కిరణ్ అబ్బవరం రేంజ్ మారబోతోందా..

ఇంద్ర పుత్రగా కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం రేంజ్ మారబోతోందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఈ మధ్య వరుస విజయాలు అందుకుంటున్నాడు. క, కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ మూవీస్ తో హిట్స్ కొట్టాడు. చెన్నై లవ్ స్టోరీ అయితే కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తనే దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. అంటే తనే హీరో, దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఈ టైమ్ లో ఓ క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.

కిరణ్ అబ్బవరం రేంజ్ మారుతోందా..

కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన అప్డేట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తన రేంజ్ ను మార్చుకునే క్రమంలోనే ఈ మూవీ చేయబోతున్నాడా అనే టాక్ వినిపిస్తోంది. లేదంటే ఈ కథ అతనికే సూట్ అవుతుందని భావించే సదరు దర్శకుడే అతని వరకు వెళ్లాడా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఇంతకీ ఈ అప్డేట్ ఏంటీ అంటే.. కిరణ్ అబ్బవరం హీరోగా ఓ మైథలాజికల్ మూవీ రూపొందబోతోంది. ఈ చిత్రానికి ‘ఇంద్ర పుత్ర’అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ ఇంద్ర పుత్రకు శ్రీకాంత్ పుప్పాల దర్శకుడు.

డెబ్యూ డైరెక్టర్ గా శ్రీకాంత్ పుప్పాల

శ్రీకాంత్ పుప్పాల అంటే ఇంతకు కాంతార 1 చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అంతకు ముందు కూడా చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉన్నవాడు. దర్శకుడుగా అతని ఫస్ట్ మూవీతోనే మైథలాజికల్ అంటే పెద్ద విషయమే. అది కూడా కిరణ్ అబ్బవరంతో అంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అదే టైమ్ లో కిరణ్ అబ్బవరం రైట్ ఛాయిస్ అనేలా కూడా ఉంది.

2027లోనే ఇంద్ర పుత్ర విడుదల

మరో విశేషం ఏంటంటే.. ఈ ఇంద్ర పుత్ర చిత్రాన్ని 2027లోనే విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జీ స్టూడియోస్ విడుదల చేయబోతుండటం మరో విశేషం. ఏదేమైనా కిరణ్ అబ్బవరం రేంజ్ ఈ మూవీతో మరో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Continue reading
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ, రేటింగ్

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ

ఆర్టిస్ట్స్ : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ, త్రిగుణ్, నవీన్, సిరి హనుమంతు తదితరులు
ఎడిటర్ : సంతోష్ నాయుడు
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్
నిర్మాతలు : ఎస్.కే.ఎన్, సాయి రాజేష్
కథ : సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి నంబూరి

బేబీ మూవీ తర్వాత ఎస్కేఎన్, సాయి రాజేష్ బాండింగ్ మరింత స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు అంటే అదో ‘కల్ట్, క్లాసిక్’అని ఆ ఇద్దరూ ముందుగా ఫిక్స్ అయిపోతుంటారు. అలా ఫిక్స్ అయి చేసిన సినిమానే చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ తో మాత్రం బాగా ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడి గురించి మాత్రం ప్రమోషన్స్ లో పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణాలేంటో కానీ అన్ని ప్రమోషన్స్ లో ఎస్కేఎన్, సాయి రాజేష్ మాత్రమే కనిపించారు. మరి ఈ మూవీ ఇవాళ(24.07.2026)విడుదలైంది. మరి చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

అజయ్(త్రిగుణ్)నివేదిత(శ్రీ గౌరీ ప్రియ) మూడేళ్లుగా ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధం అవుతారు. తీరా పెళ్లి రోజు అజయ్ తను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నా అని తప్పుకున్నాడు. అంత గాఢమైన ప్రేమ ఇలా పెటాకులు కావడంతో నివి చెన్నైలోనే ఉద్యోగం చేసుకుంటూ మందుకు బానిస అవుతుంది. మందు తాగేందుకు తన ఫ్రెండ్స్ తో కలిసే ఉంటుంది. ఈ టైమ్ లో ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ కు స్టీఫెన్ శంకర్(కిరణ్ అబ్బవరం) వారికి పరిచయం అవుతాడు. అతనో అనాథ. స్టీఫెన్ ఓ సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్రమంలో వీరి ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ షేరింగ్ కు వస్తాడు. అందరితో కలివిడిగా ఉండే స్టీఫెన్ నివిని బాగు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. మొదట కసురుకున్నా నివి స్టీఫెన్ ను చేరదీస్తుంది. అతని సినిమా ప్రయత్నాల్లో అండగా ఉంటుంది. అలాగే ఆమె తన ప్రేమను మర్చిపోలేకపోతుంటుంది.
స్టీఫెన్ ఆమెను బాగా మోటివేట్ చేస్తాడు. తొలిప్రేమ పోయినా మలి ప్రేమలోనూ మరో ఆనందం వెదకాలి అని చెబుతుంటాడు. ఈ క్రమంలో మెల్లగా నివి మందు మానేస్తుంది. ఓ టైమ్ లో ఆమె స్టీఫెన్ ను పెళ్లి చేసుకుందాం అని చెబుతుంది. మొదట షాక్ అయిన స్టీఫెన్ తర్వాత హ్యాపీగా ఒప్పుకుంటాడు. నివి పేరెంట్స్ కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి సిద్ధం అవుతారు. కట్ చేస్తే మళ్లీ నివి పెళ్లి రోజే మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి అదేంటీ..? ఇద్దరి మధ్య బంధం చెడుతుందా లేక ఇంకేదైనా జరుగుతుందా..? నివి లైఫ్ లో మళ్లీ అజయ్ వస్తాడా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

చెన్నై లవ్ స్టోరీ.. ఓ సాధారణమైన కథ. కానీ కథనంతో చాలాసార్లు మెప్పిస్తుంది. కాకపోతే ఈ కథలోని షాకింగ్ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు.ఆ పాయింట్ కొంత వరకు ఫర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఓ దశ దాటిన తర్వాత అది మరీ బోరింగ్ కనిపిస్తుంది. బట్ చెన్నై లవ్ స్టోరీ రెగ్యులర్ స్టోరీలాగానే మొదలవుతుందీ మూవీ. లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయి మందుకు బానిస కావడం కొత్తగా ఉంది. తర్వాత కిరణ్ అబ్బవరం ఎంట్రీతో సినిమా జోష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా అతనికి సంబంధించిన సీన్స్ రిపీటెడ్ గా ఉండటం కాస్త ఇబ్బంది కరం.
ఓ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ గా కనిపించినా కిరణ్ అబ్బవరంకు గౌరీ ప్రియ చెప్పే వరకు అసలు విషయం అర్థం కాకపోవడం కనెక్టింగ్ గా లేదు. అలాగే ఆమె తన ప్రేమను మర్చిపోవడానికి మందు మొదలు పెట్టి తర్వాత కిరణ్ అబ్బవరంతో కనెక్ట్ అయ్యాక చాలా తక్కువ టైమ్ లోనే మరో ప్రేమకు సిద్ధం కావడం కన్విన్సింగ్ గా లేదు. పోనీ పాత ప్రేమికుడిపై కోపమా అంటే.. అదేం కాదు. కేవలం ఓ పది రోజుల్లోనే మరో ‘గొప్ప’ ప్రేమికుడికి కనెక్ట్ కావడం సినిమాటిక్ గా కూడా అస్సలు బాలేదు. పోనీ ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమకథకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయా అంటే అవి కూడా బలంగా లేవు. హృదయాల్ని కదలించే సన్నివేశాలు, మనసులను మెలిపెట్టే సీన్స్ ఉన్నాయా అంటే అదీ అస్సలు లేదు.
ఇక సెకండ్ హాఫ్ ఎలా మొదలుపెడతారా అని ఎదురుచూసిన వారికి ఇది కాస్త బానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య అప్పుడు మంచి ప్రేమ ఉంటుందా అదీ లేదు. అక్కడ కూడా హీరో అబ్సెషన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంది. అలాగే గౌరీప్రియ లైఫ్ లోకి అతని మాజీ ప్రియుడు ఎంటర్ కావడం.. అతను మరో అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా అది కుదరడం లేదు అని చెప్పడంతో ఆమెకు అతనిపై కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే శ్రీ గౌరీప్రియపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నంలో ఆమెకు అప్పటి వరకు పట్టిన మబ్బులు విడిపోయినట్టుగా ఆమె ప్రవర్తన, నటన కనిపిస్తుంది. అయినా అతనిపై అంతులేని ప్రేమ ఉన్నట్టు చెప్పడం.. అతని కోసం జీవితాంతం ఉండిపోతాను అనడం ఆ టైమ్ కు సూట్ కాలేదు.
ఇక అప్పటి వరకు తను చాలా గొప్ప ప్రేమలో ఉన్నాడు అన్న భావనలో ఉన్న కిరణ్ అబ్బవరంకు అసలు విషయం అర్థం అవుతుంది. తర్వాతే సరైన నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తాడు. కట్ చేస్తే కథ కాస్త బాధాంతంగా ముగుస్తుంది.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియకు మధ్య అంత గొప్ప ప్రేమ ఎలివేట్ కావడానికి కావాల్సిన సన్నివేశాలు లేకపోవడం.. అసలు చాలా తక్కువ టైమ్ లోనే వీరిది ఓ అమర ప్రేమగా బిల్డప్ ఇవ్వడం అస్సలు సూట్ కాని కథనం. ఇదో బిగ్గెస్ట్ మైనస్ గా కనిపిస్తుంది. ఓ రకంగా అజయ్ పాత్రలో కాస్త హుందాతనం ఉంది. అదీ ప్లస్ పాయింట్ గా ఉంది మూవీలో. ఏదేమైనా ఇదో సాధారణమైన కథ. ఆ మూవీకి ఇంకాస్త బలమైన కథనం కూడా ఉంటే ఇంకా బావుండేది. కాకపోతే చూస్తున్నంత సేపు మాత్రం సినిమా కంప్లీట్ గా పాసబుల్ గా ఉంటుంది. ఇది మూవీకి ప్రధాన బలంగా ఉంటుంది. అంతే కానీ వీళ్లు చెప్పినట్టుగా ఇదో ఎపిక్, కల్ట్ లాంటి పదాలకు చాలా అంటే చాలా దూరంగా ఉందీ మూవీ. ఇవి తెచ్చిపెట్టుకున్న పదాలే తప్ప అసలు ఆ పదాలకు స్పష్టమైన మీనింగ్ కూడా తెలియని వాళ్లు ఆ పదాలతో మూవీని రుద్దడం ఏ మాత్రం నిజాయితీ లేని వారే చేసే పని.

నటన పరంగా

కిరణ్ అబ్బవరం తన పాత్రలో సహజంగా నటించాడు. ఆ పాత్రలోని వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం వాడుకున్నాడు. శ్రీ గౌరిప్రియ పాత్ర చాలా బావుంది. తనూ చాలా గొప్పగా నటించింది. కాకపోతే ఆ పాత్రలు చాలా తొందరగా ప్రేమలో పడటం పెద్ద మైనస్. ఆ ప్రేమకూ బలమైన పునాది కూడా లేదు. అజయ్ పాత్రలో త్రిగుణ్ బాగా చేశాడు. అతని ఫేస్ లో వయసు మీద పడిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్.

టెక్నికల్ గా

ఈ మూవీకి ప్రధాన బలం మణిశర్మ సంగీతం. అద్భుతమైన పాటలు, గొప్పగా అనిపించే నేపథ్య సంగీతంతో తనదైన మ్యాజిక్ ను మరోసారి క్రియేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా చాలా డ్రా బ్యాక్స్ ఉన్నాయి. డైలాగ్స్ బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు ఎవరు అనే కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. బట్ టైటిల్ లో చెప్పిన దాన్ని బట్టి రవి నంబూరి బాగా చేసే ప్రయత్నం చేశాడు. అతని మేకింగ్, టేకింగ్ బావున్నాయి. కథనం విషయంలో బలమైన కసరత్తులు చేయాల్సి ఉంది.

ఫైనల్ గా : ట్విస్ట్ తో సాగే రొటీన్ లవ్ స్టోరీ
రేటింగ్ : 2.5/5
– K.Y.R

Continue reading
చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రివ్యూ.. ఏముంది ఇందులో..?

ఏ కథైనా బలంగా రాసుకుంటారు మేకర్స్. అవి బలమైనవేనా కాదా అనేది తేల్చాల్సింది ప్రేక్షకులు. కొన్నిసార్లు రైటర్స్ తాము ఏదో ది బెస్ట్ ఇస్తున్నాం అని భావిస్తుంటారు. కానీ అవే చాలా బలహీనంగా ఉంటాయి అని ఆడియన్స్ కూడా భావిస్తుంటారు. అయితే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ముందు ఇంపార్టెంట్. తర్వాత అది క్లాసిక్ అవుతుందా లేక కల్ట్ అవుతుందా అనేది తర్వాతి సంగతి. బట్ ఇలా సినిమా విడుదలకు ముందే తెగ బిల్డప్ ఇస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. యస్.. వీళ్లకు అంత నమ్మకం ఉన్నట్టుగా కాకుండా ఇది కావాలనే జనాలపైకి రుద్దేస్తున్నారు అనిపించేలానే ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే ఇదో సాధారణమైన కథలాగే కనిపిస్తోంది. ఓ తెలుగు కుర్రాడు చెన్నై వెళ్లి అక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పటికే మందుకు బానిస అయిన ఓ అమ్మాయితో అతనికి పరిచయం అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. మొదట అతను ఆమెను మందుకు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఆ లవ్ స్టోరీలో ఏదో ఇష్యూ. ఆ ఇష్యూ వల్ల సదరు హీరో బాగా డిస్ట్రబ్ అవుతాడు. ఆమె అతని కోసం ఆరాటపడుతుంది. అదే టైమ్ లో దానికంటే ముందే అతన్ని చాలా లైట్ తీసుకుంటుంది. సింపుల్ గా ఇదే ట్రైలర్. ఇతర పాత్రలను పెద్దగా ఎలివేట్ చేయకుండా ఇదో ఈ రెండు పాత్రల మధ్య ఉన్న ఓ సంఘర్షణ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి లవ్ స్టోరీస్ లో అలాంటి సంఘర్షణ చాలా చాలా కామన్. కాకపోతే వీరి మూవీలో ఆ కాన్ ఫ్లిక్ట్ వేరేలా ఉండొచ్చేమో. అంత మాత్రం చేత దీన్ని ఓ ‘కల్ట్ క్లాసిక్’అని రిలీజ్ కు ముందే డబ్బా కొట్టడం అస్సలు అంటే అస్సలు బాలేదు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ఓ సాధారణ రెగ్యులర్ లవ్ స్టోరీలాగానే ఉంది తప్ప కొత్తదనం అంటూ ఏమీ కనిపించడం లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన మూవీ ఇది. ఇక ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా సాయి రాజేష్ గా కనిపిస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు ఈ మూవీ దర్శకుడు అనేది మాత్రం చెప్పడం లేదు. ఒక వేళ మూవీ హిట్ అయితే సాయి రాజేష్ ఖాతాలో వేసుకుంటాడు.. తేడా కొడితే దర్శకుడిపై నెట్టేస్తుంటాడేమో చూడాలి. ఏదేమైనా ఇది ఓ సాధారణమైన కథ అని అర్థం అవుతుంది. దాన్ని దాటుకుని ఇది నిజంగా కల్ట్ క్లాసిక్ అని వీళ్లు పదే పదే చెబుతున్నారు అంటే ఏదో తేడా కొడుతోంది. కల్ట్ నా లేక క్లాసిక్ నా అనేది చెప్పాల్సింది ప్రేక్షకులు. అది మాత్రం వీళ్లు కొడుతున్న డబ్బాలు మాత్రం మర్చిపోవద్దు.

Continue reading