
సమ్మర్ హాలిడేస్ సత్తా చాటిందా..?
దీపావళికి మూవీస్ రావడం తెలుగు వారికి పెద్దగా నచ్చదు. అమావాస్య కదా అని మనవాళ్లు దీపావళి సీజన్ లో సినిమాలు పెద్దగా విడుదల చేయరు. బట్ ఈ ట్రెండ్ కూడా కొన్నాళ్లుగా మారింది. ఆ మధ్య మూడు నాలుగేళ్లుగా వరుసగా తెలుగు సినిమాలు దీపావళికి వచ్చాయి. మాగ్జిమం హిట్స్ కొట్టాయి. బట్ ఈ సారి మళ్లీ పాత రూట్ లోకే వెళ్లారు. ఒక్క సమ్మర్ హాలిడేస్ విషయంలో మాత్రం మినహాయింపు. సమ్మర్ హాలిడేస్ దీపావళి సందర్భంగా ఈ నెల 6న విడుదలైంది. మంచి విజయం సాధించే ప్రయత్నంలో ఉంది. మేకర్స్ చాలా నమ్మకంగా ప్రెస్మీట్స్ లో చెబుతున్నారు. బట్ ఆడియన్స్ ఆ వైపు భారీగా రాలేకపోతున్నారు అనేది వాస్తవం. రివ్యూస్ లో మాత్రం మిక్స్ డ్ టాక్ వస్తోంది.
రణ్ బీర్ కపూర్ రాముడుగా మెప్పించాడా..?
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన రామాయణంకు కూడా భారీ స్పందన రాలేదు. ఇంకా చెబితే రావణుడి పాత్రలో నటించిన యశ్ నటనకు అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ కథనంలో ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది. అందుకే చాలామంది ఈ చిత్రాన్ని రావణాయాణం అని కామెంట్స్ చేస్తున్నారు. రణ్ బీర్ రాముడుగా సెట్ కాలేదన్నారు. సీతగా సాయి పల్లవి ఏజ్ బార్ గా కనిపించిందన్నారు. అదీ కాక ఈ ఇద్దరి పాత్రల్లో ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది. అయినా రాముడి సినిమా కాబట్టి ఇండియన్ ఆడియన్స్ బాగా చూస్తారు. వాల్డ్ వైడ్ గా అందరికీ రామాయణం తెలియదు కాబట్టి ఈ చిత్రంలోని విఎఫ్ఎక్స్ వల్ల బానే ఉందంటున్నారు. ఆ కారణంగా యూఎస్ లో బాగానే చూస్తున్నారు. రిలీజ్ అయినా నాలుగు రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టింది రామాయణం. బట్ ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ 2 వేల కోట్లు. దాంతో పోలిస్తే ఇదేమంత మేటర్ కాదు.
సూర్య ‘సీన్’కి అంత సీన్ ఉందా..?
సూర్య హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘సీన్’. ఈ సీన్ కు అంత సీన్ లేదు అని మొదటి ఆటకే తేల్చారు ఆడియన్స్. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన చిత్రంగా తేల్చారు. ఓ రకంగా ఈ యేడాది సూర్య కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో రెండు పెద్ద విజయాలు అందుకున్నాడు. దీంతో సీన్ తో హ్యాట్రిక్ కొడతాడు అనుకున్నవాళ్ల అంచనాలన్నీ తప్పాయి. సీన్ సూర్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది.
నయనతార మహాశక్తి మహా బోరింగ్..
నయనతార మెయిన్ లీడ్ లో నటించిన మూవీ మహాశక్తి. గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ కు సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ కూడా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. రెజీనా కసాండ్రా, దునియా విజయ్ కీలక పాత్రలు చేశారు. వీరి ఎపిసోడ్స్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ చెత్తగా ఉన్నాయి. ఇంకా చెబితే ఏఐతో వాడినవి కూడా వరస్ట్ గా ఉన్నాయి. కంటెంట్ లో విషయం ఉన్నా.. దాన్ని చెప్పే విధానంలో లోపాలున్నాయి. కనీసం తమిళ్ వాళ్లకైనా ఈ చిత్రం కనెక్ట్ అవుతుందనుకున్నారు. ఈ విషయంలో వాళ్లు కూడా సినిమాను అస్సలు బాలేదు అని తేల్చారు.
దీపావళికి బాక్సాఫీస్ వద్ద దివిటీలు వెలిగించలేకపోయిన సినిమాలు
మొత్తంగా ఈ దీపావళికి విడుదలైన నాలుగు సినిమాలు కూడా తేలిపోయినట్టే అని చెప్పాలి.
