
ఓటిటిలోకి నాని ప్యారడైజ్
నాని (Nani) హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. రిలీజ్ తర్వాత విపరీతమైన విమర్శలు వచ్చాయి. కంటెంట్ లో దమ్ములేదు అని యూనానిమస్ గా డిక్లేర్ చేశారు రివ్యూవర్స్. ఓ రకంగా నానిపై ఈ రేంజ్ లో నెగెటివిటీ రావడం ఇదే మొదటి సారి. 1980ల కథగా వచ్చిన ఈ చిత్రం ఎవరినీ మెప్పించలేకపోయింది. కేవలం హీరో నానిని హైలెట్ చేస్తూ మోతాదుకు మించిన వయొలెన్స్ మరో పెద్ద లోపం. ఆ వయొలెన్స్ కూడా కంటెంట్ కు కనెక్ట్ అయ్యేలా కాకుండా హీరోను అలాగే చూపించాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు అనిపించాడు.
నాని మూవీపై ఫ్యామిలీ ఆడియన్స్ దూరం
నాని మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. బట్ ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఛీ ఇదేం సినిమా అన్నారు అంటే తప్పేం కాదు. దసరా టైమ్ లోనే శ్రీకాంత్ ఓదెలపై కొందరు విమర్శలు చేశారు. సినిమా హిట్ అయింది కాబట్టి తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇదే అదను అనుకున్నాడేమో శ్రీకాంత్ ఓదెల ఈ సారి డోస్ ను త్రిబుల్ రేంజ్ లో పెంచాడు. అదే సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఇక అనిరుధ్ (Anirudh Ravichander) నేపథ్య సంగీతం బానే ఉన్నా.. ఒక్క పాట తప్ప మిగతావేవీ ఆకట్టుకోలేదు.
శ్రీకాంత్ రైటింగ్ లో పస లేదు
శ్రీకాంత్ రైటింగ్ లో అసలు పస లేదు అని తేల్చారు ప్రేక్షకులు. అదీ కాక అదే పనిగా వాయిదాలు పడటం కూడా మరో లోపంగా మారింది. ఇలా పోస్ట్ పోన్స్ చేసిన మూవీస్ ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అనేది అందరికీ అర్థం అయింది. ఓ రేంజ్ లో చెక్కాడు శ్రీకాంత్. ఏకంగా 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. అయినా మూవీలో దమ్ము లేకపోవడం వల్ల ఫైనల్ గా ఈ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ద ప్యారడైజ్
నాని మూవీ కాబట్టి ఓటిటి వాళ్లు కూడా భారీగానే ముట్ట చెప్పాలనుకున్నారు. సినిమా డిజాస్టర్ కాబట్టి ఆ మొత్తం సగానికి తగ్గించారు. ఇక ది ప్యారడైజ్ (The Paradise)ఈ రాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో 2 గంటల 53 నిమిషాల నిడివితో ప్రదర్శితమైన ఈ చిత్రానికి ఓటీటీ వెర్షన్ నిడివి 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా 4K డాల్బీ విజన్ హెచ్డీఆర్ విజువల్ క్వాలిటీ, డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో స్ట్రీమింగ్ కానుంది.
