వెంకీ నుంచి ఫస్ట్ సింగిల్
వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ ఇది. త్రివిక్రమ్, వెంకీ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి వెయింటింగ్ కు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడింది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయా అనే డౌట్స్ కూడా చాలామందిలో ఉంది. బట్ ఈ డౌట్స్ కు కట్ చేస్తూ తాజాగా ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అని ప్రకటించారు.
వెంకీతో పాటు ముగ్గురు హీరోయిన్లు
వెంకటేష్ హీరో కాబట్టి మంచి హీరోయిన్లు కూడా ఉండాల్సిందే కదా. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో తన పెయిర్ అయిన శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్ అలాగే డింపుల్ హయాతీ కూడా ఈ పాటలో నర్తించబోతున్నారు. అంటే ఓ రకంగా ఇదో ఐటమ్ సాంగ్ అనుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ సాంగ్స్ లో మెయిన్ హీరోయిన్ కూడా ఉందంటే పాటలో కంటెంట్ కూడా బలంగా ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే వెంకటేష్ తో పాటు నర్తించే మెయిన్ స్పెషల్ లేడీగా డింపుల్ హయాతీని చూడొచ్చు. నివేదా పేతురాజ్ రెండో హీరోయిన్ గా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి.. అంతగా చూడాల్సిన పనిలేదు.
ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగ్ 22న
ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. ‘నారాయణమ్మ’ అనే పదం చుట్టూ ఈ పాట ఉండబోతోందని తెలిపారు. మరి ఈ నారాయణమ్మ ఎలా ఉండబోతోంది.. సినిమాపై హైప్ పెంచుతుందా లేదా అనేది చూడాలి.
