స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.






