వరుణ్ తేజ్ మిగతా మూవీస్ ను డామినేట్ చేస్తాడా.. తేలిపోతాడా..

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు

వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్. రీసెంట్ గా విడుదలైన కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో వరుణ్ తేజ్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే భావన చాలామందిలో ఉంది. ఈ నెల 7న కొరియన్ కనకరాజు విడుదలవుతోంది. అయితే అదే రోజు మరికొన్ని మూవీస్ విడుదల కాబోతున్నాయి. మరి ఈ మూవీస్ వల్ల కొరియన్ కనకరాజుకు ఇబ్బంది అవుతుందా లేక వాటిని దాటి నిలబడతాడా అంటే చెప్పలేం.

అనకాపల్లి మూవీ

ఇక ఈ నెల 7న కొరియన్ కనకరాజుతో పాటు రెండు తెలుగు మూవీస్ తో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో అనకాపల్లి(Anakapalle) ఉంది. అనకాపల్లిలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. త్రినాథరావు నక్కిన(Trinadharao Nakkina) కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తను ఓ కీలక పాత్ర చేశాడు. ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ప్రమోషన్స్ పరంగా ఇంకాస్త బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది.

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల హీరోలుగా

మరో తెలుగు మూవీ అంటే కే.జే. క్యూ ఉంది(KJQ – King Jackie Queen)ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల హీరోగా నటించిన మూవీ ఇది. శశితో పాటు దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) మరో హీరో. యుక్తి తరేజా(Yukthi Thareja) హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోందీ మూవీ. దర్శకుడు కె.కె ఈ మూవీ చివరి దశలో చనిపోయాడు. అతనికి అంకితం చేస్తున్నట్టుగా ప్రతి ప్రమోషన్ లో కూడా చెబుతోందీ మూవీ టీమ్.

లోకేష్ కనకరాజ్ హీరోగా సక్సెస్ అవుతాడా..

ఇక డబ్బింగ్ మూవీస్ లో అయితే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) హీరోగా మారిన మూవీ DC. డిసి అంటే దేవదాస్, చంద్ర అనే ఇద్దరి పేర్ల ఫస్ట్ లెటర్స్. చంద్రగా వామికా గబ్బి(Wamiqa Gabbi) నటిస్తోంది. ఈ ఇద్దరి మీద మూవీ మొత్తం ఉండబోతోంది అనిపించేలా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. లోకేష్ కనకరాజ్ స్టైల్లోనే ఊర మాస్ యాక్షన్ కథగా ఉండబోతోందీ మూవీ. కాకపోతే తెలుగులో పెద్దగా పట్టించుకోవడం లేదీ మూవీని.
ఇక ఆర్ మాధవన్(R.Madhavan) నటించిన మరో తమిళ్ మూవీ ‘జి.డి. నాయుడు’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ ఇది. అయితే తెలుగులో మాత్రం మినిమం ప్రమోషన్స్ కూడా లేవు ఈ చిత్రానికి. కాకపోతే ట్రైలర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

ఎవరిది పై చేయి

మొత్తంగా ఈ నాలుగు సినిమాలతో ఈ వారం మొత్తం ఆక్యూపై అయింది. మరి ఈ నాలుగింటిలో కొరియన్ కనకరాజు డామినేషన్ మాత్రం స్పష్టంగా ఉంది. కాకపోతే కంటెంట్ లో దమ్ముంటే మిగతా మూవీస్ పై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఏదేమైనా ఈ నాలుగింటిలో ఏ మూవీ ది బెస్ట్ అనిపించుకుంటుందో అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Continue reading
బిజెపికి గట్టి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు

బిజెపికి షాక్

తాజాగా వెలువడిన మూడు బైపోల్స్ ఫలితాలు చూస్తుంటే.. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న పెద్దలకు, ఇక్కడ కూటమి సర్కార్ నడుపుతున్నోళ్లకు చెమటలు పట్టడం ఖాయం. ఇవి ఎవరో సాధారణ సీట్లు కావు, బీజేపీకి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోట్లు. అలాంటి చోట్లోనే ఓటర్లు దిమ్మతిరిగేలా రిజల్ట్స్ ఇస్తే, కమలనాథులతో పాటు కూటమి భాగస్వాములకు కూడా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా.

గుజరాత్ గుండెల్లో రైల్లు

బీహార్‌లోని బంకీపూర్‌లో బీజేపీ ఓటు షేర్ ఏకంగా ఇరవై మూడు శాతం గాలిలో కలిసిపోయింది. ఇక మోదీ, షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని మంజల్పూర్‌లో సీటు గెలిచినా పండగ చేసుకునే సీన్ లేదు. గతంలో లక్షకు పైగా ఉన్న భారీ మెజారిటీ ఈసారి కేవలం ముప్పై వేలకు పడిపోయింది, ఓటు షేర్ కూడా పాతిక శాతం హాంఫట్ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని దాతియాలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకొని రూట్ క్లియర్ చేసుకుంది.

పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా కూటమి ప్రభుత్వాల నడుపుతున్నప్పుడు ఈ రేంజ్ వ్యతిరేకత వస్తే.. పక్కన ఉన్న మిత్రపక్షాలు సైలెంట్‌గా ఎందుకు కంగారు పడుతున్నాయో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. “మా మాస్‌ పవర్‌ ముందు ఎవరైనా సరే” అనుకున్న అహంకారానికి నేటి ఓటర్లు ఈ ఫలితాలతో గట్టిగానే సమాధానం చెప్పారు. కంచుకోటల గోడలు ఎంత బలమైనా, ప్రజా వ్యతిరేకత పునాదుల్ని కదిలిస్తుందనడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం, మిత్రులకు సైతం నిద్రలేకుండా కావడం ఖాయం.

Continue reading
ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం.. బీజేపీ కంచుకోట బాంకీపూర్‌లో చరిత్ర సృష్టించిన జన్ సురాజ్

ప్రశాంత్ కిశోర్ విజయం

ప్రశాంత్ కిశోర్ అంటే మామూలుగా ఎన్నికల వ్యూహకర్తగానే చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకు ముందే ప్రశాంత్ కిశోర్ ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. తర్వాతే ఎన్నికల వ్యూహకర్తగా మారాడు. ప్రస్తుతం బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించాడు. విశేషం ఏంటంటే.. ఇదే నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గతంలో గెలుస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా నితిన్ నబీన్ గెలిచాడు. కానీ అతను పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడంతో పాటు రాజ్యసభకు వెళ్లడంతో ఇదే అసెంబ్లీకి ఉప ఎన్నికలు తప్పలేదు. ఈ ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ ఏకంగా 18వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందాడు.

ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్త

ప్రశాంత్ కిశోర్ కి రాజకీయ వ్యూహర్తగా తిరుగులేని గుర్తింపు ఉంది. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశాడు. అక్కడ పార్టీ గెలిచింది. తర్వాత 2014లో బిజెపి పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మార్మోగిపోయింది. 2019 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకు రావడంలో అత్యంత కృషి చేశాడు. ఆపైన మరికొన్ని రాష్ట్రాల్లో తను పనిచేసినా ఆయా రాష్ట్రాల్లో అతను సపోర్ట్ చేసిన పార్టీలు ఓడిపోయాయి. దీంతో ఇకపై తను వ్యూహకర్తగా ఉండనని తేల్చాడు.

ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపన

ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న సొంతంగా పార్టీ స్థాపించాడు. దానికి జన్ సురాజ్ పార్టీ అని పేరు పెట్టాడు. 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లోని 243 స్థానాలుండగా 238 సీట్లలో పోటీ చేశాడు. కానీ తను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ దారుణంగా పరాజయం పాలయ్యాడు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో దాదాపు 30యేళ్లుగా బిజెపి పార్టీయే జెండా ఎగరేస్తున్న బాంకీపూర్ నుంచి ఘన విజయం సాధించాడు.

బిజెపికి శరాఘాతం

ప్రశాంత్ కిశోర్ విజయం తర్వాత ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకముంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది బిజెపికి శరాఘాతం అని చెప్పొచ్చు. బిజెపికి బాంకీపూర్లో తిరుగులేని స్థానంగా ఉంది. అలాంటి ప్లేస్ ల ఓటమి పాలు కావడం ప్రశాంత్ కిశోర్ విజయంగానే చెప్పాలి. రాబోయే రోజుల్లో బిజెపికి మరింత గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఈ పరాజయం తర్వాత చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు.

బిజెపి ఎత్తుగడలో భాగమే

ప్రశాంత్ కిశోర్ విజయం కేవలం బిజెపి ఎత్తుగడలో భాగమే అని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపించిన తర్వాత గెలిచిన తొలి స్థానం ఇది. మరి భవిష్యత్ లో అతను రాజకీయంగా నిలదొక్కుకుంటాడా.. జాతీయ స్థాయిలో కూడా తన పార్టీని కీలకంగా ఉంచుతాడా అనేది కాలమే చెబుతుంది.

 

 

Continue reading
రవితేజ కెరీర్ లో ఇరుముడి స్పెషల్ మూవీగా నిలుస్తుందా..

రవితేజ ఇరుముడి పాట

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఈ నెల 21న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీపై ముందు నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వస్తున్నాడు అనిపించేలా ఉంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా బేబీ నక్షత్ర కీలకమైన పాత్రలో నటించారీ చిత్రంలో.

రవితేజ పాట బావుంది

రవితేజ ఇరుముడి నుంచి తాజాగా మరో పాట విడుదల చేశారు. ఫస్ట్ సాంగ్ అయితే అయ్యప్ప మాలలో రవితేజ చేసిన హడావిడీగా సాగే గీతంగా ఉంది. అయితే ఈ పాట అందుకు భిన్నంగా ఉంది. రవితేజ ఓ ఆటో డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ‘యాలాలో యాలాలో ఎన్నెట్లో ఎన్ని ముచ్చటలో.. ’అంటూ సాగే ఈ పాటలో పల్లవిలోనే ‘అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం’ అంటూ వినిపించిన పదాలు చాలా చాలా బావున్నాయి.

రవితేజ తాగుబోతు పాత్రలో

ఇక పాటలో వచ్చే సన్నివేశాలు చూస్తుంటేనే ఈ చిత్రంలో రవితేజ పాత్ర చాలా వరకు దిగువ మధ్యతరగతి వాడిగా కనిపిస్తాడు అని తెలుస్తుంది. దీనికి తోడు భార్యకు తెలియకుండా పొద్దు పొద్దునే మందు తాగడం మొదలు పెడతాడు రవితేజ. చూస్తుంటే తాగుబోతులంతా ఇలా అయ్యప్ప మాలలు వేసుకుంటారు అనిపించేలా ఉన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి

ఏదేమైనా రవితేజ కెరీర్ లో ఇదో స్పెషల్ మూవీ అవుతుందా అంటే అవుననే చెప్పాలేమో అనేలా ఉంది. శివ నిర్వాణ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా రాసుకుంటాడు. వాటిని ప్రెజెంట్ చేసే విధం కూడా చాలా బావుంటుంది. మరి ఇలా దిగువ మధ్యతరగతి హీరోతో ఇలాంటి సెంటిమెంట్స్ ను రంగరించడం మాత్రం మరో స్థాయిలో ఉండబోతోంది అనిపించేలా ఉంది.
ఇక జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనంత శ్రీరామ్ రాశాడు. హేషమ్ అబ్దుల్లా వాహబ్ ఈ పాటను పాడటం విశేషం. అతనితో పాటు సాధిక కే.ఆర్ పాడింది.

Continue reading
కామాక్షి భాస్కర్ల అగధ మూవీ ట్రైలర్ రిలీజ్

కామాక్షి భాస్కర్ల అగధ మూవీ

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన మూవీ అగధ. అగధీ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ రాజు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ ఫిక్షన్ కంటెంట్ తో రూపొందిన సినిమా ఇది. మాయలు, మంత్రాలు, మంచిపై చెడు వారి పోరాటం వల్ల సాగే కథలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
అగధ లాంటి కథలు మనకు ఇప్పటి వరకు రాలేదు అని కాదు.. కానీ ఈ మూవీ విషయంలో కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా కనిపిస్తోంది. సినిమా అంతా తన చుట్టూనే సాగుతుంది అనిపించేలా ఉంది. కామాక్షి భాస్కర్ల కూడా మంత్రగత్తెగా కనిపిస్తోంది. అయితే తను కేవలం మంచి కోసమే తన మంత్రాలు ఉపయోగిస్తుంది. దానికి భిన్నంగా దుష్టమైన మంత్రగాళ్లు కూడా ఉంటారు. మరి వారిపై కామాక్షి భాస్కర్ల పోరాటం ఎలా ఉంది అనేది ప్రధానంగా ఉండబోతోందీ మూవీలో.

చెడుపై మంచి చేసే యుద్ధం

అగధ ట్రైలర్ చూస్తే ఓ గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. మహిమ అనే పేరున్న ఆమె ఆత్మహత్య వెనక ఉన్న రహస్యం ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న మహిమ ఆత్మగా మారుతుంది. మరి తను ఎందుకు ఆత్మగా ఎందుకు మారింది అనేది మరో కోణంలో ఉంటుంది. అయితే అగధకు ఈమె ఆత్మహత్యకు ఉన్న సంబంధం ఏంటీ అనేది మరో కోణం. ‘నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలుంటే.. నా చుట్టూ మంచి చేసే పంచ భూతాలున్నాయి’అనే డైలాగ్ చాలా బావుంది.

ఎమ్.ఎస్.రాజుకు హిట్ పడుతుందా..?

మరి ఆ చెడు భూతాలను కామాక్షి భాస్కర్ల ఎలా ఎదుర్కొంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించేలా ఉంది. అయితే ఈ ట్రైలర్ మాత్రం టీజర్ లా అంత ఎఫెక్టివ్ గా లేదు. అలాగని ట్రైలర్ చూడగానే కంటెంట్ పై జడ్జిమెంట్ చేయడం సరైంది కాదు. అందుకే మూవీ విడుదలైతే కానీ ఓ క్లారిటీ రాదు.
ఏదేమైనా ఈ మూవీతో ఎమ్.ఎస్.రాజు ఓ పెద్ద హిట్ కొట్టాలనే ప్రయత్నం మాత్రం కనిపిస్తోంది. ఈ తరహా కొత్తదనం ఉన్న కథలతో ఆకట్టుకునే కామాక్షి భాస్కర్లకు కూడా ఈ మూవీ మంచి విజయం ఇచ్చేలా ఉంది. మరి ఈ నెల 14న విడుదల కాబోతోన్న అగధ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్ విడుదల

నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి

నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఎలియాస్ రుక్మిణి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ హీరోగా కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. తను అనుకున్న ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. ఓ దశలో చాలామంది ఇక నితిన్ హీరోగా తప్పుకుంటే బావుంటుందని కూడా కామెంట్స్ చేశారు. అన్నీ మైండ్ లోకి తీసుకున్నాడు నితిన్. కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాతే ఈ ఎలియాస్ రుక్మిణితో వస్తున్నాడు.
విశేషం ఏంటంటే ఎలియాస్ రుక్మిణికి హీరో నాని ప్రెజెంటర్. అంటే నాని గతంలోనే మురళీకాంత్ తో చర్చలు నడిపించాడు. దీంతో మురళీకాంత్ తో డైరెక్షన్ లోనే నాని నటించబోతున్నాడు అని చాలామంది భావించారు. బట్ ఫైనల్ గా ఆ ప్లేస్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. మరి దీనికి నానియే కారణమా లేక మురళీకాంత్ డెసిషనా అనేది తెలియాల్సి ఉంది.

నితిన్ ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్

ఇక గ్లింప్స్ చూస్తే.. నాని ఈ కథ గురించి తెలుకోవాలని దర్శకుడు మురళీకాంత్ ను అడుగినట్టుగా చూపించారు. ‘హాయ్ మురళీ.. దేని గురించి ఈ కథ అని నాని అడిగితే.. దానికి ఈ కథ కృష్ణ గురించి అన్నా’అంటాడు మురళీ. కృష్ణ ఓ నవలా రచయితగా చూపించారు. కట్ చేస్తే అతని ఊహల నుంచి కొన్ని నవలలు వస్తాయి అని చూపించారు. అందులో భాగంగా మొదటి నవల గరం గోపాల్ అని ఉంటుంది. అలాగే ఓ లెస్బియన్ నవలగా ఆమెకు ఆమె అంటే ఇష్టం అనేలా మరోటి ఉంటుంది. మూడోదిగా వ్రతం వెంకన్న అనే నవల రాసినట్టుగా ఉంటుంది. అంటే భార్య కోరికలను తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి నవలగా ఇది కనిపిస్తోంది అనేలా ఉంది.

రచయితగా నితిన్

ఇవన్నీ చూసిన తర్వాత నాని వెంటనే అడుగుతాడు.. మరి ఈ రుక్మిణి అని. దానికి వీడియోలో నితిన్ చెబుతున్నట్టుగా ‘నా వైఫ్’అంటాడు. మరి ఆ భార్య ఎవరు.. అతనికి రచయితగా తను ఎంత ఇన్సిస్పిరేషన్ గా నిలుస్తుంది.. అసలు నిజంగా ఆమె ఉంటుందా లేదా అనేది తెలియాల్సిన కథ అని అర్థమవుతుంది.
దీప్తి గంటా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సింగీతం అందించబోతున్నాడు. ఏదేమైనా నితిన్ కు ఈ మూవీ అత్యంత కీలకం అనేది మాత్రం వాస్తవం. మరి ఆ వాస్తవాన్ని నిలబెట్టుకునేలా ఎలియాస్ రుక్మిణి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
రష్మిక మందన్నా డ్యాన్స్ చిత్రీకరణలో గాయపడింది

రష్మిక మందన్నాకు గాయాలు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటీ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా తాజాగా ఒక సినిమా పాట చిత్రీకరణ సందర్భంగా ఆమెకు గాయాలు అయ్యాయి. ఒక రకంగా ఇది తీవ్ర గాయమే చెబుతున్నారు. ప్రస్తుతం తను మైసా, రణబాలి మూవీస్ షూటింగ్ చేస్తుండగా ఈ గాయం అయిందా లేక మరేదైనా చిత్రీకరణలో అయిందా అనేది తెలియాల్సి ఉంది.

గతంలోనూ రష్మిక కాలికి ఫ్రాక్చర్స్

ఓ రకంగా రష్మిక మందన్నా గతంలో సికందర్ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా గాయపడింది. అయితే ఇది మూవీ షూటింగ్ టైమ్ లో కాదు. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కాలు బెణికింది. డాక్టర్స్ పరీక్షించారు. దీంతో కాలికి ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయని తేలింది. దీంతో కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఆ టైమ్ లో మరో మూవీ ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా పాల్గొంది. అంతే తను ఎంత డెడికేటెడ్ అనేది అందరికీ తెలిసింది.

ఆరు వారాలు విశ్రాంతి

ఇక తాజాగా అయినా గాయం సాధారణంగా టాప్ అథ్లెట్స్ కు మాత్రమే అవుతుందట. అలాంటిది ఓ సాధారణ హీరోయిన్ కు ఇలాంటి గాయం కావడం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు అయితే తనకు ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం అని ఖచ్చితంగా చెప్పారు.

రష్మిక మందన్నా మూవీస్ షెడ్యూల్స్ లో మార్పులు

మరి ఈ కారణంగా తను చేస్తోన్న మూవీస్ షెడ్యూల్స్ కూడా మారిపోతాయి. దీని వల్ల ఆ మూవీస్ రిలీజ్ డేట్స్ లో కూడా మార్పులు రావడం జరుగుతుంది. ఏదేమైనా రష్మిక మందన్నా త్వరగా కోలుకోవాలి. వీలైనంత వేగంగా మళ్లీ జోష్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని గారడి డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Continue reading
శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ : ప్లస్ లు మైనస్ లు ఎలా ఉన్నాయి..?

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

ఆర్టిస్ట్స్ : ఘట్టమనేని జై కృష్ణ, రషా టండానీ, మోహన్ బాబు, వికే నరేష్, బ్రహ్మాజీ, శ్యామ్, అజయ్ తదితరులు
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి
ప్రెజెంటర్ : అశ్వనీదత్
నిర్మాత : జెమినీ కిరణ్
దర్శకత్వం : అజయ్ భూపతి

టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే కాస్త హడావిడీ ఉంటుంది. అలాంటిదేం లేకుండా శ్రీనివాస మంగాపురం మూవీతో ఘట్టమనేని జై కృష్ణను పరిచయం చేశారు. మహేష్ బాబు లాంటి స్టార్ అన్న కొడుకుగా వచ్చినా జై కృష్ణకు ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం కాస్త విచిత్రమే అయినా.. జై కృష్ణ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అతని దర్శకత్వంలో జై కృష్ణను పరిచయం చేయాలనుకున్నారు. అంటే మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో పేరు మోసిన రాజకీయ నాయకుడు. అతని కూతురు మంగ(రషా టండాని). థియేటర్స్ చదువుతుంటుంది. వేరే ఊరి నుంచి తిరుపతికి వచ్చిన కుర్రాడు శ్రీను(జై కృష్ణ). అతను తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. మంగ కూడా అది కేవలం స్నేహమే అనుకుంటుంది. మంగకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అవుతుంది. తర్వాత శ్రీను తన ప్రేమను చెబుతాడు. ఆమె తాళికట్టే చివరి క్షణం కోసం వరకు తను వెయిట్ చేస్తా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమె మాత్రం అతన్ని లైట్ తీసుకుంటుంది.

పెద్ది రెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి). ఆమె బల్లారిలో ఉంటుంది. మేనకోడలి పెళ్లికి వస్తుంది. అక్కడ ఫోటోస్ లో శ్రీను కూడా కనిపిస్తాడు. కట్ చేస్తే ఆమె అతని వద్దకు వెళుతుంది. తన మేన కోడలిని వదిలేయమని చెబుతుంది. కానీ శ్రీను తను తిరుపతి వచ్చిందే మంగ కోసం. మంగ లేకుండా తను బ్రతకలేను అని చెబుతాడు. మరి ఈ వ్వవహారం వెనక ఉన్న కథేంటీ..? వాసు బాబు ఎవరు..? వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కు వాసుబాబుకు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు శ్రీనుకు మంగతో ముందే పరిచయం ఉందా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఈ లోగా కొందరు విలన్స్ ఎంటర్ అవుతారు. వారి నుంచి దాటుకునే ప్రయత్నంలో ఈ ఇద్దరి సమస్యలు క్లియర్ అవుతాయి. ఇదే కథ. ఇలాంటి కథలు తెలుగు తెర ఇప్పటికి వేలల్లో చూసింది. అలాంటిదే శ్రీనివాస మంగాపురం మూవీ. బట్ ఇందులో కొత్తదనం అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఏ మాత్రం ఆకట్టుకోలేని కథనంలో కావాల్సినంత బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాదా సీదాగా సాగుతుంది. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఈ కాలాని తగ్గట్టుగా బలమైన కథనం ఉంటే బావుంటుంది. ఈ మూవీలో అదే ప్రధానమైన లోపం.

ఫస్ట్ హాఫ్ ఒకలా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కాస్త బావుంది. ఇందులోని ట్విస్ట్ కారణంగానే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అది చాలా కీలకమైనప్పుడు అది అద్భుతం అనిపించాలి. అలా లేకపోవడం ఫస్ట్ హాఫ్ తేలిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం నిజంగానే బావుంటుంది. అయితే ఇదేమీ కొత్తదేం కాదు. అయినా ఓకే అనిపిస్తుంది. ఓ రకంగా పడిపడి లేచె మనసులోని ట్విస్ట్ నే వీళ్లు మళ్లీ రిపీట్ చేశారు. ఆ మూవీ కూడా పోయింది. కానీ అంత ఇంపాక్ట్ కూడా శ్రీనివాస మంగాపురంలో లేదు. అదే పెద్ద మైనస్.

జై కృష్ణ నటుడుగా ఇంకా సానబెట్టబడాలి. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. ఎక్స్ ప్రెషన్స్ మరీ తేలిపోలేదు కానీ చాలా చోట్ల సరిగ్గా పెట్టలేకపోయాడు. జై కృష్ణను ఇలాంటి కథతో పరిచయం చేయాలనుకోవడమే పెద్ద లోపం. అయితే అతనిలోని మాస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం దురదృష్టం. రషా టండానీ నటన కూడా ఏమంత బాలేదు.

మోహన్ బాబు పాత్రను సెకండ్ హాఫ్ లో చూపించారు. అది స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది కానీ వీక్ గానే సాగింది. ఉన్నంతలో శ్యామ్ పాత్ర బావుంది. అలాగే నువ్వు నాకు నచ్చావులో సుహాసిని లాంటి పాత్రతో వాసుకి ఓకే అనిపించుకుంది. నరేష్ పాత్ర బావుంది. అద్భుతంగా నటించాడు. కానీ ఆ పాత్ర వల్ల సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేదు. బ్రహ్మాజీ కూడా ప్యాడింగ్ యాక్టర్ గానే కనిపించాడు. ఇతర పాత్రలన్నీ చాలా రొటీన్ వే.

టెక్నికల్ గా

జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అదరగొట్టాడు. వీక్ సీన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించాడు. ఈ కథలాగే పాటలు కూడా 90ల కాలం నాటివిగా కనిపించాయి. బట్ సాహిత్యం పరంగా పాటలన్నీ బావున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

దర్శకుడుగా అజయ్ భూపతి తీసుకున్న కథలో కొత్తదనం అస్సలు లేదు. కథనం పరంగా ఏదైనా మ్యాజిక్ లు చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. కానీ అతను స్లో నెరేషన్ తో బాగా ఇబ్బంది పెట్టాడు. ఓ రకంగా అజయ్ భూపతి కూడా ఇంకా 90స్ లోనే ఆగిపోయాడు. బట్ ఆ టైమ్ లో వచ్చినా ఇంత స్లో నెరేషన్ అంటే అప్పుడు కూడా వర్కవుట్ కాకపోయి ఉండేది.

ఫైనల్ గా : బ్యాడ్ డెబ్యూ బై జై కృష్ణ
రేటింగ్ : 2/5
K.Y.R

Continue reading
జీ5 బిగ్ అనౌన్స్‌మెంట్.. NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ ఓటీటీలో

జీ5 బిగ్ సర్‌ప్రైజ్.. తెలుగు ప్రేక్షకులకు భారీ ట్రీట్

OTT ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్, రీజినల్ కంటెంట్… ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి ప్లాట్‌ఫామ్ కొత్త వ్యూహాలతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ZEE5 తన ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ప్రకటనలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే… NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ వంటి క్రేజీ సినిమాలు ZEE5 డిజిటల్ లైనప్‌లో చోటు దక్కించుకోవడం. తెలుగు ప్రేక్షకులకు ZEE5 నుంచి భారీ గిఫ్ట్. ఈసారి ZEE5 కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథలు, యానిమేషన్, పిల్లల కోసం ప్రత్యేక కంటెంట్‌తో ఏడు భారతీయ భాషల్లో భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

తెలుగు విభాగంలో ప్రకటించిన ప్రాజెక్టులు…

NBK111
వెంకీ అనీల్ 5
వృషకర్మ
శ్రీమతి (నివేదా థామస్)
Objection My Lord (శ్రీకాంత్)
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కొత్త సీజన్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK111 ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమా ZEE5 డిజిటల్ లైనప్‌లో భాగమవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే, స్ట్రీమింగ్ తేదీ లేదా డిజిటల్ విడుదలపై ZEE5 ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

వెంకటేష్ – అనీల్ రావిపూడి కాంబో

వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వారి కొత్త చిత్రం Venky Anil 5 కూడా ZEE5 లైనప్‌లో ఉండటం ఈ ప్రకటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా థియేట్రికల్ విడుదల అనంతరం ZEE5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఈ ప్రకటనతో స్పష్టమైంది. అయితే స్ట్రీమింగ్ సమయం తర్వాత ప్రకటించనున్నారు.
నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ కూడా ఈ లైనప్‌లో భాగమైంది. ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు డిజిటల్ భాగస్వామిగా ZEE5 పేరు రావడంతో మూవీపై మరింత హైప్ పెరిగింది.

సినిమాలతో పాటు ఒరిజినల్స్‌కు పెద్దపీట

తెలుగు ప్రేక్షకుల కోసం ZEE5 ప్రత్యేకంగా రెండు కొత్త ఒరిజినల్స్‌ను కూడా తీసుకొస్తోంది.

శ్రీమతి
Objection My Lord

ఇవే కాకుండా గతంలో మంచి ఆదరణ పొందిన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోను కూడా కొత్త సీజన్‌తో తిరిగి తీసుకురానుంది.

ZEE5 వ్యూహం ఏమిటి?

ప్రస్తుతం OTT మార్కెట్‌లో కేవలం హిందీ కంటెంట్‌తో ముందుకు వెళ్లడం కష్టమవుతోంది. అందుకే ZEE5 “Language First” విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్థానిక ప్రేక్షకులకు దగ్గరయ్యే కథలపై దృష్టి పెట్టింది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాలు కూడా ప్రకటించింది.

గారడీ విశ్లేషణ

ఇటీవల తెలుగు సినిమాల డిజిటల్ హక్కుల కోసం OTTల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. అలాంటి సమయంలో NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ వంటి మూడు భారీ సినిమాలను ఒకేసారి తన లైనప్‌లో చూపించడం ద్వారా ZEE5 తెలుగు మార్కెట్‌పై తన ఫోకస్‌ను స్పష్టంగా చాటింది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రకటన డిజిటల్ లైనప్‌కు సంబంధించినది మాత్రమే. విడుదల తేదీలు, స్ట్రీమింగ్ షెడ్యూల్ లేదా ఇతర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి వాటి కోసం సంబంధిత చిత్రబృందాలు లేదా ZEE5 నుంచి వచ్చే తదుపరి ప్రకటనల కోసం వేచి చూడాల్సిందే.

Continue reading
విజయ్ దేవరకొండ: పదేళ్ల సినీ ప్రయాణం… విజయాలూ, వైఫల్యాలు

విజయ్ దేవరకొండ పదేళ్ల ప్రస్థానం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి కొన్నేళ్లకు ఒక కొత్త స్టార్ వస్తుంటాడు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ స్టైల్, యాటిట్యూడ్, సినిమాల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

చిన్న పాత్రలతో ప్రారంభమైన అతని ప్రయాణం, స్టార్ హీరోగా ఎదగడం, వరుస విజయాలు, అనూహ్యమైన పరాజయాలు, మళ్లీ తిరిగి నిలబడేందుకు చేసిన ప్రయత్నాలు… ఇలా విజయ్ కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఈ పదేళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

చిన్న పాత్రల నుంచి హీరో వరకు

విజయ్ దేవరకొండ మొదట నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని స్నేహితుడి పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ సినిమా అతనికి మంచి అవకాశాల తలుపులు తెరిచింది.

‘పెళ్లిచూపులు’తో మొదలైన స్టార్ జర్నీ

2016లో వచ్చిన పెళ్లిచూపులు విజయ్ జీవితాన్నే మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, మంచి కథతో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక సాధారణ అబ్బాయి పాత్రలో విజయ్ చాలా సహజంగా నటించాడు. అప్పటివరకు “కొత్త హీరో”గా ఉన్న విజయ్, ఈ సినిమాతో “భవిష్యత్ స్టార్”గా మారిపోయాడు.

2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం విజయ్ నటనకు ఫిదా అయ్యారు. కోపం, ప్రేమ, బాధ, ఆవేశం… ప్రతి భావాన్ని సహజంగా చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. “రౌడీ” అనే ఇమేజ్ కూడా అప్పుడే బలపడింది.

ఒకే ఏడాదిలో మూడు హిట్లు

మహానటిలో చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర
గీత గోవిందం భారీ బ్లాక్‌బస్టర్
టాక్సీవాలా మరో సూపర్ హిట్

ప్రత్యేకంగా గీత గోవిందం విజయ్‌లోని మరో కోణాన్ని చూపించింది. అర్జున్ రెడ్డిలో కనిపించిన కోపిష్టి యువకుడికి పూర్తి భిన్నంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పాత్రలో విజయ్ మెప్పించాడు.

భారీ అంచనాలు… ఆశించిన ఫలితం కాదు

ఈ విజయాల తర్వాత విజయ్ చేసిన డియర్ కామ్రేడ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో నటనకు ప్రశంసలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా నిరాశపరిచింది. ఇక్కడి నుంచే విజయ్ స్క్రిప్ట్ ఎంపికపై చర్చ మొదలైంది.

‘లైగర్’… కెరీర్‌లో అతిపెద్ద షాక్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ విజయ్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్. కానీ సినిమా విడుదల తర్వాత తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

‘ఖుషి’తో కొంత ఊరట

లైగర్ తర్వాత వచ్చిన ఖుషి విజయ్‌కు కొంత ఊరటనిచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. పూర్తిస్థాయి కమ్‌బ్యాక్ కాకపోయినా, అభిమానుల్లో మళ్లీ ఆశలు పెంచింది.

విజయ్ బలం ఏమిటి?

విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా నిలబెట్టేది అతని నటన మాత్రమే కాదు.
స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ
సహజమైన డైలాగ్ డెలివరీ
కొత్త తరానికి దగ్గరగా ఉండే బాడీ లాంగ్వేజ్
యువతను ఆకట్టుకునే స్టైల్
ఇవన్నీ అతని ప్రత్యేకతలు.

బలహీనత ఏమిటి?

విజయ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత అదే తరహా ఇంటెన్స్ పాత్రల వైపు ఎక్కువగా వెళ్లడం, సరైన కథల ఎంపికలో కొన్ని తప్పులు చేయడం అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. ప్రేక్షకులు ప్రతి సినిమాలో కొత్త విజయ్‌ను చూడాలని కోరుకుంటారు. అదే అతనికి పెద్ద సవాలు.

గారడీ విశ్లేషణ

విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఒక మాటలో చెప్పాలంటే… “వేగంగా ఎదిగిన స్టార్, కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడేందుకు ప్రయత్నిస్తున్న నటుడు.”

Continue reading