ఆదర్శ కుటుంబం వాయిదా
వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతి ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. కాకపోతే ఇది వాయిదా పడింది.
కొత్త రిలీజ్ డేట్ ఇదే
వెంకటేష్ నటిస్తోన్న ఆదర్శ కుటుంబం చిత్రాన్ని అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అందుకు కారణాలేంటీ అనేది క్లియర్ గా చెప్పలేదు కానీ.. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాలేదు అనే కారణంతోనే పోస్ట్ పోన్ చేశారు. మరీ హడావిడీగా రిలీజ్ చేసినా ఇబ్బందే కదా. అందుకే ఒక వారం టైమ్ తీసుకుని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి ఈ డేట్ ఫిక్సా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది.
వెంకీ, త్రివిక్రమ్ స్టైల్ లోనే మూవీ
వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ అంటే మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు కరెక్ట్ గా సెట్ అయ్యే కథే ఉంటుందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. కొన్నాళ్లుగా వెంకటేష్ ఏ మూవీ చేసినా అది హిట్ అయిపోతుంది. ఈ మూవీ కూడా బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతోందా అనిపించేలా ఉంది. మరి వెంకటేష్ ఆదర్శ కుటుంబం అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
