ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ రివ్యూ

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్‌ను చూస్తే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలిసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం జయకృష్ణతో పాటు రాశా తడానీకి కూడా తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.
ట్రైలర్ ప్రారంభం నుంచే గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రేమ కథతో మొదలైన కథనం, ఆ తర్వాత యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడం ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు అజయ్ భూపతి తనకు అలవాటైన స్టైల్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.
డెబ్యూ హీరో అయినప్పటికీ జయకృష్ణ స్క్రీన్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. యాక్షన్ షాట్స్‌లో మంచి ఎనర్జీ కనిపించగా, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తనవంతు ప్రయత్నం చేశాడు. ఇంకా సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్థాయి నటనపై స్పష్టత వస్తుంది. అయితే ట్రైలర్ మాత్రం హీరోపై మంచి అంచనాలను పెంచింది.
సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచింది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలకు బాగా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. జయకృష్ణకు హీరోగా మంచి లాంచ్ ఇవ్వగలిగే అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ ఇచ్చిన హైప్‌ను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు.

 

Continue reading
ఆగస్ట్ లో అదిరిపోయే సినిమాలు

టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో ఊహించినన్ని విజయాలు మాత్రం రాలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన మూవీస్ అన్నీ యధావిధిగా విజయం సాధించాయి. తర్వాత సమ్మర్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఓ మూడు నాలుగు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. జూన్ లో వచ్చిన పెద్ది, మా ఇంటి బంగారం మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన జూలైలో లెనిన్ తో ఊపు మొదలైంది. ఈ నెల చివర్లో విడుదల కాబోతోన్న శ్రీనివాస మంగాపురంపై అంచనాలున్నాయి. అయితే ఆగస్ట్ లో మాత్రం మాగ్జిమం ప్రామిసింగ్ మూవీస్ అనిపించుకున్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు విడుదల కాబోతోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆ మధ్య విడుదలైన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. కానీ ఓటిటి, శాటిలైట్ డీల్స్ సెట్ కాక ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ డీల్స్ ఓకే అయ్యాయి కాబట్టి ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఫస్ట్ టైమ్ చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీగా ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్. సితార బ్యానర్ లో రూపొందిన సినిమా ఇది. టీజర్ తో బాగా ఆకట్టుకుంది. చాలా యేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది చాలా పెద్ద విజయం అందిస్తుందని చాలామంది అనుకున్నారు. బట్ ఈ లోగానే వీరభద్రుడుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూర్య. దీంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రాబోతున్నాడు.
ఇక ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది ఇరుముడి మూవీ. రవితేజ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అయ్యప్ప మాలలో అతను విడుదల చేసిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. ఈ మూవీతో రవితేజ మంచి విజయం సాధించేలానే ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు.
ఆగస్ట్ 26న విడుదల కాబోతోన్న మూవీ టాక్సిక్. యశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఈ డేట్ కు రావడం కూడా కష్టమే అనుకున్న టైమ్ లో రీసెంట్ గా విడుదల చేసిన పాటతో మొత్తం సోషల్ మీడియాను హీటెక్కించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సితారియా, రుక్మిణి వసంత్ లాంటి బ్యూటీస్ కూడా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యశ్ చేసిన ఈ మూవీపై ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక ఆగస్ట్ 28న విడుదల కాబోతోన్న మూవీ భోగీ. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ రగ్ డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. 1960స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఇది ఉండబోతోందని ముందే చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇదే డేట్ కే రావడం ఖాయమా లేక మరో కొత్త డేట్ కు వస్తుందని కూడా చూడాలి. మొత్తంగా ఈ ఆగస్ట్ ప్రతి వారం ఒక ప్రామిసింగ్ మూవీతో ఆడియన్స్ కు మంచి జోష్ ఇచ్చే ఇవ్వబోయేలా ఉందని చెప్పొచ్చు.

Continue reading
భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’తో బ్రేక్ దొరికినట్టేనా..?

