దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదు

దుల్కర్ సల్మాన్ మూవీకి ఏమైంది

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ఐమ్ గేమ్. మళయాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇవాళ విడుదల చేశారు. తెలుగులో డబ్ చేశారు. బట్ తెలుగు డబ్ వెర్షన్ మాత్రం విడుదల కాలేదు. ఏవో టెక్నికల్ కారణంగా తెలుగులో ఈ చిత్రాన్ని ఇవాళ విడుదల చేయడం లేదు అని మూవీ టీమ్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. మరి ఆ టెక్నికల్ రీజన్స్ ఏంటీ అనేది మాత్రం చెప్పలేదు. తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ మూవీ కోసం ఎదురుచూసిన వారికి నిరాశ తప్పలేదు.

ఐమ్ గేమ్ లో ఆర్టిస్టులు ఎవరు

దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ లో కయాడు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో ఆంటోనీ వర్ఘీస్, మిస్కిన్, సంయుక్త, కథిర్ నటించారు. అన్ని పాత్రలూ పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నట్టుగా అర్థం అవుతోంది.నహాస్ హిధ్యంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మళయాలంలో మాత్రం భారీ క్రేజ్ ఉంది. ఓ రకంగా ఐమ్ గేమ్ కేరళలో ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్ట్ 21న విడుదల చేయాలి అనుకున్నారు. అప్పుడు కూడా ఏవో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. మరి మళయాలంలో ఈ మూవీకి ఎలాంటి రివ్యూస్ వస్తాయో చూడాలి.

Continue reading
సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన రోమాంచికం మూవీ రివ్యూ

రివ్యూ : రోమాంచికం

ఆర్టిస్ట్స్ : సుమంత్ ప్రభాస్, అనంతిక, ఉపేంద్ర లిమాయే, నరేంద్ర రవి, మహి, వెంకటేష్ కాకుమాను, సాయి సోహన్ తదితరులు
ఎడిటర్ : వేణు గోపాల్ రెడ్డి
సంగీతం : వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీ : పవన్ పప్పుల
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
దర్శకత్వం : గోపాల్ రెడ్డి

రోమాంచికం.. ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మించిన మూవీ కావడమే. సందీప్ రెడ్డి ఫస్ట్ టైమ్ తన బ్యానర్ లో బయటి మూవీ చేయడం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన ఈ మూవీ బజ్ కు
సందీపే అనేది వాస్తవం. ప్రమోషన్స్ మరీ భారీగా చేయకుండా ఇవాళ(03.09.2026)విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :
అన్వేష్(సుమంత్ ప్రభాస్) ఓ ఆవారా కుర్రాడు. చదువు తర్వాత ఫ్రెండ్స్ తో చిల్ అవుతుంటాడు. అలాగే తను సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలని రోమాంచికం అనే పేరుతో ఓ యాప్ రెడీ చేస్తాడు. దీని ద్వారా యూత్ అంతా ఒకరికి తెలియకుండా పరిచయం అవుతుంటారు. తర్వాత వారికి ఐడియాస్ నచ్చితే ప్రేమలో పడటమో లేక మరోదైనా చేస్తుంటారు అనేది అతని కాన్సెప్ట్.ఆ యాప్ లోనే పరిచయం అయిన చెన్నై అమ్మాయి మైథిలీ(అనంతిక). మెల్లగా ఇద్దరూ మాట కలుపుకుంటారు. తర్వాత ప్రేమలో పడతారు. మైథిలీ బర్త్ డే అని చెన్నై వెళతాడు అన్వేష్. ఇద్దరూ కలుద్దాం అనుకుంటారు. టైమ్ కూడా ఫిక్స్ అవుతుంది. సడెన్ గా మైథిలీ.. అన్వేష్ ని బ్లాక్ చేస్తుంది. అసలేం జరిగిందో తెలియక అన్వేష్ పిచ్చివాడవుతుంటాడు. ఫ్రెండ్స్ తో గాయ్ గాయ్ గా మాట్లాడ్డం.. తిరగడం చేస్తుంటాడు.
కొంత కాలం తర్వాత సడెన్ గా మైథిలీ తను అతనికి సారీ చెబుతూ.. తను హైదరాబాద్ వస్తున్నా అని చెబుతుంది. వస్తుంది కూడా. ఇద్దరూ కలిసి ఓ ఫ్రెండ్ ఫ్లాట్ తీసుకుంటారు. ఈలోగా అన్వేష్ ఫ్రెండ్ కోసం బయటకు వెళ్లి వస్తాడు. కట్ చేస్తే మైథిలీ మళ్లీ కనిపించదు. మళ్లీ బ్లాక్ చేస్తుంది. అప్పటికే మైథిలీ చాలా సెన్సిటివ్ అని తనకు సూ సైడ్ ఆలోచనలు వస్తుంటాయి అని చెబుతుంది. అక్కడి నుంచి అన్వేష్ లైఫ్ చాలా గందరగోళం అవుతుంటుంది. అసలు మైథిలికి ఏం జరిగింది అని రోజంతా నానా తంటాలు పడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. మైథిలీ అలా ఎందుకు చేస్తుంది. అసలు ఇద్దరూ కలుస్తారా.. అనేది సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది :
రోమాంచికం.. ఇది ఓ రెగ్యులర్ మూవీ కాదు. కథలో డెప్త్ ఉండదు. కంటెంట్ లో కంటిన్యూటీ ఉండదు. సంఘర్షణలూ ఏమీ ఉండవు. దీంతో ఇదేం మూవీ అనుకుంటారేమో. అలా ఏం కాదు. ఇందులో బలమైన కథ లేదు. కానీ కథనంతో కట్టి పడేస్తారు. ముఖ్యంగా హీరో చుట్టూ ఉన్న పాత్రలు మాత్రం హైలెట్ గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇది ఓ క్రేజీ క్రేజీగా సాగే సినిమా. ఫుల్ ఫన్ రైడ్ లా ఉంటుంది. సినిమా అంతా ఆడియన్స్ ను నవ్వించడమే టార్గెట్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా సార్లు నవ్విస్తారు కూడా. అందుకే ఇది రెగ్యులర్ మూవీగా కాదు.. జస్ట్ ఓ ఫన్ రైడ్ లా కనిపిస్తుంది.
సుమంత్ ప్రభాస్ పేరుకు హీరో. కానీ మన తెలుగు సినిమాల్లో హీరోలు వారి ఫ్రెండ్స్ ను ఎలా ట్రీట్ చేస్తుంటాం కదా.బట్ ఇందులో అందుకు భిన్నంగా ఉంటుంది. హీరోతో పాత్రతో సమానంగా ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయి. వారంతా హీరోను ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అసలు స్నేహితులు అంటే వీళ్లు కదా అనిపిస్తారు. అంతే కానీ హీరో కాబట్టి అతని పాత్రను హైలెట్ చేయడం ఫ్రెండ్స్ అందరినీ బకరాలు చేయడం అస్సలు కనిపిందు ఈ మూవీలో. ఆ ఫ్రెండ్స్ లో నరేంద్ర రవి పాత్ర మాత్రం అద్దిరిపోతుంది. కొన్నిసార్లు అతి అనిపించినా అతని క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది.
మొత్తం ఐదుగురు స్నేహితులు. ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. మిగతా ముగ్గురూ స్టార్టప్ యాప్ డెవలప్ చేస్తున్నాం అనే భ్రమలో లైఫ్ ను ఈజీగా తీసుకుంటారు. ఇక సుమంత్ ప్రభాస్.. అనంతికతో ప్రేమలో పడిన తర్వాత కూడా మిగతా స్నేహితులు రెగ్యులర్ గానే బిహేవ్ చేస్తుంటారు. ఇది ఓ రకంగా తెలుగు సినిమాకే కొత్తదనం అని చెప్పాలి. ఇక్కడ సీన్స్ కాస్త డల్ అవుతున్నాయి అనిపించిన వెంటనే అదిరిపోయే ఫన్నీ సీన్ వస్తుంటుంది. ఇదో రకమైన రైటింగ్ అనిపిస్తుంది. ఎలా చూసినా ఇది జెన్ జికి, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అని బలంగా చెప్పొచ్చు.

