నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘ద ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలైతే లేవు కానీ బిజినెస్ పరంగా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లో స్ట్రాంగ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. అలాగే ఓటిటి డీల్ కూడా భారీగానే అయింది. బట్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం మూవీ టీమ్ తగ్గించింది. ట్రైలర్ విడుదల చేయలేదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు. మరి కావాలనే వీళ్లు లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారా లేక ఎలాగూ పోయే మూవీ కాబట్టి ప్రమోషన్స్ కు ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా అనేది తెలియదు కానీ.. కానీ సినిమా బావున్నా.. అది ఇన్ డైరెక్ట్ గా కలెక్షన్స్ పై ప్రభావం చూపబోతోంది అనేది వాస్తవం.
నాని తో పాటు కయాడు లోహర్ హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడు మంచి పాత్రలో కనిపించాడు. సంపూర్ణేష్ బాబు పాత్ర కూడా బావుందంటున్నారు. అన్నీ ఉన్నా.. ఈ మూవీలో విపరీతమైన వయొలెన్స్ ఉండబోతోంది. ఆ కారణంగానే దీనికి సెన్సార్ నుంచి ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది. మరి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే చిన్నవాళ్లు చూడటం కుదరదు కదా. ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ ల్లో దీని ప్రభావం గట్టిగా కనిపించడం ఖాయం అంటున్నారు.
మామూలుగా నాని మూవీస్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ చూసే సినిమాలు. అతన్ని నేచురల్ స్టార్ అనడం కన్నా ఫ్యామిలీ స్టార్ అన్నా కూడా సరిపోతుంది. అలాంటి నాని కొన్నాళ్లుగా మాస్ ఇమేజ్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఈ ప్రయత్నంలో మాస్ హీరో అవుతాడా లేదా అనేది కానీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో కొన్ని మాస్ మూవీస్ లో అతని నటనపై విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అవన్నీ నానికి తెలుస్తున్నాయా లేదా అనేది తెలియదు కానీ.. ఎలా చూసినా నాని కటౌట్ కు మాత్రం ఓ రేంజ్ మాస్ హీరో అనిపించుకోవడం దాదాపు అసాధ్యం అని చాలామంది ఫీలవుతున్నారు అనేది మాత్రం నిజం.
