
శ్రీలీల ఫ్లాపుల్లోనే కెరీర్
శ్రీలీల.. అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది. పెళ్లి సందడితో పరిచయమైనా ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో ఒకట్రెండు హిట్ అయ్యాయి తప్ప మిగతా వన్నీ ఫట్ మన్నాయి. ఓ దశలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఏదేమైనా తన ఫేమ్ తెలుగులో పూర్తిగా పోయింది. శ్రీలీల అంటే హమ్మో అనేస్తున్నారు మేకర్స్. ఇంకా చెబితే ఐరన్ లెగ్ ట్యాగ్ కూడా తగిలించారు కొందరు. సరేలే అని తమిళ్ లో ప్రయత్నిస్తే అక్కడా అదే జరిగింది. పరాశక్తితో డిజాస్టర్ అందుకుంది. ఈ యేడాది తెలుగులో చాలా హోప్స్ పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పోయింది. ఇక చేతిలో ఉన్న రెండు హిందీ సినిమాలపై ఎలాంటి అప్డేట్ రావడం లేదు.
ఓమ్ తో బౌన్స్ బ్యాక్ అవుతుందా..?
శ్రీలీల ఇంకా ఆశలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ‘ఓమ్’. ధనుష్ హీరోగా మమ్మూట్టీ, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఓమ్. అమరన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఓమ్. ఈ మూవీ నుంచి శ్రీలీల పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ధనుష్, మమ్మూట్టి, సాయి పల్లవిల పాత్రలను పరిచయం చేశారు. ఇక శ్రీలీల వంతుగా ఇవాళ వీడియో విడుదలైంది.
ఓమ్ లో శ్రీలీల పాత్రలో ఒక ఎమోషన్ ఉండబోతోంది అనిపించేలా పాత్రను పరిచయం చేశారు. అలాగే తన కెరీర్ లో ఈ సారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది అనిపించేలా ఉంది. డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఈ పాత్రలో. మరి ఓమ్ తో ఓ హిట్ కొడితే శ్రీలీల మళ్లీ ఫామ్ లోకి వస్తుందని చెప్పొచ్చు.
రజినీకాంత్ ధర్మన్ లో శ్రీలీల
అలాగే మరో తమిళ్ మూవీలోకి తను ఎంటర్ అయింది. అదీ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న మూవీ. పేరు ధర్మన్. ఈ టైటిల్ గతంలోనే ప్రకటించారు. అప్పుడు శ్రీలీల కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు తన కెరీర్ డల్ గా ఉంది కాబట్టి ఈ మూవీలో తను ఉండకపోవచ్చు అనే ఊహాగానాలు వచ్చాయి. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. తను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది. దీన్నే అఫీషియల్ గా మూవీ టీమ్ కూడా ప్రకటించింది. మొత్తంగా ఈ రెండు సినిమాలూ తన కెరీర్ కు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి అనేది వాస్తవం. సో.. రెండూ హిట్ అయితే తన కెరీర్ కొత్త టర్నింగ్ ఇచ్చుకుంటుంది. ఫట్ అయితే ఇక అంతే సంగతులు.
