
ఎదురుచూసిన కాంబినేషన్
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలకు ఆ టైమ్ లో త్రివిక్రమ్ కేవలం మాటల రచయిత. దర్శకుడయ్యాక.. వెంకటేష్ హీరోగా సినిమా చేయలేదు. ఆడియన్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీ కార్యరూపం దాల్చింది. ఇవాళ విడుదలైంది కూడా. మరి వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ ఎలా ఉంది..?
ఓ సాధారణమైన మిడిల్ క్లాస్ కు చెందిన కుటుంబం కథగా సినిమా మొదలవుతుంది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య చిట్టీల వ్యాపారం చేసి నష్టపోతుంది. కూతురు ఓ మెకానిక్ ను ప్రేమిస్తున్నా అనుకుంటుంది. కొడుక్కి పెద్దగా చదువు రాదు. అతనికి గుండెకు ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ అయినా వెంకీకి ఆ జాబ్ కూడా పోతుంది. ఆ టైమ్ లో అనుకోకుండా వచ్చిన ఓ లాటరీ వల్ల ఏకంగా 100 కోట్లు గెలుచుకుంటాడు. మరి ఆ వంద కోట్లతో ఏం చేశాడు.. అనేది ఓ పాయింట్.
ఆదర్శ కుటుంబం కథనం ఎలా ఉంది..?
సినిమా ఆరంభంలోనే బిహార్, మహారాష్ట్రలో టార్జాన్ అనే పెద్ద డెకాయిట్ ముఠా ఉంటుంది. వీరు బాగా డబ్బున్న వాళ్లను టార్గెట్ చేసి తర్వాత హత్యలు చేస్తూ.. అందిన కాడికి దోచుకుంటారు. ఆ గ్యాంగ్ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఆ గ్యాంగ్ చూపు 100 కోట్ల లాటరీ కొట్టేసిన వెంకీ ఇంటిపై పడుతుంది. ఇటు కొందరు పోలీస్ లు వెంకీ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. వారు చనిపోయినా ఫర్వాలేదు అనేలా ఓ ఎరగా మారుస్తారు. మరి ఈ టార్జాన్ ముఠా టార్గెట్ రీచ్ అవుతారా.. పోలీస్ లు ఎందుకు వెంకీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ ఏంటీ..?
వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఓ అంచనాల ఉంటుంది. ఆ అంచనాలకు భిన్నంగా ఈ సారి మేం కొత్తగా ట్రై చేశాం అని చెప్పాడు త్రివిక్రమ్. బట్ అందులో నిజం లేదు. ఈ కొత్త పాయింట్ ఎవరికీ పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇంకా చెబితే త్రివిక్రమ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మార్కులు పడతాయి. ఎంటర్టైన్మెంట్ కూడా అంత సహజంగా ఉండదు. ఫోర్స్ డ్ గానే కనిపిస్తుంది. బట్ సత్య కామెడీ వల్ల దీనికి ప్లస్ అయింది. ఇంటర్వెల్ కు పావుగంటకు ముందు కథలో ఓ పట్టు కనిపిస్తుంది. ఏదో కొత్తగా భారీ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. చేసినట్టునే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఓ రేంజ్ లో ఉంది మూవీ. బట్ ఇది కూడా అర్జున్, అభిరామి నటించిన బ్లాస్ట్ లాగా ఉండటం మైనస్ గా ఉంది. అయినా ఆకట్టుకుంటుంది.
మైనస్ లేంటీ..?
ఇంటర్వెల్ తర్వాత సినిమా స్థాయి మారుతుంది అని భావించారు. బట్ అది కనిపించదు. ఇంకా చెబితే అసలు ఇది ఫ్యామిలీ కాదు అని అని సెకండ్ హాఫ్ లో రివీల్ చేసిన ట్విస్ట్ మాత్రం చాలా బావుంది. అయితే వారి నేపథ్యాలను ప్రభావవంతంగా చూపించడంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడు. ఏదో మమ అనిపించాడు అంతే. అయినా ఇప్పటి వరకూ తెలుగు.. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాల్లోనే ఫ్యామిలీ మూవీ అనగానే ఉండే రిలేషన్స్ కు భిన్నంగా ఉంది. ఇది ఖచ్చితంగా కొత్త పాయింట్ గా ఉంది. ఈ పాయింట్ తో ఇప్పటి వరకూ ఏ భాషలోనూ సినిమా రాలేదు.
వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ అనగానే అంచనాలకు తగ్గట్టుగా ఉన్నంత వరకు బావుంది. కొత్త జానర్ అని చేసిన ప్రయత్నం అంతగా బాలేదు. అదీ కాక సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ పెక్టేషన్స్ కు దగ్గరగా ఉండటం కూడా ఓ పెద్ద మైనస్. అయినా సినిమా బాలేదు అని చెప్పలేం. అలాగని సూపర్ అని చెప్పలేం. చూస్తున్నంత సేపూ బానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది.
ఫైనల్ గా ఓ దండుపాళ్యం గ్యాంగ్ ను హైలెట్ చేస్తూ బ్లాస్ట్ లోని ఫైట్స్ ను పోలిన కథనంగా ఈ కథ కనిపిస్తోంది. ఆ రెండు సినిమాలు చూసిన వారికి ఆదర్శ కుటుంబం అంతగా కనెక్ట్ కాదేమో అనిపిస్తోంది.
థమన్ సంగీతంలో పాటలు బాలేదు. నేపథ్య సంగీతం చాలా చోట్ల కాపీ కొట్టినట్టుగా ఉన్నా బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. తక్కువ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు కాబట్టి బడ్జెట్ పరంగా కూడా హ్యాపీ అనుకోవచ్చు. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో, గుంటూరు కారంతో పోలిస్తే ఆ రెండు సినిమాల స్థాయిలో ఇది లేదు. ఇంకా చెబితే గుంటూరు కారం మే బావుంది అనిపిస్తుంది.
ఫైనల్ గా : కుటుంబమే లేని ఆదర్శ కుటుంబం
రేటింగ్ : 2.5/5
KYR
