సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్ర‌భు

సమంత రూట్ మార్చింది

-ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్‌లో స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండ‌టం విశేషం.

సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్‌.. ఈ మూడు ప్రపంచాలను ఒకే ద‌గ్గ‌ర‌కి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ రూపొందుతోంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్‌లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన‌ సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్‌లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు.

నిర్మాతగా బనిజె ఏషియా

బనిజె ఏషియా నిర్మిస్తోన్న‌ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. అయితే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్స్‌, ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు, తమిళ సెలబ్రిటీ కల్చర్‌లోని ప్రత్యేకమైన కెమిస్ట్రీకి ప్రాధాన్యతనిస్తూ ఈ షోను రూపొందిస్తున్నారు.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ సోనీ విళాలో కీలకమైన ఎంటర్‌టైన్‌మెంట్ షోగా నిలవనుంది. అలాగే ఈ షో సోనీ లివ్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి రానుంది. మెయిన్ ఎపిసోడ్స్‌కు మించి ప్రేక్షకులను మరింత ఎంగేజ్ చేసేలా ప్రత్యేకమైన షార్ట్ ఫార్మ్ కంటెంట్‌ను కూడా అందించనున్నారు. సెలబ్రిటీల కుకింగ్ జర్నీ, వారు ఎదుర్కొనే ఛాలెంజెస్, కిచెన్‌లో చోటుచేసుకునే ఆసక్తికరమైన, మరిచిపోలేని మూమెంట్స్‌ను ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు.

సమంత మాట్లాడుతూ..

“ఈ షోలో పాల్గొంటుండ‌టం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉంది. నేను ఇప్పటివరకు చేసిన వాటన్నింటికంటే ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఈ షోకు నేను నో చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం. అంద‌రినీ ఒకేచోటికి తీసుకురావడంలో, మధురమైన జ్ఞాపకాలను సృష్టించడంలో, సాధారణంగా కెమెరాల ముందు కనిపించని మనలోని మరో కోణాన్ని బయటపెట్టడంలో ఫుడ్‌కు ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది. ముఖ్యంగా మనకు ఎంతో ఇష్టమైన తమిళ సెలబ్రిటీలు కిచెన్‌లోకి అడుగుపెట్టి, రిస్క్‌లు తీసుకోవడం, తప్పులు చేయడం, తమను తామే సర్‌ప్రైజ్ చేసుకోవడం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాషన్‌తో పోటీప‌డ‌టాన్ని చూడ‌టానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎవరు కిచెన్‌లో వంట చేయబోతున్నారో ఇప్పుడే చెప్పాలని నాకూ ఉంది.. కానీ అలా చెబితే అసలు ఫన్ ఏముంటుంది? సోనీ విళాతో కలిసి మేం ఏం వండబోతున్నామో అందరూ చూసి ఎంజాయ్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.

సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తూ..తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కిచెన్‌లోకి అడుగుపెట్టనున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. సెలబ్రిటీ కుకింగ్‌కు సరికొత్త వినోదాన్ని తీసుకురానుంది. ఫుడ్, ఫేమ్, కాంపిటీషన్‌తో పాటు తమిళ సంస్కృతిలోని ఆప్యాయతను ఒకే వేదికపైకి తీసుకొస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ త్వరలోనే సోనీ విళా, సోనీ లివ్‌లోకి రానుంది. డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ షోకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది.

 

Continue reading
100 కోట్ల క్లబ్‌లో చేరిన సమంత

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయంతో సమంత కెరీర్‌లో మరో కీలక మైలురాయి చేరిందని చెప్పాలి.
గత కొంతకాలంగా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సమంత, ‘మా ఇంటి బంగారం’తో మరోసారి తన మార్కెట్‌ను నిరూపించుకుంది. సినిమాలో ఆమె నటన, భావోద్వేగ సన్నివేశాలు, పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. అదే ఊపును కొనసాగిస్తూ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది మా ఇంటి బంగారం.
ఈ విజయం సమంతకు వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. మహిళా ప్రధాన పాత్రలతో కూడా భారీ వసూళ్లు సాధించవచ్చని మరోసారి ఈ సినిమా నిరూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ #100CroreClub, #MaaIntiBangaram వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విజయంతో సమంత మరోసారి టాలీవుడ్‌లో తన స్టార్‌డమ్‌ సత్తాను చాటుకుందని చాలామంది చెబుతున్నారు.

Continue reading
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading