సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ పెంచితే బావుండేదేమో

విశ్వనాథ్ అండ్ సన్స్ కి ప్రమోషన్స్ వీక్

సూర్య హీరోగా రూపొందిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు ఫీమేల్ లీడ్ గా నటించింది. అలాగే రాధిక, రవీనాటాండన్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిందీ మూవీని. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే బిగ్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేంత ట్రైలర్ కటింగ్ మాత్రం కనిపించలేదు అనేది వాస్తవం.
మామూలుగా ఇలాంటి మూవీస్ ప్రమోషన్స్ పరంగా బాగా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. బట్ వీళ్లు ఆ విషయంలో బాగా నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీంతో మూవీ ప్రమోషన్స్ గురించి ఇక లైట్ తీసుకున్నట్టే అని చెప్పాలి. దీనికంటే ముందు సుమతో ఒక కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతే.. ఇక సినిమా గురించి పెద్దగా పట్టించుకునేలాగానే లేరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అందులో వందల సినిమాలకు కనిపించే కామన్ పాయింట్స్ మాత్రమే హైలెట్ అవుతుంటాయి.

సూర్య మూవీ తమిళ్ మాత్రమేనా

సూర్య తెలుగులో నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇది అని మొదటి నుంచి వినిపించింది. బట్ అలాంటిదేం లేదు. ఇది కేవలం తమిళ్ మూవీ అని దర్శకుడు, నిర్మాత నాగవంశీ క్లియర్ గా చెప్పడం తెలుగు అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. సూర్య అంటే తెలుగు హీరోగానే ఫేమ్ అయ్యాడు. అయినా కాస్త డైరెక్ట్ తెలుగు మూవీ అని చెబితే బావుండేది. అది కూడా మూవీపై ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

బబ్లీ గాళ్ గా మమితా బైజు

మమితా బైజు బబ్లీ గాళ్ గా నటించిందీ మూవీలో. తను కాస్త అల్లరి పిల్లగా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ అనేది అర్థం అవుతుంది. వయసులో తనకంటే చిన్న పిల్ల కాబట్టి సూర్య మమితా బైజును కాస్త గారంగా చూస్తాడు. దాన్ని మమితా బైజు మిస్ అండర్ స్టాండ్ చేసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. మరి ఈ ఏజ్ బార్ లవ్ తో పాటు కుటుంబ పరమైన ఇష్యూస్ అన్నీ మూవీలో ఉంటాయి అనుకోవచ్చు.

విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ అవుతుందా

ఏదేమైనా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా కనిపిస్తోంది. ఒక్క ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇలాంటి పెద్ద మూవీస్ ను లైట్ తీసుకోవడం కూడా ఏమంత మంచిది కాదు. ఒకవేళ మూవీ రిజల్ట్ కాస్త అటు అయితే ఇక అస్సామే అవుతుందని గ్యారెంటీగా చెప్పొచ్చు. ఇక రిలీజ్ కు పెద్దగా టైమ్ కూడా లేదు. సో.. ఇక ప్రమోషన్స్ అంటూ ఏమీ ఉండవు అని తేలిపోయింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.

Continue reading
నీటి వాటాల చుట్టూ సెంటిమెంట్.. ఇంకెంత కాలం..?

ఏపీ–తెలంగాణ నీటి వివాదం

ఏపీ, తెలంగాణ అంటేనే ఎన్నో భావోద్వేగాలు. ఆ భావోద్వేగాల్లో నీటి అంశానికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఒక రకమైన చర్చ.. విభజన తర్వాత మరో రకమైన వాదన.. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఏపీ–తెలంగాణ నీటి వివాదం మాత్రం పూర్తిగా సమసిపోలేదు.

కృష్ణా అయినా.. గోదావరి అయినా.. నీటి వినియోగం, ప్రాజెక్టులు, కేటాయింపులు, కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన ప్రతిసారీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఒక రాష్ట్రం తన హక్కుల గురించి మాట్లాడితే.. మరో రాష్ట్రం తన ప్రయోజనాల గురించి వాదిస్తోంది. చివరికి నది మాత్రం రాజకీయ సరిహద్దులను పట్టించుకోదు.

నీటి కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నీటి హక్కుల అంశం కూడా కీలకంగా వినిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి విషయంలో తగిన ప్రాధాన్యం దక్కలేదనే వాదన ఉద్యమంలో బలంగా వినిపించింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా కృష్ణా, గోదావరి జలాల విషయంలో వివిధ అంశాలు వివాదాలకు దారితీస్తూనే ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చర్చించడం వేరు.. ఇప్పుడు రెండు ప్రత్యేక రాష్ట్రాల హక్కులను చట్టబద్ధంగా నిర్ణయించడం వేరు. ఈ రెండింటినీ కలిపి చూడటం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

కృష్ణా జలాలపై అసలు పరిస్థితి ఏంటి?

కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–1 ద్వారా 811 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే ఆ మొత్తం నుంచి ఏపీ, తెలంగాణకు శాశ్వతంగా విడివిడిగా తుది వాటాలు నిర్ణయించబడలేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2లో ప్రక్రియ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తాజా అధికారిక సమాచారంలో కూడా తుది నిర్ణయం ఇంకా కేంద్రానికి సమర్పించలేదని వెల్లడైంది.

అంటే..

“తెలంగాణకు ఇంత.. ఏపీకి ఇంత” అంటూ రాజకీయ వేదికలపై చెప్పే ప్రతి సంఖ్యను తుది చట్టపరమైన వాటాగా చూడలేం.

అదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైనా ఉంది.

గోదావరి విషయంలో ఇంకా క్లిష్టమైన పరిస్థితి

గోదావరి విషయంలో సమస్య మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. కృష్ణా జలాల మాదిరిగా ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి నీటి ప్రత్యేక పంపకంపై తుది ఒప్పందం లేదని గతంలోనే స్పష్టం చేసింది. గోదావరి ట్రిబ్యునల్ నిర్ణయాలు ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా రూపొందిన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక వాటా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అందుకే గోదావరి జలాల విషయంలో “మా వాటా.. మీ వాటా” అనే రాజకీయ నినాదాల కంటే.. చట్టం, ట్రిబ్యునల్ నిర్ణయాలు, ప్రాజెక్టుల వినియోగం, భవిష్యత్ అవసరాలు అన్నింటినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడు బనకచర్ల ఎందుకు చర్చలోకి వచ్చింది?

ఇటీవలి కాలంలో పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఏపీ–తెలంగాణ మధ్య నీటి చర్చలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.

కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. పోలవరం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వైపు వరద నీటిని తరలించే ప్రతిపాదనగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. దీని ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను 2022 మేలో కేంద్ర జల సంఘానికి సమర్పించారు. ఆ ప్రతిపాదనపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలు కోరారు.

ఇదే అంశంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఏపీ వాదన మాత్రం గోదావరి వరద నీటిని వినియోగించుకుని కరువు ప్రాంతాలకు నీటిని అందించడమే లక్ష్యమని ఉంది.

అంటే ఇక్కడ కూడా రెండు వైపులా ప్రజల అవసరాలే కారణంగా చూపుతున్నాయి.

గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లిపోతే?

ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది.

వరదల సమయంలో గోదావరిలో భారీగా నీరు ప్రవహిస్తుంది. అందులో కొంత భాగం సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఎంత మేరకు వినియోగించుకోవాలి? ఎక్కడ నిల్వ చేయాలి? ఎక్కడికి తరలించాలి? అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి.

కానీ “సముద్రంలోకి వెళ్తున్న నీరు అంటే ఎవరికైనా ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు” అనుకోవడం కూడా సరైన విధానం కాదు.

ఒక నది నీటికి సంబంధించి ఇప్పటికే ఉన్న కేటాయింపులు, దిగువ–ఎగువ రాష్ట్రాల హక్కులు, ట్రిబ్యునల్ నిర్ణయాలు, పర్యావరణ అంశాలు, ప్రాజెక్టుల అనుమతులు వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో పాటు చట్టబద్ధమైన ప్రక్రియ కూడా అంతే ముఖ్యం.

నీటి మీటర్ ఎందుకు అవసరం?

నీటి వివాదాల్లో మరో కీలక అంశం ఖచ్చితమైన కొలత.

ఎవరు ఎంత నీటిని తీసుకున్నారు? ఏ ప్రాజెక్ట్ ద్వారా ఎంత నీరు విడుదలైంది? ఏ సీజన్‌లో ఎంత వినియోగించారు? వరద నీటిలో ఎంత భాగం ఉపయోగించారు?

ఇలాంటి వివరాలు స్పష్టంగా ఉంటే రాజకీయ ఆరోపణలకు కూడా కొంతమేర అడ్డుకట్ట పడుతుంది.

ఇందుకోసం ఆధునిక టెలిమెట్రీ వ్యవస్థలు, రియల్‌టైమ్ నీటి కొలతలు, పారదర్శక డేటా పంచుకోవడం చాలా అవసరం.

నీటి లెక్కలు క్లియర్‌గా ఉంటే.. వివాదాల్లో సగం తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రతి నీటి సమస్యకు ప్రాంతీయ సెంటిమెంటేనా?

ఇదే అసలు ప్రశ్న.

తెలంగాణ తన నీటి హక్కుల గురించి మాట్లాడటం సహజం. ఏపీ తన సాగు, తాగునీటి అవసరాలను ప్రస్తావించడం కూడా సహజమే.

కానీ ఒక రాష్ట్రం తన ప్రయోజనాన్ని చెప్పిన ప్రతిసారీ మరో రాష్ట్రాన్ని శత్రువుగా చూపించడం మాత్రం సమస్యను పరిష్కరించదు.

నదులు ఎవరి రాజకీయ సరిహద్దులను గుర్తించవు.

కృష్ణా నది తెలంగాణలో ప్రవహించి ఏపీలోకి వెళ్తుంది. గోదావరి కూడా అనేక ప్రాంతాలను దాటి సముద్రంలో కలుస్తుంది. ఒక రాష్ట్రం తీసుకునే నిర్ణయం మరో రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

అందుకే “మన నీరు – వారి నీరు” అనే భావన కంటే..

“మన ప్రజల నీటి అవసరాలను చట్టబద్ధంగా ఎలా తీర్చాలి?” అనే ప్రశ్న ముందుకు రావాలి.

విభజనకు 12 ఏళ్లు.. ఇంకా అదే చర్చ ఎందుకు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.

విభజన సమయంలో ఉన్న అనేక సమస్యలు కాలక్రమంలో పరిష్కారమయ్యాయి. మరికొన్ని సమస్యలు ఇంకా చర్చల్లో ఉన్నాయి. అయితే నీటి అంశం మాత్రం ప్రతి కొంతకాలానికి రాజకీయ అజెండాలోకి వస్తోంది.

దీనికి ఒక కారణం నీరు నేరుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉండటం.

రైతుకు నీరు అంటే పంట. పట్టణానికి నీరు అంటే తాగునీరు. పరిశ్రమకు నీరు అంటే ఉత్పత్తి. గ్రామీణ ప్రాంతానికి నీరు అంటే జీవనాధారం.

అందుకే నీటి అంశంపై ప్రజల్లో భావోద్వేగం ఎక్కువ.

కానీ అదే భావోద్వేగాన్ని రాజకీయ లాభం కోసం పదే పదే ఉపయోగిస్తే.. అసలు సమస్య మాత్రం అక్కడే ఉండిపోతుంది.

చంద్రబాబు చెప్పే వినియోగం.. తెలంగాణ చెప్పే హక్కు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి నీటిని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని, సముద్రంలోకి వెళ్లే వరద నీటిని ప్రజల అవసరాలకు మళ్లించాల్సిన అవసరం ఉందని పలుమార్లు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2026 జూలైలో పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి నీటిని ఆగస్టులో అందించే లక్ష్యాన్ని ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో మాత్రం తమ ప్రాజెక్టులు, భవిష్యత్ నీటి భద్రతపై ప్రభావం పడకూడదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా తెలంగాణలోని రాజకీయ నేతలు కూడా గోదావరి అంశంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

అంటే రెండు రాష్ట్రాలూ తమ ప్రజల ప్రయోజనాలనే ముందుకు తెస్తున్నాయి.

ఇప్పుడు అవసరం..

ఒకరి వాదనను మరొకరు ఓడించడం కాదు. ఇద్దరి అవసరాలను చట్టబద్ధమైన పరిష్కారంలోకి తీసుకురావడం.

రాజకీయాలకు అతీతంగా పరిష్కారం సాధ్యమేనా?

సాధ్యమే. కానీ దానికి రాజకీయ సంకల్పం అవసరం.

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న వివాదాలను కేవలం ముఖ్యమంత్రుల సమావేశాలతోనే పరిష్కరించడం కష్టం. నిపుణులు, ఇంజినీర్లు, నదీ యాజమాన్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ట్రిబ్యునళ్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.

ప్రతి రాష్ట్రం తన వాదనను బలంగా వినిపించవచ్చు.

కానీ చివరకు నిర్ణయం రావాల్సింది డేటా, చట్టం, నదీ ప్రవాహం, ప్రజల అవసరాలు, పర్యావరణ పరిమితులు వంటి అంశాల ఆధారంగా.

అప్పుడే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

నీటి కోసం కొట్లాట కాదు.. నీటి కోసం ప్రణాళిక కావాలి

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నీరు కావాలి.

ఏపీ రైతుకూ నీరు కావాలి. తెలంగాణ రైతుకూ నీరు కావాలి.

ఏపీకి తాగునీరు కావాలి. తెలంగాణకు కూడా తాగునీరు కావాలి.

రెండు రాష్ట్రాల పరిశ్రమలకు నీరు అవసరం. పట్టణాలకు కూడా అవసరం.

అందుకే ఒక రాష్ట్రం గెలవాలి.. మరో రాష్ట్రం ఓడిపోవాలి అనే దృక్పథం నీటి సమస్యకు పరిష్కారం కాదు.

నీరు ఒక రాజకీయ ఆయుధంగా మారినంత కాలం వివాదం కొనసాగుతూనే ఉంటుంది.

నీరు ఒక వనరుగా, ప్రజల హక్కుగా, శాస్త్రీయంగా నిర్వహించబడినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

చివరికి ప్రశ్న ఒక్కటే..

రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు.

ఇప్పటికీ ప్రతి నీటి అంశం వచ్చినప్పుడు పాత గాయాలను గుర్తు చేసుకోవాలా?

లేక..

ఇప్పటి అవసరాలను, రేపటి తరాల నీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని రూపొందించాలా?

కృష్ణా కావచ్చు.. గోదావరి కావచ్చు..

నది ప్రవహిస్తూనే ఉంటుంది. రాజకీయాలు మారుతూనే ఉంటాయి. కానీ నీటి అవసరం మాత్రం ఎప్పటికీ ఉంటుంది.

అందుకే నీటి వాటాల చుట్టూ సెంటిమెంట్ ఎంతకాలం?

ఇకనైనా సెంటిమెంట్‌కు బదులు శాశ్వత పరిష్కారం వైపు రెండు రాష్ట్రాలు అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.

Continue reading
కిరణ్ అబ్బవరం రేంజ్ మారబోతోందా..

ఇంద్ర పుత్రగా కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం రేంజ్ మారబోతోందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఈ మధ్య వరుస విజయాలు అందుకుంటున్నాడు. క, కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ మూవీస్ తో హిట్స్ కొట్టాడు. చెన్నై లవ్ స్టోరీ అయితే కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తనే దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. అంటే తనే హీరో, దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఈ టైమ్ లో ఓ క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.

కిరణ్ అబ్బవరం రేంజ్ మారుతోందా..

కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన అప్డేట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తన రేంజ్ ను మార్చుకునే క్రమంలోనే ఈ మూవీ చేయబోతున్నాడా అనే టాక్ వినిపిస్తోంది. లేదంటే ఈ కథ అతనికే సూట్ అవుతుందని భావించే సదరు దర్శకుడే అతని వరకు వెళ్లాడా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఇంతకీ ఈ అప్డేట్ ఏంటీ అంటే.. కిరణ్ అబ్బవరం హీరోగా ఓ మైథలాజికల్ మూవీ రూపొందబోతోంది. ఈ చిత్రానికి ‘ఇంద్ర పుత్ర’అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ ఇంద్ర పుత్రకు శ్రీకాంత్ పుప్పాల దర్శకుడు.

డెబ్యూ డైరెక్టర్ గా శ్రీకాంత్ పుప్పాల

శ్రీకాంత్ పుప్పాల అంటే ఇంతకు కాంతార 1 చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అంతకు ముందు కూడా చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉన్నవాడు. దర్శకుడుగా అతని ఫస్ట్ మూవీతోనే మైథలాజికల్ అంటే పెద్ద విషయమే. అది కూడా కిరణ్ అబ్బవరంతో అంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అదే టైమ్ లో కిరణ్ అబ్బవరం రైట్ ఛాయిస్ అనేలా కూడా ఉంది.

2027లోనే ఇంద్ర పుత్ర విడుదల

మరో విశేషం ఏంటంటే.. ఈ ఇంద్ర పుత్ర చిత్రాన్ని 2027లోనే విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జీ స్టూడియోస్ విడుదల చేయబోతుండటం మరో విశేషం. ఏదేమైనా కిరణ్ అబ్బవరం రేంజ్ ఈ మూవీతో మరో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Continue reading
అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ అతనితోనే

అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ

అఖిల్ అక్కినేని అంటే ఆ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్లే హీరో అనుకున్నారు. ఆల్రెడీ నాగ చైతన్య సత్తా చాటుతున్నాడు. బట్ అఖిల్ అక్కినేని విషయంలో అది కనిపించలేదు. గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆ మూవీతో డిజాస్టర్ చూశాడు. ఏమైతేనేం.. ఒక్క హిట్ కోసం పదేళ్లకు పైగా వెయిట్ చేశాడు. ఫైనల్ గా లెనిన్ తో హిట్ అందుకున్నాడు. ఇక గేర్ మార్చినట్టు కనిపిస్తున్నాడు. వరుస మూవీస్ తో దూసుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా అఖిల్ అక్కినేని లైన్ లోకి వచ్చాడు.

పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా పవన్ సాదినేని ఓ మూవీ చేయబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ సాదినేని .. దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార మూవీ చేస్తున్నాడు. ఇది ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాతే అఖిల్ అక్కినేనితో మూవీకి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. ఆకాశంలో ఒక తార పూర్తయిన తర్వాత ఈ కథ మీద పూర్తి స్థాయి చర్చలు సాగిస్తారని చెబుతున్నారు.

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్

అఖిల్ అక్కినేని అయితే ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే చాలామంది దర్శకుల కథలు వింటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నాడు. తర్వాత పవన్ సాదినేనితో వెళ్లబోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్ న్యూస్ ఇంకా రావాల్సి ఉంది.

Continue reading
విజయ్ సేతుపతి మూవీలో టబు కీలక పాత్ర

విజయ్ సేతుపతి కథ అంటే గ్యారెంటీ

విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అంటే బలమైన కథలతో ఆకట్టుకునే హీరో. ఒకవేళ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోయినా.. కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు రావు. అందుకే అతని మూవీస్ ని అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పటి వరకు మెజారిటీగా తమిళ్ డైరెక్టర్స్ తో మాత్రమే వర్క్ చేసిన విజయ్ సేతుపతి ఆ మధ్య ఉప్పెన మూవీతో బాగా మెప్పించాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తో ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’(SlumDog – 33 Temple Road) అనే మూవీ చేస్తున్నాడు. ఓ రకంగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. రీసెంట్ గా టీజర్ తో వచ్చారు. తాజాగా ఈ మూవీలో కీలకమైన పాత్ర చేస్తున్న టబు(Tabu)కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టబు

టబు అంటే నేషనల్ వైడ్ గా చాలా పాపులర్ అయిన నటి అని అందరికీ తెలిసిందే. అయితే తను కూడా చాలాకాలంగా తెలుగు సినిమాలు చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో పూరీ జగన్నాథ్ తో వర్క్ చేయడం మాత్రం చాలామందికి నచ్చింది. కథలు చెప్పడంలో పూరీ తర్వాతే ఎవరైనా అనే మాట కొన్నాళ్ల క్రితం ఉంది. బట్ ఇప్పుడు ఒకే కథతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలున్నాయి అతనిపై. ఆ కారణంగానే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఇప్పుడు స్లమ్ డాగ్ అతనికి డూ ఆర్ డై గా మారింది.

టబు గ్లింప్స్  బావుంది

ఇక టబు(TABU as GAURI HEGDE)కు సంబంధించిన గ్లింప్స్ మాత్రం ఇన్ స్టంట్ గా చాలామందికి నచ్చేలా ఉంది. తను ఈ మూవీలో గౌరీ హెడ్డే అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ఒక బస్తీలో ఉండే యూత్ ను టార్గెట్ చేస్తూ అందరినీ కొడుతున్న సీన్ లా ఉంది ఈ గ్లింప్స్. ఈ గ్లింప్స్ లో ‘మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం’అనే డైలాగ్ బావుంది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ కమీషనర్ గా కనిపిస్తోంది టబు. ఇక ఈ గ్లింప్స్ లో విజయ్ సేతుపతితో కూడా కొన్ని షాట్స్ ఉన్నాయి.

త్వరలో విడుదల కాబోతోన్న స్లమ్ డాగ్

ఏదేమైనా పూరీ జగన్నాథ్ ఈ సారి ఖచ్చితంగా కొట్టబోతున్నాడు అని చాలామంది భావిస్తున్నారు. మరి అతను కొడతాడా లేదా అనేది తెలియదు కానీ.. ఈ గ్లింప్స్ తో టబును చాలా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. మరి మూవీ త్వరలోనే విడుదల చేస్తాం అని కూడా ఈ గ్లింప్స్ లో చెప్పేశారు.

Continue reading
టాక్సిక్ మూవీ ట్రైలర్: యశ్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదు.. అద్దిరిపోయిన ట్రైలర్

టాక్సిక్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది

యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ కోసం ముందుగానే ట్రైలర్ విడుదల చేశార. ఈ ట్రైలర్ చూడగానే ఒక్కటే మాట అనిపిస్తోంది. ఎక్స్ ల్లెంట్.. ఎక్స్ ల్లెంట్.. ఎక్స్ ల్లెంట్.. దట్సిట్. ఈ రేంజ్ విజువల గ్రాండియర్ ను టాక్సిక్ నుంచి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు.

లేడీ డైరెక్టర్ అంటే నమ్మేలా లేదు టాక్సిక్ ట్రైలర్

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందించిన సినిమా ఇది. మామూలుగా ఇండియాలో లేడీ డైరెక్టర్స్ అంటే వాళ్లు ఎంచుకునే కథలు ఒక రకంగా ఉంటాయి. విమెన్ సెంట్రిక్ లేదంటే హీరో సెంట్రిక్. బట్ టాక్సిక్ చూస్తే వాల్డ్ ఆడియన్స్ సెంట్రిక్ గా ఉండబోతోంది అనిపించేలా ఉంది గీతూ మోహన్ దాస్ టేకింగ్ అండ్ మేకింగ్.

యశ్ రేంజ్ నెక్ట్స్ లెవల్ కాబోతోందా

యశ్ గతంలో చేసిన కేజీఎఫ్ తో మాస్ ను విపరీతంగా మెప్పించాడు. కేజీఎఫ్ కంటే ముందు యశ్ ను కన్నడ వాళ్లే మాగ్జిమం టైర్ టూ హీరోగానే తీసుకున్నారు. కేజీఎఫ్ తర్వాత దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడతను. ఆ కారణంగానే తన నెక్ట్స్ మూవీ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అలాంటిది ఓ మహిళా దర్శకురాలితో అనగానే చాలామంది కామెంట్స్ చేశారు. కొందరు విమర్శించారు. బట్ కామెంట్స్ కు, విమర్శలకు టాక్సిక్ మూవీ సమాధానం చెప్పింది అనేది వాస్తవం.

గ్యాంగ్ స్టర్ గా యశ్

యశ్ క్యారెక్టర్ ను చూస్తే ఓ పెద్ద గ్యాంగ్ స్టర్ లాగా ఉన్నాడు. అలాగే ప్లే బాయ్ పాత్రలాగానూ కనిపిస్తోంది. కనిపించిన అమ్మాయితో శారీరకంగా కలవడం.. అంతే కానీ వారితో మానసికంగా దగ్గరవడం లాంటివేం అతని లైఫ్ లో ఉండదు. అలాంటిది ఓ సర్కస్ లో డ్యాన్స్ చేసే కియారా అద్వానీని చూడగానే కూడా అలాగే ‘ఎంత అంటాడు’.. దానికి ఆమె మొహం మీద ఉమ్మేస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న ఈ కాంట్రాస్ట్ అద్భుతంగా ఉందనేది తెలుస్తుంది. అలాగే నయనతార మనం ఈ సిటీని ఏలాలి అంటుంది. తర్వాత తను విలన్స్ చేతిలో గన్ పాయింట్ లో కనిపిస్తోంది.

గన్ పాయింట్ లో కూడా పవర్ ఫుల్ గా

అదే గన్ పాయింట్ లో యశ్ ను కూడా ఉంచుతారు విలన్స్. అతనితో నీ చివరి కోరిక ఏంటీ అని అడుగతారు విలన్స్. దానికి ఆ గ్యాంగ్ కు లీడర్ గా ఉన్న మనిషితో ‘నీ తమ్ముడిని చంపేసి బూడిద చేసి ఆ బూడిద చూసి ఉఫ్’అనడమే నా చివరి కోరిక అంటాడు. అదీ చాలామంది గన్ పాయింట్ లో. అదీ మాస్ ను ఎలివేట్ చేసే విధానం. అలాగే రుక్మిణి వసంత్ అతని ఇంటికి వెళుతుంది. అప్పుడు అతను పూర్తి నగ్నంగా నిలుచుని ఉంటాడు. దానికి ఆమె ‘కాస్త సివిలైజ్డ్ కన్వర్జేషన్ చేసుకుందామా’ అంటుంది. దానికి అతను ‘నేను సివిలైజ్డ్ గా ఉన్నానా’అంటాడు. ఇలాంటివి సినిమాలో ఇంకా చాలానే ఉంటాయి అనిపించేలా ఉంది.

అన్ని పాత్రలలు సమస్థాయిలో

ఏదేమైనా టాక్సిక్ ట్రైలర్ చూస్తే నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి వారి పాత్రలు కూడా సరిగ్గా ఉండేలా డిజైన్ చేసినట్టుగా ఉంది దర్శకురాలు. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ సమపాళ్లలో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగానే ఉందని అర్థం అవుతోంది.
ఏదేమైనా టాక్సిక్ ట్రైలర్ మాత్రం ఎక్స్ ట్రార్డినరీగా ఉంది అనే మాట కూడా చిన్నగానే ఉంటుంది. మరి ఈ నెల 26న విడుదల కాబోతోన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..

కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. రిలీజ్ కు ముందు నుంచీ ఈ మూవీపై చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. దీంతో ష్యూర్ షాట్ అని చాలామంది భావించారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా కొరియన్ కనకరాజులోని పాజిటివ్ థింగ్స్ అన్నీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

సత్య కామెడీ హైలెట్ గా

రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన కొరియన్ కనకరాజులో సత్య కామెడీ చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఓ రకంగా అతను ఈ చిత్రానికి హీరో అన్నంత పనిచేశాడు. సినిమా ఆద్యంతం కనిపిస్తూ అదిరిపోయే పంచ్ లతో ఇరగదీశాడు. రితికా నాయక్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ కొరియన్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసే అమ్మాయిగా తనూ ఓకే అనిపించింది. అయితే వరుణ్, రితికా మధ్య మంచి ప్రేమకథ కూడా పడి ఉంటే ఇంకా బావుండేది.

మొదటి రోజు వసూళ్లు 10.20 కోట్లు

ఇక ఈ చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే 10.20 కోట్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ కెరీర్ బాగా డల్ అయింది. అలాంటి టైమ్ లో వచ్చిన కొరియన్ కనకరాజు మంచి వసూళ్లు సాధించడం మాత్రం మంచి పరిణామమే అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు వచ్చిన వసూళ్లు. ఫస్ట్ డే మంచి మౌత్ టాక్ కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్ లో మరింత మంచి ఫిగర్స్ కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Continue reading
సిద్ధు జొన్నలగడ్డతో నాగవంశీ భారీ OTT ప్రాజెక్ట్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెబ్ సిరీస్

సిద్ధు జొన్నలగడ్డకు మరో OTT ఛాన్స్

ప్రొడ్యూసర్ గా తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు నాగవంశీ. కొత్త కథలు కాకపోయినా ఆ కథలను కొత్తగా చెప్పే దర్శకులను బాగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాగవంశీ. అలాంటి నాగవంశీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా భవిష్యత్ అంతా ఓటిటిలదే అన్నాడు. ఓటిటిల్లోనే మూవీ రావడం పక్కా అన్నాడు. అంతే కాదు.. ఓటిటి మూవీస్ ట్రైయల్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండతో నెట్ ఫ్లిక్స్ లో ఓ మూవీ చేస్తున్నానని.. అది త్వరలోనే విడుదల కాబోతోంది అని కూడా చెప్పాడు. మరి ఆ ట్రైయల్ అతనికి బాగా నచ్చిందో ఏమో.. లేటెస్ట్ గా మరో భారీ కంటెంట్ తో ఓటిటి మూవీ అనౌన్స్ చేయబోతున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్ధు

సిద్ధు జొన్నలగడ్డ అంటే నాగవంశీ క్యాంప్ మనిషి అనేది క్లియర్. అతనితో చేసిన డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినా అతనిపై నమ్మకంతో నాగవంశీ మూవీ చేయబోతున్నాడు. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం.

భారీ తారాగణంతో ఓటిటి మూవీ

ఇది పూర్తిగా ఓటిటిలోనే రాబోతోన్న మూవీ అట. అత్యంత భారీ బడ్జెట్ ను కూడా పెట్టబోతున్నారని చెబుతున్నారు. భారీ తారాగణం కూడా ఉండబోతోందంటున్నారు. ఏదేమైనా నాగవంశీ ప్లానింగ్ అంటే ప్లానింగ్ అంటున్నారు చాలామంది. సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌధరి జంటగా వెంకీ అట్లూరి మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నట్టే. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ కంటెంట్ కూడా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Continue reading
బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల బంగారు బోనం ఎత్తింది

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు.

అనంతరం నిహారిక మాట్లాడుతూ,

ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ తనను ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు.

అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత

కొద్ది రోజుల క్రితమే “నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది” అని సరదాగా అన్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు. “అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. ఈరోజు దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగింది. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించింది. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను” అని నిహారిక అన్నారు.

నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Continue reading
Bharat Bhhagya Viddhaata: కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’ కథేంటి? OTT రిలీజ్ డేట్ ఎప్పుడు..?

భారత భాగ్య విధాత మూవీ

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ప్రత్యేకమైన కథ. సాధారణంగా 26/11 ఘటనలను ఉగ్రవాదులు, భద్రతా దళాల కోణంలోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ సినిమా మాత్రం ఆ సమయంలో ఆసుపత్రిలో చిక్కుకున్న వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వైద్య సిబ్బంది, నర్సులు, వార్డ్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల ధైర్యాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

కంగనా రనౌత్, గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మితా తాంబే తదితరులు నటించిన ఈ చిత్రానికి మనోజ్ తపాడియా రచన, దర్శకత్వం వహించారు. పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ తదితర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ అనంతరం ZEE5లో ఈ నెల 14నుంచి స్ట్రీమ్ కాబోతోందీ మూవీ.

Bharat Bhhagya Viddhaata సినిమా కథేంటి?

‘భారత్ భాగ్య విధాత’ కథ 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల సమయంలో చోటుచేసుకున్న సంఘటనల స్ఫూర్తితో రూపొందింది. అయితే ఈ సినిమా మొత్తం దాడుల భయానకతను చూపించడంపైనే ఆధారపడకుండా, ఆ సమయంలో కామా అండ్ అల్బ్లెస్ ఆసుపత్రిలోని సిబ్బంది ఎలా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుంది.

ఉగ్రవాదులు ముంబైలో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా తమ సంరక్షణలో ఉన్న రోగులను వదిలిపెట్టకుండా విధుల్లో కొనసాగిన ఆసుపత్రి సిబ్బంది ధైర్యాన్ని ఈ సినిమా కథనం ముందుకు తీసుకొస్తుంది.

ఈ నేపథ్యంలో నర్సులు, వార్డ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాలే కథకు ప్రధాన బలం. ట్రైలర్ వివరాల ప్రకారం, ఆసుపత్రిలో ఉన్న దాదాపు 400 మంది ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది చేసిన పోరాటం కథలో కీలకంగా ఉంటుంది.

26/11 కథను మరో కోణంలో చూపించిన సినిమా. 26/11 ముంబై దాడులపై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం ఉగ్రదాడులు, పోలీసుల చర్యలు, కమాండోల ఆపరేషన్లు, బాధితుల కోణాలపై దృష్టి పెట్టాయి.

‘Bharat Bhhagya Viddhaata’ ప్రత్యేకత మాత్రం ఆసుపత్రి సిబ్బంది ధైర్యాన్ని కథకు కేంద్రంగా చేసుకోవడంలోనే ఉంది. ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు వైద్య సిబ్బంది తమ బాధ్యతను కొనసాగించాల్సిన పరిస్థితి. రోగులను వదిలి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ అక్కడే ఉండి సేవ చేయడం వెనుక ఉన్న మానవత్వాన్ని సినిమా చూపించే ప్రయత్నం చేసింది. అందుకే ఇది కేవలం 26/11 ఉగ్రదాడులపై రూపొందిన థ్రిల్లర్‌గా కాకుండా, సంక్షోభ సమయంలో మానవత్వం, బాధ్యత, ధైర్యం ఎలా పరీక్షకు గురవుతాయో చెప్పే డ్రామాగా చూడవచ్చు.

కంగనా రనౌత్ పాత్ర ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో కంగనా రనౌత్ ఒక ధైర్యవంతమైన నర్సు పాత్రలో కనిపిస్తుంది. ట్రైలర్‌లో ఆమె పాత్రను తీవ్రమైన పరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు ప్రయత్నించే ఆసుపత్రి సిబ్బందిలో ఒకరిగా చూపించారు.

కంగనా గతంలో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ, ‘Bharat Bhhagya Viddhaata’లో ఆమె పాత్ర యాక్షన్ కంటే బాధ్యత, భయం, మానసిక ఒత్తిడి, ధైర్యం చుట్టూ తిరుగుతుంది.

ఈ పాత్రలో ఆమెను కేవలం స్టార్‌గా కాకుండా కథలోని ఒక కీలకమైన పాత్రగా చూపించడం సినిమాకు ఉపయోగపడే అంశంగా కనిపిస్తుంది.

గిరిజా ఓక్, స్మితా తాంబే కీలక పాత్రల్లో..

కంగనా రనౌత్‌తో పాటు గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మితా తాంబే, సుహితా థత్తే, ఆశా షెలార్, ప్రియా బెర్డే తదితరులు ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ క్రెడిట్స్‌లో ఈ నటీనటుల పేర్లు అధికారికంగా పేర్కొనబడ్డాయి.

ప్రత్యేకంగా ఆసుపత్రి నేపథ్యం కావడంతో కథలో ఒక్క హీరో చుట్టూనే సినిమా తిరగకుండా పలువురు పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. అందువల్ల సినిమా అసలు ఉద్దేశం ఒక వ్యక్తిని మాత్రమే హీరోగా చూపించడం కాకుండా, ఆ సమయంలో సేవ చేసిన మొత్తం ఆసుపత్రి సిబ్బందిని గుర్తు చేయడంగా చెప్పవచ్చు.
ఈ చిత్రానికి మనోజ్ తపాడియా రచయిత, దర్శకుడు. 26/11 వంటి ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన ఘటనను మరో కోణంలో చెప్పడం దర్శకుడికి పెద్ద సవాలే. ఎందుకంటే ప్రేక్షకులకు సంఘటనల నేపథ్యం ముందే తెలుసు. అలాంటి కథలో ఉత్కంఠను కొనసాగించాలంటే పాత్రల భావోద్వేగాలు, పరిస్థితుల తీవ్రత, కథనం కీలకంగా మారతాయి.

‘Bharat Bhhagya Viddhaata’లో అదే అంశాన్ని ఉపయోగించినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఉగ్రదాడుల మధ్య ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులు, వారిని కాపాడేందుకు ప్రయత్నించే సిబ్బంది మధ్య జరిగే పరిణామాలు కథకు థ్రిల్లర్ టచ్‌ను తీసుకొస్తాయి.

Bharat Bhhagya Viddhaata సినిమా ఎందుకు ప్రత్యేకం?

ఈ సినిమా ప్రత్యేకత కేవలం 26/11 నేపథ్యం కాదు. ఆ ఘటనను గుర్తు చేసుకునే సమయంలో మన దృష్టికి రాని మరో వర్గాన్ని కథానాయకులుగా నిలబెట్టడమే దీని ప్రధాన బలం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బంది గురించి మనకు తెలుసు. కానీ ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, తమ ముందు ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు భయాన్ని పక్కన పెట్టిన సాధారణ ఉద్యోగుల ధైర్యం కూడా అంతే ముఖ్యమైనది. ఈ కోణంలో సినిమా ‘హీరో అంటే ఆయుధం పట్టుకున్న వ్యక్తి మాత్రమే కాదు’ అనే భావనను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.

సినిమా టైటిల్‌కు తగ్గ కథేనా?

‘Bharat Bhhagya Viddhaata’ అనే టైటిల్‌కు భారతదేశ భవిష్యత్తును నిర్మించే వ్యక్తులు అనే విస్తృతమైన అర్థం ఉంది. ఈ కథలో దేశాన్ని కాపాడే బాధ్యతను భద్రతా దళాలకే పరిమితం చేయకుండా, అత్యవసర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యత నిర్వర్తించిన ఆసుపత్రి సిబ్బందిని కూడా ఆ భావనలో భాగంగా చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే సినిమా టైటిల్ కథలోని ‘అజ్ఞాత వీరులు’ అనే భావనకు సరిపోతుందని చెప్పొచ్చు.

Bharat Bhhagya Viddhaata మూవీ OTT రిలీజ్ ఎక్కడ?

‘Bharat Bhhagya Viddhaata’ థియేటర్లలో 2026 జూన్ 12న విడుదలైంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ కానుందని ముందుగానే వెల్లడించారు. ఓటిటిలో ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగానే ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమ్ అవుతుందన్నమాట. మరి థియేట్రికల్ గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందీ చిత్రం. మరి ఓటిటిలో భారత భాగ్య విధాతకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

Continue reading