Gaaradi Telugu news logo

చిరంజీవి వర్సెస్ వెంకటేష్

చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనికి మించిన ఫామ్ లో కనిపిస్తున్నాడు వెంకటేష్. ఎఫ్ 2 నుంచి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతున్నాడు విక్టరీ వెంకటేష్. మన శంకర వర ప్రసాద్ గారుతో ఇండస్ట్రీ కొట్టి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈ ఇద్దరూ ఒకే టైమ్ లో వస్తే బాక్సాఫీస్ లు షేక్ అవడం ఖాయం కదా. అదే జరగబోతోంది. కాకపోతే ఎవరి బాక్స్ లు ఎక్కువ బద్ధలు కొడతారు అనే టాక్ మాత్రం మిగిలిపోయింది.

వెంకటేష్, అనిల్ రావిపూడితో మరోసారి

వెంకటేష్ తనకు వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కళ్యాణ్ రామ్, కృతిశెట్టి మరో జంటగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ జనవరి 12న విడుదల. టైటిల్ కు తగ్గట్టుగా అదే టైమ్ కి తన మూవీని కూడా విడుదల చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అంటే కొన్నాళ్లుగా సంక్రాంతి బరిలోనే మూవీస్ విడుదల చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఒక సంక్రాంతికి ఒక సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొడుతున్నాడు. అలా ఈ సంక్రాంతికి కూడా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు.

బాబీతో చిరంజీవి కాకా

చిరంజీవి కూడా వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మూవీ చేస్తున్నాడు. కాక అనే టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీ చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుని ఏకంగా డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు. చిరంజీవి కాక కూడా జనవరి 12నే విడుదల కాబోతోంది.

అనిల్ రావిపూడి వర్సెస్ బాబీ

చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ ఒకే టైమ్ కు వస్తున్నారు. మరి ప్రమోషన్స్ లో అనిల్ కొత్తదనం చూపిస్తుంటాడు. బాబీ ఆ రేంజ్ లో ప్రమోట్ చేయలేడు. ఆ మేరకు అనిల్ వర్సెస్ బాబీ అనే విషయంలో అనిల్ కాస్త దూకుడుగా ఉంటాడు. బట్ బాబీ విషయంలోనూ తక్కువ చేయలేడు. ఇక చిరు, వెంకీ కలిసి మన శంకరవర ప్రసాద్ గారులో అదరగొట్టారు. ఇప్పుడు ఇండివిడువల్ గా వస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరి మూవీకి ఎక్కువ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది.. ఎవరి మూవీకి యావరేజ్ టాక్ వస్తుందనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి చిరంజీవి అదరగొడతాడా లేక వెంకీ ఇరగ్గొడతాడా అనేది చూడాల్సిందే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి