
భోగి ట్రైలర్
శర్వానంద్ అంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. మాస్ మూవీస్ చేసినా అందులో తనదైన సాఫ్ట్ నెస్ కనిపించేది. సంపత్ నంది అంటే మాస్ మూవీస్ కు కేరాఫ్ అనలేం కానీ మాగ్జిమం మాస్ మూవీస్ తోనే ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే.. అది కూడా ‘భోగి’ టైటిల్ అంటే మళ్లీ సాఫ్ట్ మూవీతోనే వస్తున్నారు అని భావించారు. అది తప్పు అని టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే అర్థమైంది. టీజర్ డిఫరెంట్ గా ఉంది. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బట్ తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే.. సింప్లీ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
భోగి ట్రైలర్ ఎక్స్ ల్లెంట్
భోగి ట్రైలర్ ఇంత బావుంటుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఈ మూవీ ఈ నెల 12నే విడుదల కావాల్సి ఉంది. ఆ రోజు చాలా సినిమాలున్నాయి అని పోస్ట్ పోన్ చేశారు అన్నారు. అవన్నీ ఆడియన్స్ కు తెలియదు. మూవీలో మేటర్ ఉంటే.. ఉంది అనిపిస్తే చాలు.. థియేటర్ కు వెళ్లిపోతారు. అలా ఆడియన్స్ కు థియేటర్ కు వెళ్లి ముందు ఈ మూవీ చూడాలి అనిపించేలా ఉంది ట్రైలర్.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ
1960ల నేపథ్యంలో తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సాగిన కథ భోగి. ఆ కాలంలో వెట్టి చాకిరి అనేది కామన్ గా ఉండేది. తెలంగాణలో దొరల అరాచకాలు దారుణంగా ఉండేవి. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమానే ఇది అని ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే పాత్రలు, వాటి ప్రవర్తన, కాస్ట్యూమ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా శర్వానంద్ నుంచి ఈ రేంజ్ ఊరమాస్ క్యారెక్టర్ ను ఎక్స్ పెక్ట్ చేయలేదు. నలుగురు చెల్లెల్లకు అన్నగా అంటే మనకు హిట్లర్ మూవీ గుర్తొస్తుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ కథనం ఉండబోతోంది అనిపిస్తోంది. ట్రైలర్ లోని డైలాగ్స్.. వాటిలోని ఇంటెన్సిటీ చూస్తే అద్భుతం అనిపించక మానదు.
సంపత్ నంది సాధిస్తాడా..?
సంపత్ నంది దర్శకత్వం చూస్తుంటే.. ఈ కథలో ఒక్కటి మాత్రం సాధారణంగా అనిపిస్తోంది. దొరలు, అరాచకాలు అనగానే ముఖ్యంగా ఆడవాళ్లను చెరిచే వాళ్లు అనేది అందరికీ తెలుసు. మరి ఈ కథలో కూడా హీరో చెల్లెల్ల పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతోందా.. అందుకు భిన్నంగా ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. మామూలుగా ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో చెల్లెల్లను హైలెట్ చేశారు. సో.. వారిపై అత్యాచారం కామన్ గా ఉండబోతోందా అనిపిస్తోంది. ఈ పాయింట్ అయితే రొటీన్. దాన్ని దాటి చూపితేనే ప్లస్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
శర్వానంద్ ఖచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నాడు
శర్వానంద్ ను చూస్తుంటే ఇంకా బావున్నాడు అనిపిస్తోంది. మనోడు మామూలుగా హ్యాండ్సమ్. బట్ ఈ మూవీలో మేకోవర్ డీ గ్లామర్ గా ఉంది. అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ డీ గ్లామర్ లో కూడా అతను చాలా బావున్నాడు అనిపిస్తోంది. ఏదేమైనా ఈ మూవీ హీరోయిన్ అయిన అనుపమ పరమేశ్వరన్ ను ట్రైలర్ మరీ అంతగా ఎలివేట్ చేయలేదు. అంటే తనవైపు మూవీలో ఏదైనా కీ పాయింట్ ఉండొచ్చేమో అనిపిస్తోంది. డింపుల్ హయాతి కీలక పాత్రలోనూ, నెగెటివ్ రోల్ లో కనిపించబోతోందని చెప్పారు. దొర పాత్రలో ఒకనాటి కన్నడ స్టార్ హీరో తెలుగులో పాపులర్ విలన్ గా ఆకట్టుకున్న దేవరాజ్ నటించాడని తెలుస్తోంది.
ఏదేమైనా ట్రైలర్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది భోగి మూవీ. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన పాటలకు మించి నేపథ్య సంగీతం ఉండబోతోంది అనిపిస్తోంది. మరి శర్వానంద్, సంపత్ నంది ట్రైలర్ తో మాత్రమే ఆకట్టుకుంటారా లేక మూవీతో కూడా మెప్పిస్తారా అనేది ఈ నెల 27న తేలిపోతుంది.