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే టాప్ ప్లేస్ కు వెళతారు.అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయంతో ఆమె పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లెనిన్’లో భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. కథకు అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో పాటు, సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మూవీ సక్సెస్ మీట్ లో తను చాలా చాలా ఎమోషన్ అయింది. తన ఫ్యాన్స్ వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పింది.
సినిమా హిట్ అయితే హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా అవకాశాలు పెరగడం సహజం. ‘లెనిన్’కు వచ్చిన మంచి రిజల్ట్ వల్ల భాగ్యశ్రీ బోర్సే పేరు దర్శకులు, నిర్మాతల దృష్టిలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఆమెకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక్క సినిమా హిట్‌తోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం అంత సులభం కాదు. వరుసగా మంచి కథలు ఎంచుకోవడం, నటనలో వైవిధ్యం చూపించడం, ప్రేక్షకులను కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయడం చాలా ముఖ్యం. అదే చేస్తే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో లాంగ్ టైమ్ నిలిచే హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సినిమా కీలకంగా మారుతుంది. ‘లెనిన్’ విజయం భాగ్యశ్రీ బోర్సేకు ఒక పెద్ద ప్లస్ అయినా, ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఈ సినిమా ఆమె మార్కెట్ విలువను, గుర్తింపును మాత్రం ఖచ్చితంగా పెంచిందని చెప్పవచ్చు.’లెనిన్’ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ విజయాన్ని సరైన కథల ఎంపికతో కొనసాగిస్తే, టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

Continue reading
అఖిల్ ‘లెనిన్’.. కెరీర్‌కు కొత్త ఆరంభమా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో ప్రతిసారి ఒక మంచి హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో అఖిల్ తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఎప్పుడూ కనిపించింది.అలాంటి సమయంలో వచ్చిన ‘లెనిన్’ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యం, మాస్ యాక్షన్, ఎమోషన్స్ కలిసిన కథతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాయి.
అఖిల్‌లో కనిపించిన మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్‌గా కనిపించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్‌లో అతని కష్టపడిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన పాత్రను తీర్చిదిద్దిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవలి కాలంలో ప్రేక్షకులు బలమైన కథతో పాటు ఎమోషన్స్ ఉన్న మాస్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అదే ఫార్ములాను లెనిన్ కూడా అనుసరించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, లవ్ ట్రాక్‌ను సమతూకంగా చూపించే ప్రయత్నం చేసింది. విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా మంచి స్థాయిలో నమోదవుతున్నాయి. రెండో రోజు వసూళ్లు పెరగడం ప్రేక్షకుల్లో మంచి మౌత్ వస్తుండటం స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ సినిమా అఖిల్ కెరీర్‌ను మార్చుతుందా..? అంటే అవుననే చెప్పడానికి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ ఈసారి తన కంఫర్ట్ జోన్‌ను వదిలి మాస్ ఇమేజ్ వైపు అడుగు వేశాడు. అదే అతనికి పెద్ద ప్లస్ అయింది.
ఒక సినిమా సక్సెస్‌తో స్టార్‌డమ్ పూర్తిగా మారిపోదు. కానీ వరుసగా సరైన కథలను ఎంపిక చేసుకుంటే మాత్రం అఖిల్ టాలీవుడ్‌లో బలమైన స్థానం సంపాదించే అవకాశం ఉంది. లెనిన్ ఆ దిశగా అతనికి మంచి ఆరంభంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లెనిన్ కేవలం మరో సినిమా కాదు. అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచే చిత్రం. ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా అతనికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇకపై కథల ఎంపికలో ఇదే జాగ్రత్త కొనసాగిస్తే అఖిల్ కెరీర్ మరింత బలపడే అవకాశం ఉంది.

Continue reading
ఎస్.జానకి గళం.. “కామధేనువు”

తెలుగు సినిమా పాటను తమ గాత్రంతో సుసంపన్నం చేసిన గాయనీమణులు అనేకమంది ఉన్నారు. ఆ అందర్లోకీ కాస్త ఎక్కువ ప్రత్యేకమైన గాయని ఎస్ జానకి. అందుకే సినిమా పాటకి..ఎస్.జానకి గళం.. “కామధేనువు” లాంటిదంటారు డైరక్టర్ కె. విశ్వనాథ్. ఏం కావాలంటే ఆ భావం పలికించగల అత్యున్నత గాయని జానకి. కానీ ఇప్పుడా భావం ఇకపై పలకదు.. ఆ రాగం ఇకపై వినిపించదు. వయో భారంతో ఆమె కన్ను మూశారు. బట్ తను లేకపోయినా సినిమా పాట ఉన్నంత వరకు ఆమె గాత్రం ఉండిపోతోంది. అమృతవర్షిణిగా ఆడియన్స్ చేత జేజేలు కొట్టించుకున్న జానకమ్మ కొన్ని పాటలకు సంబంధించిన విశేషాలు ఓ సారి చూద్దాం.
వేదికలపై హాస్య నటుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ చంద్రశేఖర్ గారి కోడలు జానకి. అతని ద్వారానే అనుకోకుండా స్టేజ్ ఎక్కారు. ఆయన ప్రోగ్రామ్ మధ్యలో జానకితో పాటలు పాడించేవారు. ఇలా పాడుతున్న జానకిని దర్శకుడు టి.చలపతిరావు విన్నారు.
సంగీత దర్శకుడు పెండ్యాలకు రిఫర్ చేశారు. అలా ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశా అడియాసా అనే విషాదగీతంతో ఎంట్రీ ఇచ్చారు జానకి. ఆ తర్వాత చరిత్ర సృష్టించిన జానకి.. సినిమా పాటకే తలమానికమయ్యారు.

