ఘట్టమనేని జయకృష్ణను అభిమానులు ఓన్ చేసుకోలేదా..?

జయకృష్ణను ఘట్టమనేని ఫ్యామిలీ పట్టించుకోవడం లేదేంటీ..?

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో అతను నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ విడుదల కాబోతోంది. అయితే ఇక్కడ అనేక సందేహాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ. అంతకు ముందే కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు మరణించి ఉన్నాడు. అతను హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అది కృష్ణకి చాలా పెద్ద లోటుగా ఉండిపోయింది. తర్వాత మహేష్ బాబు వచ్చాడు కృష్ణ ట్యాగ్ అయిన సూపర్ స్టార్ ను ఓన్ చేసుకున్నాడు. అయితే అంత త్వరగా మహేష్ బాబు స్టార్డమ్ తెచ్చుకోలేదు. చాలా ఫ్లాపుల తర్వాత గాడిలో పడ్డాడు. దీనికి తోడు మంచి నటుడు అనిపించుకున్నాడు.

రమేష్ బాబుపై మహేష్ బాబు ప్రేమ..?

మహేష్ బాబుకు అన అన్న రమేష్ బాబు అంటే చాలా ఇష్టం. ప్రేమ, గౌరవం కూడా మెండుగా ఉన్నాయి చాలామంది చెబుతుంటారు. అలాంటి తన అన్న కొడుకు హీరోగా మారాడు అంటే అతనికి సపోర్ట్ చేయాల్సిన మహేష్ బాబు మాత్రం మాగ్జిమం మౌనంగా ఉండిపోయాడు. శ్రీనివాస మంగాపురం మూవీకి సంబంధించి ఏ ఈవెంట్ కూ అటెండ్ కాలేదు. అందుకు తన వారణాసి మూవీ కారణమే అని చెబుతూ ఓ చిన్న వీడియో చేసి వదిలాడు. బట్ అది ఏమాత్రం సరిపోలేదు అనేది నిజం.

జయకృష్ణను మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..

మహేష్ బాబు దాదాపు లైట్ తీసుకున్నాడు అనేది చాలామందిలో కలుగుతున్న భావన. దర్శకుడు అజయ్ భూపతి ఎంత చెప్పినా ఈ విషయంలో అడ్జెస్ట్ కాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన విషయం ఏంటీ అంటే.. మహేష్ బాబు అభిమానులెవరూ కూడా జయకృష్ణను ఓన్ చేసుకోలేపోయారు. అతని గురించి మినిమం కూడా పట్టించుకోలేదు అనేది వాస్తవం. పాపం అతనే సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. బట్ అభిమానులు మాత్రం చాలా అంటే చాలా లైట్ తీసుకున్నారు జయకృష్ణను.
ఇలాంటి సందర్భాల్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన.. వస్తోన్న హీరోలందరితో పోలిస్తే జయకృష్ణను ఎవరూ పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు తన అన్నపై చాలా గౌరవం ఉన్నా.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో మాత్రం వదిలేయడం ఎంత వరకు సమంజసం అనేది పెద్ద ప్రశ్న. శ్రీనివాస మంగాపురంకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ ఏవీ కూడా ఆడియన్స్ నుంచి అటెన్షన్ తెచ్చుకోలేదు అనేది వాస్తవం. అతనేదో అతని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం ఈ కుర్రాడిలో హీరోను చూడలేకపోతున్నారు.

నెపోకిడ్స్ ను రుద్దడం కామన్

మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి వస్తోన్న హీరోలందరు కూడా ముందుగా ప్రేక్షకులపై రుద్దబడటం కామన్ గా చూస్తున్నాం. జయకృష్ణ విషయంలో కూడా అదే జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నా.. అసలు ఆ కుటుంబం నుంచే ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే ఫ్యామిలీకి అల్లుడైన సుధీర్ బాబు హీరోగా మారిన టైమ్ లో అతని కోసం చాలామంది చాలా చేశారు. అతన్ని కూడా రుద్దారు. ఇప్పటికీ రుద్దడం జరుగుతూనే ఉంది. కాకపోతే సుధీర్ బాబు తన సినిమాల రిజల్ట్స్ ను పక్కన పెట్టి తనదైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు.

జయకృష్ణ స్వయంకృషే దిక్కా..

ఏదేమైనా కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. అతని ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా జయకృష్ణను అస్సలు పట్టించుకోలేదు అనేది తెలుస్తోంది. మరి అందుకు కారణాలేంటీ అనేది తెలియకపోయినా కుర్రాడు మాత్రం ఈ విషయాలన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపొద్దు అని చెప్పొచ్చు.

Continue reading
శర్వానంద్ భోగి మూవీ వాయిదా పడిందా..?

శర్వానంద్ భోగిపై లేటెస్ట్ అప్డేట్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ భోగి. ఇదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ అని గతంలోనే ప్రకటించారు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ ఫస్ట్ డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఊరమాస్ లుక్ తో నటిస్తున్నాడు. ఈ కథ చాలా బలంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా శర్వానంద్ ఇదో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా భావిస్తున్నారు.

సంపత్ నందికి పెద్ద హిట్ కావాలి

సంపత్ నంది ఈ మధ్య కాలంలో సరైన విజయాలు లేక కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయినా నిర్మాతగా మాత్రం కాస్త ఫర్వాలేదు అనిపించేలాంటి మూవీస్ చేస్తున్నాడు. ఆ మూవీస్ కంటెంట్ పక్కన పెడితే కమర్షియల్ గా మాత్రం బానే వర్కవుట్ అయ్యాయి. ఈ కారణంగా తను డైరెక్ట్ చేసిన మూవీస్ పోయినా ఇబ్బంది పడకుండా ఉంటున్నాడు. అయితే భోగి మూవీ విషయంలో సంపత్ నంది మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడట. రీసెంట్ గా ఈ మూవీ రష్ మొత్తం శర్వానంద్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

భోగి అవుట్ పుట్ పై శర్వానంద్ హ్యాపీ

భోగి కంటెంట్ తో పాటు సంపత్ నంది టేకింగ్ పై శర్వానంద్ చాలా ఇంప్రెస్ అయ్యాడట.దీంతో సంపత్ నందికి మరో అవకాశం ఇవ్వబోతున్నాడు శర్వానంద్. భోగి చిత్రాన్ని ఆగస్ట్ 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు కానీ ఇప్పటికైతే ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది.

భోగి అందరికీ కీలకమే

ఏదేమైనా భోగిపై శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సంపత్ నంది ఈ చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అటు డింపుల్ హయాతి కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఈ మూవీ కీలకమే అవుతుందని చెప్పొచ్చు. మరి రిజల్ట్ తర్వాత ఎవరికి ఎంత మేలు జరుగుతుందో అనేది తెలుస్తుంది.

Continue reading
విజయ్ జన నాయగన్ ఫైనల్ రిజల్ట్ ఏంటీ..?

జన నాయగన్ బిగ్గెస్ట్ డిజాస్టర్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమాగా జన నాయగన్ విడుదలైంది. నిజానికి ఈ మూవీ ఈ యేడాది జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అప్పుడు రిలీజ్ అయితే ఎలక్షన్ కు ప్లస్ అవుతుందని అతను భావించినా సెన్సార్ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదలకు ముందే మూవీ రావడం కష్టం అని భావించారు. ఈ లోగా పైరసీకీ గురైంది. ఈ లోగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత వెంటనే విడుదల అనుకున్నా.. అప్పుడూ కుదరలేదు.

భగవంత్ కేసరికి రీమేక్

ఫైనల్ గా ఈ నెల 23న విడుదల చేశారు. బట్ రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది.
జన నాయగన్ తెలుగులో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్. అయితే ఇది కేవలం 50శాతం మాత్రమే తీసుకున్నారు అని ముందే చెప్పినా విడుదల తర్వాత చూస్తే 80శాతం వరకు అదే ఉంది. పైగా మూవీ అంతా మక్కీకి మక్కీగానే ఉంది. టేకింగ్ పరంగా మేకింగ్ పరంగా ఏ మాత్రం కొత్తదనం లేదు. అయినా విజయ్ మూవీ కాబట్టి తమిళ్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి అని చాలామంది భావించారు. బట్ అందుకు భిన్నంగా ఈ మూవీకి బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ తమిళ్ లోనే వచ్చింది.

జన నాయగన్ ను పట్టించుకోని ప్రేక్షకులు

ఎలెక్షన్స్ టార్గెట్ గా తీసిన మిగతా 20శాతం ఇప్పుడు అవసరం లేకపోవడంతో మరింత మైనస్ గా మారింది. ఆ కారణంగా జన నాయగన్ చూసిన వాళ్లంతా.. ఇంకా చెబితే విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. దీంతో ఈ చిత్రంలో డిలీట్ చేసిన ఒక 6సీన్స్ ను మళ్లీ యాడ్ చేస్తున్నాం అని మూవీ టీమ్ ప్రకటించింది. బట్ ఇప్పటికే జరగాల్సిన నష్టమే అయితే జరిగింది. ఈ టైమ్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేయడం వల్ల ఒరిగేదేంటీ అని చాలామంది ఫీలవుతున్నారు.

విజయ్ లాస్ట్ మూవీ డిజాస్టర్ గా

ఏదేమైనా విజయ్ మూవీ అంటే భారీ క్రేజ్ ఉంటుంది. పైగా అతని లాస్ట్ మూవీ అని కూడా జనం ఎగబడి చూస్తారు అనుకున్నారు. కానీ కంటెంట్ లో దమ్ము లేకపోతే జనం అస్సలు పట్టించుకోరు అని జన నాయగన్ తో మరోసారి ప్రూవ్ అయింది.ఏదేమైనా విజయ్ లాస్ట్ మూవీతో ఇలాంటి డిజాస్టర్ చూడ్డం కాస్త బాధాకరమే.

Continue reading
కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడమేంటి

కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్

ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లంతా ఆఫర్స్ తగ్గగానే ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునేవారు. మెల్లగా ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్ లుగా వెలుగుతున్న టైమ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. అయితే వారి ఇమేజ్ కు తగ్గట్టుగా మాత్రమే ఇది కనిపించేది. అలాంటిది కీర్తి సురేష్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటే మాత్రం చాలామంది నమ్మలేకపోతున్నారు. బట్ ఇది నిజం. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఐటమ్ లో చిందేస్తోంది.

వరుస మూవీస్ తో బిజీ

కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీగా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ సరసన మరో మూవీ చేస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్, కృతిశెట్టి మరో జంటగా నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని మూవీస్ చేస్తోంది. అలాంటి టైమ్ లో కీర్తి సురేష్ సడెన్ గా ఐటమ్ సాంగ్ చేయడం ఆశ్చర్యమే.

ద ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్

Keerthy Suresh Movies, The Paradise Movieనేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ద ప్యారడైజ్’మూవీలో కీర్తి సురేష్ ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇది ఈ నెల 28నుంచే చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది కదా. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఐటమ్ సాంగ్ పెద్ద బ్యాలన్స్ గా ఉంది. ఈ పాట కేవలం నాని కోసమే చేస్తోంది అనేది చాలామందికి తెలిసిన విషయం. నానితో కీర్తి సురేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కారణంగానే ఈ ఐటమ్ లో చిందేస్తోందా లేక ఫ్యూచర్ లో కూడా ఈ టైప్ స్పెషల్ సాంగ్స్ తో నర్తిస్తుందా అనేది చూడాలి.
కానీ కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడం ఆమె అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అని చెప్పాలి.

Continue reading
అనిల్ రావిపూడిని ఫాలో అయిన త్రివిక్రమ్

వెంకటేష్ ఆదర్శ కుటుంబం గ్లింప్స్

మూవీ ప్రమోషన్స్ అంటే ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడిని చూసే అంతా నేర్చుకోవాలని అంటున్నారు. చాలా ఇన్నోవేటివ్ గా, అట్రాక్టివ్ గా ముఖ్యంగా ఆడియన్స్ మైండ్ లోకి ఇమ్మీడియెట్ గా చొచ్చుకుపోయేలా అతను ప్రమోట్ చేస్తుంటాడు. దీంతో చాలామంది ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అని ఫిక్స్ అయిపోతుంటారు. అదీ అనిల్ రావిపూడి స్టైల్. ఇప్పుడు అనిల్ రావిపూడిని ఫాలో అవుతూ ఆదర్శకుటుంబం ప్రమోషన్ మొదలు పెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తోన్న మూవీ ఇది. అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ మేరకు గతంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ గ్లింప్స్ చూడగానే అందరికీ గుర్తొచ్చింది కేవలం అనిల్ రావిపూడినే. అతని స్టైల్లోనే ఆదర్శ కుటుంబం గ్లింప్స్ కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి స్టైల్ లో గ్లింప్స్

శ్రీనిధి శెట్టి, వెంకటేష్ ఓ కొత్త ఇంటికి వెళతారు. అక్కడ ఉన్న వస్తువులన్నీ చూసి నీకు ఎంత బాగా పనిచేస్తాయో అంటూ శ్రీనిధి శెట్టి, వెంకటేష్ కు చెబుతూ ఉండటం.. దానికి కౌంటర్ గా రఘుబాబు చాలా చీప్ గా వెంకీని చూడటం చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఓ రకంగా ఎఫ్ 2 లో వెంకటేష్, రఘుబాబు పాత్రలను కొనసాగించినట్టుగానూ ఉంది. మొత్తంగా ఈ గ్లింప్స్ అయితే చూడగానే ఆకట్టుకునేలా ఉంది అనేది చెప్పొచ్చు.
అయితే ఆదర్శ కుటుంబంలో కూడా వెంకటేష్ కూడా తన భార్య కింద నలిగిపోయే పాత్రే చేస్తున్నట్టుగా ఉంది. త్రివిక్రమ్ స్టైల్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారని అర్థమైంది. కాకపోతే ఫ్లేవర్ అంతా అనిల్ రావిపూడిదే ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆదర్శ కుటుంబలో నారా రోహిత్ కూడా

ఇక కొసమెరుపేంటంటే.. ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్ పోలీస్ అధికారి పాత్రలో నటించడం. మరి అతని పాత్ర ఎలా ఉంటుంది అనేది ఇలా ప్రమోషన్స్ లో చెబుతారా లేక డైరెక్ట్ గా మూవీలోనే చూడాలా అనేది తెలియాల్సి ఉంది.

 

Continue reading
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

తెలుగు సినిమా చరిత్రలో దర్శకులంటే గుర్తొచ్చే పేర్లు చాలా ఉన్నాయి. కానీ కథ చెప్పే విధానం, పాత్రల నిర్మాణం, పాటల చిత్రీకరణ, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించే తీరు వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ప్రేక్షకులే ఆయనకు “క్రియేటివ్ డైరెక్టర్” అనే బిరుదు ఇచ్చారు.కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పెద్ద అపజయాలు ఎదురైనా తన కథ చెప్పే శైలిని మార్చకుండా ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత.

గులాబీతో మొదలైన ప్రయాణం

1995లో వచ్చిన గులాబీ కృష్ణవంశీని దర్శకుడిగా పరిచయం చేసింది. రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసినప్పటికీ, తొలి సినిమాతోనే తనదైన విజువల్ స్టైల్, భావోద్వేగాలను చూపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పాటల చిత్రీకరణ, ప్రేమకథను చెప్పిన తీరు అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నిన్నే పెళ్లాడతా కృష్ణవంశీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కుటుంబ కథలను కూడా అందంగా, వినోదాత్మకంగా చెప్పొచ్చని నిరూపించిన సినిమా ఇదే. నాగార్జున, టబు నటనతో పాటు కుటుంబ బంధాలను చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది.

సిందూరం.. సాహసోపేత ప్రయత్నం

నక్సలిజం నేపథ్యంలో రూపొందిన సిందూరం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రియలిస్టిక్ కథనం, భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని చూపించిన తీరు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

అంతఃపురం.. రియలిజానికి నిదర్శనం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన అంతఃపురం ఇప్పటికీ కృష్ణవంశీ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. హీరోయిజం కంటే మనుషుల జీవితాలను, భయాలను, కుటుంబ బంధాలను ముందుకు తీసుకువచ్చిన తీరు ఈ సినిమాకు ప్రత్యేకత.

మురారి.. మహేష్ బాబులోని నటుడిని వెలికితీసిన సినిమా. మురారి మహేష్ బాబు కెరీర్‌లో ముఖ్యమైన చిత్రాల్లో ఒకటి. కుటుంబ విలువలు, గ్రామీణ నేపథ్యం, ఆధ్యాత్మిక అంశాలను మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఖడ్గం కృష్ణవంశీ కెరీర్‌లో మరో మైలురాయి.

దేశభక్తి, మత సామరస్యం, సినిమా పరిశ్రమ, ప్రేమ వంటి విభిన్న అంశాలను ఒకే కథలో మిళితం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు, సంభాషణలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.

ప్రయోగాలు… విజయాలు… అపజయాలు

ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం, చక్రం, రాఖీ, చందమామ, మహాత్మా, గోవిందుడు అందరివాడేలే వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కొన్ని సినిమాలు మంచి స్పందన పొందగా, మరికొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ కొత్త అంశాలను ప్రయత్నించాలనే తపన మాత్రం ఆయనలో ఎప్పుడూ కనిపించింది.

కృష్ణవంశీ సినిమాల్లో కనిపించే ముఖ్యమైన అంశాలు:

బలమైన కుటుంబ భావోద్వేగాలు
విభిన్న పాత్రల నిర్మాణం
గ్రామీణ నేపథ్యాల సహజ చిత్రణ
కథలో భాగంగా ఉండే పాటలు
మహిళా పాత్రలకు ప్రాధాన్యం
సమాజానికి సంబంధించిన అంశాలపై దృష్టి
ఇవే ఆయనను ఇతర దర్శకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి.

కెరీర్‌లో ఎదురుదెబ్బలు

కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఆ మార్పులకు అనుగుణంగా వచ్చిన కొత్త కథన శైలితో పోలిస్తే, కృష్ణవంశీ కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.అయితే ఆయన దర్శకత్వ శైలి, కథల ఎంపిక, భావోద్వేగాల చిత్రణకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

ముగింపు

తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవంశీ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. హిట్లు, ఫ్లాపులు ప్రతి దర్శకుడి కెరీర్‌లో సహజమే. కానీ ఒక దర్శకుడిని గుర్తుంచేది అతని విజయాల కంటే అతను సృష్టించిన సినిమాల ప్రభావం. ఆ కోణంలో చూస్తే గులాబీ, నిన్నే పెళ్లాడతా, సిందూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం వంటి చిత్రాలు కృష్ణవంశీని తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

Continue reading
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక యువత శక్తి

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం

దేశ రాజకీయాల్లో కొన్ని సంఘటనలు కేవలం వార్తలుగానే మిగలవు. అవి ఒక తరం ఆలోచనలను, ప్రజాస్వామ్యం బలాన్ని గుర్తు చేస్తాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా అలాంటి సంఘటనగానే చర్చకు వస్తోంది.

కొన్ని వారాలుగా కొనసాగిన విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, నిరుద్యోగ యువతలో పెరిగిన అసంతృప్తి చివరకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారాయి. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే కొత్త వేదిక ఊపునిచ్చింది.

ఎలా మొదలైంది ఈ ఉద్యమం?

మొదట్లో ఇది కేవలం పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులపై ప్రశ్నలతో ప్రారంభమైంది. ముఖ్యంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విషయంలో వచ్చిన వివాదాలు వేలాది మంది విద్యార్థుల్లో ఆగ్రహాన్ని పెంచాయి.

అదే సమయంలో సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఈ అసంతృప్తిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో CJP కీలక పాత్ర పోషించింది.

జంతర్ మంతర్ నుంచి జాతీయ ఉద్యమంగా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

కొన్ని చోట్ల పోలీసుల చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనలు మరింత వైరల్ కావడంతో ఉద్యమానికి దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది.

సోషల్ మీడియా పాత్ర ఎంత?

ఈ ఉద్యమం ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియా కేవలం వినోద వేదిక కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే, ఉద్యమాలను విస్తరించే శక్తివంతమైన సాధనం.

గతంలో ప్రధాన మీడియా సంస్థలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించగలిగేవి. ఇప్పుడు ఒక సాధారణ యువకుడి పోస్టు కూడా జాతీయ చర్చకు కారణమవుతోంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కీలకం?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చాలా మంది సాధారణ రాజకీయ పరిణామంగా చూడడం లేదు. ఇది ప్రభుత్వంపై పెరిగిన ప్రజా ఒత్తిడికి ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, ప్రజా అసంతృప్తి ఈ నిర్ణయానికి దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ప్రభుత్వం అధికారికంగా రాజీనామాకు వేరే కారణాలు చెప్పినా, ప్రజల దృష్టిలో మాత్రం ఈ ఉద్యమం ప్రభావం స్పష్టంగా కనిపించింది.

యువతకు ఈ ఉద్యమం ఇచ్చిన సందేశం

ఈ మొత్తం పరిణామం యువతకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం హక్కు. సమస్యలను శాంతియుతంగా ప్రస్తావించడం బాధ్యత. ఒక్కోసారి చిన్నగా మొదలైన ఉద్యమాలు కూడా దేశవ్యాప్తంగా మార్పులకు కారణం కావచ్చు.

గారడి విశ్లేషణ

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ ఘటన భారత యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని బయటపెట్టింది.

ప్రశ్నించే స్వరం ఎంత బలంగా ఉంటుందో, ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమో ఈ ఉద్యమం మరోసారి గుర్తు చేసింది.
చివరికి ఈ ఉద్యమం చెప్పిన సందేశం ఒక్కటే…
‘‘పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప.”

Continue reading
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ OTT రిలీజ్.. ఆగస్టులో ZEE5లో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

‘వంద దేవుళ్ళు’ OTT రిలీజ్

తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ZEE5 తెలుగు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఈ ఆగస్టులో ZEE5లో OTT ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఖచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.

ఇటీవల ZEE5లో విడుదలైన ‘పరిమళ & కో’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తర్వాత అదే తరహాలో మరో బలమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ZEE5 సిద్ధమైంది. ఆ జాబితాలో ఇప్పుడు ‘వంద దేవుళ్ళు’ చేరింది.

తల్లి–కొడుకుల అనుబంధమే కథకు బలం

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ ఒంటరి తల్లి, ఆమె ఇద్దరు కుమారుల జీవితాల చుట్టూ సాగుతుంది. మధ్య వయసులో ఉన్న తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని ఒక కుమారుడు నిర్ణయించుకోవడం, ఆ తల్లి కూడా జీవితంలో ఓ తోడును కోరుకోవడం వంటి అంశాలపై కథ నడుస్తుంది. అయితే ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, సమాజం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన కథలో ప్రధానంగా నిలుస్తుంది.

తల్లి జీవితంలో చేసిన త్యాగాలను గుర్తించిన కొడుకు, ఆమె ఆనందం కోసం సమాజాన్ని ఎదుర్కొనే విధానం ఈ చిత్రానికి హృదయంగా నిలుస్తుంది. భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సామాజిక సందేశం కలగలిసిన ఈ కథ ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

మహిళ జీవితంపై బలమైన సందేశం

‘వంద దేవుళ్ళు’ కేవలం ఒక తల్లి కథ మాత్రమే కాదు. వివాహం, మాతృత్వం, మహిళల త్యాగం, సహచర్యం అవసరం, సమాజం మహిళలపై పెట్టే ఆంక్షలు వంటి అనేక భావోద్వేగ అంశాలను ఈ చిత్రం హృద్యంగా చూపిస్తుంది. అన్ని తరాల ప్రేక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ కథతో సులభంగా కనెక్ట్ అవుతారని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో మంచి స్పందన

థియేటర్లలో విడుదలైన సమయంలో కూడా ‘వంద దేవుళ్ళు’ మంచి ఆదరణ పొందింది. సహజమైన నటన, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, బలమైన కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంపికగా నిలిచింది.

ZEE5 ఏమంది?

ఈ సందర్భంగా ZEE5 మార్కెటింగ్ సౌత్, తమిళ & మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి జేవియర్ మాట్లాడుతూ, ‘పరిమళ & కో’కు వచ్చిన స్పందన ప్రేక్షకులు వాస్తవికమైన కుటుంబ కథలను ఎంతగానో ఆదరిస్తున్నారని మరోసారి నిరూపించింది. ఇప్పుడు ‘వంద దేవుళ్ళు’తో ఆ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ హృద్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని తెలిపారు.

ఎప్పుడు స్ట్రీమింగ్?

విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్ళు’ ఈ ఆగస్టులో ZEE5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Continue reading
నాగ బంధం OTT రివ్యూ: థియేటర్‌లో ఫ్లాప్.. ఓటిటిలో ఎలా ఉంది?

నాగ బంధం ఓటిటి రివ్యూ

థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన నాగ బంధం ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేశారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అంటూ మేకర్స్ చేసిన ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.

అయితే థియేటర్లలో మాత్రం నాగ బంధం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. విజువల్స్, గ్రాండ్ స్కేల్ ఉన్నప్పటికీ కథనం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని సన్నివేశాలను అవసరానికి మించి సాగదీయడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఓటిటిలో పరిస్థితి ఎలా ఉంది..?

ఇప్పుడు ఓటిటిలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. థియేటర్లలో భారీ అంచనాలతో చూసిన ప్రేక్షకులు నిరాశ చెందినా.. ఓటిటిలో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తున్నవారికి సినిమా ఒకసారి చూడదగ్గదిగానే అనిపిస్తోంది. ముఖ్యంగా మైథలాజికల్ కాన్సెప్ట్, విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని అడ్వెంచర్ ఎపిసోడ్స్ చిన్న స్క్రీన్‌పై అంతగా ఇబ్బంది పెట్టడం లేదు.

అయితే థియేటర్లలో వినిపించిన ప్రధాన విమర్శలు మాత్రం ఓటిటిలో కూడా అలాగే ఉన్నాయి. కథలో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బలవంతంగా పెట్టినట్టుగా అనిపించడం ఇంకా మైనస్‌లుగానే కనిపిస్తున్నాయి.

నభా నటేష్‌కు మంచి మార్కులు

ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేష్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంది. విరాట్ కర్ణ తన పాత్రలో బాగానే కనిపించినా, కథ బలంగా లేకపోవడం వల్ల అతని పెర్ఫార్మెన్స్ పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేదు.

ఫైనల్‌గా…

నాగ బంధం థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ, ఓటిటిలో మాత్రం ఒకసారి చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ విజువల్స్, మైథలాజికల్ టచ్ నచ్చే వారికి సినిమా కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. కానీ బలహీనమైన కథనం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఇది కూడా గొప్ప ఓటిటి సక్సెస్‌గా చెప్పే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. థియేటర్‌లో మిస్ అయిన వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ అంచనాలు మాత్రం చాలా తక్కువగా పెట్టుకుంటేనే సినిమా కొంతవరకు నచ్చే అవకాశం ఉంది.

Continue reading
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ, రేటింగ్

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ

ఆర్టిస్ట్స్ : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ, త్రిగుణ్, నవీన్, సిరి హనుమంతు తదితరులు
ఎడిటర్ : సంతోష్ నాయుడు
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్
నిర్మాతలు : ఎస్.కే.ఎన్, సాయి రాజేష్
కథ : సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి నంబూరి

బేబీ మూవీ తర్వాత ఎస్కేఎన్, సాయి రాజేష్ బాండింగ్ మరింత స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు అంటే అదో ‘కల్ట్, క్లాసిక్’అని ఆ ఇద్దరూ ముందుగా ఫిక్స్ అయిపోతుంటారు. అలా ఫిక్స్ అయి చేసిన సినిమానే చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ తో మాత్రం బాగా ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడి గురించి మాత్రం ప్రమోషన్స్ లో పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణాలేంటో కానీ అన్ని ప్రమోషన్స్ లో ఎస్కేఎన్, సాయి రాజేష్ మాత్రమే కనిపించారు. మరి ఈ మూవీ ఇవాళ(24.07.2026)విడుదలైంది. మరి చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

అజయ్(త్రిగుణ్)నివేదిత(శ్రీ గౌరీ ప్రియ) మూడేళ్లుగా ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధం అవుతారు. తీరా పెళ్లి రోజు అజయ్ తను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నా అని తప్పుకున్నాడు. అంత గాఢమైన ప్రేమ ఇలా పెటాకులు కావడంతో నివి చెన్నైలోనే ఉద్యోగం చేసుకుంటూ మందుకు బానిస అవుతుంది. మందు తాగేందుకు తన ఫ్రెండ్స్ తో కలిసే ఉంటుంది. ఈ టైమ్ లో ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ కు స్టీఫెన్ శంకర్(కిరణ్ అబ్బవరం) వారికి పరిచయం అవుతాడు. అతనో అనాథ. స్టీఫెన్ ఓ సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్రమంలో వీరి ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ షేరింగ్ కు వస్తాడు. అందరితో కలివిడిగా ఉండే స్టీఫెన్ నివిని బాగు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. మొదట కసురుకున్నా నివి స్టీఫెన్ ను చేరదీస్తుంది. అతని సినిమా ప్రయత్నాల్లో అండగా ఉంటుంది. అలాగే ఆమె తన ప్రేమను మర్చిపోలేకపోతుంటుంది.
స్టీఫెన్ ఆమెను బాగా మోటివేట్ చేస్తాడు. తొలిప్రేమ పోయినా మలి ప్రేమలోనూ మరో ఆనందం వెదకాలి అని చెబుతుంటాడు. ఈ క్రమంలో మెల్లగా నివి మందు మానేస్తుంది. ఓ టైమ్ లో ఆమె స్టీఫెన్ ను పెళ్లి చేసుకుందాం అని చెబుతుంది. మొదట షాక్ అయిన స్టీఫెన్ తర్వాత హ్యాపీగా ఒప్పుకుంటాడు. నివి పేరెంట్స్ కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి సిద్ధం అవుతారు. కట్ చేస్తే మళ్లీ నివి పెళ్లి రోజే మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి అదేంటీ..? ఇద్దరి మధ్య బంధం చెడుతుందా లేక ఇంకేదైనా జరుగుతుందా..? నివి లైఫ్ లో మళ్లీ అజయ్ వస్తాడా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

చెన్నై లవ్ స్టోరీ.. ఓ సాధారణమైన కథ. కానీ కథనంతో చాలాసార్లు మెప్పిస్తుంది. కాకపోతే ఈ కథలోని షాకింగ్ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు.ఆ పాయింట్ కొంత వరకు ఫర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఓ దశ దాటిన తర్వాత అది మరీ బోరింగ్ కనిపిస్తుంది. బట్ చెన్నై లవ్ స్టోరీ రెగ్యులర్ స్టోరీలాగానే మొదలవుతుందీ మూవీ. లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయి మందుకు బానిస కావడం కొత్తగా ఉంది. తర్వాత కిరణ్ అబ్బవరం ఎంట్రీతో సినిమా జోష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా అతనికి సంబంధించిన సీన్స్ రిపీటెడ్ గా ఉండటం కాస్త ఇబ్బంది కరం.
ఓ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ గా కనిపించినా కిరణ్ అబ్బవరంకు గౌరీ ప్రియ చెప్పే వరకు అసలు విషయం అర్థం కాకపోవడం కనెక్టింగ్ గా లేదు. అలాగే ఆమె తన ప్రేమను మర్చిపోవడానికి మందు మొదలు పెట్టి తర్వాత కిరణ్ అబ్బవరంతో కనెక్ట్ అయ్యాక చాలా తక్కువ టైమ్ లోనే మరో ప్రేమకు సిద్ధం కావడం కన్విన్సింగ్ గా లేదు. పోనీ పాత ప్రేమికుడిపై కోపమా అంటే.. అదేం కాదు. కేవలం ఓ పది రోజుల్లోనే మరో ‘గొప్ప’ ప్రేమికుడికి కనెక్ట్ కావడం సినిమాటిక్ గా కూడా అస్సలు బాలేదు. పోనీ ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమకథకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయా అంటే అవి కూడా బలంగా లేవు. హృదయాల్ని కదలించే సన్నివేశాలు, మనసులను మెలిపెట్టే సీన్స్ ఉన్నాయా అంటే అదీ అస్సలు లేదు.
ఇక సెకండ్ హాఫ్ ఎలా మొదలుపెడతారా అని ఎదురుచూసిన వారికి ఇది కాస్త బానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య అప్పుడు మంచి ప్రేమ ఉంటుందా అదీ లేదు. అక్కడ కూడా హీరో అబ్సెషన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంది. అలాగే గౌరీప్రియ లైఫ్ లోకి అతని మాజీ ప్రియుడు ఎంటర్ కావడం.. అతను మరో అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా అది కుదరడం లేదు అని చెప్పడంతో ఆమెకు అతనిపై కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే శ్రీ గౌరీప్రియపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నంలో ఆమెకు అప్పటి వరకు పట్టిన మబ్బులు విడిపోయినట్టుగా ఆమె ప్రవర్తన, నటన కనిపిస్తుంది. అయినా అతనిపై అంతులేని ప్రేమ ఉన్నట్టు చెప్పడం.. అతని కోసం జీవితాంతం ఉండిపోతాను అనడం ఆ టైమ్ కు సూట్ కాలేదు.
ఇక అప్పటి వరకు తను చాలా గొప్ప ప్రేమలో ఉన్నాడు అన్న భావనలో ఉన్న కిరణ్ అబ్బవరంకు అసలు విషయం అర్థం అవుతుంది. తర్వాతే సరైన నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తాడు. కట్ చేస్తే కథ కాస్త బాధాంతంగా ముగుస్తుంది.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియకు మధ్య అంత గొప్ప ప్రేమ ఎలివేట్ కావడానికి కావాల్సిన సన్నివేశాలు లేకపోవడం.. అసలు చాలా తక్కువ టైమ్ లోనే వీరిది ఓ అమర ప్రేమగా బిల్డప్ ఇవ్వడం అస్సలు సూట్ కాని కథనం. ఇదో బిగ్గెస్ట్ మైనస్ గా కనిపిస్తుంది. ఓ రకంగా అజయ్ పాత్రలో కాస్త హుందాతనం ఉంది. అదీ ప్లస్ పాయింట్ గా ఉంది మూవీలో. ఏదేమైనా ఇదో సాధారణమైన కథ. ఆ మూవీకి ఇంకాస్త బలమైన కథనం కూడా ఉంటే ఇంకా బావుండేది. కాకపోతే చూస్తున్నంత సేపు మాత్రం సినిమా కంప్లీట్ గా పాసబుల్ గా ఉంటుంది. ఇది మూవీకి ప్రధాన బలంగా ఉంటుంది. అంతే కానీ వీళ్లు చెప్పినట్టుగా ఇదో ఎపిక్, కల్ట్ లాంటి పదాలకు చాలా అంటే చాలా దూరంగా ఉందీ మూవీ. ఇవి తెచ్చిపెట్టుకున్న పదాలే తప్ప అసలు ఆ పదాలకు స్పష్టమైన మీనింగ్ కూడా తెలియని వాళ్లు ఆ పదాలతో మూవీని రుద్దడం ఏ మాత్రం నిజాయితీ లేని వారే చేసే పని.

నటన పరంగా

కిరణ్ అబ్బవరం తన పాత్రలో సహజంగా నటించాడు. ఆ పాత్రలోని వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం వాడుకున్నాడు. శ్రీ గౌరిప్రియ పాత్ర చాలా బావుంది. తనూ చాలా గొప్పగా నటించింది. కాకపోతే ఆ పాత్రలు చాలా తొందరగా ప్రేమలో పడటం పెద్ద మైనస్. ఆ ప్రేమకూ బలమైన పునాది కూడా లేదు. అజయ్ పాత్రలో త్రిగుణ్ బాగా చేశాడు. అతని ఫేస్ లో వయసు మీద పడిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్.

టెక్నికల్ గా

ఈ మూవీకి ప్రధాన బలం మణిశర్మ సంగీతం. అద్భుతమైన పాటలు, గొప్పగా అనిపించే నేపథ్య సంగీతంతో తనదైన మ్యాజిక్ ను మరోసారి క్రియేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా చాలా డ్రా బ్యాక్స్ ఉన్నాయి. డైలాగ్స్ బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు ఎవరు అనే కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. బట్ టైటిల్ లో చెప్పిన దాన్ని బట్టి రవి నంబూరి బాగా చేసే ప్రయత్నం చేశాడు. అతని మేకింగ్, టేకింగ్ బావున్నాయి. కథనం విషయంలో బలమైన కసరత్తులు చేయాల్సి ఉంది.

ఫైనల్ గా : ట్విస్ట్ తో సాగే రొటీన్ లవ్ స్టోరీ
రేటింగ్ : 2.5/5
– K.Y.R

Continue reading