కాకాకి ప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ ఊపులోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ‘కాకా’తో వస్తున్నాడు. కానీ కాకాకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చిరంజీవి దాటుకుంటాడా లేదా అనేది చూడా చాలామంది చూస్తున్నారు. ఆ ప్రమాదం పేరు సెంటిమెంట్. భాషతో పనిలేకుండా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను బలంగా చూస్తారు. ఆ సెంటిమెంట్ కారణంగానే కాకా పోవడం ఖాయం అని భావిస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్ లో కాకా మూవీ
చిరంజీవి కాకా నిర్మాత కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్. వెంకట్ కే నారాయణ నిర్మాత. కానీ అతను నిర్మించిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి పోతున్నాయి. ఈ 2026లోనే అతను నిర్మాణం మొదలు పెట్టాడు. అఫ్ కోర్స్ నిర్మాతగా గతంలో కో ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. బట్ఈ యేడాది విడుదలైన మూవీస్ అన్నీ పోయాయి. మళయాలంలో రూపొందిన ది బాలన్ మూవీ విమర్శకులకు బాగా నచ్చింది. కమర్షియల్ గా పోయింది.
ఇక ఈ జనవరి 9నే విడుదల కావాల్సిన విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ రాజకీయ కారణాలతో వాయిదా పడింది. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మూవీ విడుదలైంది. అప్పటికే నష్టం జరిగిపోయింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిన జన నాయగన్ 350 కోట్ల వరకు మాత్రమే ఆగిపోయింది.
భారీ నష్టాలతో వెంకట్ కే నాారాయణ
ఇక టాక్సిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా మారింది. ఈ మూవీ బడ్జెట్ 650 కోట్ల వరకు అని చెబుతున్నారు. కానీ దానికి వచ్చిన వసూళ్లు కేవలం 350 కోట్ల వరకు మాత్రమే. అదీ కాక ఓటిటి డీల్ కూడా 60శాతం కోత విధించారు. ఓ రకంగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఒకటిగా నిలిచింది టాక్సిక్. ఆ వరుసలో నెక్ట్స్ ఉన్న మూవీ చిరంజీవి కాకా.
చిరంజీవి గట్టెక్కిస్తాడా
చిరంజీవి కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా అనేది చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికైతే కాకా జనవరి 14న విడుదల కాబోతోంది అని చెప్పారు. డేట్ లో మార్పులు ఉండే అవకాశాలున్నాయి. బట్ ఏదేమైనా కేవీఎన్ సెంటిమెంట్ భయం మాత్రం కాకాలో ఉంది. మరి అది దాటి కాకాతో బిగ్గెస్ట్ హిట్ ఇస్తే మెగాస్టార్ కు వెంకట్ కే నారాయణ రుణపడిపోతాడు అనేది కూడా వాస్తవం.
