వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..

కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. రిలీజ్ కు ముందు నుంచీ ఈ మూవీపై చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. దీంతో ష్యూర్ షాట్ అని చాలామంది భావించారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా కొరియన్ కనకరాజులోని పాజిటివ్ థింగ్స్ అన్నీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

సత్య కామెడీ హైలెట్ గా

రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన కొరియన్ కనకరాజులో సత్య కామెడీ చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఓ రకంగా అతను ఈ చిత్రానికి హీరో అన్నంత పనిచేశాడు. సినిమా ఆద్యంతం కనిపిస్తూ అదిరిపోయే పంచ్ లతో ఇరగదీశాడు. రితికా నాయక్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ కొరియన్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసే అమ్మాయిగా తనూ ఓకే అనిపించింది. అయితే వరుణ్, రితికా మధ్య మంచి ప్రేమకథ కూడా పడి ఉంటే ఇంకా బావుండేది.

మొదటి రోజు వసూళ్లు 10.20 కోట్లు

ఇక ఈ చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే 10.20 కోట్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ కెరీర్ బాగా డల్ అయింది. అలాంటి టైమ్ లో వచ్చిన కొరియన్ కనకరాజు మంచి వసూళ్లు సాధించడం మాత్రం మంచి పరిణామమే అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు వచ్చిన వసూళ్లు. ఫస్ట్ డే మంచి మౌత్ టాక్ కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్ లో మరింత మంచి ఫిగర్స్ కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Continue reading
వరుణ్ తేజ్ మిగతా మూవీస్ ను డామినేట్ చేస్తాడా.. తేలిపోతాడా..

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు

వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్. రీసెంట్ గా విడుదలైన కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో వరుణ్ తేజ్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే భావన చాలామందిలో ఉంది. ఈ నెల 7న కొరియన్ కనకరాజు విడుదలవుతోంది. అయితే అదే రోజు మరికొన్ని మూవీస్ విడుదల కాబోతున్నాయి. మరి ఈ మూవీస్ వల్ల కొరియన్ కనకరాజుకు ఇబ్బంది అవుతుందా లేక వాటిని దాటి నిలబడతాడా అంటే చెప్పలేం.

అనకాపల్లి మూవీ

ఇక ఈ నెల 7న కొరియన్ కనకరాజుతో పాటు రెండు తెలుగు మూవీస్ తో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో అనకాపల్లి(Anakapalle) ఉంది. అనకాపల్లిలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. త్రినాథరావు నక్కిన(Trinadharao Nakkina) కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తను ఓ కీలక పాత్ర చేశాడు. ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ప్రమోషన్స్ పరంగా ఇంకాస్త బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది.

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల హీరోలుగా

మరో తెలుగు మూవీ అంటే కే.జే. క్యూ ఉంది(KJQ – King Jackie Queen)ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల హీరోగా నటించిన మూవీ ఇది. శశితో పాటు దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) మరో హీరో. యుక్తి తరేజా(Yukthi Thareja) హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోందీ మూవీ. దర్శకుడు కె.కె ఈ మూవీ చివరి దశలో చనిపోయాడు. అతనికి అంకితం చేస్తున్నట్టుగా ప్రతి ప్రమోషన్ లో కూడా చెబుతోందీ మూవీ టీమ్.

లోకేష్ కనకరాజ్ హీరోగా సక్సెస్ అవుతాడా..

ఇక డబ్బింగ్ మూవీస్ లో అయితే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) హీరోగా మారిన మూవీ DC. డిసి అంటే దేవదాస్, చంద్ర అనే ఇద్దరి పేర్ల ఫస్ట్ లెటర్స్. చంద్రగా వామికా గబ్బి(Wamiqa Gabbi) నటిస్తోంది. ఈ ఇద్దరి మీద మూవీ మొత్తం ఉండబోతోంది అనిపించేలా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. లోకేష్ కనకరాజ్ స్టైల్లోనే ఊర మాస్ యాక్షన్ కథగా ఉండబోతోందీ మూవీ. కాకపోతే తెలుగులో పెద్దగా పట్టించుకోవడం లేదీ మూవీని.
ఇక ఆర్ మాధవన్(R.Madhavan) నటించిన మరో తమిళ్ మూవీ ‘జి.డి. నాయుడు’. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ ఇది. అయితే తెలుగులో మాత్రం మినిమం ప్రమోషన్స్ కూడా లేవు ఈ చిత్రానికి. కాకపోతే ట్రైలర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

ఎవరిది పై చేయి

మొత్తంగా ఈ నాలుగు సినిమాలతో ఈ వారం మొత్తం ఆక్యూపై అయింది. మరి ఈ నాలుగింటిలో కొరియన్ కనకరాజు డామినేషన్ మాత్రం స్పష్టంగా ఉంది. కాకపోతే కంటెంట్ లో దమ్ముంటే మిగతా మూవీస్ పై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఏదేమైనా ఈ నాలుగింటిలో ఏ మూవీ ది బెస్ట్ అనిపించుకుంటుందో అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Continue reading
కొరియన్ కనకరాజు టీజర్ అదిరిందిగా..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిని ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఓటిటి, శాటిలైట్ రైట్స్ ఇంకా పూర్తి కాలేదు అనే కారణంతో ఇప్పటి వరకు ఆగారు. ఫైనల్ గా ఆ రైట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. దీంతో మూవీని ఆగస్ట్ 7న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. తాజాగా కొరియన్ కనకరాజు మూవీ టీజర్ విడుదల చేశారు.
కొరియన్ కనకరాజు అనే టైటిలే బాగా ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ కు అందుకు భిన్నంగా మొదలై.. ఆ టైటిల్ కు తగ్గట్టుగా ఉండేలా టీజర్ ఎండ్ చేశారు. పెనుగొండ అనే ఊరిలో ఉండే కనకరాజు.. ఆవారాగా ఉంటాడు. ఎప్పుడూ మందు, చిందులు, ఊర్లో గొడవలు అంటూ ఉంటుంటాడు. అలాంటి అతని ఊరికి ఓ అమ్మాయి వస్తుంది. తను కొరియన్ లో ఏదో మాట్లాడుతుంది. కట్ చేస్తే అదే భాషలో కనకరాజు కూడా మాట్లాడ్డం మొదలు పెడతాడు. అంతే కాదు అతనికి ఏకంగా మాయలు కూడా మొదలవుతాయి. మొదట్లో అతని ఫ్రెండ్ క్యాజువల్ గా తీసుకుంటాడు. కానీ అతనికి సీరియస్ గానే కొన్ని మాయలు వస్తుంటాయి. దాని కారణంగా అతను కాస్త బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. అలాగే టీజర్ లో కనకరాజును పరిచయం చేస్తున్నప్పుడు అన్నీ కొరియన్ విజువల్స్ వస్తుంటాయి. మరి వాటి వెనక ఉన్న కారణం ఏంటీ.. నిజంగానే అతనికి కొరియన్ దెయ్యం పడుతుందా.. పడితే ఆ దెయ్యం కనకరాజును ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టీజర్ మాత్రం సింపుల్ గా చాలా బావుందని చెప్పాలి. మాస్ అండ్ క్లాస్ తో పాటు కామెడీ హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో పుష్కలంగా ఉండబోతున్నాయి అనిపించేలా ఉంది టీజర్ కట్. టీజర్ తోనే ఆకట్టుకున్నారంటే తర్వాత ట్రైలర్.. ఆపై మూవీతో మంచి విజయం కూడా అందుకోబోతున్నారు అనిపించేలా ఉంది.
ఇక వరుణ్ తేజ్ కనకరాజుగా అతని ఫ్రెండ్ సత్య కనిపిస్తున్నారు. హీరోయిన్ రితికా నాయక్ కు ఇది ఓ మంచి అవకాశం అనేలా ఉంది. ఏదేమైనా టీజర్ మాత్రం చాలా బావుందనే చెప్పాలి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Continue reading