రవితేజదే ఈ వారం కూడా
మాస్ మహరాజ్ రవితేజ చాలాకాలం తర్వాత ఓ బ్లాక్ బస్టర్ చూశాడు. అతని కెరీర్ లోనే చాలా పెద్ద విజయం ఇది. ఇరుముడి మూవీ యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ డిక్లేర్ అయింది. ఇప్పటికే 150 కోట్లు వసూళ్లు వచ్చాయి. అది 200 కోట్ల వరకు వెళుతుందని చాలామంది అనుకుంటున్నారు. అలాగే రెండో వారంలో కూడా ఈ మూవీ దూకుడు తగ్గలేదు. మూడో వారంలో రాబోతోన్న మూవీస్ అయినా రవితేజ మూవీకి బ్రేకులు వేస్తాయా అనేది చూస్తే..
సుమంత్ ప్రభాస్, అనంతిక మ్యాజిక్ చేస్తారా
సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన మూవీ రోమాంచకం. సెప్టెంబర్ 3న విడుదల కాబోతోందీ మూవీ. సందీప్ రెడ్డి వంగా నిర్మించాడు. ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. ఇదో రొమాంటిక్ మూవీ అని ముందు నుంచీ చెప్పారు. మరి ఈ మూవీతో సందీప్ రెడ్డి విజయం అందుకుంటాడా అనేది చూడాలి.
కుమార్ కసరం, స్వేత లక్ష్మణ్ జంటగా నటించిన మూవీ ‘సహ’. ఈ మూవీ చాలాకాలంగా చిత్రీకరణ చేసుకుంది. నిషాంత్ దోతి దర్శకత్వం చేసిన ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది. ఇప్పటికైతే పెద్దగా అంచనాలేం లేవు. రిలీజ్ తర్వాత రివ్యూస్ ను బట్టి ఆడియన్స్ వస్తారేమో చూడాలి.
దుల్మర్ సల్మాన్ తెలుగులో సత్తా చాటుతాడా
దుల్మర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఐమ్ గేమ్’. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా అని ట్రైలర్ తోనే అర్థమైంది. నిజానికి ఇది ఆగస్ట్ 21నే విడుదల కావాల్సి ఉంది. బట్ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. మరి ఈ డబ్బింగ్ మూవీపై అంచనాలు కూడా లేవు. కేవలం దుల్కర్ మూవీ కాబట్టి కాస్త జనాలు చూసే అవకాశం ఉండొచ్చు.
నివిన్ పాలీ, మమితా బైజు జంటగా నటించిన మూవీ బెత్లెమేమ్ కుటుంబ కథ అనే మళయాల మూవీ కూడా డబ్బింగ్ అయి సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇది మళయాలంలో ఆగస్ట్ 21న విడుదలైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 200 వసూళ్లు సాధించింది. ఇంకా సత్తా చాటుతోందీ మూవీ. అందుకే తెలుగులో డబ్ చేశారు. నిజానికి ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ కథకు దగ్గరగా ఉండే మూవీ. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. మొత్తంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మరికొన్ని డబ్బింగ్, పేరులేని మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నాయి.
రవితేజ దూకుడు పెరుగుతూనే ఉంది
మరి ఈ మూవీలో ఇరుముడి ప్రభంజనంను దాటుకుని నిలిచే మూవీస్ ఏమై ఉంటాయా అనేది చూడాలి. బట్ ఇరుముడికి జనం మాత్రం జేజేలు కొడుతున్నారు. ఆ కారణంగా కొత్తగా వస్తోన్న మూవీస్ పై జనం పెద్దగా పట్టించుకోవడం కష్టమే అంటున్నారు. సో.. ఈ వారం కూడా అదే రిపీట్ అయితే మాస్ రాజా పంట గట్టిగా పండినట్టే.






