చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్.. వీరులో గెలిచేది ఎవరు..?

 ఓ రేంజ్  2027 సంక్రాంతి

సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు మంచి ఊపొస్తుంది. చాలా పెద్ద స్టార్ హీరోలు నటించిన మూవీస్ ఆ టైమ్ కు విడుదల చేస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ మారింది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీస్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. ఆ కారణంగానే చాలా ముందుగానే వీళ్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంటారు. అలా ఈ 2027 సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి అవేంటో చూద్దాం.

సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్

సంక్రాంతి హాలిడేస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ కు వస్తుంటారు. అందుకే జనవరి 12న సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన మూవీ సంబరాల ఏటి గట్టు మూవీ విడుదల కాబోతోంది. ఓ రకంగా చూస్తే ఇది గతేడాది లేదంటే ఈ యేడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ బాగా ఆలస్యం అవుతోంది. సాయిదుర్గా తేజ్ విరూపాక్ష తర్వాత చేస్తున్న మూవీ ఇది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతోన్న మూవీ ఇది. ఫైనల్ గా ఇది సంక్రాంతికి వస్తుందని మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించారు.

జనవరి 14న శర్వానంద్ మూవీ

జనవరి 14న రిలీజ్ అని సినిమా ప్రారంభానికి ముందే డేట్ ఇచ్చిన మూవీ శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోది. వీళ్ల కాంబోలో చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. మామూలుగా అయితే శ్రీను వైట్ల ఇప్పుడు ఫామ్ లో లేడు. ఓ రకంగా ఇది అతని చివరి ప్రయత్నం అనుకోవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

అనిల్ రావిపూడి లైన్ లో ఉన్నాడు

ఇక రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ వెంకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడదుల చేశారు. మరి ఈ మూవీతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని చాలామంది భావిస్తున్నారు.

చిరంజీవి కూడా సంక్రాంతి బరిలోనే

ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ కూడా సంక్రాంతికే వస్తోందంటున్నారు. వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్, బాబీ కాంబోలో మూవీ అంటే మంచి అంచనాలే ఉంటాయి. వాటిని అందుకోవడం ఖాయం అనేలా వీళ్లు ఫీల్ అవుతున్నారు. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోందీ మూవీలో. చిరంజీవికి కూతురు లాంటి పాత్ర చేస్తుందని సమాచారం. బట్ వీళ్లు సంక్రాంతికే రావడం మాత్రం పక్కా అంటున్నారు.

మరికొన్ని మూవీస్ సంక్రాంతి బరిలో

ఓ రకంగా ఈ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయి. బట్ సంక్రాంతి టార్గెట్ గానే మరికొన్ని మూవీస్ ఉన్నాయి. రజినీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి డైరెక్షన్ లో స్టార్ట్ అయిన మూవీ సంక్రాంతికే పక్కా అంటున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ‘జాంబిరెడ్డి 2’ కూడా సంక్రాంతి బరిలో విడుదలవుతుంది. లేదంటే ప్రశాంత్ వర్మ ప్రొడ్యూస్ చేస్తున్న మహాకాళి అయినా సంక్రాంతికే విడుదలవుతుందంటున్నారు.
అలాగే రష్మిక మందన్నా మెయిన్ లీడ్ గా చేస్తోన్న మైసా మూవీ కూడా సంక్రాంతికే విడుదలవుతుందని చెబుతున్నారు. మరి ఇంతమందితో కలిసి బరిలో నిలవడం రైటేనా అనేది తెలియాల్సి ఉంది. బట్ మైసా మాత్రం ప్యాన్ ఇండియా మూవీ. కాబట్టి రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇన్ని మూవీస్ తో ఈ సారి సంక్రాంతి మరింత రంజుగా ఉండబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading
ఆగస్ట్ లో అదిరిపోయే సినిమాలు

టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో ఊహించినన్ని విజయాలు మాత్రం రాలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన మూవీస్ అన్నీ యధావిధిగా విజయం సాధించాయి. తర్వాత సమ్మర్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఓ మూడు నాలుగు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. జూన్ లో వచ్చిన పెద్ది, మా ఇంటి బంగారం మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన జూలైలో లెనిన్ తో ఊపు మొదలైంది. ఈ నెల చివర్లో విడుదల కాబోతోన్న శ్రీనివాస మంగాపురంపై అంచనాలున్నాయి. అయితే ఆగస్ట్ లో మాత్రం మాగ్జిమం ప్రామిసింగ్ మూవీస్ అనిపించుకున్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు విడుదల కాబోతోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆ మధ్య విడుదలైన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. కానీ ఓటిటి, శాటిలైట్ డీల్స్ సెట్ కాక ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ డీల్స్ ఓకే అయ్యాయి కాబట్టి ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఫస్ట్ టైమ్ చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీగా ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్. సితార బ్యానర్ లో రూపొందిన సినిమా ఇది. టీజర్ తో బాగా ఆకట్టుకుంది. చాలా యేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది చాలా పెద్ద విజయం అందిస్తుందని చాలామంది అనుకున్నారు. బట్ ఈ లోగానే వీరభద్రుడుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూర్య. దీంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రాబోతున్నాడు.
ఇక ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది ఇరుముడి మూవీ. రవితేజ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అయ్యప్ప మాలలో అతను విడుదల చేసిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. ఈ మూవీతో రవితేజ మంచి విజయం సాధించేలానే ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు.
ఆగస్ట్ 26న విడుదల కాబోతోన్న మూవీ టాక్సిక్. యశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఈ డేట్ కు రావడం కూడా కష్టమే అనుకున్న టైమ్ లో రీసెంట్ గా విడుదల చేసిన పాటతో మొత్తం సోషల్ మీడియాను హీటెక్కించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సితారియా, రుక్మిణి వసంత్ లాంటి బ్యూటీస్ కూడా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యశ్ చేసిన ఈ మూవీపై ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక ఆగస్ట్ 28న విడుదల కాబోతోన్న మూవీ భోగీ. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ రగ్ డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. 1960స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఇది ఉండబోతోందని ముందే చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇదే డేట్ కే రావడం ఖాయమా లేక మరో కొత్త డేట్ కు వస్తుందని కూడా చూడాలి. మొత్తంగా ఈ ఆగస్ట్ ప్రతి వారం ఒక ప్రామిసింగ్ మూవీతో ఆడియన్స్ కు మంచి జోష్ ఇచ్చే ఇవ్వబోయేలా ఉందని చెప్పొచ్చు.

Continue reading