ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రివ్యూ

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్‌ను చూస్తే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలిసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం జయకృష్ణతో పాటు రాశా తడానీకి కూడా తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.
ట్రైలర్ ప్రారంభం నుంచే గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రేమ కథతో మొదలైన కథనం, ఆ తర్వాత యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడం ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు అజయ్ భూపతి తనకు అలవాటైన స్టైల్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.
డెబ్యూ హీరో అయినప్పటికీ జయకృష్ణ స్క్రీన్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. యాక్షన్ షాట్స్‌లో మంచి ఎనర్జీ కనిపించగా, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తనవంతు ప్రయత్నం చేశాడు. ఇంకా సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయి నటనపై స్పష్టత వస్తుంది. అయితే ట్రైలర్ మాత్రం హీరోపై మంచి అంచనాలను పెంచింది.
సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచింది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలకు బాగా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. జయకృష్ణకు హీరోగా మంచి లాంచ్ ఇవ్వగలిగే అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ ఇచ్చిన హైప్‌ను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు.

 

Continue reading
శ్రీనివాస మంగాపురం వాయిదా వేశారుగా

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది. జయకృష్ణ ఫస్ట్ మూవీ కావడంతో పాటు ఇలాంటి నెపోకిడ్స్ ను ఫస్ట్ టైమ్ పరిచయం చేసిన నిర్మాత ప్రెజెంటర్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. అదీ కాక ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోస్ అన్నీ బాగా పేలాయి. దీంతో ఈ మూవీ గ్యారెంటీగా విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు.
మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా ఇది ఉండబోతోందని మొదటే చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఏకంగా 1కోటి రూపాయలు ఇచ్చారు అనే ప్రచారం కూడా సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ కూడా ఉండటంతో శ్రీనివాస మంగాపురంను వాయిదా వేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అనేలా తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ అంటే ఇదే నెల 30న ఉండబోతోంది. అదీ కాక అదే రోజు మహేష్ బాబు హీరోగా ఫస్ట్ మూవీ రాజకుమారుడు విడుదలైన రోజు కూడా అదే. దీంతో ఇది కూడా కలిసొస్తుందని భావించారేమో.. ఈ నెల 30 శ్రీనివాస మంగాపురం విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.

Continue reading
శ్రీనివాస మంగాపురం పోస్ట్ పోన్ అవుతోందా..?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు, మహేష్ బాబు అన్న కొడుకు అంటూ చాలా ట్యాగ్స్ తో ఉన్న హీరో జయకృష్ణ. అతను హీరోగా పరిచయం అవుతోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ ఇద్దరి జంటకు మంచి అప్లాజ్ వస్తోంది. జయకృష్ణ ఇండస్ట్రీలోకి రావడం కోసం చాలా కసరత్తులు చేశాడు. తన తండ్రి సాధించలేకపోయిన విజయాన్ని తను సాధించాలని తాపత్రయ పడుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారంతో మంచి హిట్స్ అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆల్రెడీ ఈ మూవీ ఆడియోకు మంచి అప్లాజ్ వస్తోంది.పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని జూలై 9న విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. అయితే అదే టైమ్ కు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ కూడా విడుదల కాబోతోంది. దీంతో వీరు తమ శ్రీనివాస మంగాపురం సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త డేట్ గా ఇదే అని ఫిక్స్ చేయలేదు కానీ.. జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. మొత్తంగా హీరోగా ఫస్ట్ మూవీ అంటే ఇలాగే చేయాలి. కానీ వీళ్లు మొదటి నిర్ణయాన్ని వాయిదా వేయడం ఏమంత బాలేదు అని అభిమానులు భావించినా.. అఖిల్ తో పోటీ ఎందుకునే అని వీళ్లు అలా ఫిక్స్ అయ్యారు. బట్ మూవీ ఎప్పుడు విడుదలైన మంచి విజయం సాధించడం ఖాయం అనేది వీరి కాన్ఫిడెన్స్ మాత్రం చూడముచ్చటగా ఉంది.

Continue reading