
పవన్ కు విడాకులు రొటీన్ అయ్యాయా..?
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకున్నట్టు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా షాక్ తిన్నారు. నిజానికి ఇద్దరూ విడిపోతున్నారు అని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఇదేదో వైసీపీవాళ్లు చేస్తున్న ఫేక్ ప్రచారం అనుకున్నారు. బట్ ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరూ చెప్పడంతో షాక్ తినక తప్పలేదు.
ఆల్రెడీ రెండు సార్లు పెళ్లి, విడాకులు అయ్యాయి
పవన్ కళ్యాణ్ కు అసలు పెళ్లిల్లు కలిసి రావడం లేదేమో అనిపిస్తోంది. మొదట్లో తనకు ఏమీ తెలియని(..?) టైమ్ లో పెళ్లైంది. చాలా తక్కువ టైమ్ లో విడిపోయారు. కట్ చేస్తే తన బద్రి మూవీలో ఓ హీరోయిన్ గా నటించిన రేణూదేశాయ్ తో పరిచచయం ప్రణయంగా మారింది. పెళ్లికి ముందే వీరు సహజీవనం చేశారు. ఓ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ టైమ్ లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ నాయకుడుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.ఆ టైమ్ లో పొలిటికల్ గా చాలామంది విమర్శలు చేస్తున్నారని చేతిలో పిల్లాడిని పట్టుకుని మరీ తాళి కట్టాడు.
పూనమ్ కౌర్ తోనూ ఎఫైర్ అంటూ వార్తలు
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కి మరో కూతురు పుట్టింది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో పూనమ్ కౌర్ అనే మరో నటితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పూనమ్ కౌర్ కూడా అనఫీషియల్ గా అంగీకరించింది. బట్ షాకింగ్ గా తను ఓ రష్యన్ అమ్మాయితో ఎఫైర్ లో ఉన్నాడని చెబుతూ రేణూ దేశాయ్ అఫీషియల్ గా విడాకులు తీసుకుంది. తీన్మార్ అనే మూవీలో చిన్న పాత్రలో నటించిన అన్నా లెజినోవాను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. దీంతో అఫీషియల్ గా మూడో పెళ్లైంది. వీరికీ ఇద్దరు పిల్లలున్నారు.
అధికార పార్టీతో పొత్తులో ఉన్నా.. ఇలాగైందేంటో..
ఇక 2014లో జనసేన పార్టీ స్థాపించి నానా ఢక్కా మొక్కీలు తిన్నాడు. చివరికి 22024లో అనధికారికంగా అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక మళ్లీ అంతా హ్యాపీస్ అనుకుంటున్న టైమ్ లో ఈ షాకింగ్ విషయం తెలిసింది. ఈ విషయం అంత ఈజీగా పొక్కలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆల్మోస్ట్ 20 రోజుల క్రితమే అన్నా రష్యా వెళ్లిపోయిందట.
ఇతరుల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడ్డమే అసహ్యం..
ఏదేమైనా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాలది వారి వ్యక్తిగత జీవితం. అయితే వ్యక్తిగత జీవితంలోనే ఉంటే ఫర్వాలేదు. కానీ అతను ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో విపరీతంగా విమర్శలు కూడా వస్తుంటాయి. వాటికి భయపడేంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ కి. ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు విడిపోయాడు కాబట్టి ఇదేమంత కొత్తేం కాదు. బట్ కామెంట్స్ ను లైట్ తీసుకుంటాడు. కాకపోతే ఒక వ్యక్తి ఇన్నిసార్లు విడిపోవడం.. దాన్ని ఇతరుల విషయంలో నెగెటివ్ గా మాట్లాడ్డం మాత్రం అసహ్యంగా ఉంది.
