జాసన్ సంజయ్ హిట్ కొడతాడా
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సిగ్మా. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. డ్రగ్స్, గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాటు ఏనుగు దంతాల కథ కూడా మిక్స్ అయింది ఈ ట్రైలర్. మరి ఈ మూడిని బ్యాలన్సింగ్ గా చెప్పాడా దర్శకుడు జాసన్ సంజయ్ అనే అనుమానం చాలామందిలో ఉంది.
జాసన్ కి విజయ్ సపోర్ట్ ..?
జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన సిగ్మా మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు తమిళనాడులో ఉంది. అక్కడ విజయ్ ఈ మూవీ కోసం ఏమీ చేయడం లేదు. తనయుడు కాబట్టి ఏదోక ప్రమోషనల్ ఈవెంట్ కు అటెండ్ అవుతాడు అని చాలామంది భావించారు. బట్ అలాంటిదేం లేదు. విజయ్ తన కొడుకు జాసన్ సంజయ్ మూవీ కోసం వ్యక్తిగతం కూడా ఏమీ చేయడం లేదు. ఈ విషయాన్ని జాసన్ సంజయ్ కూడా హ్యాపీగానే తీసుకుంటున్నాడు. తనకు తాను ఎదగగలనని అతను నిరూపించుకునే ప్రయత్నం కూడా ఇది అనుకోవచ్చు.
త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2నే
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన మూవీ ఆదర్శ కుటుంబం. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా మరో జంటగా నారా రోహిత్, నివేదా పేథురాజ్ నటించారు. ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఆదర్శ కుటుంబం టీజర్ కు అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 2కు పెద్దగా టైమ్ లేదు. అయినా వీళ్లు కామ్ గానే కనిపించడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. అయినా ఈ మూవీపై త్రివిక్రమ్ చాలా నమ్మకంగా ఉన్నాడు అనేది తెలుస్తోంది.
జాసన్ సంజయ్, త్రివిక్రమ్ ను దాటగలడా..
జాసన్ సంజయ్ ది సిగ్మా ఫస్ట్ మూవీ. ఇందులో తెలుగు హీరో హీరోయిన్లు నటించారు. ఈ మూవీతో తెలుగులో కూడా ఆడియన్స్ మెప్పించడం అతని ప్రధాన పని. కానీ త్రివిక్రమ్ వంటి తెలుగు టాప్ డైరెక్టర్ తో పోటీ పడి.. అందులో నెగ్గడం అంత ఈజీ కాదు. ఇదో పెద్ద టఫ్ టాస్క్. అదే టైమ్ లో ఆదర్శ కుటుంబంకు హిట్ టాక్ వస్తే సిగ్మా పని అయిపోయినట్టే. త్రివిక్రమ్ ను దాటి సిగ్మా హిట్ కావడం అంటే అదో కథ, కథనంతో మెస్మరైజ్ చేయాలి. అప్పుడే ఆదర్శ కుటుంబంతో పోటీ పడే అవకాశాలున్నాయి. ఏదేమైనా జాసన్ సంజయ్ కి త్రివిక్రమ్ ను దాటడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
