Gaaradi Telugu news logo

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో అగ్నిపరీక్ష బ్యాచ్ చేసే హడావుడి తట్టుకోలేకపోతున్నాం. ఐదోవారానికిగానూ నామినేషన్ల విషయమై పెద్ద ప్లాన్ వేశామని సంబరపడిపోయారు గానీ అది వీళ్ల మెడకే చుట్టుకుబోతుందని అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఇంతకీ హౌస్‌లో 30వ రోజైన మంగళవారం(అక్టోబర్ 06) అసలేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.

ఐదోవారం నామినేషన్లలోకి అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా వచ్చేశారు. అంతా మనమే ఉంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే అవతలి వైపు నుంచి వీలైనంత మందిని నామినేషన్‌లోకి లాగండి అని రోహిత్ తన టీంకి చెప్పాడు. దీంతో పాయింట్స్ ఉన్నా లేకపోయినా అగ్నిపరీక్ష టీం నుంచి షాలిని, రోహిత్ ఇలా అందరూ నామినేషన్స్ చేసేశారు. దీంతో కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ సాధించిన వంశీ, సుధీర్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

మంగళవారం ఎపిసోడ్‌లో పండుని కనిపెట్టిన సుధీర్.. రోహిత్, షాలినిని నామినేట్ చేశాడు. మాటలు జారుతున్నావ్, సైగలు చేస్తున్నావ్ అని రోహిత్‌కి చెప్పాడు. రోహిత్ వల్ల నీ చెడిపోతోంది. రాత్రి నాలుగువరకు కూర్చుని మాట్లాడుతున్నారు అని సుధీర్ అన్నాడు. అది పర్సనల్ పాయింట్ నీకు అవసరం లేదు అని సుధీర్‌తో షాలిని వాదించింది. తర్వాత చరణ్ వచ్చి ముకేశ్‌ని నామినేట్ చేశాడు. తర్వాత అపూర్వ వచ్చి.. నక్క, చిన్నదో వైపు, పెద్దదో వైపు, ట్రయాంగిల్ ట్రాక్ అని ఇలా అన్నావ్ అంటూ ముకేశ్‌ని నామినేట్ చేసింది. నువ్వు తోపు అయితే నీకు నేను బాపు అని అపూర్వ అనేసరికి.. నువ్వు నాకు బాపు? తండ్రివా? అని ముకేశ్ కౌంటర్లు వేశాడు.

తర్వాత ఝాన్సీని నామినేట్ చేసిన అపూర్వ.. నువ్వు గ్రూపులో ఉండి వారి మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నావ్. నీ డ్యాగర్స్‌ని ఎందుకు ఇచ్చావ్? అనేసరికి నేను ఆట ఆడాలని ఆ డ్యాగర్స్ ఇచ్చా ఇమ్యూనిటీ నాకు అవసరం లేదు. జనాలు ఉంచాలని అనుకుంటే ఉంచుతారని ఝాన్సీ కౌంటర్ ఇచ్చింది. నరేశ్ వచ్చి చరణ్‌ని నామినేట్ చేశాడు. ఏం కనిపించడం లేదు. హోస్ట్ చెప్తున్నా నువ్వు మారడం లేదని కారణాలు చెప్పాడు. ఆపై ఝాన్సీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేసింది. అగ్నిపరీక్షలో నిన్ను ఇలా చూడలేదు. ఇక్కడ, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. మాటలు తూలుతున్నావ్ అని రోహిత్‌కి నామినేషన్ పాయింట్స్ చెప్పింది. సుధీర్‌ని పిల్ల బచ్చా అని ఎలా అన్నావ్. ఆటని ఆటగాడిలా ఆడు పోటుగాడిలా కాదు అని అమన్‌ని నామినేట్ చేసింది .

తర్వాతే దేబ్జానీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేసింది. నువ్వు అగ్నిపరీక్షలో ప్రవర్తించిన విధానం నాకు నచ్చింది కానీ ఇక్కడ నచ్చడం లేదు అని తన కారణాలు చెప్పింది. రోహిత్ వచ్చి నరేశ్, రాంప్రసాద్‌లని నామినేట్ చేశాడు. మా అందరినీ నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అది నాకు తెలుసు. మీకు పాయింట్స్ లేకపోయినా నామినేట్ చేస్తారని రోహిత్ ప్లాన్‌ని నరేశ్ బట్టబయలు చేశాడు. తర్వాత వంశీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేశాడు. అలా చివరకు అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలినీ, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ నామినేషన్స్‌లోకి వచ్చారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

ఇక్కడ అగ్నిపరీక్షకు అర్థం కాని విషయం ఏంటంటే ఈసారి కూడా వీళ్లలో ఒకరు ఎలిమినేట్ కావడం గ్యారంటీ. అది చరణ్ అ‍య్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే షాలిని కావొచ్చు. మరి ఈసారి ఎవరెళ్లిపోతారనేది చూడాలి?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి