వంద దేవుళ్లు OTT రిలీజ్: విజయ్ ఆంటోని మూవీ ఎక్కడ చూడాలి?

వంద దేవుళ్లు OTT రిలీజ్

థియేటర్లలో భావోద్వేగాలతో ప్రేక్షకులను కదిలించిన విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో ‘నూరు సామి’ (Nooru Saami) పేరుతో విడుదలైన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి చర్చకు కారణమైంది.

ఇప్పుడు ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆగస్ట్ 7 నుంచి Zee5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారికి ఇది మంచి అవకాశం.

‘బిచ్చగాడు’ కాంబో మళ్లీ కలిసింది

విజయ్ ఆంటోని కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘బిచ్చగాడు’ తర్వాత దాదాపు పదేళ్లకు దర్శకుడు శశితో ఆయన మరోసారి కలిసి చేసిన సినిమా ఇదే. అయితే ఈసారి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ కాకుండా, కుటుంబ బంధాలు, సమాజం, మానవ విలువల చుట్టూ తిరిగే కథను దర్శకుడు ఎంచుకున్నారు.

వంద దేవుళ్లు కథ ఏంటి?

సినిమా కథలో సెల్వి అనే విధవరాలు తన ఇద్దరు పిల్లలను ఎన్నో కష్టాలు పడి పెంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఆమె జీవితంలో మళ్లీ సంతోషాన్ని వెతుక్కోవాలనుకుంటుంది. కానీ ఒక మహిళ రెండో జీవితాన్ని ప్రారంభించాలనుకోవడం సమాజానికి అంత సులభంగా అంగీకారమైన విషయం కాదు. అలాంటి సమయంలో ఆమె కొడుకు తీసుకునే నిర్ణయం, తల్లి కోసం నిలబడే విధానం, కుటుంబంలో జరిగే సంఘటనలే ఈ సినిమా ప్రధాన కథ. ఇది కేవలం తల్లి కథ మాత్రమే కాదు… ఒక కొడుకు తన తల్లిని ఎలా అర్థం చేసుకున్నాడనే భావోద్వేగ ప్రయాణం. థియేటర్లలో విడుదలైన తర్వాత **’వంద దేవుళ్లు’**కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కథలోని భావోద్వేగాలకు మంచి మార్కులు పడ్డాయి.

ప్లస్ పాయింట్స్

హృదయానికి హత్తుకునే తల్లి-కొడుకు బంధం
విధవరాలి పునర్వివాహం వంటి అరుదైన అంశాన్ని హుందాగా చూపించడం
స్వాసిక నటనకు ప్రశంసలు
సందేశంతో కూడిన క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం
కమర్షియల్ అంశాలు ఆశించే వారికి కొంత నిరాశ కలిగించే అవకాశం
కథ అసలు పాయింట్‌కు చేరుకోవడానికి సమయం తీసుకోవడం

ఎందుకు చూడాలి?

ప్రస్తుతం OTTల్లో ఎక్కువగా థ్రిల్లర్లు, క్రైమ్ డ్రామాలు వస్తున్న సమయంలో, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండే భావోద్వేగ కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వంద దేవుళ్లు అలాంటి సినిమాల్లో ఒకటి. ముఖ్యంగా… కుటుంబ కథలు ఇష్టపడేవారు. తల్లి-కొడుకు సెంటిమెంట్ సినిమాలు చూసేవారికి బాగా నచ్చే అవకశాలున్నాయి.
Gaaradi Verdict

‘వంద దేవుళ్లు’ భారీ మాస్ ఎంటర్‌టైనర్ కాదు. కానీ మన సమాజంలో ఇప్పటికీ చర్చించడానికి వెనుకాడే ఒక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పిన సినిమా. థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా, OTTలో కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
ఎమోషనల్ కథలు ఇష్టపడే వారికి ఆగస్ట్ 7 నుంచి Zee5లో స్ట్రీమ్ చేయడానికి ఇది మంచి ఎంపిక.

Continue reading
మాయలేడి గ్లింప్స్ రిలీజ్.. లవ్, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి పెంచిన రాకేష్ వర్రే

మాయలేడి గ్లింప్స్ రిలీజ్

తెలుగు సినీ ప్రేక్షకులకు కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే, ఇప్పుడు మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోగా, నిర్మాతగా ఆయన రూపొందిస్తున్న “మాయలేడి” సినిమా తాజాగా తన మొదటి గ్లింప్స్‌ను విడుదల చేసింది. చిన్న నిడివిలోనే ప్రేమ, యాక్షన్, మిస్టరీ అంశాలను కలిపి సినిమా మీద ఆసక్తిని పెంచడంలో ఈ గ్లింప్స్ సక్సెస్ అయిందనే చెప్పాలి.

గ్లింప్స్‌లో ఏముంది?

గ్లింప్స్ ప్రారంభం నుంచే హీరోకు హీరోయిన్‌పై ఉన్న ఆసక్తిని చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్తుంది. హీరోయిన్ గురించి ఒక్కో విషయం తెలుసుకుంటున్న కొద్దీ ఆమెపై హీరో ప్రేమ మరింత పెరుగుతుంది. అయితే ఇదంతా సాధారణ ప్రేమకథ కాదనే సంకేతాలను దర్శకుడు చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతున్న సమయంలో హీరోయిన్‌కు సంబంధించిన కొన్ని ఊహించని విషయాలు బయటపడతాయి.

అక్కడి నుంచే కథ కొత్త మలుపు తిరుగుతుందనే ఫీలింగ్ గ్లింప్స్‌లో కనిపిస్తుంది. యాక్షన్ కూడా బలంగానే కనిపించింది. గ్లింప్స్‌లో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా యాక్షన్‌కు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ చెప్పే… “మన మధ్యకి ఎవరైనా వస్తే ఊరుకోను” అనే డైలాగ్‌తో పాటు హీరో, హీరోయిన్ కలిసి శత్రువులతో పోరాడే సన్నివేశాలు సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉండబోతున్నాయని సూచిస్తున్నాయి.

చివరి డైలాగ్‌తో పెరిగిన క్యూరియాసిటీ గ్లింప్స్ చివర్లో రాకేష్ వర్రే చెప్పే… “ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది.” అనే డైలాగ్ సినిమా అసలు కాన్సెప్ట్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది.

విలన్ ఎవరు?

హీరోయిన్ చుట్టూ ఉన్న రహస్యం ఏమిటి?

అసలు మాయలేడి అంటే ఎవరు?

అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

రాకేష్ వర్రే లుక్ ఎలా ఉంది?

ఈ గ్లింప్స్‌లో రాకేష్ వర్రే ఫ్రెష్ లుక్‌లో కనిపించారు. లవ్ సీన్స్‌లో నేచురల్‌గా కనిపించడమే కాకుండా, యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా కలిగిన ప్రాజెక్ట్‌గా కనిపిస్తోంది.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం మరో ప్లస్ గ్లింప్స్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన “నిన్ను చూసినాక ఈ క్షణం..” పాట మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ మరోసారి ప్రేమకథకు సరైన ఎమోషన్‌ను జోడించినట్లు అనిపిస్తోంది.

“మాయలేడి” గ్లింప్స్ చూస్తే ఇది కేవలం ఒక సాధారణ లవ్ స్టోరీ కాదని అర్థమవుతోంది. ప్రేమ, యాక్షన్, మిస్టరీ అంశాలను సమతుల్యంగా మిక్స్ చేసిన కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. రాకేష్ వర్రే తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయింది.

Continue reading
వరుణ్ తేజ్ మిగతా మూవీస్ ను డామినేట్ చేస్తాడా.. తేలిపోతాడా..

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు

వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్. రీసెంట్ గా విడుదలైన కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో వరుణ్ తేజ్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే భావన చాలామందిలో ఉంది. ఈ నెల 7న కొరియన్ కనకరాజు విడుదలవుతోంది. అయితే అదే రోజు మరికొన్ని మూవీస్ విడుదల కాబోతున్నాయి. మరి ఈ మూవీస్ వల్ల కొరియన్ కనకరాజుకు ఇబ్బంది అవుతుందా లేక వాటిని దాటి నిలబడతాడా అంటే చెప్పలేం.

అనకాపల్లి మూవీ

ఇక ఈ నెల 7న కొరియన్ కనకరాజుతో పాటు రెండు తెలుగు మూవీస్ తో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో అనకాపల్లి(Anakapalle) ఉంది. అనకాపల్లిలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. త్రినాథరావు నక్కిన(Trinadharao Nakkina) కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తను ఓ కీలక పాత్ర చేశాడు. ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ప్రమోషన్స్ పరంగా ఇంకాస్త బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది.

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల హీరోలుగా

మరో తెలుగు మూవీ అంటే కే.జే. క్యూ ఉంది(KJQ – King Jackie Queen)ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల హీరోగా నటించిన మూవీ ఇది. శశితో పాటు దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) మరో హీరో. యుక్తి తరేజా(Yukthi Thareja) హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోందీ మూవీ. దర్శకుడు కె.కె ఈ మూవీ చివరి దశలో చనిపోయాడు. అతనికి అంకితం చేస్తున్నట్టుగా ప్రతి ప్రమోషన్ లో కూడా చెబుతోందీ మూవీ టీమ్.

లోకేష్ కనకరాజ్ హీరోగా సక్సెస్ అవుతాడా..

ఇక డబ్బింగ్ మూవీస్ లో అయితే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) హీరోగా మారిన మూవీ DC. డిసి అంటే దేవదాస్, చంద్ర అనే ఇద్దరి పేర్ల ఫస్ట్ లెటర్స్. చంద్రగా వామికా గబ్బి(Wamiqa Gabbi) నటిస్తోంది. ఈ ఇద్దరి మీద మూవీ మొత్తం ఉండబోతోంది అనిపించేలా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. లోకేష్ కనకరాజ్ స్టైల్లోనే ఊర మాస్ యాక్షన్ కథగా ఉండబోతోందీ మూవీ. కాకపోతే తెలుగులో పెద్దగా పట్టించుకోవడం లేదీ మూవీని.
ఇక ఆర్ మాధవన్(R.Madhavan) నటించిన మరో తమిళ్ మూవీ ‘జి.డి. నాయుడు’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ ఇది. అయితే తెలుగులో మాత్రం మినిమం ప్రమోషన్స్ కూడా లేవు ఈ చిత్రానికి. కాకపోతే ట్రైలర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

ఎవరిది పై చేయి

మొత్తంగా ఈ నాలుగు సినిమాలతో ఈ వారం మొత్తం ఆక్యూపై అయింది. మరి ఈ నాలుగింటిలో కొరియన్ కనకరాజు డామినేషన్ మాత్రం స్పష్టంగా ఉంది. కాకపోతే కంటెంట్ లో దమ్ముంటే మిగతా మూవీస్ పై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఏదేమైనా ఈ నాలుగింటిలో ఏ మూవీ ది బెస్ట్ అనిపించుకుంటుందో అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Continue reading
బిజెపికి గట్టి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు

బిజెపికి షాక్

తాజాగా వెలువడిన మూడు బైపోల్స్ ఫలితాలు చూస్తుంటే.. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న పెద్దలకు, ఇక్కడ కూటమి సర్కార్ నడుపుతున్నోళ్లకు చెమటలు పట్టడం ఖాయం. ఇవి ఎవరో సాధారణ సీట్లు కావు, బీజేపీకి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోట్లు. అలాంటి చోట్లోనే ఓటర్లు దిమ్మతిరిగేలా రిజల్ట్స్ ఇస్తే, కమలనాథులతో పాటు కూటమి భాగస్వాములకు కూడా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా.

గుజరాత్ గుండెల్లో రైల్లు

బీహార్‌లోని బంకీపూర్‌లో బీజేపీ ఓటు షేర్ ఏకంగా ఇరవై మూడు శాతం గాలిలో కలిసిపోయింది. ఇక మోదీ, షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని మంజల్పూర్‌లో సీటు గెలిచినా పండగ చేసుకునే సీన్ లేదు. గతంలో లక్షకు పైగా ఉన్న భారీ మెజారిటీ ఈసారి కేవలం ముప్పై వేలకు పడిపోయింది, ఓటు షేర్ కూడా పాతిక శాతం హాంఫట్ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని దాతియాలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకొని రూట్ క్లియర్ చేసుకుంది.

పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా కూటమి ప్రభుత్వాల నడుపుతున్నప్పుడు ఈ రేంజ్ వ్యతిరేకత వస్తే.. పక్కన ఉన్న మిత్రపక్షాలు సైలెంట్‌గా ఎందుకు కంగారు పడుతున్నాయో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. “మా మాస్‌ పవర్‌ ముందు ఎవరైనా సరే” అనుకున్న అహంకారానికి నేటి ఓటర్లు ఈ ఫలితాలతో గట్టిగానే సమాధానం చెప్పారు. కంచుకోటల గోడలు ఎంత బలమైనా, ప్రజా వ్యతిరేకత పునాదుల్ని కదిలిస్తుందనడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం, మిత్రులకు సైతం నిద్రలేకుండా కావడం ఖాయం.

Continue reading
ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం.. బీజేపీ కంచుకోట బాంకీపూర్‌లో చరిత్ర సృష్టించిన జన్ సురాజ్

ప్రశాంత్ కిశోర్ విజయం

ప్రశాంత్ కిశోర్ అంటే మామూలుగా ఎన్నికల వ్యూహకర్తగానే చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకు ముందే ప్రశాంత్ కిశోర్ ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. తర్వాతే ఎన్నికల వ్యూహకర్తగా మారాడు. ప్రస్తుతం బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించాడు. విశేషం ఏంటంటే.. ఇదే నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గతంలో గెలుస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా నితిన్ నబీన్ గెలిచాడు. కానీ అతను పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడంతో పాటు రాజ్యసభకు వెళ్లడంతో ఇదే అసెంబ్లీకి ఉప ఎన్నికలు తప్పలేదు. ఈ ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ ఏకంగా 18వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందాడు.

ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్త

ప్రశాంత్ కిశోర్ కి రాజకీయ వ్యూహర్తగా తిరుగులేని గుర్తింపు ఉంది. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశాడు. అక్కడ పార్టీ గెలిచింది. తర్వాత 2014లో బిజెపి పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మార్మోగిపోయింది. 2019 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకు రావడంలో అత్యంత కృషి చేశాడు. ఆపైన మరికొన్ని రాష్ట్రాల్లో తను పనిచేసినా ఆయా రాష్ట్రాల్లో అతను సపోర్ట్ చేసిన పార్టీలు ఓడిపోయాయి. దీంతో ఇకపై తను వ్యూహకర్తగా ఉండనని తేల్చాడు.

ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపన

ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న సొంతంగా పార్టీ స్థాపించాడు. దానికి జన్ సురాజ్ పార్టీ అని పేరు పెట్టాడు. 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లోని 243 స్థానాలుండగా 238 సీట్లలో పోటీ చేశాడు. కానీ తను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ దారుణంగా పరాజయం పాలయ్యాడు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో దాదాపు 30యేళ్లుగా బిజెపి పార్టీయే జెండా ఎగరేస్తున్న బాంకీపూర్ నుంచి ఘన విజయం సాధించాడు.

బిజెపికి శరాఘాతం

ప్రశాంత్ కిశోర్ విజయం తర్వాత ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకముంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది బిజెపికి శరాఘాతం అని చెప్పొచ్చు. బిజెపికి బాంకీపూర్లో తిరుగులేని స్థానంగా ఉంది. అలాంటి ప్లేస్ ల ఓటమి పాలు కావడం ప్రశాంత్ కిశోర్ విజయంగానే చెప్పాలి. రాబోయే రోజుల్లో బిజెపికి మరింత గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఈ పరాజయం తర్వాత చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు.

బిజెపి ఎత్తుగడలో భాగమే

ప్రశాంత్ కిశోర్ విజయం కేవలం బిజెపి ఎత్తుగడలో భాగమే అని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపించిన తర్వాత గెలిచిన తొలి స్థానం ఇది. మరి భవిష్యత్ లో అతను రాజకీయంగా నిలదొక్కుకుంటాడా.. జాతీయ స్థాయిలో కూడా తన పార్టీని కీలకంగా ఉంచుతాడా అనేది కాలమే చెబుతుంది.

 

 

Continue reading
రవితేజ కెరీర్ లో ఇరుముడి స్పెషల్ మూవీగా నిలుస్తుందా..

రవితేజ ఇరుముడి పాట

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఈ నెల 21న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీపై ముందు నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వస్తున్నాడు అనిపించేలా ఉంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా బేబీ నక్షత్ర కీలకమైన పాత్రలో నటించారీ చిత్రంలో.

రవితేజ పాట బావుంది

రవితేజ ఇరుముడి నుంచి తాజాగా మరో పాట విడుదల చేశారు. ఫస్ట్ సాంగ్ అయితే అయ్యప్ప మాలలో రవితేజ చేసిన హడావిడీగా సాగే గీతంగా ఉంది. అయితే ఈ పాట అందుకు భిన్నంగా ఉంది. రవితేజ ఓ ఆటో డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ‘యాలాలో యాలాలో ఎన్నెట్లో ఎన్ని ముచ్చటలో.. ’అంటూ సాగే ఈ పాటలో పల్లవిలోనే ‘అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం’ అంటూ వినిపించిన పదాలు చాలా చాలా బావున్నాయి.

రవితేజ తాగుబోతు పాత్రలో

ఇక పాటలో వచ్చే సన్నివేశాలు చూస్తుంటేనే ఈ చిత్రంలో రవితేజ పాత్ర చాలా వరకు దిగువ మధ్యతరగతి వాడిగా కనిపిస్తాడు అని తెలుస్తుంది. దీనికి తోడు భార్యకు తెలియకుండా పొద్దు పొద్దునే మందు తాగడం మొదలు పెడతాడు రవితేజ. చూస్తుంటే తాగుబోతులంతా ఇలా అయ్యప్ప మాలలు వేసుకుంటారు అనిపించేలా ఉన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి

ఏదేమైనా రవితేజ కెరీర్ లో ఇదో స్పెషల్ మూవీ అవుతుందా అంటే అవుననే చెప్పాలేమో అనేలా ఉంది. శివ నిర్వాణ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా రాసుకుంటాడు. వాటిని ప్రెజెంట్ చేసే విధం కూడా చాలా బావుంటుంది. మరి ఇలా దిగువ మధ్యతరగతి హీరోతో ఇలాంటి సెంటిమెంట్స్ ను రంగరించడం మాత్రం మరో స్థాయిలో ఉండబోతోంది అనిపించేలా ఉంది.
ఇక జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనంత శ్రీరామ్ రాశాడు. హేషమ్ అబ్దుల్లా వాహబ్ ఈ పాటను పాడటం విశేషం. అతనితో పాటు సాధిక కే.ఆర్ పాడింది.

Continue reading
కామాక్షి భాస్కర్ల అగధ మూవీ ట్రైలర్ రిలీజ్

కామాక్షి భాస్కర్ల అగధ మూవీ

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన మూవీ అగధ. అగధీ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ రాజు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ ఫిక్షన్ కంటెంట్ తో రూపొందిన సినిమా ఇది. మాయలు, మంత్రాలు, మంచిపై చెడు వారి పోరాటం వల్ల సాగే కథలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
అగధ లాంటి కథలు మనకు ఇప్పటి వరకు రాలేదు అని కాదు.. కానీ ఈ మూవీ విషయంలో కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా కనిపిస్తోంది. సినిమా అంతా తన చుట్టూనే సాగుతుంది అనిపించేలా ఉంది. కామాక్షి భాస్కర్ల కూడా మంత్రగత్తెగా కనిపిస్తోంది. అయితే తను కేవలం మంచి కోసమే తన మంత్రాలు ఉపయోగిస్తుంది. దానికి భిన్నంగా దుష్టమైన మంత్రగాళ్లు కూడా ఉంటారు. మరి వారిపై కామాక్షి భాస్కర్ల పోరాటం ఎలా ఉంది అనేది ప్రధానంగా ఉండబోతోందీ మూవీలో.

చెడుపై మంచి చేసే యుద్ధం

అగధ ట్రైలర్ చూస్తే ఓ గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. మహిమ అనే పేరున్న ఆమె ఆత్మహత్య వెనక ఉన్న రహస్యం ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న మహిమ ఆత్మగా మారుతుంది. మరి తను ఎందుకు ఆత్మగా ఎందుకు మారింది అనేది మరో కోణంలో ఉంటుంది. అయితే అగధకు ఈమె ఆత్మహత్యకు ఉన్న సంబంధం ఏంటీ అనేది మరో కోణం. ‘నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలుంటే.. నా చుట్టూ మంచి చేసే పంచ భూతాలున్నాయి’అనే డైలాగ్ చాలా బావుంది.

ఎమ్.ఎస్.రాజుకు హిట్ పడుతుందా..?

మరి ఆ చెడు భూతాలను కామాక్షి భాస్కర్ల ఎలా ఎదుర్కొంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించేలా ఉంది. అయితే ఈ ట్రైలర్ మాత్రం టీజర్ లా అంత ఎఫెక్టివ్ గా లేదు. అలాగని ట్రైలర్ చూడగానే కంటెంట్ పై జడ్జిమెంట్ చేయడం సరైంది కాదు. అందుకే మూవీ విడుదలైతే కానీ ఓ క్లారిటీ రాదు.
ఏదేమైనా ఈ మూవీతో ఎమ్.ఎస్.రాజు ఓ పెద్ద హిట్ కొట్టాలనే ప్రయత్నం మాత్రం కనిపిస్తోంది. ఈ తరహా కొత్తదనం ఉన్న కథలతో ఆకట్టుకునే కామాక్షి భాస్కర్లకు కూడా ఈ మూవీ మంచి విజయం ఇచ్చేలా ఉంది. మరి ఈ నెల 14న విడుదల కాబోతోన్న అగధ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్ విడుదల

నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి

నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఎలియాస్ రుక్మిణి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ హీరోగా కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. తను అనుకున్న ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. ఓ దశలో చాలామంది ఇక నితిన్ హీరోగా తప్పుకుంటే బావుంటుందని కూడా కామెంట్స్ చేశారు. అన్నీ మైండ్ లోకి తీసుకున్నాడు నితిన్. కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాతే ఈ ఎలియాస్ రుక్మిణితో వస్తున్నాడు.
విశేషం ఏంటంటే ఎలియాస్ రుక్మిణికి హీరో నాని ప్రెజెంటర్. అంటే నాని గతంలోనే మురళీకాంత్ తో చర్చలు నడిపించాడు. దీంతో మురళీకాంత్ తో డైరెక్షన్ లోనే నాని నటించబోతున్నాడు అని చాలామంది భావించారు. బట్ ఫైనల్ గా ఆ ప్లేస్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. మరి దీనికి నానియే కారణమా లేక మురళీకాంత్ డెసిషనా అనేది తెలియాల్సి ఉంది.

నితిన్ ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్

ఇక గ్లింప్స్ చూస్తే.. నాని ఈ కథ గురించి తెలుకోవాలని దర్శకుడు మురళీకాంత్ ను అడుగినట్టుగా చూపించారు. ‘హాయ్ మురళీ.. దేని గురించి ఈ కథ అని నాని అడిగితే.. దానికి ఈ కథ కృష్ణ గురించి అన్నా’అంటాడు మురళీ. కృష్ణ ఓ నవలా రచయితగా చూపించారు. కట్ చేస్తే అతని ఊహల నుంచి కొన్ని నవలలు వస్తాయి అని చూపించారు. అందులో భాగంగా మొదటి నవల గరం గోపాల్ అని ఉంటుంది. అలాగే ఓ లెస్బియన్ నవలగా ఆమెకు ఆమె అంటే ఇష్టం అనేలా మరోటి ఉంటుంది. మూడోదిగా వ్రతం వెంకన్న అనే నవల రాసినట్టుగా ఉంటుంది. అంటే భార్య కోరికలను తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి నవలగా ఇది కనిపిస్తోంది అనేలా ఉంది.

రచయితగా నితిన్

ఇవన్నీ చూసిన తర్వాత నాని వెంటనే అడుగుతాడు.. మరి ఈ రుక్మిణి అని. దానికి వీడియోలో నితిన్ చెబుతున్నట్టుగా ‘నా వైఫ్’అంటాడు. మరి ఆ భార్య ఎవరు.. అతనికి రచయితగా తను ఎంత ఇన్సిస్పిరేషన్ గా నిలుస్తుంది.. అసలు నిజంగా ఆమె ఉంటుందా లేదా అనేది తెలియాల్సిన కథ అని అర్థమవుతుంది.
దీప్తి గంటా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సింగీతం అందించబోతున్నాడు. ఏదేమైనా నితిన్ కు ఈ మూవీ అత్యంత కీలకం అనేది మాత్రం వాస్తవం. మరి ఆ వాస్తవాన్ని నిలబెట్టుకునేలా ఎలియాస్ రుక్మిణి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
స్నేహానికన్న మిన్న లేదురా.. Friendship Day Special | స్నేహం గొప్పదనం తెలిపే ప్రత్యేక కథనం

స్నేహానికన్న మిన్న లేదురా

స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అన్నాడో కవి. నిజమే.. ఎన్ని బంధాలున్నా.. ఎందరు బంధువులున్నా.. ఎవ్వరికీ సాటి రానిది స్నేహం. ఏదో ఒక దశలో స్నేహాన్ని అనుభవించని మనిషీ, స్నేహాన్ని వర్ణించని కవీ ఉండరేమో.. ఎవరి అనుభవాలకు వారుగా తమ స్పందనలను తెలియజేస్తారు. అందుకే ఈ లోకంలో డబ్బుల్లేనోడు కాదు, స్నేహితులు లేనోడే అసలైన పేదోడు అంటారు.. ఇవాళ స్నేహితుల దినోత్సవం.
ఆపదలో ఉంటే అడక్కుండానే సాయం చేస్తుంది స్నేహం.. చేసిన సాయానికి ప్రతిఫలాన్ని ఎన్నడూ కోరదు. స్నేహముంటే చాలూ.. అది పంచే మాధుర్యం ఉంటే చాలు అనుకునే స్నేహితులుంటే ఆ జన్మధన్యం అనకుండా ఉండగలమా.
ప్రేమైనా.. పెళ్లైనా.. మరే బంధమైనా వెదుక్కుంటేనే వస్తుంది. కానీ స్నేహం అలా కాదు.. అది మన కంటే ముందే పుట్టి ఉంటుంది.. ఓ రెండు ఆత్మలు కలసి బ్రహ్మదేవుణ్ని ఓ వరం అడిగాయట. రూపురేఖలు వేరైనా ఒకే ఊపిరిగా ఉండే బంధాన్ని సృష్టించమని.. అప్పుడు వచ్చిన ఆ సృష్టే ఈ స్నేహం.. అంటే కాదనేదెవరు..
పసికందులుగా పుట్టిన తర్వాత.. ఊహ తెలిసే టైమ్ కే మనకు స్నేహితులెవరో తెలిసిపోతుంది. ముందుగా అమ్మానాన్నా స్నేహితులుగా ఉంటారు. కానీ ఆ బంధాన్ని కూడా మరిపించేలా మరో స్నేహం మనకు తోడయ్యేది మనకు ఓ వయసు వచ్చిన తర్వాతే.. అప్పుడు ఏర్పడ్డ స్నేహం ఎన్ని అవాంతారాలొచ్చినా.. ఆగదు.. ఎంత వయసుకు వచ్చినా వాడిపోదు.. అసలా బంధాన్ని వర్ణించాలంటే అనుభవం తప్ప మాటలు చాలవు..

స్నేహం… ప్రతిఫలం ఆశించని బంధం

మనలో చాలామంది స్నేహాలు పాఠశాల స్థాయి నుంచే పెరుగుతాయి. ఆ వయసులోనే మనకు స్నేహితుడూ.. అతని విలువా తెలుస్తుంటాయి.. అలా మొదలైన స్నేహం ఎంత ఎదిగినా విడిపోదు.. సరికదా.. మరింత బలపడుతుంది. ఆటపాటలు, చదువుల నుంచి కెరీర్ వరకూ కలిసే నడుస్తుంది. అప్పటి వరకూ మనతో ఉన్న నేస్తాలు తాత్కాలికంగా విడిపోతున్నా.. ఎప్పటికీ ఫేర్ వెల్ లేని ఏకైక బంధం స్నేహం మాత్రమే.
స్నేహానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు.. కానీ కాలేజ్ డేస్ లో స్నేహాన్ని అనుభవించడం జీవితంలో ఒక స్వచ్ఛమైన బహుమతి.. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోని స్నేహితులు కాలేజ్ డేస్ లో మనకెప్పుడూ ఉంటారు. కాకపోతే అలాంటి స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలంటే మనసు, మనమూ నిజాయితీగా ఉండాలంతే.. అప్పుడు ఆ స్నేహితుడే కాదు.. అతనితో గడిపే కాలం కూడా మన నేస్తమవుతుంది.
లోకమే మనంగా గడిపిన స్నేహాలు ఎక్కడో ఓ చోట తాత్కాలికంగా విడిపోవాల్సి వస్తుంది. అది తాత్కాలికమే అయినా.. అలాంటప్పుడు, అప్పటి వరకూ వారు పంచుకున్న కబుర్లు.. చేసిన అల్లరి పనులు గుర్తుకు వచ్చిన ఆ క్షణం కన్నీటి నివాళిగా మారుతుంది. అయినా ఆ అల్లరిని ఈ కన్నీటితో కలిపి పంచుకుంటారు. అలాంటి ఈ స్నేహ బంధం ఎంత మధురమో కదా..

దూరం పెరుగుతుంది… కానీ స్నేహం కాదు

ఎన్ని తరాలైనా అంతరాలు లేని బంధం స్నేహం.. అలాంటి బంధానికి ఎవరైనా అడ్డు తగిలినా.. ఒక్కసారి మనసులు కలిసిన స్నేహాలకు ఆస్తులు అంతస్తులు మేటర్ కానే కావు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఆ స్నేహితులు కలకాలం నిలిచే ఉంటారు.. దానికి రాజు పేద భేదాలుండవు. వర్ణ, వర్గ తారతమ్యాలు ఉండవు.
నిజానికి మన పురాణాల్లో అత్యంత గొప్ప స్నేహంగా దుర్యోధనుడు, కర్ణుడు అని చెబుతారు. అలాంటి నేపథ్యంలో ఉన్న వాళ్లెవరైనా ఇప్పటికీ అలాంటి స్నేహాన్ని నిలుపుకుంటారు. నేస్తం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు ఎన్నడూ వెనకాడరు. ఇక్కడ స్నేహితుడు.. అతని మంచి తప్ప మరొకటి కనిపించదు..
జీవితంలో ఏ బంధానికైనా విడిపోవడాలుంటాయోమో కానీ స్నేహానికి ఉండవు.. కారణం.. అది అన్ని బంధాలకు అతీతమైనది.. హృదయ స్పందనలంత స్వచ్ఛమైనది. అందులో తేడాలు వచ్చి ఆ స్పందన ఆగిపోతే పోయేవి ప్రాణాలే తప్ప స్నేహం కాదు.. అందుకే చిన్నారి స్నేహాలెన్ని తాత్కాలికంగా విడిపోయినా.. ఆ చిరునామాను కథగా రాసుకోమంటారు..

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని ఆ కవి ఏ అనుభవంతో రాశాడో కానీ.. ఆ అనుభవంలో తడిసిపోని మనిషి ఉండడు.. ఒకవేళ ఉన్నా అలాంటి వారంతా స్వచ్ఛమైన మనసుతో అచ్చమైన స్నేహితుణ్ని వెదుక్కోవాలి..

Continue reading
రష్మిక మందన్నా డ్యాన్స్ చిత్రీకరణలో గాయపడింది

రష్మిక మందన్నాకు గాయాలు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటీ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా తాజాగా ఒక సినిమా పాట చిత్రీకరణ సందర్భంగా ఆమెకు గాయాలు అయ్యాయి. ఒక రకంగా ఇది తీవ్ర గాయమే చెబుతున్నారు. ప్రస్తుతం తను మైసా, రణబాలి మూవీస్ షూటింగ్ చేస్తుండగా ఈ గాయం అయిందా లేక మరేదైనా చిత్రీకరణలో అయిందా అనేది తెలియాల్సి ఉంది.

గతంలోనూ రష్మిక కాలికి ఫ్రాక్చర్స్

ఓ రకంగా రష్మిక మందన్నా గతంలో సికందర్ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా గాయపడింది. అయితే ఇది మూవీ షూటింగ్ టైమ్ లో కాదు. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కాలు బెణికింది. డాక్టర్స్ పరీక్షించారు. దీంతో కాలికి ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయని తేలింది. దీంతో కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఆ టైమ్ లో మరో మూవీ ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా పాల్గొంది. అంతే తను ఎంత డెడికేటెడ్ అనేది అందరికీ తెలిసింది.

ఆరు వారాలు విశ్రాంతి

ఇక తాజాగా అయినా గాయం సాధారణంగా టాప్ అథ్లెట్స్ కు మాత్రమే అవుతుందట. అలాంటిది ఓ సాధారణ హీరోయిన్ కు ఇలాంటి గాయం కావడం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు అయితే తనకు ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం అని ఖచ్చితంగా చెప్పారు.

రష్మిక మందన్నా మూవీస్ షెడ్యూల్స్ లో మార్పులు

మరి ఈ కారణంగా తను చేస్తోన్న మూవీస్ షెడ్యూల్స్ కూడా మారిపోతాయి. దీని వల్ల ఆ మూవీస్ రిలీజ్ డేట్స్ లో కూడా మార్పులు రావడం జరుగుతుంది. ఏదేమైనా రష్మిక మందన్నా త్వరగా కోలుకోవాలి. వీలైనంత వేగంగా మళ్లీ జోష్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని గారడి డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Continue reading