నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్ విడుదల

నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి

నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఎలియాస్ రుక్మిణి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ హీరోగా కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. తను అనుకున్న ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. ఓ దశలో చాలామంది ఇక నితిన్ హీరోగా తప్పుకుంటే బావుంటుందని కూడా కామెంట్స్ చేశారు. అన్నీ మైండ్ లోకి తీసుకున్నాడు నితిన్. కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాతే ఈ ఎలియాస్ రుక్మిణితో వస్తున్నాడు.
విశేషం ఏంటంటే ఎలియాస్ రుక్మిణికి హీరో నాని ప్రెజెంటర్. అంటే నాని గతంలోనే మురళీకాంత్ తో చర్చలు నడిపించాడు. దీంతో మురళీకాంత్ తో డైరెక్షన్ లోనే నాని నటించబోతున్నాడు అని చాలామంది భావించారు. బట్ ఫైనల్ గా ఆ ప్లేస్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. మరి దీనికి నానియే కారణమా లేక మురళీకాంత్ డెసిషనా అనేది తెలియాల్సి ఉంది.

నితిన్ ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్

ఇక గ్లింప్స్ చూస్తే.. నాని ఈ కథ గురించి తెలుకోవాలని దర్శకుడు మురళీకాంత్ ను అడుగినట్టుగా చూపించారు. ‘హాయ్ మురళీ.. దేని గురించి ఈ కథ అని నాని అడిగితే.. దానికి ఈ కథ కృష్ణ గురించి అన్నా’అంటాడు మురళీ. కృష్ణ ఓ నవలా రచయితగా చూపించారు. కట్ చేస్తే అతని ఊహల నుంచి కొన్ని నవలలు వస్తాయి అని చూపించారు. అందులో భాగంగా మొదటి నవల గరం గోపాల్ అని ఉంటుంది. అలాగే ఓ లెస్బియన్ నవలగా ఆమెకు ఆమె అంటే ఇష్టం అనేలా మరోటి ఉంటుంది. మూడోదిగా వ్రతం వెంకన్న అనే నవల రాసినట్టుగా ఉంటుంది. అంటే భార్య కోరికలను తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి నవలగా ఇది కనిపిస్తోంది అనేలా ఉంది.

రచయితగా నితిన్

ఇవన్నీ చూసిన తర్వాత నాని వెంటనే అడుగుతాడు.. మరి ఈ రుక్మిణి అని. దానికి వీడియోలో నితిన్ చెబుతున్నట్టుగా ‘నా వైఫ్’అంటాడు. మరి ఆ భార్య ఎవరు.. అతనికి రచయితగా తను ఎంత ఇన్సిస్పిరేషన్ గా నిలుస్తుంది.. అసలు నిజంగా ఆమె ఉంటుందా లేదా అనేది తెలియాల్సిన కథ అని అర్థమవుతుంది.
దీప్తి గంటా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సింగీతం అందించబోతున్నాడు. ఏదేమైనా నితిన్ కు ఈ మూవీ అత్యంత కీలకం అనేది మాత్రం వాస్తవం. మరి ఆ వాస్తవాన్ని నిలబెట్టుకునేలా ఎలియాస్ రుక్మిణి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడమేంటి

కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్

ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లంతా ఆఫర్స్ తగ్గగానే ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునేవారు. మెల్లగా ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్ లుగా వెలుగుతున్న టైమ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. అయితే వారి ఇమేజ్ కు తగ్గట్టుగా మాత్రమే ఇది కనిపించేది. అలాంటిది కీర్తి సురేష్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటే మాత్రం చాలామంది నమ్మలేకపోతున్నారు. బట్ ఇది నిజం. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఐటమ్ లో చిందేస్తోంది.

వరుస మూవీస్ తో బిజీ

కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీగా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ సరసన మరో మూవీ చేస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్, కృతిశెట్టి మరో జంటగా నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని మూవీస్ చేస్తోంది. అలాంటి టైమ్ లో కీర్తి సురేష్ సడెన్ గా ఐటమ్ సాంగ్ చేయడం ఆశ్చర్యమే.

ద ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్

Keerthy Suresh Movies, The Paradise Movieనేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ద ప్యారడైజ్’మూవీలో కీర్తి సురేష్ ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇది ఈ నెల 28నుంచే చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది కదా. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఐటమ్ సాంగ్ పెద్ద బ్యాలన్స్ గా ఉంది. ఈ పాట కేవలం నాని కోసమే చేస్తోంది అనేది చాలామందికి తెలిసిన విషయం. నానితో కీర్తి సురేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కారణంగానే ఈ ఐటమ్ లో చిందేస్తోందా లేక ఫ్యూచర్ లో కూడా ఈ టైప్ స్పెషల్ సాంగ్స్ తో నర్తిస్తుందా అనేది చూడాలి.
కానీ కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడం ఆమె అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అని చెప్పాలి.

Continue reading
నాని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

నేచురల్ స్టార్ ఈ మధ్య తన రేంజ్ మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ముఖ్యంగా మాస్ హీరో అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో సక్సెస్ అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే అతని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఇంతకు ముందు అతనితోనే ఊరమాస్ గెటప్ తో దసరా మూవీ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని గత మార్చిలోనే విడుదల చేస్తాం అని చెప్పారు. బట్ మాట దాటేశారు. కొత్త రిలీజ్ డేట్ గా ఆగస్ట్ 21న అన్నారు. అదీ పోయింది. అసలు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుందా అని ఆడియన్స్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మామూలుగా ఈ మధ్య రిలీజ్ డేట్ లు బాగా వాయిదా పడుతున్న మూవీస్ పై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా పోయింది అనేది అందరికీ తెలిసిందే. కేవలం దసరాతో మాత్రం ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెలకు ప్లానింగ్ పై అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. తీసిందే తీస్తూ ఉంటున్నాడట. దీంతో నిర్మాతలకు మండిపోయినా కామ్ గా ఉండిపోతున్నారట. ఒక్కసారి కథ ఫైనల్ అయితే మూవీ చేయడం సులువు అవుతుంది. బట్ అతను అదే పనిగా సెట్స్ లో కూడా కథలో మార్పులు చేస్తున్నాడట. ఈ కారణంగా బాగా ఆలస్యం అవుతోంది అని టాక్. అదీ కాక క్లైమాక్స్ చిత్రీకరణ సరిగా రాలేదట. దీంతో మొత్తం క్లైమాక్స్ ను మళ్లీ షూట్ చేయాలట.అదీ కాక ఓ ఐటమ్ సాంగ్ కూడా బ్యాలన్స్ ఉందట. ఈ కారణంగానే ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. బట్ ఈ డేట్ కు కూడా రావడం దాదాపు అసాధ్యం అని తేలింది. అన్నీ సెట్ అయితే దసరాకు రావొచ్చు. లేదంటే డిసెంబర్ వరకు ఆగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఏదేమైనా సరైన ప్లానింగ్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. అదీ ఇంకా కొనసాగుతూనే ఉండటం మరింత ఇబ్బందిగా మారిందట.

Continue reading