వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2నుంచి అవుట్

టాలీవుడ్ 2నుంచి వెంకటేష్ అవుట్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47′ (AK47).వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ రావాలని అభిమానులు చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీరి నిరీక్షణ ఫలించింది. అయితే ఈ మూవీ అక్టోబర్ 2న విడుదలవుతుందని గతంలోనే ప్రకటించారు. బట్ ఈ డేట్ లో మార్పు వచ్చింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి వాయిదా వేశారు. దీంతో పాటు అక్టోబర్ లో విడుదల కాబోతోన్న మూవీస్ చూస్తే రిలీజ్ డేట్స్ ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 2న తెల్ల కాయితం

అక్టోబర్ 2న తెల్ల కాయితం విడుదల కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న మూవీ ఇది. దీనిపై మంచి అంచనాలున్నాయి. కొత్త దర్శకుడే అయినా టైటిల్ నుంచి పబ్లిక్ లో హైలెట్ కావడం కూడా మూవీకి పెద్ద ప్లస్ అయింది. చాలా వేగంగా చిత్రీకరణ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అప్పుడే ఫిక్స్ కావడం చూసి సినిమా వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 15న రజినీకాంత్

ఇక దసరా బరిలో ఉన్న మూవీస్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అంతా ఊహించినట్టుగానే రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్ 2 ను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదు. బట్ ఈ రిలీజ్ డేట్ మాగ్జిమం ఖాయం అయిందని చాలామంది చెబుతున్నారు.

అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ

అక్టోబర్ 16న మోస్ట్ అవెయిటెడ్ మూవీ రణబాలి కూడా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ఇది. మామూలుగా అయితే ఇది సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. రష్మిక మందన్నాకు గాయం కారణంగా ఒక నెల వాయిదా వేశారు. ఇది అక్టోబర్ 16న విడుదలవుతుందని రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ధనుష్ కూడా అక్టోబర్ 16నే

అక్టోబర్ 16న విడుదల కాబోతోన్న తమిళ్ మూవీ ఓమ్. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. మమ్మూట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ కూడా తెలుగులో బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ అక్టోబర్ భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఈ పోటీలో ఎవరు బలంగా నెగ్గుతారో అనేది చూడాలి.

 

Continue reading
చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్.. వీరులో గెలిచేది ఎవరు..?

 ఓ రేంజ్  2027 సంక్రాంతి

సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు మంచి ఊపొస్తుంది. చాలా పెద్ద స్టార్ హీరోలు నటించిన మూవీస్ ఆ టైమ్ కు విడుదల చేస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ మారింది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీస్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. ఆ కారణంగానే చాలా ముందుగానే వీళ్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంటారు. అలా ఈ 2027 సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి అవేంటో చూద్దాం.

సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్

సంక్రాంతి హాలిడేస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ కు వస్తుంటారు. అందుకే జనవరి 12న సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన మూవీ సంబరాల ఏటి గట్టు మూవీ విడుదల కాబోతోంది. ఓ రకంగా చూస్తే ఇది గతేడాది లేదంటే ఈ యేడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ బాగా ఆలస్యం అవుతోంది. సాయిదుర్గా తేజ్ విరూపాక్ష తర్వాత చేస్తున్న మూవీ ఇది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతోన్న మూవీ ఇది. ఫైనల్ గా ఇది సంక్రాంతికి వస్తుందని మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించారు.

జనవరి 14న శర్వానంద్ మూవీ

జనవరి 14న రిలీజ్ అని సినిమా ప్రారంభానికి ముందే డేట్ ఇచ్చిన మూవీ శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోది. వీళ్ల కాంబోలో చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. మామూలుగా అయితే శ్రీను వైట్ల ఇప్పుడు ఫామ్ లో లేడు. ఓ రకంగా ఇది అతని చివరి ప్రయత్నం అనుకోవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

అనిల్ రావిపూడి లైన్ లో ఉన్నాడు

ఇక రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ వెంకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడదుల చేశారు. మరి ఈ మూవీతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని చాలామంది భావిస్తున్నారు.

చిరంజీవి కూడా సంక్రాంతి బరిలోనే

ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ కూడా సంక్రాంతికే వస్తోందంటున్నారు. వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్, బాబీ కాంబోలో మూవీ అంటే మంచి అంచనాలే ఉంటాయి. వాటిని అందుకోవడం ఖాయం అనేలా వీళ్లు ఫీల్ అవుతున్నారు. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోందీ మూవీలో. చిరంజీవికి కూతురు లాంటి పాత్ర చేస్తుందని సమాచారం. బట్ వీళ్లు సంక్రాంతికే రావడం మాత్రం పక్కా అంటున్నారు.

మరికొన్ని మూవీస్ సంక్రాంతి బరిలో

ఓ రకంగా ఈ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయి. బట్ సంక్రాంతి టార్గెట్ గానే మరికొన్ని మూవీస్ ఉన్నాయి. రజినీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి డైరెక్షన్ లో స్టార్ట్ అయిన మూవీ సంక్రాంతికే పక్కా అంటున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ‘జాంబిరెడ్డి 2’ కూడా సంక్రాంతి బరిలో విడుదలవుతుంది. లేదంటే ప్రశాంత్ వర్మ ప్రొడ్యూస్ చేస్తున్న మహాకాళి అయినా సంక్రాంతికే విడుదలవుతుందంటున్నారు.
అలాగే రష్మిక మందన్నా మెయిన్ లీడ్ గా చేస్తోన్న మైసా మూవీ కూడా సంక్రాంతికే విడుదలవుతుందని చెబుతున్నారు. మరి ఇంతమందితో కలిసి బరిలో నిలవడం రైటేనా అనేది తెలియాల్సి ఉంది. బట్ మైసా మాత్రం ప్యాన్ ఇండియా మూవీ. కాబట్టి రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇన్ని మూవీస్ తో ఈ సారి సంక్రాంతి మరింత రంజుగా ఉండబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading