ఏజ్ తో పని ఏముందీ అంటుంటారు. కానీ ఒక వయసు దాటితేనే రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. బట్ ఈయన విషయంలో అది మినహాయింపు. ఈ వయసులో కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. అసలు తనకు ఏజ్ గురించి గుర్తుకు కూడా లేదు అంటే ఆశ్చర్యం లేదు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ఇండియన్ స్క్రీన్ మీద ఈయన చేసిన ప్రయోగాలకు లెక్కే లేదు అనిపిస్తుంది. అసలు ఇన్ని ఎక్స్ పర్మెంట్స్ తో కమర్షియల్ గా విజయాలు సాధిస్తారా అని కూడా అనుకుంటారు.ఆ విషయంలో కూడా అదరగొట్టాడు సింగీతం. ఎలాంటి ఎక్స్ పర్మెంట్ అయినా కమర్షియల్ గా కూడా పెద్ద విజయాలు సాధించాడు. అదే అత్యంత అరుదైన విషయం కూడా. పుష్పక విమానం లాంటి మూకీ మూవీతో అద్భుత విజయం సాధించాడు. అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, ఆదిత్య 369,భైరవద్వీపం, మేడమ్ వంటి చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి మనిషి ఇప్పుడు 94యేళ్ల వయసులో ఓ మూవీ చేశాడు. సింగ్ గీతం అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఇది కూడా ఆయన శైలిలో అంతా కొత్తదనంతో కూడిన చిత్రమే. ఎక్కువగా పాటలతో సాగే కథనంలా ఉండబోతోందీ మూవీ. మాటల్లోనే పాటలుగా సాగుతుంది అనిపించేలా ఉంది. రీసెంట్ గా విడుదలైన పాటలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది.
ఈ ఏజ్ లో కూడా ఇలాంటి ఎక్స్ పర్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇక విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత. అతనికీ ఈ దర్శకుడు అంటే ఆరాధన. దీంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడీ చిత్రానికి. ప్రమోషన్స్ కూడా కొత్తగానే ఉన్నాయి. అయాన్ కే హీరోగా నటించాడు. షాలినీ కొండేపూడి విలన్ గా నటించింది. మరి ఈ చిత్రంతో సింగీతం శ్రీనివాసరావు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అనేది చూడాలి






