వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్, NKRAR2) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో వెంకటేష్ నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటూ కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కావడంతో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కథ, పాత్రలు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యే కొద్దీ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.






