Gaaradi Telugu news logo

అల్లు అర్జున్.. నువ్వు సూపర్

అల్లు అర్జున్ మూవ్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నంలో అతని స్ట్రాటజీస్ మరో స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓ వైపు తెలుగు హీరోలంతా రాజమౌళితో సినిమాలు చేసిన తర్వాతే ప్యాన్ ఇండియా హీరోలు అనిపించుకున్నారు. బట్ ఒక్క అల్లు అర్జున్ మాత్రమే అందుకు భిన్నంగా వెళుతున్నాడు. రాజమౌళితో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇంకా చెబితే తన ఓన్ థియేటర్ ‘AAA’లో చాలామంది దర్శకుల ఫోటోస్ కనిపిస్తాయి.. రాజమౌళి తప్ప.

మాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్

అల్లు అర్జున్ కెరీర్ మొదట్లోనే అతనికి కూడా తెలియకుండానే మళయాలంలో మంచి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. ఇది మరే తెలుగు హీరోకూ సాధ్యం కాలేదు. ఇంకా చెబితే మళయాలీలు తెలుగు సినిమాలను మాగ్జిమం లైట్ తీసుకుంటారు. అలాంటిది అల్లు అర్జున్ ను ఓన్ చేసుకున్నారు అంటే అదే ఆశ్చర్యం. తన ఫ్యాన్ బేస్ ను సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్లిపోయాడు అల్లు అర్జున్. అదే అతన్ని ఇప్పుడు మళయాలంలో ఓ స్టార్ హీరోగా చూసేలా చేసింది. ఇక పుష్ప, పుష్ప 2 తర్వాత ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. పుష్ప2కు కొంత నెగెటివిటీ వచ్చినా వసూళ్లు మాత్రం తగ్గలేదు. ఏకంగా బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచిందీ మూవీ అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

రూట్ మార్చిన అల్లు అర్జున్

అందరు హీరోలు ఒకలా అయితే అల్లు అర్జున్ మాత్రమే మరోలా అనిపించేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేయాల్సి ఉంది. కానీ సడెన్ గా రూట్ మార్చాడు. ఈ సారి తమిళ దర్శకుడు అట్లీతో జత కట్టాడు. రాకా అనే టైటిల్ తో నాగ్ అశ్విన్, ప్రభాస్ వద్దు అనుకున్న బ్యూటీ దీపికా పదుకోణ్ ను ఈ చిత్రంలో తీసుకున్నాడు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇది బిగ్గెస్ట్ కాన్వాస్ తో రూపొందుతోన్న మూవీ. భారీ తారాగణం, భారీ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా. హాలీవుడ్ రేంజ్ మూవీ అని ఇప్పటికే అంతా అంటున్నారు. పైగా ఇందులో అల్లు అర్జున్ తోడేలులాగా కనిపించబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే కథపైనే ఫోకస్ పెట్టాడు. అఫ్ కోర్స్ తన ఇమేజ్ ను కూడా చూసుకుంటాడు.

అట్లీ, లోకేష్ కనకరాజ్ లతో మూవీస్ ఇందుకేనా..?

రాకా తర్వాత అల్లు అర్జున్ ఈ సారి లోకేష్ కనకరాజ్ తో జత కట్టాడు. ఈ మూవీ ఆగిపోయింది అని వచ్చిన అన్ని రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్ గానే అప్డేట్ ఇచ్చింది టీమ్. ఇది ఈ యేడాదే ప్రారంభం అవుతుంది అని చెప్పారు. అంటే బ్యాక్ టు బ్యాక్ తమిళ్ డైరెక్టర్స్ తోనే మూవీస్ చేస్తున్నాడు. అంటే కేరళం తర్వాత అతని టార్గెట్ తమిళనాడా..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. కేరళంలో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ ఏకంగా ఆర్మీనే ఉంది. సో.. ఇక తమిళనాడును టార్గెట్ చేస్తూ.. అక్కడి ఆడియన్స్ ను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు.

తమిళ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్

ఓ రకంగా తమిళనాడులో తెలుగు హీరోస్ కు మంచి ఫ్యాన్ బేస్ అంటూ ఏం లేదు. ఇంకా చెబితే తెలుగు హీరోలను వాళ్లు లైట్ తీసుకుంటారు. ఏదో రాజమౌళి వల్ల బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటివి కొన్ని కోట్లు సంపాదించాయి. బట్ తెలుగు హీరోలను వాళ్లు ఓన్ చేసుకోలేదు అనేది కాదనలేని సత్యం. అందుకే అల్లు అర్జున్ వారిని తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా వాస్తవం. అలాగని ఇదేమీ తప్పు కాదు కదా.. ఒక భాషా ప్రేక్షకులను మనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ గా సెట్ చేసుకోవడంలో కష్టమేం కాదుగా. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నది ఇదే.

అల్లు అర్జున్ సాధిస్తాడా..?

అల్లు అర్జున్ ఒక మూసలో ఆగిపోవాలనుకోవడం లేదు. అది పుష్ప నుంచే మొదలైంది. తన రేంజ్ ని మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఇప్పుడు అట్లీ, లోకేష్ కనకరాజ్ వంటి దర్శకులతో మూవీస్ చేస్తున్నాడు. పైగా ఈ ఇద్దరు దర్శకులకు తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అది ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ కు ప్లస్ అవుతుంది. ఆ సినిమాలు కూడా నిజంగా బావుంటే అది అతని టార్గెట్ గా మారుతుంది. అంటే తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకునే ప్రయత్నం అన్నమాట. ఏదేమైనా అల్లు అర్జున్ స్ట్రాటజీ మాత్రం సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. మరి ఇప్పటి వరకు తెలుగు హీరోలెవరూ సాధించలేనిది అల్లు అర్జున్ సాధిస్తాడా అనేది కాలం చెబుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి