యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బ్లాస్ట్. మే 28న విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద విజయం సాధించింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ చాలా వరకు ప్రిడక్టబుల్. కానీ కథనంతో కట్టి పడేశారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ పాత్రను డిజైన్ చేసిన విధానానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రధానంగా తమిళ్ లో తెరకెక్కినా డబ్బింగ్ రూపంలో తెలుగులోనూ హిట్ అయింది. మళయాలంలో మాత్రం చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. అలాంటి చిత్రాన్ని ఈ నెల 25న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఓ వైపు ఓటిటిలో వస్తున్నా.. ఈ మూవీకి అక్కడక్కడ థియేటర్స్ లో కూడా ఆడుతూనే ఉంది.
మామూలుగా ఇలాంటి మూవీస్ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంటాయి. ఓటిటిలో మాత్రం తేలిపోతుంటాయి. బట్ ఈ మూవీ విషయంలో అలా కాలేదు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్.. ఓటిటిలో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ కు ఓటిటిలో హారతులు పడుతున్నారు ఆడియన్స్. థియేటర్స్ లో చూసిన వాళ్లు కూడా ఓటిటిలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు అంటే అది ఈ కంటెంట్ లో ఉన్న దమ్ము. ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ లో బ్లాస్ట్ కు బ్లాస్టింగ్ రెస్పాన్స్ వస్తోందనేది వాస్తవం.