నెగెటివ్ పాయింట్స్

కేవలం కామెడీ గ్యాంగ్ పై మాత్రమే ఫోకస్ చేశారు. యాప్ మేటర్ మొదటి సీన్ కే పరిమితం అయింది. చాలా చోట్ల స్లోగా సాగుతుంది. చాలా లాజిక్స్ ను పక్కన పెట్టారు. ఇవి మైనస్ లుగా కనిపిస్తాయి. అలాగే ఇది మిడిల్ ఏజ్ తో పాటు ఆపై వయసున్న ఆడియన్స్ కు కనెక్ట్ కావడం దాదాపు ఇంపాజిబుల్.
నటన పరంగా చూస్తే.. సుమంత్ ప్రభాస్ బాగా చేశాడు. అమాయకత్వం, బలుపు, తెలియని తనం అన్ని మిక్స్ చేసిన పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. అనంతిక క్యూట్ గా ఉంది. నటనా బావుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో నరేంద్ర రవి ఇరగ్గొట్టాడు. తన టైమింగ్, స్లాంగ్ లో నేచురాలిటీ ఉన్నాయి. ఉపేంద్ర లిమాయే పోలీస్ పాత్రలో బాగా నవ్వించాడు. ఫ్రెండ్స్ పాత్రల్లో వెంకటేష్ కాకుమాను, మణి ఎరిగల, సాయి సోహన్ అందరూ అదరగొట్టారు. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

టెక్నికల్ గా :
వాసుకి వైభవ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బావుంది. లిమిటెడ్ లొకేషన్స్ లో పవన పప్పుల సినిమాటోగ్రఫీ చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశాడు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.
దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి రాసుకున్న కథను పక్కాగా తెరకెక్కించాడు. కొన్ని సీన్స్ లో నాన్ స్టాప్ గా నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ లాజిక్స్ అన్నీ పక్కన పెట్టాడు.

ఫైనల్ గా : రోమాంచికం – బాగా నవ్వించిన ప్రయత్నం
రేటింగ్ : 2.75/5
K.Y.R

Continue reading
రవితేజ ఇరుముడి మూవీతో 200 కోట్ల క్లబ్ లో చేరాడు

రవితేజ 200 కోట్ల క్లబ్ లో

మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా నటించిన ఇరుముడి మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్లబ్ లోకి ఎంటర్ అవడం రవితేజకు ఫస్ట్ టైమ్. ఈ మూవీ ఇంకా భారీ వసూళ్లు సాధిస్తోంది. బేబీ నక్షత్ర(Baby Nakshatra) నటన అత్యద్భుతం అయితే రవితేజ ఫస్ట్ ఈ స్థాయి నటనతో అందరి హృదయాలు కొల్లగొట్టాడు. ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar), సాయికుమార్(Sai Kumar) ల నటన చాలా బావుంది. సినిమాలో చాలా మైనస్ లు ఉన్నా.. వాటన్నిటినీ రవితేజ, బేబీ నక్షత్ర నటనతో అధిగమించి మరీ ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించింది.

రవితేజ ఇమేజ్ కి భిన్నంగా ఇరుముడి

రవితేజ సినిమాలన్నీ కాస్త ఫంకీగా ఉంటాయి. అతని పాత్రలు మరీ రొటీన్ అయిపోయాయి అనే తరుణంలో వచ్చింది ఇరుముడి. అద్భుతమైన నటనతో చూసినవాళ్లందరి చేతా కన్నీళ్లు పెట్టించాడు. ముఖ్యంగా బేబీ నక్షత్ర మళయాలీ అమ్మాయి అయినా ఎక్కడా తడబాటు లేకుండా తనే తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. కావేరీ పాత్రలో ప్రియా భవానీ అదరగొట్టింది. గురుస్వామిగా సాయి కుమార్ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ లు అదిరిపోయాయి.

యూనానిమస్ బ్లాక్ బస్టర్ గా ఇరుముడి

ఈ మధ్య కాలంలో యూనానిమస్ గా మూవీకి బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది అంటే అది కేవలం ఇరుముడికే. జనం బళ్లు కట్టుకుని వచ్చి మరీ చూస్తున్నారు. చాలా చోట్ల ఇంకా హౌస్ ఫుల్(House Full) బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. చాలా పెద్ద స్టార్స్ నటించిన, భారీ బడ్జెట్ మూవీస్ కు కూడా ఇన్ని రోజుల తర్వాత ఆ బోర్డ్ కనిపించలేదు. దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) సాధించిన విజయం మాత్రం అఖండమే అని చెప్పాలి.

టికెట్ రేట్లు పెంచకున్నా భారీ వసూళ్లు

ఇరుముడి మూవీకి ఉన్న మరో అడ్వాంటేజ్ సినిమా టికెట్ రేట్లు పెంచకపోవడం. ఒకవేళ టికెట్ రేట్లు పెంచి ఉంటే వసూళ్లు ఓ రేంజ్ లో ఉండేవి. ఓ రకంగా తెలుగు మూవీస్ లో ఇప్పటికీ హయ్యొస్ట్ కలెక్షన్స్ లో మన శంకర్ వరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆ స్థాయిలో నిలవబోయే మూవీగా ఇరుముడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా రవితేజ తన జోన్ నుంచి పూర్తిగా తప్పుకుని చేసిన ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో. రవితేజ ఇరుముడి 200 కోట్లు సాధించినందుకు ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్యులేషన్స్.

Continue reading
వెలిగొండ ప్రాజెక్ట్ ఎవరిది? వైఎస్‌ఆర్, చంద్రబాబు, జగన్.. ఎవరి వాటా ఎంత?

వెలిగొండ ప్రాజెక్ట్ ఎవరిది?

వెలిగొండ ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఈ భారీ సాగునీటి ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వార్ మొదలైంది. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తానే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందిస్తున్నానని చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం.. వెలిగొండకు అసలు రూపం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని, కీలకమైన జంట టన్నెల్స్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెబుతోంది.

మరి అసలు నిజం ఏంటి?

వెలిగొండ ఎవరి ప్రాజెక్ట్? ఎవరి హయాంలో ఎంత పని జరిగింది? ఎవరు ఎక్కువ ఖర్చు చేశారు?

ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది?

వెలిగొండ కథ ఒక్క ప్రభుత్వంతో మొదలైనది కాదు.

ప్రాజెక్టుకు సంబంధించి తొలి ఆలోచనలు 1990ల ప్రారంభంలోనే ఉన్నాయి. CAG రికార్డుల ప్రకారం 1991లో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఆదేశాలు జారీ కాగా, 1994లో తొలి DPR సిద్ధమైంది. ఆ తర్వాత ప్రస్తుత రూపంలోని ప్రాజెక్టు కోసం 2005లో మార్చి 2005 DPR ఆధారంగా నిర్మాణాన్ని చేపట్టారు.

అయితే అంతకంటే ముందే, 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండకు శంకుస్థాపన చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు 2026లో కూడా గుర్తుచేశారు.

అంటే..

శంకుస్థాపన క్రెడిట్ చంద్రబాబుదే.

కానీ శంకుస్థాపనతోనే ప్రస్తుత రూపంలోని భారీ వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా మొదలైందని చెప్పడం మాత్రం సరైనది కాదు.


వైఎస్‌ఆర్ హయాంలో ఏం జరిగింది?

2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు కొత్త రూపు వచ్చింది.

జలయజ్ఞం కింద ప్రాజెక్టును పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు. జంట టన్నెల్స్, నల్లమలసాగర్ రిజర్వాయర్, ఫీడర్ కెనాల్, ప్రధాన కాలువలు వంటి కీలక నిర్మాణాలు ప్రాజెక్టులో భాగమయ్యాయి. 2005లో ప్రస్తుత ప్రాజెక్టు నిర్మాణ దశలోకి రావడం కూడా ఇదే కాలానికి సంబంధించిన కీలక పరిణామం.

వెలిగొండలో అత్యంత కీలకమైన భాగం నల్లమల కొండల్లో నిర్మించిన జంట టన్నెల్స్. సుమారు 37.587 కిలోమీటర్ల మేర ఉన్న ఈ టన్నెల్ వ్యవస్థ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని నల్లమలసాగర్‌కు తరలించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం.

అందుకే వైఎస్‌ఆర్ హయాంలో వెలిగొండకు వచ్చిన నిర్మాణాత్మక మలుపును విస్మరించడం కూడా కష్టం.


మరి 2014 వరకు ఎంత ఖర్చయింది?

ఇక్కడే అసలు లెక్కలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ స్టేటస్ వివరాల ప్రకారం 2014 వరకు వెలిగొండపై సుమారు ₹3,581.67 కోట్లు ఖర్చయ్యాయి.

అయితే ఈ మొత్తాన్ని పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత క్రెడిట్‌గా చూపించడం మాత్రం సరైన పద్ధతి కాదు.

ఎందుకంటే వైఎస్‌ఆర్ 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2009–14 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.

అందుకే ఈ మొత్తాన్ని **“వైఎస్‌ఆర్ ప్రారంభించిన నిర్మాణ దశ + 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ పాలన”**గా చూడటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.


2014–19లో చంద్రబాబు ఏం చేశారు?

2014లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ సమయంలో వెలిగొండ పనులు కొనసాగాయి. ముఖ్యంగా టన్నెల్ పనులు ముందుకు వెళ్లాయి.

2014 నుంచి 2019 మధ్య వెలిగొండ ప్రాజెక్టుపై ₹1,414.51 కోట్లు ఖర్చయ్యాయి అని అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ స్టేటస్ వివరాలు చెబుతున్నాయి.

అయితే టన్నెల్ పనుల పురోగతి, కాంట్రాక్టర్ల పనితీరు, ఖర్చులపై CAG కూడా కొన్ని అంశాలను పరిశీలించింది. CAG 2024లో వెలిగొండపై ప్రత్యేక Compliance Audit Reportను విడుదల చేసింది. ఈ ఆడిట్‌లో 2017-18 నుంచి 2020-21 వరకు పనుల అమలు, ఆర్థిక ప్రభావాలను పరిశీలించారు.

కాబట్టి చంద్రబాబు 2014–19 కాలాన్ని “ఏ పని జరగలేదు” అని చెప్పడం కూడా తప్పే. అదే సమయంలో ప్రాజెక్టు పూర్తయిపోయింది అని చెప్పడం కూడా వాస్తవానికి సరిపోదు.


జగన్ హయాంలో వెలిగొండలో కీలక మలుపు

2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.

వెలిగొండలో ఆయన ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాలు రెండో టన్నెల్ సహా మిగిలిన క్లిష్టమైన పనులను పూర్తి చేయడం.

ప్రాజెక్ట్‌పై అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2019 తర్వాత ₹952.52 కోట్లు ఖర్చయ్యాయి. ఇదే కాలంలో టన్నెల్-1 2021లో పూర్తయింది. టన్నెల్-2 కూడా 2024లో పూర్తి కాగా, 2024 మార్చి 6న జంట టన్నెల్స్‌ను జాతికి అంకితం చేసినట్లు రికార్డులు, వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.

అంటే జగన్ ప్రభుత్వానికి వెలిగొండలో ఉన్న ప్రధాన క్రెడిట్ ఏమిటంటే..

కీలకమైన జంట టన్నెల్స్‌ను పూర్తి చేయడం.

అయితే టన్నెల్స్ పూర్తయ్యాయంటే మొత్తం ప్రాజెక్టు పూర్తయినట్టేనా?

అదే అసలు ట్విస్ట్.


టన్నెల్స్ పూర్తయినా ప్రాజెక్ట్ మొత్తం ఎందుకు పూర్తి కాలేదు?

వెలిగొండ అంటే కేవలం రెండు టన్నెల్స్ కాదు.

టన్నెల్స్‌తో పాటు నల్లమలసాగర్, ఫీడర్ కెనాల్, ప్రధాన కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వంటి అనేక అంశాలు ఉన్నాయి.

CAG కూడా ప్రాజెక్టులో టన్నెల్స్, హెడ్ రెగ్యులేటర్, రిజర్వాయర్, ఫీడర్ కెనాల్, కాలువల నిర్మాణాన్ని విడివిడిగా పరిశీలించింది.

అందుకే 2024లో జంట టన్నెల్స్ పూర్తయ్యాయని చెప్పడం ఒక వాస్తవం అయితే.. మొత్తం వెలిగొండ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పడం వేరే విషయం.


మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోంది?

2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండలో మిగిలిన పనులపై దృష్టి పెట్టింది.

ప్రత్యేకంగా ఫీడర్ కెనాల్, లైనింగ్, మిగిలిన సివిల్ పనులు, నిర్వాసితుల పునరావాసం, పరిహారం వంటి అంశాలు ముందుకు వచ్చాయి.

2026లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం Phase-Iకు సంబంధించిన పనులపై మొత్తం వ్యయం ₹7,983 కోట్లు కాగా, మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం ₹10,200 కోట్లు. Phase-Iలో సుమారు 18.8 కిలోమీటర్ల జంట టన్నెల్స్, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

అలాగే 2026 ఆగస్టు నాటికి NDA ప్రభుత్వం 6,206 ప్రభావిత కుటుంబాలకు ₹768 కోట్ల R&R పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అంటే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ పాత్రను కేవలం “ప్రాజెక్టు ప్రారంభం”గా చూడలేం. మిగిలిన పనులు, నీటి విడుదలకు అవసరమైన వ్యవస్థ, R&R వంటి చివరి దశ పనులు కూడా ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలో ఉన్నాయి.


అయితే.. ఎవరి వాటా ఎక్కువ?

ఇదే అసలు ప్రశ్న.

అందుబాటులో ఉన్న 2023 ప్రాజెక్ట్ స్టేటస్ లెక్కలను మాత్రమే తీసుకుంటే:

పాలనా కాలం వెలిగొండపై ఖర్చు
2014 వరకు ₹3,581.67 కోట్లు
2014–19 ₹1,414.51 కోట్లు
2019 తర్వాత ₹952.52 కోట్లు

ఈ మూడు సంఖ్యలను మాత్రమే పోల్చితే 2014 వరకు ఉన్న దశలోనే అత్యధిక ఖర్చు జరిగింది.

కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి.

₹3,581.67 కోట్లను మొత్తం వైఎస్‌ఆర్ వ్యక్తిగత ఖాతాలో వేయడం సరైంది కాదు. ఎందుకంటే అందులో 2009–14 మధ్య జరిగిన ఖర్చు కూడా ఉంది.

అదే విధంగా..

₹1,414.51 కోట్లు ఖర్చు చేశాడని చెప్పి చంద్రబాబే వెలిగొండ మొత్తం నిర్మించారని చెప్పలేం.

అలాగే..

₹952.52 కోట్లు ఖర్చయిందని చెప్పి జగన్ ప్రభుత్వమే మొత్తం ప్రాజెక్టును నిర్మించిందని చెప్పడం కూడా సరైనది కాదు.


వెలిగొండ క్రెడిట్.. ఎవరిది?

ఇక్కడ రాజకీయ నినాదాల కంటే చరిత్రను చూస్తే సమాధానం చాలా సింపుల్.

చంద్రబాబు నాయుడు

శంకుస్థాపన చేసిన నాయకుడు. 1996లో ప్రాజెక్టుకు తొలి అడుగు వేశారు. 2014–19లో కూడా నిర్మాణ పనులు కొనసాగించారు. ఇప్పుడు ప్రాజెక్టు Phase-Iను ప్రారంభించే స్థాయికి తీసుకెళ్లే చివరి దశ పనులను ఆయన ప్రభుత్వం చేపట్టింది.

వైఎస్ రాజశేఖర రెడ్డి

వెలిగొండను భారీ నిర్మాణ ప్రాజెక్టుగా మలిచిన కీలక నాయకుడు. 2004 తర్వాత ప్రాజెక్టుకు కొత్త రూపం ఇచ్చి, 2005లో ప్రస్తుత నిర్మాణ దశలోకి తీసుకెళ్లిన కాలం ఆయన పాలనతో ముడిపడి ఉంది.

వైఎస్ జగన్

కీలకమైన టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం. 2019 తర్వాత మిగిలిన క్లిష్టమైన టన్నెల్ పనులు పూర్తయ్యాయి. 2024లో జంట టన్నెల్స్‌ను అంకితం చేశారు.


ఫైనల్‌గా చెప్పాలంటే..

వెలిగొండ ఒక్కరి ప్రాజెక్టు కాదు.

1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నుంచి.. 2004–05లో ప్రాజెక్టుకు భారీ రూపం ఇచ్చిన వైఎస్‌ఆర్ వరకు.. 2014–19లో పనులు కొనసాగించిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి.. 2019–24లో కీలక టన్నెల్ పనులను పూర్తి చేసిన జగన్ ప్రభుత్వం వరకు.. ప్రతి దశలోనూ వేర్వేరు ప్రభుత్వాల పాత్ర ఉంది.

లెక్కల పరంగా చూస్తే 2014 వరకు ఉన్న దశలోనే అత్యధిక ఖర్చు జరిగింది. కానీ ఆ మొత్తం మొత్తాన్ని వైఎస్‌ఆర్ ఒక్కరికే కేటాయించడం సరైనది కాదు. అదే సమయంలో 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం, 2019–24లో జగన్ ప్రభుత్వం చేసిన పనులను కూడా తక్కువ చేసి చూడలేం.

ఇక 2026లో వెలిగొండ Phase-I ప్రారంభంతో మరో కీలక మైలురాయి చేరుకుంది. ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన పనులు, నీటి పంపిణీ, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలను పూర్తి చేయాల్సిన దశలో ఉంది.

అందుకే “వెలిగొండ మాదే” అనే రాజకీయ వాదన కంటే..

“ఎవరి హయాంలో ఏం జరిగింది?”

అనే ప్రశ్నకు సమాధానం వెతికితేనే వెలిగొండ అసలు చరిత్ర కనిపిస్తుంది.

Continue reading
రష్మిక మందన్నా ‘మైసా’మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్

రష్మిక మందన్నా రణబాలి కూడా లైన్ లో

రష్మిక మందన్నా అంటే ఇప్పుడు టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో అదరగొడుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తోంది. అయితే పెళ్లికి ముందే స్టార్ట్ అయిన మూవీ రణబాలి. రణబాలి సెట్స్ లో ఉన్న టైమ్ లోనే విజయ్ దేవరకొండతో ఏడు అడుగులు నడిచింది రష్మిక మందన్నా. అఫ్ కోర్స్ వీరి పెళ్లి గురించి మూడేళ్లుగా జనం మాట్లాడుకుంటున్నారు.
రణబాలి మూవీ ఈ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ రష్మిక మందన్నా హిప్ కు ఇంజూరీ అవడంతో ఆలస్యం అయింది. కొత్త రిలీజ్ డేట్ గా అక్టోబర్ 16ని ప్రకటించింది మూవీ టీమ్. ఈ మూవీలోనే విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడుగా కనిపించబోతున్నాడు అని ముందు నుంచే చెప్పారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది.

రష్మిక మందన్నా ప్యాన్ ఇండియా మూవీ మైసా

రష్మిక మందన్నా రణబాలి తర్వాత చేస్తోన్న మూవీ మైసా. మైసా ప్యాన్ ఇండియా మూవీ. ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అద్దిరిపోయింది అనే చెప్పాలి. మైసాలో రష్మిక మందన్నా ఓ గిరిజన యోధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది కరెక్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ అని అప్పుడే అంతా చెప్పుకున్నారు.

మైసా దర్శకుడు ఎవరు

రష్మిక మందన్నా మైసా మూవీకి రవీంద్ర పుల్లెపు దర్శకుడు. ఇతనికి ఇదే తొలి సినిమా. గతంలో రవీంద్ర.. హను రాఘవపూడి దగ్గర పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఈ మూవీపై విపరీతమైన రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నాడట. ఏదేమైనా గాయం తర్వాత చాలా వేగంగా కోలుకున్న రష్మిక మందన్నా వెంటనే మళ్లీ సెట్స్ లో జాయిన్ కాబోతుండటం మాత్రం తన డెడికేషన్ కు నిదర్శనం. మరి రణబాలి, మైసా మూవీస్ తో రష్మిక మందన్నా ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.

Continue reading
కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అడుగు.. రామ్మోహన్ నాయుడితో మంత్రి తుమ్మల భేటీ

రామ్మోహన్ నాయుడితో తుమ్మల భేటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ తీసుకురావాలన్న ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమై చర్చించారు. కొత్తగూడెం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల్లో జిల్లాకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి తుమ్మల వివరించారు.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై తుమ్మల ఫోకస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపింది.

2026 జూన్‌లోనూ తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై చర్చించారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యంలో feasibility ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరినట్లు రిపోర్టులు వెల్లడించాయి.

పాత స్థలంపై ఫీజిబిలిటీ సమస్య.. కొత్త స్థలంపై ఆశలు

కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనకు గతంలోనే కేంద్ర స్థాయిలో site clearance లభించింది. అయితే తర్వాత ప్రతిపాదిత ప్రాంతంపై నిర్వహించిన సాంకేతిక పరిశీలనల్లో కొన్ని సమస్యలు తలెత్తాయి.

దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించింది. 2026లో అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలను పరిశీలించి feasibility study నిర్వహించినట్లు తెలుస్తోంది.

అంటే.. ఎయిర్‌పోర్ట్ వస్తుందా? రాదా? అనే దశ నుంచి.. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దిశగా చర్చ ముందుకు వచ్చినట్లు చెప్పొచ్చు.

భద్రాచలం రామయ్య భక్తులకు మరింత సౌకర్యం

కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు మరో ప్రధాన కారణంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది.

భద్రాచలం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే భద్రాచలం టెంపుల్ టూరిజానికి మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తుమ్మల పేర్కొన్నారు.

పారిశ్రామికంగా కీలకమైన జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. సింగరేణి సంస్థ, హెవీ వాటర్ ప్లాంట్, వివిధ పారిశ్రామిక సంస్థలు, ఖనిజ వనరులతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

అదే సమయంలో అటవీ ప్రాంతాలు, ప్రకృతి వనరులు, ఎకో టూరిజం అవకాశాలు కూడా జిల్లాలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే పారిశ్రామిక పెట్టుబడులు, వ్యాపార ప్రయాణాలు, పర్యాటకం, విద్యా రంగం వంటి అనేక విభాగాలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.

ఎయిర్‌పోర్ట్ వస్తే జిల్లాకు ఏం లాభం?

కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కార్యరూపం దాల్చితే ప్రధానంగా కొన్ని ప్రయోజనాలు కనిపించవచ్చు.

  • భద్రాచలం వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం
  • పారిశ్రామిక రంగానికి వేగవంతమైన కనెక్టివిటీ
  • కొత్త పెట్టుబడులకు అవకాశాలు
  • టెంపుల్ టూరిజం, ఎకో టూరిజానికి ప్రోత్సాహం
  • విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రయాణ సౌకర్యం
  • స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం
  • భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి మెరుగైన జాతీయ కనెక్టివిటీ

అయితే ఇవన్నీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, అనుమతులు, భూమి, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్ట్ ఆమోదం వంటి తదుపరి దశలు పూర్తయిన తర్వాతే వాస్తవ రూపం దాల్చుతాయి.

రామ్మోహన్ నాయుడు స్పందన ఏంటి?

మంత్రి తుమ్మల విజ్ఞప్తికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి feasibility ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు కీలకంగా మారింది.

మీరు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్న సెప్టెంబర్ 7న కేంద్ర ప్రతినిధుల బృందం కొత్తగూడెం పర్యటన విషయానికి ప్రస్తుతం నాకు అధికారిక ధృవీకరణ లభించలేదు. అందువల్ల ఆ అంశాన్ని తుది వార్తగా కాకుండా, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా ప్రచురించడం మంచిది.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ కల నెరవేరుతుందా?

కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనకు దాదాపు దశాబ్ద కాలం చరిత్ర ఉంది. 2016లోనే కేంద్రం కొత్తగూడెం ప్రాజెక్టుకు site clearance ఇచ్చినప్పటికీ, తర్వాతి దశల్లో స్థల అనుకూలత, feasibility వంటి అంశాలు అడ్డంకిగా మారాయి.

ఇప్పుడు ప్రత్యామ్నాయ స్థలం, కొత్త feasibility నివేదికలతో మరోసారి ఈ ప్రాజెక్టుపై కదలిక కనిపిస్తోంది.

తుమ్మల ప్రయత్నాలు.. కేంద్రం సానుకూల స్పందన.. కొత్త స్థలంపై feasibility ప్రక్రియ ఇవన్నీ కలిసొస్తే కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కల మరోసారి పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

అయితే చివరకు విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం నుంచి తుది ఆమోదం, అవసరమైన సాంకేతిక-పర్యావరణ అనుమతులు, ప్రాజెక్ట్ అమలు వంటి అంశాలు కీలకం కానున్నాయి.

Continue reading
రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నిలబడతాడా

రవితేజ వారసత్వం మాధవ్ నిలబెడతాడా

మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) తమ్ముడు రఘు రాజు తనయుడు మాధవ్ భూపతి(Madhav Bhupathi Raju) రాజు హీరోగా నిలబడతాడా..? తాజాగా విడుదలైన అతను హీరోగా నటించిన మారెమ్మ ట్రైలర్ చూస్తుంటే అతను ఇంకా చాలా చాలా షైన్ కావాల్సి ఉంది అనిపిస్తోంది. ట్రైలర్ లోనే అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ మైనస్ గా కనిపిస్తోంది అనేది వాస్తవం. ఈ మూవీ కోసం అతను చాలా టైమ్ తీసుకున్నాడు. చాలామంది నిర్మాతలు కూడా కనిపిస్తున్నారు. కంటెంట్ తెలంగాణ నేపథ్యంగా ఉంది. తెలంగాణలో మారెమ్మ తల్లి గురించి తెలియని వారు ఉండరు. అందుకే ఆ నేపథ్యం తీసుకున్నాడేమో అనుకోవచ్చా లేక నిజంగానే ఈ కథలో ఏదైనా నావల్టీ ఉందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

మారెమ్మ ట్రైలర్ ఎలా ఉంది

ఇక మారెమ్మ ట్రైలర్(Maremma Trailer) పరంగా చూస్తే ఇది తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే కథ అని అర్థమౌతుంది. మారెమ్మ కోసం మొక్కుకున్న ఓ ఎద్దు చుట్టూ సాగే కథగా ఉంది. ఆ ఎద్దుకంటే ముందు ఊరంతా ఇబ్బందులు పడుతుంది. పశువులు చనిపోతుంటాయి. ఆ కారణంగా ఎద్దు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి హీరో సాకుతాడు. ఓ రకంగా చూస్తే అతనో పశువుల కాపరి. అతనికి చదువుకున్న అమ్మాయితో ప్రేమ ఉంటుంది. అదే ఊరిలో ఉన్న దొరల కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏంటీ..? వాటిని ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథగా ఉండబోతోందని తెలుస్తోంది.

ట్రైలర్ లో మేటర్ లేనట్టుగా ఉంది

మారెమ్మ ట్రైలర్ లో పెద్దగా విషయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆకట్టుకునే కంటెంట్ లాగా కూడా లేదు. హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా పెద్దగా బలం లేనట్టుగా చూపించారు. హీరోయిన్ పాత్రను కూడా మాగ్జిమం లైట్ తీసుకున్నారు అనేలా ఉంది. మిగతా పాత్రలు కూడా పెద్ద గొప్పగా కనిపించడం లేదు. కొన్ని పాత్రలు మరీ రొటీన్ గా ఉండబోతున్నాయి అనిపించాయి.

ఇరుముడి సెంటిమెంట్ మారెమ్మతో రిపీట్ అవుతుందా..

రవితేజ రీసెంట్ గా దేవుడి కంటెంట్ తో ఉన్న ఇరుముడితో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మారెమ్మతో మాధవ్ కూడా విజయం అందుకుంటాడు అని కొంతమంది సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నారు. మరి చూద్దాం.. విజయం అందుకుంటాడా లేదా అనేది.
మారెమ్మ ఈ నెల 10న విడుదల కాబోతోంది. మంచాల నాగరాజు(Manchala Nagaraju) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు(Mayur Reddy Bandaru) నిర్మించాడు. ప్రశాంత్ ఆర్ విహారి(Prashanth R. Vihari) సంగీతం అందించాడు.

Continue reading
సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

సద్గురు ₹1 కోటి విరాళం

సద్గురు టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించాడు. ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.
నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.
“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.
అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, ‘ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే’ అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”
ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.
ఈ విపత్తుకు “దైవిక కారణాలు” లేదా “మార్మిక కోణాలు” ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. ‘ఇదంతా దేవుడి లీల’ అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”
ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు.

Continue reading
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ‘వేట’ మొదలు

సందీప్ సరోజ్ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్

సినిమా టైటిల్‌కి కథతో కనెక్షన్ ఉంటే ఆ సినిమాపై మొదటి నుంచే ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తున్న సినిమా ‘వేట’. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్, సాత్విక జంపా జంటగా నటిస్తున్న ఈ సినిమా సోమవారం ఆగస్ట్ 31న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఎస్‌ఆర్‌డీ స్టూడియోస్, ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలు. కొత్త దర్శకుడు అశోక్ కోటిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

గోదావరి నేల నుంచి ఓ కొత్త కథ..

‘వేట’ టైటిల్‌ను ప్రకటించిన విధానం చూస్తే సినిమా ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. గోదావరి ప్రాంతపు నేపథ్యంతో, గ్రామీణ జీవితం, అక్కడి మనుషులు, వారి భావోద్వేగాలను టచ్ చేసే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటివరకు విడుదలైన సమాచారం ప్రకారం ఇది కేవలం పల్లెటూరి కథగా మాత్రమే కాకుండా సహజత్వంతో పాటు కమర్షియల్ అంశాలను కూడా కలిపిన సినిమాగా రూపొందనుంది. నిర్మాత ఫణి అడపాక కూడా సినిమా సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో సాగుతుందని చెప్పారు.

అంటే గోదావరి బ్యాక్‌డ్రాప్‌ను కేవలం అందమైన లొకేషన్ల కోసం కాకుండా కథలో ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. అయితే కథలో అసలు ‘వేట’ ఏంటి? అనే విషయాన్ని మాత్రం మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్‌లోనే ఉంచారు.

సందీప్ సరోజ్‌కి మరో డిఫరెంట్ సినిమా

‘కమిటీ కుర్రోళ్లు’తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్(Sandeep Saroj)ఇప్పుడు ‘వేట’తో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాలో తన పాత్ర, కథకు తగ్గట్టుగా కొత్తగా కనిపించబోతున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, ఎమోషన్, యాక్షన్ వంటి అంశాలతో సినిమా సాగనుండటంతో సందీప్ సరోజ్‌కు ఇది మరో మంచి అవకాశం కావచ్చు.

సందీప్ సరోజ్ స్వయంగా ‘వేట’ టైటిల్ కథకు సరిగ్గా సరిపోతుందని చెప్పడం కూడా ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఇదే పేరుతో చిరంజీవి నటించిన సినిమా ఉండటంతో టైటిల్‌పై సహజంగానే చర్చ మొదలైంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను కేవలం ఆ పాత సినిమా పేరుతో వచ్చిన గుర్తింపు కోసం తీసుకోలేదని, తమ కథకు ఇది యాప్ట్‌గా ఉంటుందని సందీప్ సరోజ్ స్పష్టం చేశారు.

దర్శకుడిగా అశోక్ కోటిపల్లి మొదటి అడుగు

‘వేట’తో అశోక్ కోటిపల్లి(Ashok Kotipalli) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమానే ఒక ప్రత్యేకమైన గ్రామీణ కథతో చేయడం ఆసక్తికరంగా మారింది.

కథ చెప్పిన వెంటనే సీనియర్ నటుడు, దర్శకుడు కేఎస్ రవి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్ కోటిపల్లి తెలిపారు. తొలి సినిమాతోనే మంచి టీమ్‌తో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

కొత్త దర్శకుడికి కథే అసలు బలం. ‘వేట’ విషయంలో కూడా కథను నమ్మి నిర్మాతలు ముందుకు రావడం, అనుభవజ్ఞులైన నటీనటులు భాగం కావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

కేఎస్ రవి కుమార్ కీలక పాత్ర

‘వేట’లో సీనియర్ దర్శకుడు, నటుడు కేఎస్ రవి కుమార్ (K.S. Ravi Kumar) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.సినిమా కథ తనకు నచ్చిందని, ఇందులో తాను పోషిస్తున్న పాత్ర కూడా తనకు బాగా నచ్చిందని ఆయన ఈవెంట్‌లో తెలిపారు. గ్రామీణ నేపథ్యంలోని పెద్దమనిషి తరహా పాత్రలో కనిపించనున్నట్టు చెప్పారు. జెన్‌జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని, మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

ఇలాంటి పాత్రలో కేఎస్ రవి కుమార్ కనిపించడం సినిమాకు అదనపు బలం కావచ్చు. అయితే ఆయన పాత్ర స్వభావం, కథలో ఎంత కీలకంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం సినిమా విడుదలకు దగ్గర్లోనే మరింతగా తెలుసుకునే అవకాశం ఉంది.

ఘనంగా ‘వేట’ పూజా కార్యక్రమం

‘వేట’ ప్రారంభోత్సవానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, కేఎస్ రవి కుమార్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

నాగబాబు స్క్రిప్ట్ అందించగా.. సాయి రాజేష్(Sai Rajesh), ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య(V.N.Aditya), ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెహర్ రమేష్(Meher Ramesh), యదు వంశీ, అనుదీప్ దేవ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా పలువురు ప్రముఖుల సమక్షంలో ‘వేట’ లాంఛనంగా ప్రారంభం కావడం సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి ఉందనే విషయాన్ని చూపిస్తోంది.

సాత్విక జంపాకు కీలక అవకాశం

సాత్విక జంపా(Satwika Jampa) ‘వేట’లో సందీప్ సరోజ్‌కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో మంచి ప్రారంభంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. కానీ కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందనే ఆసక్తి మాత్రం ఏర్పడుతోంది. సినిమా కథ ముందుకు వెళ్లేకొద్దీ సాత్విక పాత్రపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత అదే రూట్.. కానీ ఈసారి మరింత కమర్షియల్‌గా?

సందీప్ సరోజ్‌కు ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి గుర్తింపును తెచ్చిన సినిమా. ఇప్పుడు ‘వేట’ కూడా గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికమే అయినా.. రెండు సినిమాలను ఒకేలా చూడాల్సిన అవసరం లేదు.

‘వేట’ విషయంలో నిర్మాతలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే గ్రామీణ వాతావరణం ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా నేచురల్ డ్రామాగా మాత్రమే ఉండదు. కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఉండనుంది. అదే ఈ సినిమాను ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి వేరుగా నిలబెట్టే అంశం కావచ్చు.

‘వేట’లో అసలు వేట ఏంటి?

ఇదే ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న ప్రధాన ప్రశ్న.

టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. గోదావరి బ్యాక్‌డ్రాప్, గ్రామీణ వాతావరణం, ప్రేమ, భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలిసిన కథగా ‘వేట’ను మేకర్స్ పరిచయం చేస్తున్నారు. కానీ టైటిల్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

అందుకే ప్రస్తుతానికి కథపై ఎలాంటి ఊహాగానాలు చేయడం కంటే మేకర్స్ నుంచి వచ్చే ఫస్ట్ లుక్, టీజర్, క్యారెక్టర్ పోస్టర్లు, షూటింగ్ అప్‌డేట్స్ కోసం వేచి చూడటం మంచిది.

టెక్నికల్ టీమ్ కూడా ఆసక్తికరంగానే ఉంది

‘వేట’(Veta Movie)కు అశోక్ కోటిపల్లి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎ. విజయ్ ఫైట్స్, అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్, రాఘవేంద్ర తిరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సినిమాకు సరైన విజువల్ టోన్ తీసుకురావడంలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంతపు నేచురల్ లొకేషన్స్‌ను కథకు తగ్గట్టుగా చూపించగలిగితే ‘వేట’కు ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీ వచ్చే అవకాశం ఉంది.

Continue reading
బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతారా

బాలకృష్ణ, నాగార్జున బరిలో దిగుతారా

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) దూకుడు బాగా పెంచాడు. వరుసగా హిట్ మూవీస్ చేస్తున్నాడు. అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. అయినా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ను ఈ నెల 6న అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు. మధ్యలో బాలయ్య(Balayya) కాస్త గాయపడటంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. లేదంటే ఈ మూవీ ఈ దసరాకే రావాల్సి ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఆయన ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు.

నాగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కాస్త స్లో అయ్యాడు. అయినా తన వందో సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు. రీసెంట్ గా తన బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రా. కార్తీక్(Ra. Karthik) డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. నాగార్జున 100వ సినిమాను ఓ మైల్ స్టోన్ గా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గ్లింప్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 24న నాగార్జున 100వ సినిమా విడుదల చేస్తాం అని చెప్పారు. ఇక్కడే బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మూవీ టీమ్ కూడా ఓ డైలమాలో పడిపోయారు.

బాలయ్య కూడా అదే డేట్ కేనా

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ కూడా డిసెంబర్ 24నే విడుదల చేస్తారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే డేట్ లో నాగార్జున వస్తున్నాడు అంటే పోటీ తప్పదు అనిపించేలానే ఉంది. లేదంటే నందమూరి బాలకృష్ణ కొంత ముందుగా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని వినిపిస్తోంది. అంటే డిసెంబర్ సెకండ్ వీక్ లో బాలకృష్ణ మూవీ విడుదలవుతుందని చెబుతున్నారు.

బాలయ్య, నాగ్ పోటీ తప్పదా

బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ ఒకేసారి వస్తే మాత్రం పోటీ ఓ రేంజ్ లో ఉంటుందనుకోవచ్చు. పైగా ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన వైరం కూడా ఉంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. సో.. ఇద్దరూ డిసెంబర్ 24నే వస్తే అభిమానులకు మాత్రం ఓ పెద్ద పని పడబోతోంది అనుకోవచ్చు.

 

Continue reading