జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయింది. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవతో ఈ కాంబో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, దేవుడి పాత్ర, భారీ విజువల్ స్కేల్ అంటూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎన్టీఆర్ ఏ దేవుడి పాత్రలో నటిస్తున్నాడనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయంలో మాత్రం ఓ స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. మాగ్జిమం కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఫార్మాట్‌ను దాటి ఒక భారీ మైథలాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనేది మాత్రం స్పష్టం. పురాణాలు, చరిత్ర, ఫాంటసీ అంశాలను కలిపి ఒక ఎపిక్ కథను సిద్ధం చేశాడు అనేది క్లియర్.
ఎన్టీఆర్ విషయానికి వస్తే… ఆయనకు పౌరాణిక పాత్రలు కొత్త కాదు. చిన్న వయసులోనే పౌరాణిక పాత్రలు చేసిన అనుభవం ఉంది. తన డైలాగ్ డెలివరీ, హావభావాలతో ఇలాంటి పాత్రలకు సరిపోయే నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ అయిన నటుడు. అందుకే ఎన్టీఆర్‌ను దేవుడి తరహా పాత్రలో చూడాలనే వార్తలకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.
కానీ ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లు కేవలం స్టార్ పవర్‌తో కాకుండా కథ, విజువల్స్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌పై ఆధారపడి ఉంటాయి. త్రివిక్రమ్ తన రైటింగ్ స్టైల్ తో ఈ పురాణ ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరిస్తాడు? ఎన్టీఆర్ పాత్రను ఏ స్థాయిలో చూపిస్తాడు? అనేదే అసలు ఆసక్తి. కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయిక మాత్రం మరోసారి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.






