అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ అతనితోనే

అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ

అఖిల్ అక్కినేని అంటే ఆ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్లే హీరో అనుకున్నారు. ఆల్రెడీ నాగ చైతన్య సత్తా చాటుతున్నాడు. బట్ అఖిల్ అక్కినేని విషయంలో అది కనిపించలేదు. గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆ మూవీతో డిజాస్టర్ చూశాడు. ఏమైతేనేం.. ఒక్క హిట్ కోసం పదేళ్లకు పైగా వెయిట్ చేశాడు. ఫైనల్ గా లెనిన్ తో హిట్ అందుకున్నాడు. ఇక గేర్ మార్చినట్టు కనిపిస్తున్నాడు. వరుస మూవీస్ తో దూసుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా అఖిల్ అక్కినేని లైన్ లోకి వచ్చాడు.

పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా పవన్ సాదినేని ఓ మూవీ చేయబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ సాదినేని .. దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార మూవీ చేస్తున్నాడు. ఇది ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాతే అఖిల్ అక్కినేనితో మూవీకి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. ఆకాశంలో ఒక తార పూర్తయిన తర్వాత ఈ కథ మీద పూర్తి స్థాయి చర్చలు సాగిస్తారని చెబుతున్నారు.

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్

అఖిల్ అక్కినేని అయితే ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే చాలామంది దర్శకుల కథలు వింటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నాడు. తర్వాత పవన్ సాదినేనితో వెళ్లబోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్ న్యూస్ ఇంకా రావాల్సి ఉంది.

Continue reading
అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, రాజకీయ అంశాలను కలిపి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని సింబాలిక్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రేక్షకులు కథలో పురాణాల ప్రభావం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం అఖిల్ మేకోవర్. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయికల్లో ఆమె ఒకరు. ‘లెనిన్’లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. సరదాగా ఉండే, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని స్వయంగా భాగ్యశ్రీ తెలిపింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీకి ఈ సినిమా కూడా విజయం అందించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే అది పూర్తిగా కథ, ఆమె పాత్ర నిడివి, ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మాత్రం అఖిల్-భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది ఇద్దరి ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. విడుదలకు ముందు సినిమాకు అదనపు హైప్ రావడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ప్రమోషన్స్ ను బట్టి చూస్తే ‘లెనిన్’లో యాక్షన్, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే సినిమా నిజంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ మాత్రం అఖిల్‌కు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకమైన సినిమా. కథ ప్రేక్షకులను మెప్పిస్తే ఇద్దరికీ ఇది పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది.

Continue reading