తెలుగు సినిమా తొలినాటి చిత్ర కారుడు బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరంలో జానకితో ఓ అపురూప గీతం పాడించారు. బిఎన్ ఎంతగానో ఇష్డపడే దేవులపల్లి రచించిన పాటలన్నీ జానకితోనే పాడించారు. పగలైతే దొరవేరా పాటలో సున్నితమైన శృంగార భావాల్ని పలికించిన జానకి గాత్రం.. గట్టుకాడ ఎవరో…పాటలో జానపద సొగసుల్నీ అంతే అందంగా పలికిస్తుంది.

కెవి. మహదేవన్ సంగీత దర్శకత్వంలోనూ అజరామరమైన గీతాలెన్నో పాడారు జానకి. జగ్గయ్య హీరోగా వచ్చిన ముందడుగు చిత్రంలో ఆత్రేయ రాసిన కోడెకారు చిన్నవాడా పాటలో జానకికి జానకే ప్లేబ్యాక్ పాడారు. ఆ పాటలో జానకి గాత్రం మనోహరంగా సాగుతుంది. మాధవపెద్ది సత్యంకు ధీటుగా పలుకుతుంది.

సంగీత దర్శకులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జానకితో పాడించుకోడానికే ఉత్సాహం చూపేవారు. జానకి పాడితే తప్ప ఆ ఫీల్ ఆడియన్స్ కు కారీ కాదనేది వారి నమ్మకం . ఎమ్మెస్ విశ్వనాథన్ అంతులేని కథ కోసం కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాట జానకి పాడడం వల్లే వేదన వ్యక్తమైంది.

అదే ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో వచ్చిన మరో చరిత్రలోనూ మరపురాని పాటలెన్నో ఉన్నాయ్. వాటిలో పదహారేళ్లకు నీలోనాలో అంటూ జానకి గళంలో వినిపించే మెలోడీలో వినిపించే రాగాలు వర్ణించలేనివి. సాహిత్యంలోని భావాన్నే కాదు.. సన్నివేశంలోని సారాన్ని సైతంలో గళంలో పలికిస్తుందీ పాటలో.

డైరక్టర్ వంశీ తొలి చిత్రం మంచుపల్లకీలో జానకి ఓ అపురూపమైన గీతం ఆలపించారు. వేటూరి రాసిన ఈ గీతాన్ని రాజన్ నాగేంద్ర స్వరపరిచారు. టైటిల్ ను జస్టిఫై చేస్తూ సాగే ఈ గీతం జానకి తప్ప ఇంకెవరు పాడినా ఆ పీల్ క్యారీ అయ్యేది కాదు. సాహిత్యంలోని ఆర్తిని కంఠంలో ఒప్పించగలగడం చిన్న ఫీట్ కాదు. సినిమా కళాకారుల గొప్పతనమంతా అక్కడే ఉంది.

ఇసైజ్నాని ఇళయరాజా అయితే జానకి వీరాభిమాని. తను స్వరకల్పన చేసిన ప్రతి సినిమాలోనూ జానకితో ఒక్క పాటైనా పాడించుకోకపోతే ఆయనకు కుదరదు. అలా జానకి ఇళయరాజా వేటూరి కాంబినేషన్ లో ఎన్నెన్నో మధురగీతాలు తెలుగు శ్రోతలకు వీనుల విందు చేశాయి. వాటిలో జాతీయ పురస్కారం సాధించిన పాట కూడా ఉండడం విశేషం. సితార కోసం జానకి పాడిన వెన్నెల్లో గోదారి అందం…పాట వినడం నిజంగానే ఓ వరం.

అచ్చమైన తెలుగు ఘజల్ గా చెప్పుకోదగ్గ గీతం ఒకటి రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంది. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం తయారైన ఈ గీతం జానకి పాడడం విశేషం. కవి భావాన్ని, సన్నివేశాన్ని అర్ధం చేసుకుని పాడగలగడమే సినీ నేపధ్య గాయకుల పని. ఆ పనికి నూటికి నూరు శాతం న్యాయం చేశారు జానకి.

నవ్వుల విషయంలోనూ జానకి స్పెషలిస్టు. అలా అంత నాచురల్ గా నవ్వగలిగే ఆర్టిస్టు అంతకు ముందూ లేరు…ఆ తర్వాతా రాలేదు. అది కూడా తను పాటను ఫీల్ అయి పాడడంలోంచే పుట్టింది. జ్యోతిలో సిరిమల్లె పూవల్లే నవ్వు పాటకు జానకి నవ్వులే జీవం పోశాయి. ఇక ముద్దమందారంలో అయితే జొన్నా చేలో జున్ను పాటలో బాలుతో కల్సి జానకి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

జానకి సాహిత్యాన్నీ సందర్భాన్నీ అధ్యయనం చేసి తన గాత్రంలో పలికించే ప్రయత్నం చేస్తారు. అదే తన సక్సస్ మంత్రం అదే. ఆ కాన్ఫిడెన్స్ తోనే బాలసుబ్రహ్మణ్యానికి పోటీ గీటీ అంటూ ఉంటే నేనే అని ఓ సందర్భంగా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పారు. తను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టు కూడా. సప్తపది చిత్రంలో గోవుల్లు తెల్లన లో పిల్లవాడి వరసలన్నీ జానకి స్వరంలో పురుడు పోసుకున్నవే.

సినిమా సంగీతానికి జానకి చేసిన సేవలు కొలడం సాధ్యం కాని పని. తనకు ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ ఏమంత సంతోషపరచలేదు. భారత రత్న ఇస్తే బాగుండేది అనడం కొంత మందిని బాధించినా…ఆ మాటలోనూ జానకి ఆవేదన నిండి ఉంది. సంగీత కళాకారులను ఎందుకు బిగ్ ఏరియాలో నిర్లక్ష్యం చేస్తున్నారనే వేదన ఉంది. జానకి తెలుగువారి సాంస్కృతిక సంపద.

వయసు మీదపడటం.. ఆరోగ్యం సహకరించకపోవడం.. వంటి కారణాలతో సినిమాల్లోనే కాదు.. ఇకపై ఏ వేదికలపైనా పాడబోనని కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు జానకమ్మ. అలా తన పాటకు శాశ్వత విరామంతో సంగీతాభిమానులను షాక్ కు గురి చేసినా.. ఇవాళ ఆమె కూడా లేరు అనే చేదు నిజం మాత్రం ఇంకెవ్వరూ భర్తీ చేయలేనిది. ఆమె పంచిన గానసంపద తరుగు లేనిది.. తరిగిపోనిది.. ఆ సంపదనే మళ్లీ మళ్లీ వింటూ జానకమ్మ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమె గానాన్నే వింటూ పులకించిపోతూనే ఉంటాము. ఆమెకు గారడి.కామ్ ఘనమైన నివాళి అర్పిస్తోంది.

 

 

Continue reading
‘జననాయకన్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

దళపతి విజయ్(Thalapathi Vijay) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జననాయకన్’ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మూవీ టీమ్ సీబీఎఫ్‌సీ (CBFC) సూచించిన మార్పులను పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను వెరిఫికేషన్ కోసం సమర్పించింది.
ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారికంగా సర్టిఫికేట్ మాత్రం మరో ఒకటి లేదా రెండు రోజుల్లో జారీ కానుందని సమాచారం. దీంతో సినిమా జూలై 23 విడుదల దాదాపు ఖరారైనట్లే బలంగా వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయినప్పటికీ, దాని ప్రభావం ఓపెనింగ్స్‌పై పెద్దగా ఉండదనే అంచనాలు ఉన్నాయి. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘జననాయకన్’ విజయ్(C,M.Vijay) నటుడిగా చేస్తున్న చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అభిమాన సంఘాలు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ పూర్తికావడంతో విడుదలపై ఉన్న సందేహాలకు కూడా తెరపడినట్లైంది. ఇక అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే ఫ్యాన్స్ కు మంచి పండగ రాబోతోందనుకోవచ్చు.

Continue reading
అల్లు అర్జున్ ను మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

తమిళ్ లో రూపొందిన బ్లాస్ట్(Blast Movie) మూవీతో ఓవర్ నైట్ తెగ గుర్తింపు వచ్చింది ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కు. అంతకు ముందు చాలా సినిమాలు చేసినా బ్లాస్ట్ తో వచ్చిన ఫేమ్ మాత్రం చాలా ప్రత్యేకమైనదే అని చెప్పాలి. పైగా ఇది ఓ యాక్షన్ ఓరియంటెడ్ కథ.. అందులో తనూ ఓ ప్రధాన పాత్రగా చేసింది. అందుకే ఈ మూవీతో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అలాంటి ప్రీతి ముకుందన్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బట్ అది తను మిస్ చేసుకుందట.
దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా'(RAAKA Movie) లో కీలకమైన ఓ పాత్ర కోసం మొదట యువ నటి ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే, అప్పటికే ప్రీతి ముకుందన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ముందుగా ఇచ్చిన డేట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన అవలేకపోయినట్టు తెలిపాడు. షెడ్యూల్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అట్లీ.
దీంతో ఆ కీలక పాత్రను చివరకు మలయాళ నటి ఫెమినా జార్జ్(Femina George) దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇలాంటి భారీ సినిమాల్లో అవకాశం రావడం ఏ నటికైనా ప్రత్యేకమే. అయితే డేట్స్ సమస్య కారణంగా ప్రీతి ముకుందన్ ఈ అవకాశాన్ని కోల్పోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. మరోవైపు ఫెమినా జార్జ్‌కు మాత్రం ఇది కెరీర్‌లో మంచి అవకాశం అని భావిస్తున్నారు.

Continue reading
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం, ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, విజయాలతో సాగి చివరకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నిలిచింది. దూకుడు రాజకీయాలు, పదునైన ప్రసంగాలు, ప్రజల్లోకి వెళ్లే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని (ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా) కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ABVP కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పనిచేయడం ప్రారంభించారు.

స్థానిక నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా

2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ ZPTC సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేశారు. అనంతరం 2007లో స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కాంగ్రెస్‌లో చేరికతో కొత్త మలుపు

తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, వెనక్కి తగ్గలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి తన రాజకీయ బలం మరోసారి నిరూపించారు.
2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. పాదయాత్రలు, సభలు, ప్రజా కార్యక్రమాల ద్వారా పార్టీని తిరిగి పోటీలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

2023 ఎన్నికలు.. ముఖ్యమంత్రి పీఠం

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రచార ముఖచిత్రంగా నిలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని చేపట్టింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రైతు రుణమాఫీ అమలు, ప్రజాపాలన కార్యక్రమం వంటి ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో హైడ్రా, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు కూడా చర్చనీయాంశమయ్యాయి. వీటికి మద్దతుతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం విజయాలతో పాటు వివాదాలనూ చూసింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, ‘వోటుకు నోటు’ కేసు, రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రిగా కూడా ప్రతిపక్షాలతో తీవ్ర రాజకీయ పోరు కొనసాగుతోంది. మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ప్రజా సమస్యలపై దూకుడుగా పోరాడే నాయకుడిగా అభివర్ణిస్తారు. ఈ రెండు కోణాలు ఆయన రాజకీయ ప్రయాణంలో భాగమే.
రేవంత్ రెడ్డి రాజకీయాల్లో వేగం, దూకుడు, ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేసే విధానం చాలామందికి నచ్చుతుంది. ప్రజల్లోకి నేరుగా వెళ్లే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే సమయంలో ఆయన నిర్ణయాలు, వ్యాఖ్యలు తరచూ రాజకీయ చర్చలకు కారణమవుతుంటాయి.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాధారణ స్థానిక నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగిన అరుదైన ప్రయాణంగా చెప్పవచ్చు. విజయాలు, అపజయాలు, విమర్శలు, వివాదాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనపై తుది తీర్పు మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. అయితే తెలంగాణ రాజకీయ చరిత్రలో రేవంత్ రెడ్డి పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

Continue reading
అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగుపెట్టిన వెంకటేష్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్, NKRAR2) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో వెంకటేష్ నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటూ కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కావడంతో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కథ, పాత్రలు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యే కొద్దీ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

Continue reading
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading