Gaaradi Telugu news logo

త్రివిక్రమ్ తేలిపోయాడా..?

త్రివిక్రమ్ ఈ మధ్య ఈజీగా దొరికిపోతున్నాడు. ఏం చేసినా, తీసినా జనం చూస్తారులే అనే ఈజీ ఫీలింగ్ వల్ల ఇప్పటి వరకు అతను తీసిన సినిమాలన్నీ ఉన్నాయి. కానీ ఇకపై అలా ఉండదు అని డిక్లేర్ చేసింది ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం ఫస్ట్ హాఫ్ బానే ఉంది అనే భావన కలిగింది. బట్ సెకండ్ హాఫ్ పూర్తిగా పోయింది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే అనేక లోపాలున్నాయి. అంత ఎఫెక్టివ్ రైటింగ్ అస్సలు కనిపించలేదు. ఈ కారణంగానే దాదాపు 100కోట్ల బడ్జెట్(రెండు సార్లు రీ షూట్స్ తో సరిపోయింది) తో రూపొందిన ఆదర్శ కుటుంబం గంగపాలైంది.

అజ్ఞాతవాసి రిజల్టే ఆదర్శ కుటుంబం కూడానా..?

అజ్ఞాతవాసి కూడా అంతే. పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు అని చాలా బిల్డప్ ఇచ్చారు. అప్పటికీ ఇది ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కు ఫ్రీమేక్ అని చాలామంది ముందుగానే కామెంట్స్ చేశారు. అదీ కాక ఒరిజినల్ మూవీనే వెరీ యావరేజ్. అలాంటి యావరేజ్ మూవీని తన స్టైల్లో అద్భుతం చేద్దాం అనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. అజ్ఞాతవాసి ఆల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతోంది. ఫస్ట్ వీకెండ్ లో వచ్చిన వసూళ్లు చూస్తేనే అర్థం అవుతుంది.. ఇది ఎంత పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుంది అని.

రైటింగ్ లో పస తగ్గి.. నస పెరిగిందా..?

ఏదేమైనా త్రివిక్రమ్ రైటింగ్ లో పస తగ్గింది.. నస పెరిగింది. ప్రాసల కోసం పాట్లు పడటమే తప్ప ప్రయత్నం బలంగా కనిపించడం లేదు. ఈ కారణంగానే అతని రైటింగ్ లో పవర్ తగ్గిపోయింది. మామూలుగా కథలో దమ్ముంటే ప్రాసలు అదనంగా కలిసొస్తాయి. కథలో దమ్ము లేకపోతే ప్రాసలు కూడా ప్రయాసగా మిగిలిపోతాయని ఆదర్శ కుటుంబం తేల్చింది. త్రివిక్రమ్ తర్వాత సినిమా ఎన్టీఆర్ తో. మరి ఆదర్శ కుటుంబం రిజల్ట్ చూసి ఎన్టీఆర్ సెకండ్ థాట్ లో పడ్డా ఆశ్చర్యం లేదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి