Gaaradi Telugu news logo

చిరంజీవి ప్లానింగ్ సూపర్

మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అయితే.. ఈ ఏజ్ లో కూడా ఆ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. విశ్వంభర షూటింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఇబ్బంది అయ్యింది తప్ప చిరంజీవి నుంచి చిన్న తప్పు కూడా లేదు. బట్ శ్రీకాంత్ ఓదెల అలా కాదు. ప్లానింగ్ సరిగా లేదు. మూవీ మేకింగ్ విషయంలో పర్ఫెక్షన్ లేదు. కంటెంట్ పై కమాండ్ లేదు. అందుకే ద ప్యారడైజ్ మూవీ బాగా అంటే బాగా ఆలస్యం అయింది.

శ్రీకాంత్ ఓదెలకు ప్లానింగ్ లేదు

శ్రీకాంత్ ఓదెల ద ప్యారడైజ్ మూవీని నిజానికి ఈ యేడాది మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. బట్ ప్లానింగ్ లో పర్ఫెక్షన్ లేక సెప్టెంబర్ 24న విడుదల చేశారు. పోనీ సినిమా అయినా బావుందా అంటే అదీ లేదు. అణచివేత నుంచి తిరుగుబాటు వరకు కథనం ఉండాలి. కానీ హీరో నానితో చేయించిన జిమ్మిక్కుల కారణంగా అసలుకే ఎసరు పడింది. అందుకే ప్యారడైజ్ పై యూనానిమస్ గా నెగెటివ్ టాక్ వచ్చింది. ఏదో కొందరు తెలంగాణ వాళ్లు సినిమా చాలా బావుంది అని సోషల్ మీడియాలో బీరాలు పలికారు.

శ్రీకాంత్ ఓదెలకు షాక్ ఇచ్చిన చిరంజీవి

చిరంజీవికి ఇలా ప్లానింగ్ లేకుండా సినిమాలు చేయడం అస్సలు నచ్చదు. ఆ కారణంనే శ్రీకాంత్ ఓదలతో చేయాల్సిన మూవీని ఆపేసుకున్నాడు. ఇంకా చెబితే మార్చిలో మూవీ రిలీజ్ అయితే శ్రీకాంత్ వెంటనే చిరంజీవి మూవీ పనులు మొదలు పెట్టాలి. బట్ అలా చేయలేదు కాబట్టి చిరంజీవి వేరే ప్లానింగ్స్ తో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు అని చెబుతున్నారు. కానీ నిజానికి శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ కి వచ్చిన రిజల్ట్ చూసి చిరంజీవి వెనక్కి తగ్గాడు అనేది వాస్తవం. ఆ కారణంగానే శ్రీకాంత్ ను దూరం పెట్టాడు.

శ్రీకాంత్ ఓదల వల్ల పాఠాలు నేర్చుకున్న దర్శకులు

ఏదేమైనా ద ప్యారడైజ్ మూవీ రిజల్ట్ చాలామంది అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఓ గుణపాఠం. ఇంకా చెబితే ప్రస్తుతం సినిమాలు చేస్తున్న చాలామంది సీనియర్ డైరెక్టర్స్ కు కూడా ఓ పాఠమే. సినిమా మేకింగ్ అనేది ఒక కళ. ఆ కళను తక్కువ చేసి చూస్తే దర్శకులకు షాకులు తప్పవు. కథ, కథనాలపై పూర్తి పట్టు ఉంటేనే సినిమాలు చేయాలి. లేదంటే నిర్మాతలు నిండా మునిగిపోవడం ఖాయం. ఆ ద ప్యారడైజ్ నిర్మాత మునిగిపోయాడు కాబట్టే మెగాస్టార్ చిరంజీవి చాలా త్వరగా శ్రీకాంత్ ఓదెల నుంచి మేల్కొన్నాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి