
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు ట్విస్ట్ ఇచ్చినట్టేనా..?
ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్ట్ కు త్రివిక్రమ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది అని చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీగా గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయాల్సి ఉంది. బట్ ఈలోగా త్రివిక్రమ్ చేసిన ఆదర్శ కుటుంబం అతని కెరీర్ లో మరో ఆల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలింది. అజ్ఞాతవాసి రేంజ్ లో ఇది డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ఈ కారణంగానే ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడేమో.
ఎన్టీఆర్, అనిల్.. ఓ సర్ ప్రైజింగ్ కాంబినేషన్
ఎన్టీఆర్ అనూహ్యంగా అనిల్ రావిపూడితో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అది కూడా తన అన్న కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ‘జనవరి 12న విడుదల’అనే మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ తర్వాత బాలకృష్ణతో చేయబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోన్న టైమ్ లో ఈ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.
త్రివిక్రమ్ కు హారిక హాసినితో సమస్యలు
త్రివిక్రమ్ కూడా ఇటు తన సొంతమైన లాంటిదైన హారిక హాసిని బ్యానర్ తోనూ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే డివివి దానయ్యతో జత కట్టబోతున్నాడు అనే టాక్ కూడా వచ్చింది. చినబాబు, నాగవంశీతో ఇబ్బందులు ఉన్నాయనే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నారు. ముఖ్యంగా నాగవంశీతో త్రివిక్రమ్ కు గ్యాప్ వచ్చిందన్నారు. మరి ఏమైందో కానీ ఈ ఇష్యూను ప్రస్తుతం సార్ట్ అవుట్ చేసుకున్నారు అంటున్నారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అటకెక్కినట్టేనా..?
ఏదేమైనా త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ గట్టి షాక్ ఇచ్చాడు. గతంలో ఇదే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చాడు.. ఆ టైమ్ లో వేరే హీరోలు ఎవరూ పట్టించుకోలేదు. బట్ ఎన్టీఆర్ అతన్ని నమ్మాడు. అరవింద సమేత వీరరాఘవ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. కట్ చేస్తే తర్వాత అతను అల వైకుంఠపురములో వంటి ఆల్ టైమ్ హిట్ ఇచ్చాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ కాస్త హర్ట్ అయ్యాడు. అయినా అతనికి మైథాలజిపై పట్టు ఉందనే కారణంతో త్రివిక్రమ్ ను నమ్మాడు. గాడ్ ఆఫ్ వార్ చేయాలనుకున్నాడు.కానీ ఆదర్శ కుటుంబం డిజాస్టర్ తో మైండ్ మార్చుకున్నాడు. మరి ఈ మారిన మనసును అలాగే ఉంచుతాడా లేక మార్చుకుని గాడ్ ఆఫ్ వార్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన విషయమే.
