Gaaradi Telugu news logo

రివ్యూ : రామాయణ
తారాగణం : రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు
ఎడిటర్ : హుజీఫా లొఖండ్వాలా
సినిమాటోగ్రఫీ : పంకజ్ కుమార్, మహేష్ లిమాయొ
సంగీతం : హన్స్ జిమ్మర్, ఏఆర్ రహమాన్
నిర్మాతలు : నమిత్ మల్హోత్రా, యశ్
దర్శకత్వం : నితేష్ తివారీ
రిలీజ్ డేట్ : 05.11.2026

కొన్ని కథలు మనకు బాగా తెలిసే ఉంటాయి. కానీ వాటిని చెప్పే విధానంలోనే తేడాలుంటాయి. ఆ తేడాలు ఆడియన్స్ కు బాగా నచ్చితే ఇమ్మీడియొట్ గా కనెక్ట్ అవుతుంటాం. అలాంటిదే రామాయణం. రామాయణ ఇతిహాసం అంటే భారతదేశంలో కోట్లమందికి ఆరాధన. అందులో రాముడు మన దేవుడు అని భారత్ అంతా నమ్ముతుంది. ముఖ్యంగా నార్త్ వాళ్లు. కాకపోతే రామాయణం తీయాలంటే తెలుగోళ్లు తీయాలి అనే మాట కూడా ఉంది. మరి నార్త్ వాళ్లు తీసిన ఈ రామాయణ ఎలా ఉంది అనేది చూద్దాం.

ఎలా ఉంది :
రామాయణం కథ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అదే రాముడు, అదే సీత, అదే రావణుడు, విభీషణుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు ఇలా అన్ని పాత్రనల గురించీ మనకు బాగా తెలిసిందే. అయితే ఈ రామాయణం రెండు భాగాలుగా మార్చారు. ఫస్ట్ పార్ట్ లో కేవలం సీతాపహరణం వరకు సాగింది. అయితే ఇందులో రావణుడి పాత్రను మరింత బలంగా రాశారు.. తీశారు. రావణుడిని జననం, అతను భీకరంగా ఎందుకు, ఎలా మారాడు అనే పాయింట్ ను బాగా ఎలివేట్ చేశారు.

రామాయణ వృత్తాంతం
రాముడి జననం దాని వృత్తాంతం అంతా మనకు తెలిసిందే కదా. రాముడి పాత్రను రాసిన విధానంలో ఎలాంటి కొత్తదనమూ లేదు. ఆ పాత్రను డిజైన్ చేసిన విధానంలో కూడా కొత్తగా ఏం లేదు. అదే సమయంలో రాముడుగా రణ్ బీర్ అంత ప్రభావవంతంగా కనిపించకపోవడం కొంత మైనస్. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ కావడం కష్టమే.
సీత పాత్రను కూడా అలాగే రాశారు.. తీశారు. సీతారాములు కలిసిన తర్వాత కథ పాకంలో పడుతుంది అని చాలామంది భావించారు. బట్ ఇందులో ఎలాంటి ఎమోషన్ లేకపోవడం అత్యంత పెద్ద లోపం. ఈ ఇద్దరి పాత్రలను ఇంకా ఎఫెక్ట్ గా తీర్చిదిద్ది ఉండాల్సింది. ఇంకా చెబితే ఆ ఇద్దరూ అసలు సీతారాములు అంటే నమ్మడానికి కూడా లేదు. అంత వీక్ రైటింగ్ కనిపిస్తుంది. అలాగే సీతగా సాయి పల్లవి కూడా అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. అనవసరమైన మేకప్, ఆడంబరాల వల్ల ఆ పాత్ర తేలిపోయినట్టుగా ఉంది.

అరణ్య వాసం
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి ఇద్దరికీ పెళ్లి కావడం.. తర్వాత అరణ్య వాసం ఎపిసోడ్ రావడం.. ఆ ఎపిసోడ్ లో బలమైన ఎమోషన్ లేకపోవడం.. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో సీతారాముల అనురాగం, అనుబంధం గురించి అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో అది మచ్చుకు కూడా కనిపించదు. ఇదో పెద్ద లోపంగా కనిపిస్తుంది.
రావణుడు అత్యంత బలశాలి. రాముడు దేవావతారం. ఈ ఇద్దరి మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం శూర్పనఖ. ఆమె రాముడిపై మోజు పడుతుంది. రాముడు కాదు అంటాడు. ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నంలో ఆమె ముక్కు కోస్తాడు లక్ష్మణుడు. అక్కడి కథ పాకంలో పడుతుంది. ఇక్కడ బంగారు జింక పాయింట్ కనిపిస్తుంది. మనకు ఇప్పటి వరకు తెలిసిన జింక రూపంలో ఉన్న మనిషికి రాముడంటే భక్తి. ఇందులో అది కనిపించదు. ఇంకా చెబితే జింక పాత్రను లంకలోని రాకాసుడి పాత్రగా చూపించారు.

సీతాపహరణం
రావణుడు..సీత ఇంటికి వెళ్లడం.. ఆమెను కిడ్నాప్ చేయడం.. ఆ టైమ్ లో రామలక్ష్మణులు జింక వేటకు వెళ్లడం.. ఇది కొత్తదేం కాదు. తర్వాత ఇంటికి వెళ్లగానే సీత కనిపించకపోవడంతో వెదకడం మొదలు పెడతారు. అదే టైమ్ లో జటాయువు సీతను కాపాడే ప్రయత్నంలో రావణుడికి ముచ్చెమటలు పట్టించే ఎపిసోడ్ మాత్రం హైలెట్ గా కనిపించింది. అందుకు ప్రధాన కారణం విఎఫ్ఎక్స్. అయినా అది అద్భుతంగా ఉంది.

జటాయువు ఎపిసోడ్
ఇక జటాయువు చనిపోయే ముందు రావణుడి పరాక్రమం గురించి చెప్పే సీన్ అద్దిరిపోయింది. ఆ విషయం రాముడికే చెబుతాడు. సాధారణమైన మానవుడైన రాముడు ఇంతటి బలశాలి అయిన రావణుడిని ఎలా ఎదుర్కొంటాడు అనేది చాలా సినిమాల్లో చూశాం. అది సెకండ్ పార్ట్ లో ఉండబోతోందని ఎండ్ కార్డ్ వేశారు. ఈ ఎండ్ కార్డ్ కూడా చాలా వీక్ గా ఉంది. మరి సెకండ్ పార్ట్ అయినా అద్భుతంగా ఉండబోతోందేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ మరో స్థాయిలో ఉన్నాయి కాబట్టి అది అలాగే ఉండే అవకాశాలున్నాయి.

కథనం మాత్రం మరీ చప్పగా ఉంది
కథ గురించి మనందరికీ తెలిసు. కథనం మాత్రం మరీ చప్పగా ఉంది. సంఘర్షణ లేదు. ఎమోషన్ లేదు. ఏదో సోసోగా సాగిపోయిందంతే. అయినా సినిమా బావుంది అనే ఫీలింగ్ రావడానికి కారణం జెన్.జి బ్యాచ్. వారికి బాగా కనెక్ట్ అవుతుంది. కారణం విఎఫ్ఎక్స్. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కు మించిన స్థాయిలో విఎఫ్ఎక్స్ ఉండటం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆ బలాన్నే దర్శకుడు నితీష్ తివారీ నమ్ముకున్నాడు అనేది అర్థమైపోతుంది.

రావణ పాత్రలో లోపాలు
అయితే రావణుడి పాత్రలో అనేక లొసుగులు ఉన్నాయి. రావణుడు త్రిలోకాధిపతి అని చెప్పారు. అది అబద్ధం. అదే నిజమైతే భూలోకంలో అయోధ్య, సీతమ్మ రాజ్యం కూడా ఉన్నాయి కదా. అప్పుడు వారంతా రావణుడికి బానిసలు అని కదా చెప్పారు. రావణుడు కేవలం లంకాధిపతి అన్నదే నిజం అని వాల్మీకి రామాయణంతో పాటు అనేక రామాయణ గాథలు చెప్పాయి. అలాగే రావణుడి పాత్రను మొత్తం హిమాలయాల్లో చూపడం కూడా సరి కాదు. అది కూడా అబద్ధమే. ఎందుకంటే లంకలో హిమాలయాలు లేవు అని అనేక ఇతిహాసాల్లోనే చెప్పారు. ఇలా చాలానే ఉన్నాయి.
నటన పరంగా :
రావణుడి పాత్రకు యశ్ జీవం పోశాడు. మొదట్లో కేజీఎఫ్ ను దాటలేదు అనిపించినా మెల్లగా అతను రావణుడుగానే మారాడు. రాముడుగా రణ్ బీర్ ఓకే. సీతగా సాయి పల్లవి జస్ట్ ఓకే. లక్ష్మణుడి పాత్ర వీక్. నటన సోసో. రావణుడి తల్లి పాత్రలో సీనియర్ నటి శోభన కనిపించింది. కానీ తను ఇంకా కల్కిలోనే ఆగిపోయినట్టుగా ఉంది. ఇతర పాత్రధారులంతా బానే చేశారు.
టెక్నికల్ గా :
హుజీఫా లొఖాండ్ వాలా ఎడిటింగ్ వీక్ గా ఉంది. చాలా స్లో నెరేషన్ కనిపిస్తుంది. కొన్ని షాట్స్ అనవసం అని చాలాసార్లు అనిపిస్తుంది. పంకజ్ కుమార్, ముఖేష్ లిమాయే సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విఎఫ్ఎక్స్ కు అనుగుణంగా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రహమాన్ సంగీతం చాలా బావుంది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. పాటలు హిందీవాళ్లకు ఓకేనేమో కానీ తెలుగులో అంత ప్రభావవంతంగా లేవు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ కనిపించని స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచెస్ట్ గా ఉన్నాయి.
దర్శకుడు నితేష్ తివారీ ఈ కథతో పాటు కొన్ని అవాస్తవాలు కూడా కల్పించానని ముందే చెప్పాడు. అయినా ఇతిహాసాల్లో ఇలాంటి కల్పనలకు తావు ఉండకూడదు. ఈ విషయంలో అతన్ని క్షమించలేము. బట్ టేకింగ్, మేకింగ్ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాయి. ఫస్ట్ పార్ట్ తో హిట్ మాత్రమే కొట్టే అవకాశాలున్నాయి. మరి సెకండ్ పార్ట్ తో అయినా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.

ఫైనల్ గా : రామాయణ.. వీక్ నెరేషన్
రేటింగ్ : 3/5
KYR

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి