Gaaradi Telugu news logo

వెంకటేష్ బరిలోకి దిగాడు

పండగ టైమ్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ కు ఆ పండగ డబుల్ అవుతుంది. ఈ దసరా పండగకు వచ్చిన నాలుగు సినిమాలు దేనికదే ఆగిపోయాయి. రణబాలి సీడెడ్, తెలంగాణలో సత్తా చాటుతోంది. జైలర్ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో దుమ్మురేపుతుంటే క్రేజీ కళ్యాణం తెలంగాణలో ఆకట్టుకుంటోంది. మరి తర్వాత ఎవరు..? అంటే సడెన్ గా లైన్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్.

వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీస్ కి ఫేవరెట్

వెంకటేష్ మూవీ అంటే అది కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ చేసిన ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 9న అన్నారు. ఆ డేట్ కూడా మారిపోయింది. ఫైనల్ గా అక్టోబర్ 30న విడుదల అన్నారు. కానీ ఆ టైమ్ కు ఆల్రెడీ నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నాయి. ఈ నలుగురు ఆదర్శ కుటుంబం వల్ల ఇబ్బంది పడిపోతున్నారు. పోనీ వాయిదా వేసుకుందాం అనుకుంటే మళ్లీ అలాంటి డేట్ దొరకడం కష్టం అవుతుంది. అందుకే మార్చుకోలేకపోయారు. అయినా ‘సమ్మర్ హాలిడేస్’మూవీని నవంబర్ 6న విడుదల చేస్తాం అని నిర్మాత ప్రకటించాడు. అలాగే పెద్ద సినిమాలు ఇలా చేస్తే మేం మునిగిపోతాం అని కూడా అన్నాడు.

విశ్వక్ సేన్ ‘కల్ట్’ అక్టోబర్ 30నే

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా చేసిన సినిమా కల్ట్ అక్టోబర్ 30నే విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్స్ కూడా ఇన్నోవేటివ్ గా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ ఇప్పటికే వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. అందుకే తనే రంగంలోకి దిగి దర్శకత్వం కూడా చేశాడు. ఆ కారణంగా కల్ట్ మూవీపై అంచనాలైతే ఉన్నాయి. మరి వాటిని నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇట్లు అర్జున్ ఆకట్టుకుంటుందా..?

అక్టోబర్ 30న విడుదల కాబోతోన్న మరో మూవీ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. అనస్వర రాజన్ హీరోయిన్. మహేష్ ముప్పాల దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. టీజర్ బావుంది. ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో మూగవాడుగా నటించాడు. ఫస్ట్ మూవీ అంటే ఇదో ఛాలెంజింగ్. మరి ఆ ఛాలెంజ్ లో అనీష్ నెగ్గుతాడా లేదా అనేది చూడాలి.

కిల్లర్ ఛాలెంజ్ లు వర్కవుట్ అవుతాయా..?

చివరగా అదే రోజున విడుదలవుతున్న సినిమా కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోకు తల్లిగా నటించిన జ్యోతి పూర్వజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా నటించింది. సైన్స్ ఫిక్షన్ అని చెప్పారు. ఓ డిఫరెంట్ కథతో వస్తోన్న మూవీ అని దర్శకుడు ప్రమోషన్స్ లో చెబుతున్నాడు. అదీ కాక ఈ మూవీలో ఓ ట్విస్ట్ గురించి ముందే చెబితే కోటి రూపాయలు ఇస్తా అని ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. మరి ఈ ఛాలెంజ్ ల ఏమైనా వర్కవుట్ అవుతాయోమో లేదో అనేది చూడాలి.

అక్టోబర్ 30న విన్నర్ ఎవరు..?

మొత్తంగా ఈ అక్టోబర్ 30న కూడా నాలుగు సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేని కంటెంట్ తో వస్తున్నాయి. మరి ఈ నాలుగింటిలో ఏది అన్నిటికంటే బెస్ట్ అని చెబుతారో ఆడియన్స్ అనేది చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి