Gaaradi Telugu news logo

కరుప్పుతో హిట్ ట్రాక్ ఎక్కిన సూర్య

తమిళ్ స్టార్ హీరో సూర్య గత పదేళ్లుగా నాన్ స్టాప్ గా ఫ్లాపులే చూశాడు. కొన్ని యావరేజ్ మూవీస్ ఉన్నాయి. అయినా అతని రేంజ్ కు తగ్గ హిట్స్ మధ్య పడలేదు. ఆ లోటును తీరుస్తూ ఈ మే 15న విడుదలైన కరుప్పు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడుగా డబ్ చేశారు. బట్ తెలుగులో ఆ స్థాయి విజయం రాలేదు. తర్వాత ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్ సన్స్ తో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ రెండు హిట్స్ తో సూర్యలో మంచి జోష్ వచ్చింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన విజయాలుగా ఈ రెండు చిత్రాలు కనిపించాయి. చిత్రంగా ఇప్పుడు హ్యాట్రిక్ కు రెడీ అయ్యాడు సూర్య.

‘సీన్’ అనే మూవీతో రాబోతోన్న సూర్య

సూర్య హీరోగా సీన్ అనే మూవీ రాబోతోంది. ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కాబోతోంది. మళయాల దర్శకుడు జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నజ్రియా నజిమ్ హీరోయిన్ గా మళయాల యంగ్ స్టర్ నాస్లేన్ మరో కీలక పాత్రలో నటించాడు. సింబు ఓ కేమియోలో కనిపించబోతున్నాడు. ఓ రకంగా దీన్ని మళయాల మూవీ అనే చెబుతున్నారు. బట్ తమిళ్ లో కూడా ఉంటుంది. మరి తెలుగులో కూడా డబ్ చేస్తున్నారీ మూవీని.

7 నెలల్లో 3 సినిమాలు.. హ్యాట్రిక్ కన్ఫార్మా..?

ఏడు నెలల్లో మూడు సినిమాలు అంటే పెద్ద విషయమే. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు సీన్ టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. సూర్య ఇప్పటి వరకూ చేయని పాత్ర ఈ మూవీలో ఉండబోతోందని ముందు నుంచి స్ట్రాంగ్ గా చెబుతున్నారు. మరి ఈ సీన్ తో కూడా మంచి హిట్ కొడితే సూర్య ఒకే యేడాది హ్యాట్రిక్ కొన్ని రికార్డ్ కూడా క్రియేట్ చేస్తాడు. మరి సీన్ కు అంత సీన్ ఉందా లేదా అనేది చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి