
మైసా మూవీ వాయిదా
రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించిన మూవీ ఈ నెల 27న విడుదల కాబోతోంది. అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఈ చిత్రాన్ని వాయిదా వేశాం అని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం రష్మిక మందన్నా(Rashmika Mandanna)ప్రాణం పెట్టి మరీ పనిచేసిందని మేకింగ్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. మైసా (Mysaa Movie) అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత టీజర్ కూ అదే స్థాయిలో స్పందన వచ్చింది. రీసెంట్ గా పాటలు రిలీజ్ చేస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రమోషన్స్ మొదలైనట్టు అని చాలామంది భావించారు. ఇంకేముందీ ట్రైలర్ కూడా వచ్చేస్తే రిలీజ్ కు ఇక ఫిక్స్ అయినట్టే అనుకున్నారు. కానీ మైసా మూవీ వాయిదా పడింది.
భోగి ట్రైలర్ ఎఫెక్ట్ ఎంత..?
రష్మిక మందన్నా మైసా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడానికి కారణం భోగి(Bhogi Mogive) మూవీ ట్రైలరే అని కొందరు మాట్లాడుతున్నారు. నిజానికి మైసాతో పోలిస్తే భోగికి ఎలాంటి హైప్ లేదు. బజ్ లేదు. బట్ భోగి ట్రైలర్ చూసి చాలామంది మైండ్ బ్లోయింగ్ అనేశారు. శర్వానంద్(Sharvanand), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)జంటగా నటించిన భోగికి సంపత్ నంది దర్శకుడు. అతను ఈ చిత్రంపై చాలా అంటే చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సినిమా మరో స్థాయిలో ఉంది. శర్వానంద్ కు నేషనల్ అవార్డ్ ఖాయం అని మాట్లాడాడు కూడా. ఏదేమైనా భోగి ట్రైలర్ అద్భుతమైన రియాక్షన్ వస్తోంది.
మైసా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు..?
భోగి ట్రైలర్ కారణంగానే రష్మిక మందన్నా మైసా వాయిదా పడింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇది టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే వాయిదా పడిందని కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం అని రొటీన్ డైలాగ్ వాడేశారు మేకర్స్. ఒకవేళ టెక్నికల్ రీజన్స్ లో నిజమే ఉన్నా.. ఇప్పటికైతే చాలామంది భోగి ట్రైలర్ కు వచ్చిన స్పందన కారణంగానే మైసాను వాయిదా వేశారు అనేది చాలామంది అభిప్రాయం. మరి ఇది నిజమో కాదో మీకే తెలియాలి.
