అంటే ఎక్కువగా అందాల ప్రదర్శనకే పరిమితమైన పీరియడ్ అది. అలాంటి సందర్భంలో ఎంట్రీ ఇచ్చినా ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు. తెలుగులో రైతు భారతం తన ఫస్ట్ సినిమా. కానీ మనవరాలి పెళ్లి ముందుగా విడుదలైంది. అయితే గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రాజేంద్రుడు గజేంద్రుడు.
చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో తొలి మలి సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోయినా ఆఫర్స్ వెల్లువెత్తాయి. వరుసగా నంబర్ వన్, మాయలోడు, మేడమ్, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మదొంగ వంటి సినిమాలు చేసేసింది. ఈ సినిమాలు అప్పట్లో సౌందర్యకి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే అక్కినేని నాగార్జున హీరోగా ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ తో తొలి భారీ హిట్ ను అందుకొన్నది.. ఈ సినిమాలో సౌందర్య నటన తో పాటు గ్లామర్ కు కూడా జనం ఫిదా అయిపోయారు.

అమ్మోరుతో అద్భుతమైన గుర్తింపు

1995లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు స్పెషల్ ఇమేజ్ ను తెచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా, మహిళా ప్రేక్షకుల్లో సౌందర్యపై అభిమానం పెరగడానికి కారణం అమ్మోరు చిత్రమే. ఈ మూవీలో సౌందర్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమ్మోరులో సౌందర్య నటనకు తొలి నంది అవార్డ్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దాసోహయ్యాయి. ఈ సినిమా తర్వాత తనికి వెను తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
సౌందర్య చేసే సినిమాల్లో ఆమె పాత్రలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి. ఏ పాత్ర చేసినా తనే పాత్రగా మారడం తన శైలి. అందుకే పెదరాయుడు వంటి సినిమాలో చిన్న పాత్రలోనూ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది. పెదరాయుడు సినిమాలో సౌందర్య పాత్ర టూ షేడ్స్ లో నడుస్తుంది. పొగరుబోతు కోడలుగానూ…అత్తింటి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకున్న గృహిణిగానూ రెండు విభిన్న ధోరణుల్నీ అద్భుతంగా నటించి మెప్పించింది.

తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా సౌందర్య

అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. అయితే అప్పటి హీరోయిన్లలో ఉన్న బెస్ట్ క్లాలిటీ ఏంటంటే.. హీరోల స్టార్గమ్ కంటే కథలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలతో పాటు జెడి చక్రవర్తి, వినోద్ కుమార్, నరేష్, సురేష్, వినీత్ వంటి స్మాల్ స్టార్స్ తో నూ నటించింది. ముఖ్యంగా జగపతిబాబుతో తనది బెస్ట్ పెయిర్ అంటారు. ఈ జంట అంత సహజంగా ఉండేది.
అమాయకత్వం నిండిన పాత్రలైనా.. ఆత్మవిశ్వాసం మెండైన పాత్రలైనా.. ఇట్టే ఒదిగిపోతుంది సౌందర్య. దొంగాట సినిమాలో అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయిగా, అంతపురంలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న యువతిగా సౌందర్య నటనకు ఫిదా కానివారెవ్వరు.. ఈ కారణంగానే సౌందర్య ఉంటే సినిమా హిట్.. అనే సెంటిమెంట్ బలంగా ఉండేది ఆ టైమ్ లో. అలాగే హీరోలు సైతం సౌందర్య డేట్స్ కు అనుగుణంగా తమ డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్న రేంజ్ తనది.

సౌందర్య – వెంకటేష్ స్పెషల్ మూవీస్

సౌందర్య, వెంకటేష్ జోడీకి పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. తను టాప్ పొజిషన్ లో ఉండగానే వెంకటేష్ తో చేసిన పెళ్లి చేసుకుందాం సినమాలో తనది సాహసోపేతమైన పాత్ర. లైంగిక దాడి బాధితురాలిగా ఆ స్థాయి హీరోయిన్ నటించడం ఊహించం. కానీ తను పాత్రను ప్రేమించింది. అలాగే అంతకు ముందే వెంకటేష్ తో చేసిన పవిత్రబంధంలో తన నటన ముందు వెంకటేష్ సైతం తేలిపోయాడంటే అతిశయోక్తి కాదు.
ఆర్టిస్ట్ అంటే చాలెంజింగ్ రోల్స్ వస్తే వదలకూడదు. కానీ చాలామంది ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందేమో అని అలాంటి పాత్రలు వదులుకుంటారు. కానీ సౌందర్య మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే లైంగిక దాడి బాధితురాలిగా నటించేందుకు ఒప్పుకుని ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకుందాం సినిమాలో ఈ పాత్ర చేసి ప్రేక్షకులతోనే కాదు.. పరిశ్రమలోనూ ప్రతి ఒక్కరి చేతా శెభాష్ అనిపించుకుంది.
వెంకటేష్ తో సౌందర్యది బ్లాక్ బస్టర్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా హిట్టే. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవిపుత్రుడు వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు. దేవీపుత్రుడు తప్ప మిగతావన్నీ బ్లాక్ బస్టర్సే.

బాబు మోహన్, అలీతోనూ స్పెషల్ సాంగ్స్ చేసిన సౌందర్య

సౌందర్య దర్శకుల నటి. మంచి పాత్రైతే చాలు.. వెంటనే ఒప్పుకుంటుంది. అలాగే దర్శకుల కోసం ఇమేజ్ నూ పక్కనబెట్టగల పెద్ద మనసూ ఉంది. అందుకే బాబూ మోహన్, అలీ వంటి కమెడియన్స్ తో కూడా డ్యూయొట్ చేయగలిగింది. ఆ సినిమాల్లో హీరో వేరే. కానీ సిట్యుయేషన్ కోసం దర్శకుల మాట వినడం తన ధర్మం అని ఫీలవడం వల్లే ఆ పాటలు చేసింది.
పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా సౌందర్యకి పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ తిరుగులేని తరిగిపోని అభిమానాన్ని సంపాదించుకుంది సౌందర్య. దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్ హీరోలతో నటించినా.. తను టాప్ హీరోయిన్ అన్న అహం దరిచేరనివ్వని అరుదైన అభినేత్రి సౌందర్య. అందుకే ఆమెను తెలుగువారు తమ ఆడపడుచుగానే చూశారు.. జూనియర్ సావిత్రిగా కొనియాడారు.

2001 నుంచి తగ్గిన సౌందర్య దూకుడు

1994నుంచి 2001 వరకూ సౌందర్యది కెరీర్ పరంగా పీక్ స్టేజ్. యేడాదికి అన్ని భాషల్లో కలిపి పది సినిమాల వరకూ విడుదలయ్యేవంటే తనెంత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టో అర్థం చేసుకోవచ్చు. అయితే నటిగా శిఖరాలను చూసిన సౌందర్య కెరీర్లో 2001తర్వాత విజయాల సంఖ్య మరీ తగ్గిపోయింది. అయినా ఆమె స్థానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
ఒక నటి కెరీర్ లో ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేయొచ్చో అన్నీ చేసిన నటి సౌందర్య. తనలాగా అన్ని డిఫరెంట్ మూవీస్ చేసిన హీరోయిన్ ఆ తర్వాత మనకు లేరంటే అతిశయోక్తి కాదు. 9నెలలు, అరుంధతి వంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు నా మనసిస్తారా, ఎదరులేని మనిషి వంటి సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలూ చేసింది. తెలుగులో సౌందర్య చేసిన చివరి సినిమా మోహన్ బాబు హీరోగా నటించిన శివ్ శంకర్.

నిర్మాతగా సౌందర్య

2002లో సినిమాలు బాగా తగ్గిన తర్వాత సౌందర్ నిర్మాతగా మారింది. ద్వీప అనే కన్నడ సినిమాను నిర్మించింది. గిరీష్ కాసరవల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ లో జాతీయ అవార్డులు, నాటులు కర్ణాటక ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అలాగే మూడు ఫిలిమ్ ఫేర్ పురస్కారాలూ లభించాయి.

సౌందర్య మరణం ఊహించనిది

నటిగా సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తనలాంటి మరో నటిని మనం దక్షిణాదిలోనే ఇంత వరకూ చూడలేదు. పెళ్లి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరింది సౌందర్య. ఆపార్టీ తరఫున హెలీకాప్టర్ లో ప్రచారానికి బయలుదేరింది. కానీ ఆ ప్రయాణం టేకాఫ్ కావడానికి ముందే తన లైఫ్ ఎండ్ అయింది. హెలీకాప్టర్ కూలిపోయి ఆ అభినయ సౌందర్యం మంటల్లో ఆహూతి అయిపోయింది. లక్షలాది మంది అభిమానుల కన్నీటి సాక్షిగా ఆ సౌందర్యం శాశ్వతంగా కనుమరుగైంది. ఆమె లేకపోయినా అత్భుతమైన పాత్రలతో నిరంతరం లక్షలాది అభిమానులను గుర్తు చేసుకుంటూనే ఉంటారు సౌందర్యను.

 

  • K.Y.B

Continue reading
కొరియన్ కనకరాజు టీజర్ అదిరిందిగా..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిని ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఓటిటి, శాటిలైట్ రైట్స్ ఇంకా పూర్తి కాలేదు అనే కారణంతో ఇప్పటి వరకు ఆగారు. ఫైనల్ గా ఆ రైట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. దీంతో మూవీని ఆగస్ట్ 7న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. తాజాగా కొరియన్ కనకరాజు మూవీ టీజర్ విడుదల చేశారు.
కొరియన్ కనకరాజు అనే టైటిలే బాగా ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ కు అందుకు భిన్నంగా మొదలై.. ఆ టైటిల్ కు తగ్గట్టుగా ఉండేలా టీజర్ ఎండ్ చేశారు. పెనుగొండ అనే ఊరిలో ఉండే కనకరాజు.. ఆవారాగా ఉంటాడు. ఎప్పుడూ మందు, చిందులు, ఊర్లో గొడవలు అంటూ ఉంటుంటాడు. అలాంటి అతని ఊరికి ఓ అమ్మాయి వస్తుంది. తను కొరియన్ లో ఏదో మాట్లాడుతుంది. కట్ చేస్తే అదే భాషలో కనకరాజు కూడా మాట్లాడ్డం మొదలు పెడతాడు. అంతే కాదు అతనికి ఏకంగా మాయలు కూడా మొదలవుతాయి. మొదట్లో అతని ఫ్రెండ్ క్యాజువల్ గా తీసుకుంటాడు. కానీ అతనికి సీరియస్ గానే కొన్ని మాయలు వస్తుంటాయి. దాని కారణంగా అతను కాస్త బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. అలాగే టీజర్ లో కనకరాజును పరిచయం చేస్తున్నప్పుడు అన్నీ కొరియన్ విజువల్స్ వస్తుంటాయి. మరి వాటి వెనక ఉన్న కారణం ఏంటీ.. నిజంగానే అతనికి కొరియన్ దెయ్యం పడుతుందా.. పడితే ఆ దెయ్యం కనకరాజును ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టీజర్ మాత్రం సింపుల్ గా చాలా బావుందని చెప్పాలి. మాస్ అండ్ క్లాస్ తో పాటు కామెడీ హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో పుష్కలంగా ఉండబోతున్నాయి అనిపించేలా ఉంది టీజర్ కట్. టీజర్ తోనే ఆకట్టుకున్నారంటే తర్వాత ట్రైలర్.. ఆపై మూవీతో మంచి విజయం కూడా అందుకోబోతున్నారు అనిపించేలా ఉంది.
ఇక వరుణ్ తేజ్ కనకరాజుగా అతని ఫ్రెండ్ సత్య కనిపిస్తున్నారు. హీరోయిన్ రితికా నాయక్ కు ఇది ఓ మంచి అవకాశం అనేలా ఉంది. ఏదేమైనా టీజర్ మాత్రం చాలా బావుందనే చెప్పాలి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Continue reading
శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ మధ్య విభేదాలు ఎందుకు?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశాల్లో డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య నెలకొన్న విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు మంచి అనుబంధంతో కనిపించిన ఈ ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఇప్పుడు వేర్వేరు వర్గాలుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అసలు శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ మధ్య విభేదాలు ఎందుకు?

టాలీవుడ్‌లో కొరియోగ్రఫీ రంగంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. అయితే డ్యాన్స్ మాస్టర్స్ మరియు డ్యాన్సర్స్ సంక్షేమం, అసోసియేషన్ నిర్వహణ, సభ్యుల హక్కులు, ఎన్నికల విధానాల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అసోసియేషన్‌లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?, సభ్యులకు అవకాశాలు ఎలా కల్పించాలి?, నిధుల వినియోగం ఎలా ఉండాలి?, యువ కొరియోగ్రాఫర్లకు ప్రోత్సాహం ఎలా ఇవ్వాలి? వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. ఈ విభేదాలే క్రమంగా పెద్ద వివాదంగా మారినట్లు తెలుస్తోంది.

డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. సభ్యుల మద్దతు కూడగట్టేందుకు శేఖర్ మాస్టర్ వర్గం, జానీ మాస్టర్ వర్గం వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి రోజులలో సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

శేఖర్ మాస్టర్ బలం ఏమిటి?

శేఖర్ మాస్టర్ చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనేక మంది డ్యాన్సర్లకు అవకాశాలు కల్పించిన వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయనకు సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్ల మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అసోసియేషన్‌లో స్థిరత్వం తీసుకురాగల నాయకుడిగా ఆయనను కొందరు సభ్యులు భావిస్తున్నారని తెలుస్తోంది.

జానీ మాస్టర్‌కు ఉన్న ఫాలోయింగ్

మరోవైపు జానీ మాస్టర్ కూడా యువతలో భారీ క్రేజ్ కలిగిన కొరియోగ్రాఫర్. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు యువ డ్యాన్సర్లు, కొత్త తరం కొరియోగ్రాఫర్లలో మంచి మద్దతు ఉందని చెబుతున్నారు. మార్పు అవసరమని భావించే సభ్యులు జానీ మాస్టర్ వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఎన్నికల్లో ఎవరిది పైచేయి?

ప్రస్తుతం చూస్తే శేఖర్ మాస్టర్ అనుభవం, సీనియర్ల మద్దతు ఆయనకు బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో జానీ మాస్టర్‌కు యువత మద్దతు, సోషల్ మీడియాలో ప్రభావం ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం. అసోసియేషన్‌లో ఓటు హక్కు కలిగిన సభ్యుల సంఖ్య, చివరి నిమిషంలో జరిగే వ్యూహాలు, మద్దతుదారుల ఐక్యత ఫలితాన్ని నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం పోటీ హోరాహోరీగా ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
శేఖర్ మాస్టర్ అయినా, జానీ మాస్టర్ అయినా, ఇద్దరూ తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేసిన కొరియోగ్రాఫర్లు. అందుకే వ్యక్తిగత విభేదాల కంటే డ్యాన్సర్ల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల భవిష్యత్తు ముఖ్యమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా ఇరు వర్గాలు కలిసి పనిచేస్తే, డ్యాన్సర్లకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ మధ్య పోటీ టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికర చర్చగా మారింది.

Continue reading
100 కోట్ల క్లబ్‌లో చేరిన సమంత

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయంతో సమంత కెరీర్‌లో మరో కీలక మైలురాయి చేరిందని చెప్పాలి.
గత కొంతకాలంగా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సమంత, ‘మా ఇంటి బంగారం’తో మరోసారి తన మార్కెట్‌ను నిరూపించుకుంది. సినిమాలో ఆమె నటన, భావోద్వేగ సన్నివేశాలు, పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. అదే ఊపును కొనసాగిస్తూ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది మా ఇంటి బంగారం.
ఈ విజయం సమంతకు వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. మహిళా ప్రధాన పాత్రలతో కూడా భారీ వసూళ్లు సాధించవచ్చని మరోసారి ఈ సినిమా నిరూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ #100CroreClub, #MaaIntiBangaram వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విజయంతో సమంత మరోసారి టాలీవుడ్‌లో తన స్టార్‌డమ్‌ సత్తాను చాటుకుందని చాలామంది చెబుతున్నారు.

Continue reading
ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రివ్యూ

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్‌ను చూస్తే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలిసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం జయకృష్ణతో పాటు రాశా తడానీకి కూడా తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.
ట్రైలర్ ప్రారంభం నుంచే గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రేమ కథతో మొదలైన కథనం, ఆ తర్వాత యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడం ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు అజయ్ భూపతి తనకు అలవాటైన స్టైల్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.
డెబ్యూ హీరో అయినప్పటికీ జయకృష్ణ స్క్రీన్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. యాక్షన్ షాట్స్‌లో మంచి ఎనర్జీ కనిపించగా, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తనవంతు ప్రయత్నం చేశాడు. ఇంకా సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయి నటనపై స్పష్టత వస్తుంది. అయితే ట్రైలర్ మాత్రం హీరోపై మంచి అంచనాలను పెంచింది.
సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచింది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలకు బాగా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. జయకృష్ణకు హీరోగా మంచి లాంచ్ ఇవ్వగలిగే అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ ఇచ్చిన హైప్‌ను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు.

 

Continue reading
ఆగస్ట్ లో అదిరిపోయే సినిమాలు

టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో ఊహించినన్ని విజయాలు మాత్రం రాలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన మూవీస్ అన్నీ యధావిధిగా విజయం సాధించాయి. తర్వాత సమ్మర్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఓ మూడు నాలుగు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. జూన్ లో వచ్చిన పెద్ది, మా ఇంటి బంగారం మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన జూలైలో లెనిన్ తో ఊపు మొదలైంది. ఈ నెల చివర్లో విడుదల కాబోతోన్న శ్రీనివాస మంగాపురంపై అంచనాలున్నాయి. అయితే ఆగస్ట్ లో మాత్రం మాగ్జిమం ప్రామిసింగ్ మూవీస్ అనిపించుకున్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు విడుదల కాబోతోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆ మధ్య విడుదలైన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. కానీ ఓటిటి, శాటిలైట్ డీల్స్ సెట్ కాక ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ డీల్స్ ఓకే అయ్యాయి కాబట్టి ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఫస్ట్ టైమ్ చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీగా ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్. సితార బ్యానర్ లో రూపొందిన సినిమా ఇది. టీజర్ తో బాగా ఆకట్టుకుంది. చాలా యేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది చాలా పెద్ద విజయం అందిస్తుందని చాలామంది అనుకున్నారు. బట్ ఈ లోగానే వీరభద్రుడుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూర్య. దీంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రాబోతున్నాడు.
ఇక ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది ఇరుముడి మూవీ. రవితేజ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అయ్యప్ప మాలలో అతను విడుదల చేసిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. ఈ మూవీతో రవితేజ మంచి విజయం సాధించేలానే ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు.
ఆగస్ట్ 26న విడుదల కాబోతోన్న మూవీ టాక్సిక్. యశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఈ డేట్ కు రావడం కూడా కష్టమే అనుకున్న టైమ్ లో రీసెంట్ గా విడుదల చేసిన పాటతో మొత్తం సోషల్ మీడియాను హీటెక్కించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సితారియా, రుక్మిణి వసంత్ లాంటి బ్యూటీస్ కూడా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యశ్ చేసిన ఈ మూవీపై ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక ఆగస్ట్ 28న విడుదల కాబోతోన్న మూవీ భోగీ. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ రగ్ డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. 1960స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఇది ఉండబోతోందని ముందే చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇదే డేట్ కే రావడం ఖాయమా లేక మరో కొత్త డేట్ కు వస్తుందని కూడా చూడాలి. మొత్తంగా ఈ ఆగస్ట్ ప్రతి వారం ఒక ప్రామిసింగ్ మూవీతో ఆడియన్స్ కు మంచి జోష్ ఇచ్చే ఇవ్వబోయేలా ఉందని చెప్పొచ్చు.

Continue reading