రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నిలబడతాడా

రవితేజ వారసత్వం మాధవ్ నిలబెడతాడా

మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) తమ్ముడు రఘు రాజు తనయుడు మాధవ్ భూపతి(Madhav Bhupathi Raju) రాజు హీరోగా నిలబడతాడా..? తాజాగా విడుదలైన అతను హీరోగా నటించిన మారెమ్మ ట్రైలర్ చూస్తుంటే అతను ఇంకా చాలా చాలా షైన్ కావాల్సి ఉంది అనిపిస్తోంది. ట్రైలర్ లోనే అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ మైనస్ గా కనిపిస్తోంది అనేది వాస్తవం. ఈ మూవీ కోసం అతను చాలా టైమ్ తీసుకున్నాడు. చాలామంది నిర్మాతలు కూడా కనిపిస్తున్నారు. కంటెంట్ తెలంగాణ నేపథ్యంగా ఉంది. తెలంగాణలో మారెమ్మ తల్లి గురించి తెలియని వారు ఉండరు. అందుకే ఆ నేపథ్యం తీసుకున్నాడేమో అనుకోవచ్చా లేక నిజంగానే ఈ కథలో ఏదైనా నావల్టీ ఉందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

మారెమ్మ ట్రైలర్ ఎలా ఉంది

ఇక మారెమ్మ ట్రైలర్(Maremma Trailer) పరంగా చూస్తే ఇది తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే కథ అని అర్థమౌతుంది. మారెమ్మ కోసం మొక్కుకున్న ఓ ఎద్దు చుట్టూ సాగే కథగా ఉంది. ఆ ఎద్దుకంటే ముందు ఊరంతా ఇబ్బందులు పడుతుంది. పశువులు చనిపోతుంటాయి. ఆ కారణంగా ఎద్దు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి హీరో సాకుతాడు. ఓ రకంగా చూస్తే అతనో పశువుల కాపరి. అతనికి చదువుకున్న అమ్మాయితో ప్రేమ ఉంటుంది. అదే ఊరిలో ఉన్న దొరల కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏంటీ..? వాటిని ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథగా ఉండబోతోందని తెలుస్తోంది.

ట్రైలర్ లో మేటర్ లేనట్టుగా ఉంది

మారెమ్మ ట్రైలర్ లో పెద్దగా విషయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆకట్టుకునే కంటెంట్ లాగా కూడా లేదు. హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా పెద్దగా బలం లేనట్టుగా చూపించారు. హీరోయిన్ పాత్రను కూడా మాగ్జిమం లైట్ తీసుకున్నారు అనేలా ఉంది. మిగతా పాత్రలు కూడా పెద్ద గొప్పగా కనిపించడం లేదు. కొన్ని పాత్రలు మరీ రొటీన్ గా ఉండబోతున్నాయి అనిపించాయి.

ఇరుముడి సెంటిమెంట్ మారెమ్మతో రిపీట్ అవుతుందా..

రవితేజ రీసెంట్ గా దేవుడి కంటెంట్ తో ఉన్న ఇరుముడితో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మారెమ్మతో మాధవ్ కూడా విజయం అందుకుంటాడు అని కొంతమంది సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నారు. మరి చూద్దాం.. విజయం అందుకుంటాడా లేదా అనేది.
మారెమ్మ ఈ నెల 10న విడుదల కాబోతోంది. మంచాల నాగరాజు(Manchala Nagaraju) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు(Mayur Reddy Bandaru) నిర్మించాడు. ప్రశాంత్ ఆర్ విహారి(Prashanth R. Vihari) సంగీతం అందించాడు.

Continue reading