Gaaradi Telugu news logo

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్క్ చేరిన థర్డ్ మూవీగా ఇరుముడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి మూవీగా చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు, రెండో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. తర్వాత ఓ తెలుగు మూవీగా ఇన్ని కోట్లు తెచ్చుకున్న మూవీ ఇరుముడి.
రవితేజ తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకుని చేసిన మూవీ ఇరుముడి. మాస్ మహరాజ్ అనే ట్యాగ్ ఒక్క షాట్ లో కూడా కనిపించకుండా చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. అదే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా మారింది. తర్వాత బేబీ నక్షత్ర నటన మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆపై సాయికుమార్, ప్రియా భవానీ శంకర్, శ్వాసిక వంటి వారి పాత్రలు మరో స్థాయిలో ఉన్నాయి.


ఓ రకంగా ఈ మధ్య కాలంలో కామన్ ఆడియన్స్ అంతా బళ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా చూస్తున్నారు అంటే అది కేవలం ఇరుముడి మాత్రమే. ఇప్పటికీ ఆటోలు, ట్రాక్టర్స్ లో వెళ్లి మరీ జనం ఎగబడి చూస్తున్నారు. ఆగస్ట్ 21న విడుదలైంది ఇరుముడి. ఇప్పటికీ అదే ఊపు. అవే వసూళ్లు. చాలా చోట్ల హౌస్ ఫుల్ కనిపిస్తోంది. అలాంటి మూవీ ఓటిటిలోకి వస్తుందంటే జనం రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన విషయం.
మామూలుగా కొన్నాళ్ల క్రితం థియేటర్స్ లో హిట్ అయిన మూవీస్ కు ఓటిటిలో పెద్దగా కనెక్ట్ కావు.. థియేటర్స్ ఫ్లాప్ అయిన మూవీస్ ఓటిటిలో హిట్ అవుతుంటాయి అనే సామెత ఉంది. ఆ సామెత చాలా తక్కువ టైమ్ లో మారిపోయింది. ఇప్పుడు థియేటర్స్ బావుంటేనే ఓటిటిలో కూడా బావుంటాయి అనే టాక్ వచ్చింది. సో.. ఇరుముడికి ఓటిటిలో కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఇరుముడి నెట్ ఫ్లిక్స్ లో ఇవాళ(18.09.2026) అర్థరాత్రి నుంచే ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి