బాలకృష్ణ, వెంకటేష్, నాగ చైతన్య వంటి స్టార్స్ తో మూవీకు రెడీ అయినా జీ5

భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్య‌మైన భాషాల‌తో, క్రియేటివిటీతో, కొత్త హ‌ద్దుల‌ను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జ‌ర్నీలో క్రియేట‌ర్స్ ప్ర‌తిభ ఎంతో కీల‌కంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన వినోద అనుభవాలతో కూడిన భారీ కంటెంట్ లైనప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇండస్ట్రీలో అత్యంత నిబద్ధతతో, నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులే తెలుగు వినోద రంగానికి అసలైన బ‌లం.. సాంస్కృతికతను కాపాడుకుంటూనే సృజనాత్మకతలో కొత్తదనాన్ని అందించడంలో జీ5 ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రేక్షకుల మనసులను బలంగా తాకే కథలను అందిస్తూనే.. పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న సంప్రదాయ పద్ధతులను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యానర్స్‌తో తెలుగు జీ5 పార్ట‌న‌ర్‌ఫిప్ కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూరింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ వంటి ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలతో కలిసి తెలుగు జీ5 ఈ భారీ లైనప్‌ను సిద్ధం చేసింది. ఒరిజినల్స్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న‌ ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’తో పాటు.. జగపతి బాబు హోస్ట్‌గా ప్రేక్షకుల అభిమాన షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ మరోసారి సందడి చేయనుంది.

ఇక సినిమా విభాగంలో కూడా ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను తెలుగు జీ5 అందిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ‘లెనిన్’..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’..కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘వృషకర్మ’.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి నటిస్తున్న ‘కనక దుర్గ’ చిత్రాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. అలాగే ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు జీ5 ప్రేక్ష‌కును అల‌రించ‌నుంది.

జీ5 తెలుగు, త‌మిళ్‌, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనంతో, సంప్రదాయానికి భిన్నంగా ఉండే కథలను ఆదరిస్తుంటారు. తమ భావోద్వేగాలకు, మనసుకు దగ్గరయ్యే సహజత్వాన్ని కూడా ఎంతో విలువగా భావిస్తారు తెలుగు ఆడియెన్స్‌. గత కొన్నేళ్లుగా క్రియేటర్స్‌, నిర్మాణ సంస్థలు, ప్రేక్షకులతో మేం ఏర్పరుచుకున్న పార్ట్‌న‌ర్‌షిప్‌ ద్వారా మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అదే ఆలోచనతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌ను రూపొందించాం.

‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ నుంచి ‘శ్రీమతి’, ‘పంచనామా’ వంటి ఒరిజినల్స్ వరకు.. ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన కంటెంట్‌తో పాటు సరికొత్త కథలను కూడా ఈ లైనప్‌లో అందిస్తున్నాం. ప్రతి టైటిల్‌కు ప్రత్యేకమైన కథనం, విభిన్నమైన దృక్పథం ఉంది. కొత్తగా, ధైర్యంగా, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే కథలను అందించాలనే మా నిబద్ధతకు ఈ కంటెంట్ లైనప్ సాక్ష్యం. అదే సమయంలో తెలుగు ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే అంశాలను కూడా ఈ కథల్లో జోడించాం” అని అన్నారు.

ఒరిజినల్స్, సినిమాలతో పాటు.. ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో కూడా తెలుగు జీ5 తన వినోద ప్రపంచాన్ని మరింత విస్తరిస్తోంది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి టైటిల్స్‌తో సరికొత్త కథనాలను ప్రేక్షకులకు అందించనుంది.

అలాగే పిల్లల కోసం ‘బార్బరీక్’, ‘కుండక మండక్క’ వంటి కంటెంట్‌తో పాటు.. ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను కూడా అందిస్తూ తన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. విభిన్న ఫార్మాట్లు, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కంటెంట్‌తో.. దక్షిణాది నుంచి అత్యుత్తమ వినోదాన్ని తెలుగు జీ5 అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఏదో ఒక ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు జీ5లో సిద్ధంగా ఉంది.

Continue reading
చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్.. వీరులో గెలిచేది ఎవరు..?

 ఓ రేంజ్  2027 సంక్రాంతి

సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు మంచి ఊపొస్తుంది. చాలా పెద్ద స్టార్ హీరోలు నటించిన మూవీస్ ఆ టైమ్ కు విడుదల చేస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ మారింది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీస్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. ఆ కారణంగానే చాలా ముందుగానే వీళ్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంటారు. అలా ఈ 2027 సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి అవేంటో చూద్దాం.

సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్

సంక్రాంతి హాలిడేస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ కు వస్తుంటారు. అందుకే జనవరి 12న సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన మూవీ సంబరాల ఏటి గట్టు మూవీ విడుదల కాబోతోంది. ఓ రకంగా చూస్తే ఇది గతేడాది లేదంటే ఈ యేడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ బాగా ఆలస్యం అవుతోంది. సాయిదుర్గా తేజ్ విరూపాక్ష తర్వాత చేస్తున్న మూవీ ఇది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతోన్న మూవీ ఇది. ఫైనల్ గా ఇది సంక్రాంతికి వస్తుందని మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించారు.

జనవరి 14న శర్వానంద్ మూవీ

జనవరి 14న రిలీజ్ అని సినిమా ప్రారంభానికి ముందే డేట్ ఇచ్చిన మూవీ శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోది. వీళ్ల కాంబోలో చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. మామూలుగా అయితే శ్రీను వైట్ల ఇప్పుడు ఫామ్ లో లేడు. ఓ రకంగా ఇది అతని చివరి ప్రయత్నం అనుకోవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

అనిల్ రావిపూడి లైన్ లో ఉన్నాడు

ఇక రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ వెంకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడదుల చేశారు. మరి ఈ మూవీతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని చాలామంది భావిస్తున్నారు.

చిరంజీవి కూడా సంక్రాంతి బరిలోనే

ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ కూడా సంక్రాంతికే వస్తోందంటున్నారు. వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్, బాబీ కాంబోలో మూవీ అంటే మంచి అంచనాలే ఉంటాయి. వాటిని అందుకోవడం ఖాయం అనేలా వీళ్లు ఫీల్ అవుతున్నారు. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోందీ మూవీలో. చిరంజీవికి కూతురు లాంటి పాత్ర చేస్తుందని సమాచారం. బట్ వీళ్లు సంక్రాంతికే రావడం మాత్రం పక్కా అంటున్నారు.

మరికొన్ని మూవీస్ సంక్రాంతి బరిలో

ఓ రకంగా ఈ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయి. బట్ సంక్రాంతి టార్గెట్ గానే మరికొన్ని మూవీస్ ఉన్నాయి. రజినీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి డైరెక్షన్ లో స్టార్ట్ అయిన మూవీ సంక్రాంతికే పక్కా అంటున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ‘జాంబిరెడ్డి 2’ కూడా సంక్రాంతి బరిలో విడుదలవుతుంది. లేదంటే ప్రశాంత్ వర్మ ప్రొడ్యూస్ చేస్తున్న మహాకాళి అయినా సంక్రాంతికే విడుదలవుతుందంటున్నారు.
అలాగే రష్మిక మందన్నా మెయిన్ లీడ్ గా చేస్తోన్న మైసా మూవీ కూడా సంక్రాంతికే విడుదలవుతుందని చెబుతున్నారు. మరి ఇంతమందితో కలిసి బరిలో నిలవడం రైటేనా అనేది తెలియాల్సి ఉంది. బట్ మైసా మాత్రం ప్యాన్ ఇండియా మూవీ. కాబట్టి రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇన్ని మూవీస్ తో ఈ సారి సంక్రాంతి మరింత రంజుగా ఉండబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading
వెంకటేష్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్.. 2027 సంక్రాంతికి టార్గెట్

వెంకటేష్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఈ రోజు నిజంగానే స్పెషల్ డే. హీరోగా వెంకటేష్ సినీ ప్రయాణం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ #VenkyAnil5 నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ లాంటి ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం ఒక కారణమైతే.. మరోవైపు వెంకటేష్‌తో వరుసగా సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి కథను రెడీ చేశాడన్న ఆసక్తి మరో కారణం.

వెంకటేష్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది

#VenkyAnil5 నుంచి విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్‌లో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపిస్తున్నారు. గతంలో చూసిన వెంకటేష్ లుక్స్‌కు భిన్నంగా ఈ పోస్టర్‌లో ఆయన చాలా సీరియస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఫస్ట్ లుక్‌ను చూస్తే ఈసారి వెంకటేష్ పాత్రలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్, ఎమోషన్‌కు కూడా ప్రాధాన్యత ఉండేలా కనిపిస్తోంది. అయితే పాత్ర పూర్తి స్వరూపం, కథలో ఆయనకు ఉన్న బ్యాక్‌డ్రాప్ వంటి విషయాలను మేకర్స్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అందుకే ఇప్పుడే కథపై ఫిక్స్‌డ్‌గా ఒక నిర్ణయానికి రావడం కంటే, ఫస్ట్ లుక్ ఇచ్చిన ఇంప్రెషన్ వరకే చూడటం మంచిది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

వెంకటేష్ 40 ఏళ్లకు స్పెషల్ ట్రీట్

వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదలైంది. అంటే సరిగ్గా అదే తేదీన 2026లో ఆయన హీరోగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

ఇంత సుదీర్ఘ ప్రయాణంలో వెంకటేష్ ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, కామెడీ హీరోగా, ఎమోషనల్ పాత్రల్లో.. ఇలా ప్రతి జోనర్‌లోనూ తనదైన మార్క్ చూపించారు.

అందుకే 40 ఏళ్ల కెరీర్ పూర్తయిన రోజున ఆయన కొత్త సినిమా నుంచి ఇలాంటి పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రావడం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది.

వెంకటేష్‌కు ఇప్పటివరకు 7 నంది అవార్డులు దక్కాయి. ఆయన కెరీర్‌లోని నటనా వైవిధ్యానికి ఈ అవార్డులు కూడా ఒక గుర్తింపుగా నిలిచాయి.

కల్యాణ్ రామ్‌తో వెంకటేష్ కాంబినేషన్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ నందమూరి కల్యాణ్ రామ్. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలిసి నటిస్తుండటంతో ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి మొదటి నుంచే ఉంది.

ఇక కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతిశెట్టి, వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ కాంబినేషన్‌ను జూన్ 2026లో జరిగిన సినిమా లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించారు.

దీంతో #VenkyAnil5 కేవలం వెంకటేష్ సినిమా కాకుండా మంచి మల్టీస్టారర్ ఫీల్ ఇచ్చే ప్రాజెక్ట్‌గా మారింది.

అనిల్ రావిపూడి మరోసారి వెంకీని ఎలా చూపిస్తాడో?

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ ప్రధాన బలంగా నిలిచాయి.

ఇప్పుడు #VenkyAnil5 విషయంలో మాత్రం అనిల్ రావిపూడి కొత్త టచ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి కనిపిస్తోంది. వెంకటేష్‌ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా చూపించడం చూస్తే పాత్రలో ఒక డిఫరెంట్ షేడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

అయితే పోస్టర్ చూసి ఇది పూర్తిగా యాక్షన్ సినిమా అని చెప్పడం మాత్రం తొందరపాటు అవుతుంది. మేకర్స్ నుంచి కథకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాతే సినిమా జానర్‌పై స్పష్టత వస్తుంది.

2027 సంక్రాంతికి #VenkyAnil5

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. దీంతో ప్రకటించిన సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ చేస్తూ షూటింగ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాలకు చాలా కీలకమైన సీజన్. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అనిల్ రావిపూడి సినిమా కావడంతో #VenkyAnil5పై ఈ రిలీజ్ విషయంలో అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.

అయితే 2027 సంక్రాంతి విడుదల అని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం జనవరి 2027 సంక్రాంతి రిలీజ్ అని చెప్పడం మాత్రమే సరైనది.

ఇది వెంకటేష్ కెరీర్‌లో మరో స్పెషల్ మూవీ అవుతుందా?

వెంకటేష్ 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్‌తో ఆయన చేస్తున్న సినిమా కావడంతో #VenkyAnil5పై అంచనాలు పెరుగుతున్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా వెంకటేష్ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్న లుక్, పాత్ర పేరు, కల్యాణ్ రామ్‌తో మల్టీస్టారర్ కాంబినేషన్, కీర్తి సురేష్–కృతిశెట్టి కాస్టింగ్, సంక్రాంతి రిలీజ్.. ఇవన్నీ సినిమాకు మంచి బజ్ తీసుకొస్తున్నాయి.

ఇక అసలు విషయం ఏంటంటే.. ఈసారి అనిల్ రావిపూడి వెంకటేష్‌ను ఎంత కొత్తగా చూపించబోతున్నాడు? వెంకట్ రెడ్డి పాత్రలో వెంకీ ఎలా మెప్పించబోతున్నాడు? అనేదే అసలు ఆసక్తి.

ప్రస్తుతం ఫస్ట్ లుక్ అయితే వెంకీ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సినిమా నుంచి వచ్చే నెక్ట్స్ అప్‌డేట్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

ఫైనల్‌గా చెప్పాలంటే.. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణానికి తగ్గట్టుగానే #VenkyAnil5 ఫస్ట్ లుక్ కూడా పవర్‌ఫుల్‌గా వచ్చింది. ఇక అనిల్ రావిపూడి ఈ కాంబినేషన్‌ను స్క్రీన్‌పై ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. 2027 సంక్రాంతికి వెంకీ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Continue reading
అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగుపెట్టిన వెంకటేష్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్, NKRAR2) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో వెంకటేష్ నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటూ కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కావడంతో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కథ, పాత్రలు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యే కొద్దీ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

Continue reading