Gaaradi Telugu news logo

సిగ్మాతో జాసన్ సంజయ్

దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’అనే మూవీతో దర్శకుడుగా మారాడు. తన ఫస్ట్ మూవీ సందీప్ కిషన్ తో చేశాడు. ఈ మూవీ జూలైలోనే విడుదల కావాల్సి ఉంది. బట్ అదే టైమ్ కు విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదల చేశారు. జాసన్ తన తండ్రి మూవీ ఉంది కాబట్టి తన సిగ్మాను వాయిదా వేశారు. కట్ చేస్తే కాస్త ఎక్కువ టైమ్ ఉన్నా ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీ రిజల్ట్ ముందే తెలిసిపోయిందని కొందరు ఫీలవుతున్నారు.

తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలు

సందీప్ కిషన్ కొన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ కారణంగా ఈ మూవీ పోతుందా అంటే అదేం కాదు. ఓ సెంటిమెంట్ మాత్రం బలంగా కనిపిస్తోంది. అదేంటంటే.. ఈ మధ్య కాలంలో తమిళ్ డైరెక్టర్స్ తో తెలుగు హీరోలు చేసిన మూవీస్ అన్నీ పోతున్నాయి. ఒకప్పుడు స్టాలిన్ తర్వాత 2010లో ఏ మాయ చేశావె, డార్లింగ్ మూవీస్ తప్ప మిగతావేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెబితే అస్సలు ఆడలేదు.

జాసన్ మూవీతో సందీప్ కిషన్ కు దెబ్బా

ఈ లిస్ట్ లో చాలాకాలం నుంచి చూస్తే సూర్య డైరెక్ట్ చేసిన నాని,పులి చిత్రాల రిజల్ట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. పంజా, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో, స్పైడర్, ది వారియర్, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇదే లిస్ట్ లో ముందుగా విజయ్ తనయుడు జాసన్ డైరెక్ట్ చేసిన సిగ్మా కూడా తెలుగులో పోతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు కొందరు. కాకపోతే ఇది డైరెక్ట్ తమిళ్ మూవీ కాబట్టి అక్కడ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నెక్ట్స్ లైన్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్

అలాగే ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్న హీరోలు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ తో అల్లు అర్జున్ తో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఈ సెంటిమెంట్ ను ఎవరు బ్రేక్ చేయబోతున్నారు అనేది చూద్దాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి